కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 (నీట్)ను వాయిదా వేయాల్సిందేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు సైతం ఈ డిమాండును సమర్థిస్తున్నాయి. అయినప్పటికీ ఏమీ పట్టనట్లుగా జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి జూలైలోనే జరగాల్సిన ఈ పరీక్షలు క-రో-నా కారణంగా వాయిదా పడ్డాయి. వీటిని సెప్టెంబరులో నిర్వహిస్తామని కేంద్రం అనంతరం వెల్లడించింది. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని 11 రాష్ట్రాల విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్షల్లో జాప్యం వద్దని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పరీక్షల షెడ్యూల్ ను కేంద్రం విడుదల చేసింది. ఓవైపు క-రో-నా మహమ్మారి మరోవైపు భారీ వర్షాలు, వరదలు.. ఇలాంటి పరిస్థితుల్లో తాము పరీక్షలకు హాజరయ్యేది ఎలా అంటూ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ని-ర-స-న-లు చేపడుతున్నారు. నల్ల బ్యాండ్లు ధరించి నిరాహార దీక్షలు చేస్తున్నారు. 

stalin 28082020 2

సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. క-రో-నా ముప్పుతో పాటు బీహార్, గుజరాత్, అసోం, కేరళ తదితర రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ లో ఇంటర్నెట్ పై ఆం-క్ష-లు ఉన్నాయి. ప్రజా రవాణా స్తంభించడంతో విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం కష్టతరం కానుంది. వీటన్నింటి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక మరో పక్క రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పై స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలని ఏకం చేస్తుంది. బీజేపీ లేని రాష్ట్రాల్లో మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో, డీఎంకే అధినేత స్టాలిన్ రంగంలోకి దిగి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు పలకాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ కోరారు. తాము ఈ విషయం పై మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తున్నామని, అందరూ దీనికి మద్దతు ఇచ్చి, కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. మరో మోడీని ఏదైనా అనాలి అంటే ఆలోచించే, ఈ ఇద్దరు కేంద్రాన్ని నిలదీస్తారో లేదో ?

భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)), కేంద్రానికి లేఖ రాస్తూ, డిస్కోమ్ లిక్విడిటీ ప్యాకేజీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే 90,000 కోట్ల రూపాయల వాటాను, తమ బకాయలు తీర్చే దాకా ఇవ్వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్కె సింగ్ కు రాసిన లేఖలో, ఏపి డిస్కోమ్‌లు నిలిపివేసిన మొత్తాన్ని పునరుత్పాదక విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయలు, పూర్తిగా చెల్లించే వరకు డిస్కోమ్‌ల లిక్విడిటీ ప్యాకేజీ కింద ఏమైనా పంపిణీ చేయడాన్ని ఆపివేయాలని సిఐఐ మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తుంది, అని సిఐఐ తన లేఖలో తెలిపింది. ఈ ఏడాది మే నెలలో, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించడానికి 90,000 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలైలో, ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే చేసుకున్న పవన, సౌర ప్రాజెక్టుల అగ్రిమెంట్ల పై తిరిగి సమీక్ష జరపాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం సంతకం చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించబోమని, వీటిని సమీక్ష చేస్తాం అని చెప్పటం, అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.

cii 280820202

ఈ విషయం పై కంపెనీలు, కోర్టుకు వెళ్ళిన తరువాత ,హైకోర్టు డిసెంబరులో రావాల్సిన బకాయిలను చెల్లించాలని చెప్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై స్టే ఆర్డర్ జారీకి ఆదేశించింది. సోలార్ కు యూనిట్‌కు 2.44 రూపాయలు, విండ్ డెవలపర్‌లకు యూనిట్‌కు 2.43 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో 2,500 కోట్ల రూపాయలను విడుదల చేసింది, ఇది 40 శాతం బకాయిలు మాత్రమే. అప్పటి నుంచి మిగతా 60 శాతం పెండింగ్ ఉంటూ వచ్చింది. సిఐఐ అంచనా ప్రకారం, మరో రూ .1,000 కోట్లు వెంటనే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఏపి ప్రభుత్వ నిర్ణయంతో, కంపెనీలు ఎంతో నష్టపోయాయని సిఐఐ తెలిపింది. ఒప్పందాలు రద్దు అనేది చట్టబద్ధమైనవిగా పరిగణించబడవు అని లేఖలో పేర్కొన్నారు. గత వారం ఈ విషయం పై జోక్యం చేసుకోవాల్సిందిగా, ఆయా కంపెనీలు కేంద్రానికి లేఖ రాసాయి. ఇప్పటికే ఈ విషయం కోర్టుల్లో నానూతూ ఉందని, కోర్టు ఆదేశించినా పూర్తి బకాయలు చెల్లించలేదని, కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాసారు. ఇప్పుడు తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) కూడా కేంద్రానికి లేఖ రాయటమే కాక, మా బకాయలు చెల్లించే వరకు, ఇవ్వద్దు అని కేంద్రాన్ని కోరింది.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని రైతుల తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించే సమయంలో, ఆనాడు రాజకీయ నాయకులు అమరావతి గురించి కానీ, రాజధాని ఇక్కడే ఉంటుంది అంటూ అనేక సందర్భాల్లో, అనేక వ్యాఖ్యలు చేసారని, ఇందులో అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే రైతులు, ప్రభుత్వానికి భూములు ఇచ్చారని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మారగానే, మరో పార్టీ అధికారంలోకి రాగానే, నాడు చెప్పిన మాటలు, నాడు ఇచ్చిన నమ్మకం వమ్ము చేస్తూ, ఈ రోజు రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తాం అనే నేపధ్యంలో ఈ అన్ని అంశాలు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు, రాజధాని రైతులు. అలాగే వివధ సందర్భాల్లో, ఈ నాయకులు మాట్లాడిన మాటలు, హైకోర్టుకు సమర్పించారు. అయితే ఈ వ్యవహారం పై స్పందించిన హైకోర్టు వారందరికీ నోటీసులు జరీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి, బొత్సా, బుగ్గన సహా, తెలుగుదేశం, బీజేపీలకు కూడా ఈ నోటీసులు వెళ్ళాయి. రైతుల పక్షాన లాయర్ ఉన్నం మురళీధర్ ఈ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు అందరికీ నోటీసులు ఇచ్చి, సమాధానం చెప్పమని కోరింది.

hc 27082020 2

రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చెయ్యాలని వీరిని ఆదేశించింది. ఇక మరో పక్క ఈ కేసుతో పాటే, ఉన్న రాజధాని కేసు పై కూడా, స్టేటస్ కో, వచ్చే నెల 21 వరకు కొనసాగిస్తూ, ఈ కేసుని వచ్చే నెల 21కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఈ సందర్భంగా, ప్రభుత్వం తరుపు న్యాయావది, అనేక కేసులు ఈ విషయం పైనే వస్తున్నాయని, దీని పై ఎదో ఒక డైరక్షన్ ఇవ్వాలని కోరగా, అలా ఇవ్వటం కుదరదు అని, ఎవరినీ పిటీషన్ వెయ్యవద్దు అని చెప్పలేం అని, ఈ విషయంలో ఏదైనా జడ్జిమెంట్ వస్తే, అవి అన్ని కేసులకు వర్తిస్తుందని, ఎవరినీ పిటీషన్ వెయ్యవద్దు అని మేము చెప్పలేం అని అన్నారు. ఇక మరో పక్క రాజధాని రైతులకు ఇచ్చే కౌలు ఇవ్వటం లేదు అంటూ, వేసిన పిటీషన్ విచారణలో, ప్రభుత్వం తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ రోజు నిధులు విడుదల చేసాం అని చెప్పటంతో, ఈ కేసుని శుక్రవారానికి వాయిదా వేసారు. ఇక మరో పక్క విశాఖలోని 30 ఎకరాల్లో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ పై కూడా హైకోర్టుకు ఫిర్యాదు అందింది. ఒక పక్క స్టేటస్ కో ఉన్నా సరే, విశాఖలో గెస్ట్ హౌస్ పేరిట 30 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారని, 30 ఎకరాల్లో గెస్ట్ హౌస్ ఉండదు అని, దీని పేరున సిఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరుగుతుందని కోర్టుకు తెలపటంతో, ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చెయ్యాలని, చీఫ్ సెక్రటరీని కోర్ట్ ఆదేశించింది.

వాళ్ళు సిబిఐ అధికారులు. గుంటూరులో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఎంక్వయిరీ చేస్తున్నారు. వారికి రక్షణగా ఉండే ఒక పోలీస్ , సిబిఐ పైనే నిఘా పెట్టారు. సిబిఐ అధికారుల సమాచారాన్ని ఎవరికో చేరవేస్తున్నారు. ఈ విషయం సిబిఐ ఆఫీసర్లు పసిగట్టారు. వెంటనే ఆమెను పంపించి వేసి, గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఘటన, నిన్న జరిగినట్టు ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం సంచలనంగా మారింది. ఇక పూర్తి విషయానికి వస్తే, గుంటూరులో ముగ్గురు పోలీస్ అధికారులు అక్రంగా నిర్బందించారు అంటూ, ఒక కేసు హైకోర్టులోకి వెళ్ళటం, హైకోర్టు ఆదేశాల ప్రకారం, సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. క్రికెట్ బెట్టింగ్ విషయంలో, ఈ అంశం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం, సిబిఐ రంగంలోకి దిగింది. గుంటూరుకి వచ్చి ఎంక్వయిరీ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గుంటూరు పరిధిలోని ఒక స్టేషన్ లో మహిళా ఎస్ఐగా పని చేస్తున్న ఒక వ్యక్తిని, సిబిఐ అధికారులకు బద్రత నిమిత్తం నియమించారు. విచారణలో భాగంగా సిబిఐ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణకు వెళ్ళగా, వారికి బద్రతగా వెళ్ళిన ఆ ఎస్ఐ, సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్న తీరుని తన సెల్ ఫోన్ తో ఫోటోలు, వీడియోలు తీసినట్టు, సిబిఐ అధికారులు పసిగట్టారు. వెంటనే ఆమే ఫోన్ లాక్కుని చూడగా, తమ విచారణ పై నిఘా పెట్టారని అర్ధం చేసుకున్నారు.

cbi 27082020 2

వెంటనే ఆ ఎస్ఐ ని అక్కడ నుంచి పంపించే వేసారు. అలాగే జరిగిన విషయం మొత్తాన్ని, తమ పై నిఘా పెట్టటాన్ని, సిబిఐ అధికారులు, గుంటూరు ఎప్సీకి ఫిర్యాదు చేసారు. అలాగే గుంటూరు ఐజికి కూడా ఫిర్యాదు చేసారని ఆ ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం సారాంశం. అంతే కాదు, జరిగిన విషయం మొత్తాన్ని సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి కూడా చెప్పి, తమ పై నిఘా పెట్టిన వ్యక్తి పై కేసు పెట్టి, ఆమె ఎందుకు నిఘా పెట్టారో అనే విషయం పై కూడా, విచారణ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. 2019 అక్టోబర్ లో గుంటూరు సిసిఎస్ పోలీసులు ముగ్గురి పై అభియోగం హైకోర్టులో నమోదు అయ్యింది. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో కేసు వేయటం దీని పై, పోలీసులు మీదే ఆరోపణలు రావటంతో, హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, ఢిల్లీ బ్రాంచ్ ఎస్పీ ఎంఎస్ ఖాన్ గుంటూరు పోలీసుల పై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. Source : https://www.eenadu.net/districts/latestnews/Guntur/4/120099862

Advertisements

Latest Articles

Most Read