అమరావతిలో ప్రజా ఉద్యమమే లేదని, అక్కడ జరిగేదంతా భూస్వాములు, పెట్టుబడి దారీ, ధన వంతుల ఉద్యమమని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రైతుల పోరాటాన్ని అవమాన పరిచారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో సోమవారం ఆయన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తో కలిసి విలేకరు లతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత 250 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని హేళన చేసారు. చంద్రబాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారని, అమరావతి అనేది పెద్ద కుంభకోణమని, చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి అని ఉద్యమాన్ని చంద్రబాబు వరుకే పరిమితం చెయ్యటానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని కోసం 85 మంది చనిపోయారని చెప్పటడం అంతా ఒక కట్టు కథ అని చివరకు మరణాల పై కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని హేళన చేసే ప్రయత్నం చేసారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే జగన్మో హన్ రెడ్డి ప్రయత్నం అంటూ, చంద్రబాబు ప్రజలను రెచ్చగొడు తున్నారన్నారాని ఆరోపించారు.
అలాగే అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన సిపిఐ పై కూడా విమర్శలు చేస్తూ, చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారని, తమది కమ్యునిష్టు పార్టీ ఆఫ్ ఇండియానా లేక కాపిటలిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా అనే దానికి రామకృష్ణ సమాధానం చెప్పాలని అన్నారు. ఇక మరో నేత డొక్కా మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో జరిగే ఉద్యమానికి దళితులకు సంబంధం లేదని సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక అలాగే మంత్రి కొడాలి నాని కూడా ఈ రోజు అమరావతిలో పేదలకు బ్రతకటానికి వీలు లేదా అంటూ, అమరావతిలో అసెంబ్లీ కూడా ఉండటానికి వీలు లేదని అన్నారు. అయితే వీరందరూ కావాలని ఉన్నట్టు ఉండి, అమరావతి ఉద్యమం చేస్తున్న వారి పై చేస్తున్న వ్యాఖ్యలకు, అమరావతి రైతులు కూడా అదే రీతిలో తిప్పి కొట్టారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, మా బాధలు వినాల్సిన ప్రభుత్వం, ఇలా రెచ్చగొట్టటం సబబు కాదని అన్నారు. అమరావతిలో దళితులకు సంబంధం లేదని చెప్పటం సరికాదని, అమరావతి దళిత నియోజకవర్గం అని, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలని అమరావతి పై విషం చిమ్మటం ప్రారంభించారని అన్నారు.