ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం, అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని, తమ పై కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. కేంద్రానికి కూడా ఈ విషయంలో ఫిర్యాదు కూడా చేసింది. ముఖ్యంగా కొంత మంది అధికారులు, పోలీసులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, వీరి ప్రవర్తనతో హైకోర్టు కూడా, ఈ రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా లేదా అని అడిగే పరిస్థితి ఉందని, రెండు సార్లు చీఫ్ సెక్రటరీని, మూడు సార్లు డీజీపీని హైకోర్టు కోర్టుకు పిలిపించింది అంటే, రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుందో నిదర్శనం అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు, డీజీపీ మధ్య అలాగే ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ, తెలుగుదేశం నాయుడు జవహర్ మధ్య, మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపధ్యంలోనే ఈ రోజు మరో సంఘటన వెలుగులోకి రావటంతో, తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పు తెలుసుకున్న ఆ అధికారి వెంటనే దాన్ని సరి దిద్దుకోవటంతో, వివాదం వెంటనే ముగిసిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఎకౌంటులో వేసిన ఒక పోస్ట్ తో, విజయవాడ ఎంపీ కేశినేని ఆగహ్రం వ్యక్తం చేసారు.

వైసిపీ పార్టీకి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన రాజకీయ వ్యాఖ్యలను, కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఎకౌంటు షేర్ చేసింది. బండికోళ్ల లంక బ్యారేజి గురించి వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు లాగా కాంట్రాక్టర్ల వెంట పరిగెత్తకుండా, మా నాయుకుడు వైఎస్ జగన్ రైతుల జీవితాలు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ, చేసిన కామెంట్స్ ని కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ హేండిల్ షేర్ చేసింది. అయితే దీని పై విజయవాడ ఎంపీ కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తన ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ని ప్రశ్నించారు. ఒక మాజీ సియం పై, ప్రత్యర్ధి పార్టీ చేసే రాజకీయ విమర్శలను మీరు ఎలా షేర్ చేస్తారు, మీరు ఒక ప్రభుత్వ అధికారి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి అంటూ, కలెక్టర్ ట్వీట్ ని ఖండిస్తున్నట్టు ఎంపీ ట్వీట్ చేసారు. మీ తప్పుని సరిదిద్దుకొండి అని విజ్ఞప్తి చేసారు. దీంతో వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్ ఎకౌంటు నుంచి ఆ ట్వీట్ తొలగించబడింది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌సహజంగా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరు ఉంది. అయితే అధికారిక ఎకౌంటు నుంచి అత్యుత్సాహంతో చేసిన ట్వీట్ తో, విమర్శలు రావటం, వెంటనే దాన్ని సరి చేసుకోవటంతో, వివాదం ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు పై, సామాజికా మాధ్యమాల్లో, కొంత మంది కావాలని అభ్యంతరకర పోస్టింగులు పెట్టినా, వారి పై చర్యలు తీసుకోవాలని కోరినా, వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, హైకోర్టు రిజిస్టార్ కోర్టుకు తెలిపారు. చర్యలు తీసుకోమని కోరినా, ఎలాంటి చర్యలు లేవని అన్నారు. దీనికి సంబంధించి, హైకోర్టు రిజిస్టార్ దాఖలు చేసిన పిటీషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే తాము దాఖలు చేసిన పిటీషన్ లో స్వల్ప మార్పులు చేస్తూ, అదనపు అఫిడవిట్ వేశామని కోర్ట్ కు తెలిపారు. అయితే దీని పై కౌంటర్ సబ్మిట్ చెయ్యటానికి తమకు కొంత సమయం కావాలని, ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు అంగీకారం తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, మరో అనుబంధ పిటీషన్ దాఖలు అయ్యింది. కర్నూల్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి, శివానందరెడ్డి ఈ విషయంలో మరో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున మురళీధర్‌రావు, కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఆయన పిటీషన్ లో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. హైకోర్టు పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాని వెనుక కుట్ర కోణం ఉందని, దీని పై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన అనేక కీలక ఆధారాలు కోర్టుకు సమర్పించారు.

ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా, ఎలా పని చేస్తుంది కోర్టుకు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొంత మంది ప్రభుత్వంలో ఉన్నారని, వారు ఈ కుట్రలు అన్నీ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే కుట్ర కోణం ఉంది అంటూ పిటీషనర్ లేవనెత్తిన అభ్యంతరాల పై స్పందించిన ధర్మాసనం, ఆ వివరాలు అన్నీ దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచన చేసింది. అయితే పిటీషనర్ తరుపు న్యాయవాది స్పందిస్తూ, దర్యాప్తు అధికారులు నిష్పాక్షికంగా విచారణ చెయ్యటం లేదని, హైకోర్టు గతంలో 94 మందికి నోటీసులు ఇస్తే, కేవలం 12 మంది పైనే ఇప్పటి వరకు కేసు కట్టారని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు కూడా సిఐడి పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సిఐడి సరైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. మీరు చెప్తున్న దానికి, జరుగుతున్న దానికి పొంతన లేదని, కోర్టు పై గౌరవం ఉంటే, కనీసం ఆ అభ్యంతరకర పోస్టింగులు అయినా తొలగించాలని ఆదేశించింది. అలాగే సోషల్ మీడియా కంపెనీలకు కూడా, ఇలాంటి కామెంట్ల పై తగిన చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం రాయలసీమను రత్నాలు చేస్తా, బేసిన్లు భేషీజాలు లేవు అని చెప్పిన కేసీఆర్, అలాగే రాయలసీమకు అన్యాయం జరిగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ వెళ్ళేంత స్నేహం ఇద్దరి మధ్య ఉన్నా, ఒక చిన్న ప్రాజెక్ట్ పై, ఇంత పెద్ద రచ్చ గత ఆరు నెలలుగా జరుగుతుంది. ఇద్దరూ ఒకరి దావత్ లకు ఒకరు వెళ్తారు కదా, కలిసి పరిష్కారం చేసుకోకుండా, మా మీద నిందలు ఎందుకు అని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కూడా. అయితే కేంద్రం, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం, నిన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం నడించింది. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, కేంద్ర మంత్రి స్పందించి, ఆపాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి.

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని, ఇది అక్రమ ప్రాజెక్ట్ అని, అసలకే అక్రమ ప్రాజెక్ట్ అనుకుంటే, దాన్ని మరింత విస్తరణ చేస్తాం అంటే చూస్తూ ఉండం అంటూ, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, జగన్ స్పందిస్తూ, మీ కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్ట్ ల కు కూడా అనుమతులు లేవు కదా అని బదులు ఇచ్చారు. అయితే కేసీఆర్ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ బేసిన్ లో భాగంగా కట్టిన ప్రాజెక్ట్ అని, దానికి అనుమతులు ఉన్నాయని, పోతిరెడ్డిపాడు బేసిన్ కు సంబంధం లేకుండా కట్టిన ప్రాజెక్ట్ అని, పోతిరెడ్డిపాడు ఆపకపోతే, అలంపూర్‌ వద్ద బ్యారేజీ కట్టి మేము తోడుకుపోతాం అని హెచ్చరించారు. శ్రీశైలం, సాగర్ బాధ్యత తమకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే దీనికి స్పందించిన జగన్, మీకో న్యాయం, మాకో న్యాయమా, శ్రీశైలం ఎడమగట్టు, సాగర్‌ కుడికాలువ మాకు ఇవ్వండి అని కోరటంతో, కేంద్రం మంత్రి కలుగ చేసుకుని, ఇరు రాష్ట్రాలను ప్రాజెక్ట్ డీపీఆర్ లు సమర్పించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జగన్ మీడియా పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షి మీడియాలో హైకోర్టు, సుప్రీం కోర్టు గురించి వ్యాఖ్యలు చేసింది అంటూ, ప్రచురించిన కధనం పై హైకోర్టు అసంతృప్తి తెలిపింది. విచారణకు సంబంధం లేని విషయాలు, ప్రస్తావిస్తూ హైకోర్టుని ఎలా లాగుతారు అంటూ, అడ్వకేట్ జనరల్ దృష్టికి ఈ అంశం తీసుకొచ్చింది. దీని పై స్పందించిన అడ్వకేట్ జనరల్, ఈ కధనం పరిశీలించి చెప్తామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని, మిస్ రిపోర్ట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. అయితే ఇదే సమయంలో మరో న్యాయవాది అయిన నాగిరెడ్డి కలుగ చేసుకుని, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అంటూ, ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఒక తప్పుడు కధనం రాసింది కదా, ఇది కూడా న్యాయస్థానికి సంబంధించిన వార్తలే అని, ఇవి కూడా తప్పుగా ప్రచురితం అవుతున్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయం ఇప్పటికే కోర్టు పరిధిలో విచారణలో ఉందని, ఆ విచారణ అయ్యేంత వరకు, దాని పై స్పందించం అని కోర్టు స్పష్టం చేసింది.

ఇక నిన్నటి నుంచి అమరావతి కేసుల్లో రోజు వారీ విచారణ ప్రారంభం అయ్యింది. దాదాపుగా ఉన్న 230 కేసులను, 18 విభాగాలుగా హైకోర్టు విభజించింది. ఇప్పటికే ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. చాలా కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడ్డాయి. మరికొన్ని కేసులను మెయిన్ బెంచ్ నుంచి తప్పించి, వేరే డివిజన్ బెంచ్ కు బదిలీ చేసారు. నిన్న ముఖ్యంగా సియం క్యాంప్ ఆఫీస్ పై చర్చ జరిగింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు పిటీషన్ లో, అడ్వకేట్ జెనెరల్ స్పందిస్తూ, ఏ కార్యాలయం తరలించే ఉద్దేశం లేదని, క్యాంప్ కార్యాలయం మాత్రం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పటంతో, క్యాంప్ కార్యాలయాల పై వివరాలు కోర్టు అడిగింది. ఇక సెలెక్ట్ కమిటీ, మండలిలో జరిగిన చర్చకు సంబంధించి, పూర్తి వివరాలు కోర్టు అడిగింది. సిఆర్డీఏ కొనసాగుతుందని, అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ పై ఇక నుంచి ఎలాంటి కార్యకలాపాలు చెయ్యకూడదు అని, దీని పై కూడా స్టేటస్ కో ఇచ్చింది. ఇలాగే అనేక కేసుల పై నిన్న విచారణ జరిగింది. ఈ రోజు మరి కొన్ని కేసుల పై విచారణ జరగనుంది.

Advertisements

Latest Articles

Most Read