మంత్రి సీదిరి అప్పలరాజు పదవి ఈ సారి విస్తరణలో ఎగిరిపోనుందనే టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గంలో చేర్పులు-కూర్పులు-మార్పులు వార్తలు వచ్చిన తరువాత తొలిసారిగా స్పందించింది సీదిరి అప్పలరాజు కావడంతో ఈ వికెట్ కేబినెట్ నుంచి అవుట్ అవ్వొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. సీఎం కేబినెట్ నుంచి తప్పిస్తున్నామని చెప్పకపోతే సీదిరి అప్పలరాజు ఇలా స్పందించి వుండరని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మంత్రి వర్గంలో కొత్తగా కొన్ని వర్గాలకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలనుకుంటే.. తానే మొదటిగా రాజీనామా చేస్తానని ప్రకటించడంతో సీదిరి సీటు ఖాళీ అవుతోందని అర్థం అవుతోందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. గత సారి సీదిరి అప్పలరాజుని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని వార్తలొచ్చినా, ఆయన కేబినెట్లోనే కొనసాగారు. ఈ సారి మాత్రం సీదిరి ప్లేసులో పొన్నాడ సతీష్‌ని తీసుకుంటున్నారని అప్పుడే వైసీపీ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
news
జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పిన పట్టాభి... అవి విని అక్కడ ఉన్న వారు షాక్...
ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పాలన తారా స్థాయికి చేరుకుంది. బాదితుల పైనే దాడులు చేసి, బాధితుల పైనే కేసులు పెట్టి, బాధితులనే కొట్టి, బాదితులనే కోర్టులో ప్రవేశ పెట్టారు అంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. నిన్న గన్నవరం టిడిపి ఆఫీస్ పై అటాక్ చేసి, అక్కడకు సంఘీభావంగా వచ్చిన పట్టాభిని అరెస్ట్ చేసారు. ఒక రోజు తరువాత అరెస్ట్ చూపించి, ఆయన పై హత్యాయత్నం కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయితే కొద్ది సేపటి క్రిందట పట్టాభిని గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా పట్టాభి జడ్జి ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టారని పట్టాభి జడ్జికి తెలిపారు. తనను గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి అక్కడ కొట్టారని తెలిపారు. కొంత మంది ముసుగులు వేసుకుని వ్యక్తులు వచ్చారని, పోలీస్ స్టేషన్ లో తన ముఖానికి టవల్ చుట్టి, అటు ఇటూ ఈడ్చుకుని వెళ్లి, అరి కాళ్ళు, అరి చేతుల పై కొట్టారని పట్టాభి తెలిపారు. పట్టాభి తన బాధ చెప్పుకోవటం చూసి, అక్కడ ఉన్న వారి షాక్ తిన్నారు.
ప్రశాంత్ కిషోర్ ఏపిలో ఇంత పవర్ఫుల్ అయిపోయాడా ? ఇక మంత్రులు ఎందుకు దండగ ?
ఏపీలో విచిత్ర పాలన నడుస్తోంది. జంబలకిడి పంబ సినిమాకి ఏ మాత్రం తగ్గిపోని విచిత్ర వ్యవహారాలు, వింతలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులుంటారు. అందరి తరఫున సలహాదారుడు సజ్జల మాత్రమే మాట్లాడతారు. రివర్స్ టెండరింగ్ లా రివర్స్ పాలనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తూన్న ఏపీలో మరో జంబలకిడి పంబ నిర్ణయం కలకలం రేపుతోంది. రాష్ట్రమంతా అధ్వాన రహదారులతో ప్రయాణికులకు నిత్యమూ నరకం కనపడుతోంది. అడుగుకో గుంతల్లో రోడ్లను వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని లోకేష్ ఇటీవల వ్యంగ్యంగా రాష్ట్రంలో రోడ్ల సమస్యని ఎత్తిచూపారు. అధ్వాన రహదారుల సమస్య వైసీపీకి విపరీతమైన డ్యామేజ్ చేయడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ సంస్థ తేల్చేసింది. ఈ నేపథ్యంలో తాము చెప్పినట్టు సర్కారు చేయాలని పీకే టీం ప్రభుత్వ పెద్దలకు చెప్పేసింది. ప్రయాణికుల ఇబ్బందులు, అత్యవసరంగా వేయాల్సిన రోడ్లు గురించి ఇంజనీర్లు ఇచ్చే నివేదికలు కంటే, ఐ ప్యాక్ ఏ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుందో అక్కడ రోడ్లు వేసే ప్రణాళికని ఐ ప్యాక్ రూపొందించింది. ప్రశాంత్ కిశోర్ టీము దెబ్బకి ఇంజనీరు బకరాలైపపోయారు. 5 నెలల క్రితం ఏపీ ప్రభుత్వ ఇంజనీర్లు పంపిన ఎస్టిమేషన్స్ అన్నీ బుట్టదాఖలు చేశారు. ప్రశాంత్ కిశోర్ బృందం ఐ ప్యాక్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై చేసిన అధ్యయనం నివేదికలో, అత్యవసరంగా వేయాల్సిన రోడ్లను సూచించింది. ఐ ప్యాక్ వేయమన్న రోడ్లనే వేయాలని ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చేసింది సర్కారు. తాము చెప్పిన రోడ్లు యుద్ధప్రాతిపదికన వేయాలని, లే పోతే ప్రజావ్యతిరేకత మరింతగా పెరిగిపోతుందని ఐ ప్యాక్ టీమ్ వైసీపీ పెద్దలని హెచ్చరించడంతో, రోడ్లు ఎంపిక చేసే బాధ్యత కూడా వారికే అప్పగించేశారు. ఎన్నికలకు వెళ్లేలోగానే రోడ్లు బాగు చేయకపోతే ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన ఐప్యాక్ ఒక్కో నియోజకవర్గానికి ముఖ్యమైన 5 రోడ్లను సెలెక్ట్ చేసి వేయాలని హుకుం జారీ చేసింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులు 6,182 కిలోమీటర్ల రహదారులను పునరుద్ధరించాలని, దీని కోసం 1,700 కోట్ల వ్యయమవుతుందని అంచనాలు సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ఈ రోడ్లు, అంచనాలు మరిచిపోండని అధికారులకు స్పష్టం చేసింది. ఐ ప్యాక్ వేయమన్న రోడ్లే వేయాలని చెప్పేయడంతో అధికారులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు.
లక్ష్మీపార్వతి దిగజారుడుకి పరాకాష్ట.. రోజు రోజుకీ ఎందుకు ఇలా అయిపోతుంది ?
ఇంతకంటే దిగజారవనుకున్న ప్రతీసారీ మరింత దిగజారి మాట్లాడటం లక్ష్మీపార్వతికి వ్యసనంగా మారిపోయింది. వైసీపీ అధినేత మెప్పు పొందేందుకు ఎంతకైనా తెగించే లక్ష్మీపార్వతిని చూసి వైసీపీ నేతలే అసహ్యించుకుంటున్నారు. నందమూరి తారకరత్న మృతి పట్ల వైసీపీ నేతలు, పేటీఎం సైకోలు వ్యవహరించిన తీరు దారుణమంటే, తారకరత్నకి నాయనమ్మని అవుతానని చెప్పుకునే లక్ష్మీపార్వతి అంతకంటే ఘోరంగా వ్యవహరించి, ఛీకొట్టించుకుంటున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభానికి హాజరైన తారకరత్న గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. కుప్పంలో చికిత్స అనంతరం 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. పార్టీలకు అతీతంగా అందరూ నివాళులు అర్పించారు. ఒక్క లక్ష్మీపార్వతి మాత్రమే తారకరత్న మరణాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించి అందరితోనూ ఛీకొట్టించుకుంటోంది. యువగళం పాదయాత్ర ఆరంభం రోజే తారకరత్న చనిపోయారని, లోకేష్ పాదయాత్రకి అడ్డంకి కాకుండా ఇన్నాళ్లూ దాచారని నందమూరి లక్ష్మీపార్వతి విషం చిమ్మారు. తారకరత్న బ్రెయిన్ డెడ్ అయ్యారని, తారకరత్న మరణించినట్లు డాక్టర్లు తొలి రోజే నిర్ధారించారని లక్ష్మీపార్వతి తన దుష్టబుద్ధిని బయటపెట్టుకున్నారు. తారకరత్న భార్యకి బంధువైన విజయసాయిరెడ్డే నందమూరి-నారా కుటుంబాలు మంచి వైద్యం అందించాయని కితాబునిచ్చారు. నిత్యమూ చంద్రబాబు, లోకేష్, టిడిపిపై విరుచుకుపడే సాయిరెడ్డి తన హుందాగా ప్రవర్తిస్తే..నందమూరి ఇంటి పేరు తగిలించుకుని ఆ కుటుంబంపై అనునిత్యమూ విషం చిమ్మే లక్ష్మీపార్వతిపై ఎన్టీఆర్ అభిమానులు ఊస్తున్నారు. వైసీపీ వాళ్లే ఆమె తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.