జేసి దివాకర్ రెడ్డి, చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఈ మది జేసి ప్రభాకర్ రెడ్డి పై వరుస కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తరువాత, జేసీ చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసారు. జేసి దివాకర్ రెడ్డికి తాడిపత్రి సమీపంలో గనులు ఉన్నాయి. అయితే మైనింగ్ అధికారులు ఆ గనుల వద్దకు వెళ్లి, జేసీ దివాకర్ రెడ్డి గనులు సోదాలు చేసారు. అయితే పక్కన ఉన్న అధికార పార్టీ గనులు సోదాలు చేయలేదని జేసీచెప్తున్నారు. గనులు క్లోజ్ చేసేందుకు, అధికార పార్టీ నేతలు స్కెచ్ వేస్తున్నారని, ఇందులో వచ్చే ఆదాయంతోనే తాము బతుకున్నామని, ఇది లేకుండా చేసి ఆర్ధికంగా దెబ్బ తీయాలని ప్లాన్ చేసారని జేసీ అన్నారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు పెట్టారని జేసి అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అందరికీ తిరిగి చెల్లిస్తామని, తగిన సత్కారం చేస్తామని అన్నారు. మైన్స్ పై జరుగుతున్న దాన్ని ప్రశ్నించటానికి వస్తే, నేను వస్తున్నా అని తెలిసి ఏడీ వెళ్లిపోయాడని, నా భార్యతో వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉందని జేసి అన్నారు.. ఆయన మాటల్లో, " నా మైన్స్ లో సోదాలు చేసారు. ఇది నక్స-లైట్ ల కోసం వచ్చి సాధించేది కాదు. పర్సనల్ గా నా కుటుంబం పై కక్ష సాధించేందుకు చేసింది. ఇప్పటికే ఎన్ని రకాల బాధలు పెట్టాలో, అన్ని రకాల బాధలు పెట్టారు. పక్కగా ఉన్న సరే, ఏది లేకపోతే, ఎస్సీ ఆక్ట్ పైన పెట్టి, లోపల వేయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తిట్టాడు, తిట్టలేదో వాళ్ళకి అవసరం లేదు. దొరికితే ఎస్సీ ఆక్ట్ పెట్టి లోపల వేస్తున్నారు. ఇంకోటి ఎదో లారీలు, బస్సుల దాంట్లో సంబంధం ఉందని, దాంట్లో ఇరికించారు. కక్ష సాధింపులో భాగంగా. అయితే ఇప్పటి వరకు దివాకర్ రెడ్డిని టచ్ చేయలేక పోయారు. "
"మావాడు మావాడు అంటూ ఉంటాను కదా, అందకే నా పైన లవ్ అనుకుంటా, ఆ సంబంధం ఏమైనా గుర్తుకు వచ్చిందో ఏమో కానీ, ఇంత కాలం నా మీదకు రాలేదు. నా తమ్ముడు మీదకు వెళ్ళారు. ఇప్పుడు నా మీదకు వస్తున్నారు. వాళ్ళు నాకు చెప్పకపోయినా, వాళ్ళ వ్యవహారం నాకు తెలుసు కాబట్టి, నా గనులు క్లోస్ చేసే దానికి, స్కెచ్ వేసి తయారు చేసి రెడీ అయ్యారు. ఒకటి నా భార్య పేరిట ఉంది. నాకు , నా భార్యకు అది తప్ప ఏమి లేదు. దాంట్లో ఏమైనా వస్తే నాకు బ్రతుకు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది కొత్త స్టైల్ లో, నా పొట్ట కొట్టి, బ్రతుకు మీద కొట్టి, చంపేయటానికి చేస్తున్న ప్రయత్నాలు. ఏదో ఒకటి చేసి, ఆ మైన్ నడవకుండా చెయ్యాలని, ఒక సంకల్పంతో వచ్చారు. అది అడగటానికి ఇక్కడ వస్తే అధికారి లేడు. ఇలాగే చేస్తే ఇక నేను, నా భార్య ఇక్కడకు వచ్చి ధర్నా చెయ్యాలి. ఆఫ్ట్రాల్ ఒక ట్రాన్స్ఫర్ కి భయపడి, ఈ అధికారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు రూల్స్ ఏమి లేవు, ఈ ప్రభుత్వంలోనే లేవు. ఒక నియంత చెప్పింది, చేయటమే వాళ్ళకి తెలుసు. ఆ నియంత ఎంత కాలం ఉంటాడో లేదో వీళ్ళకు తెలుసా. " అని జేసి అన్నారు.