తాము చేసిన పనులు గొప్పగా చెప్పుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. తమ కష్టం అని ప్రజలకు చెప్పుకోవటం, ప్రజలను మెప్పించటంలో అర్ధం ఉంటుంది. కనీ, వేరే వారు చేసిన పనికి మనం క్రెడిట్ కొట్టేసి, ప్రజలను మభ్య పెడదాం అనుకుంటే, అది చివరకు రివర్స్ అవుతుంది. ఇలాంటి పనులు అధికారంలోకి వచ్చిన వైసీపీ అనేకం చేసింది. చంద్రబాబు తెచ్చిన కంపెనీలు ఓపెన్ చేసి, తామే తెచ్చాం అని చెప్పటం. చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులు చివరి దశలో ఉంటే, మొత్తం తామే చేసాం అని చెప్పటం, ఇలాంటివి సర్వ సాధారణం. అయితే రాజకీయ కోణంలో, ఎవరి ఆట వారు ఆడతారు కాబట్టి, ఇవన్నీ సహజం. కనీ ఒక్కోసారి, అవి రివర్స అయ్యి, మనకే ఎదురు దెబ్బలు అవుతాయి. తాజాగా ఇలాంటి ఎదురు దెబ్బే జగన్ పార్టీకి తగిలింది. విజయవాడ వాసుల డ్రీం ప్రాజెక్ట్ కనకదుర్గ ఫ్లైఓవర్. నిజానికి ఈ క్రెడిట్ మొత్తం తెలుగుదేశం పార్టీకి, నిధులు ఇచ్చి సహకరించి కేంద్రానికి దక్కుతుంది. 2011లో తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఈ ఫ్లై ఓవర్ కోసం ధర్నాలు చేసి, చంద్రబాబుని కూడా తీసుకు వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, పెద్ద ఉద్యమమే నడిపారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత, విజయవడా ఎంపీ కేశినేని నాని, ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత తీసుకుని, చంద్రబాబు సహకారంతో, కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రాజెక్ట్ మొదలు పెట్టేలా చేసారు.
అయితే వివిధ కారణాలతో ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ అవుతూ వచ్చింది. డిజైన్లలో మార్పులు, రాజకీయంగా టిడిపితో వైరం రావటంతో నిధులు ఇవ్వకపోవటం, ఇలా వివిధ కారణాలతో లేట్ అయ్యింది. 2019 జూన్ నాటికి 85 శాతం పనులు పుర్తయయ్యి. మరో రెండు మూడు నెలల్లో ప్రాజెక్ట్ అయిపోయేది. ప్రభుత్వం మారటంతో, ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తీ మరింత లేట్ అయ్యింది. రెండు నెలల్లో అయిపోవాల్సిన పని, ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పూర్తి కావచ్చింది. ఫ్లై ఓవర్ లోడ్ టెస్టింగ్ కూడా అయిపోయింది. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. దీంతో ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ 4న ప్రారంభం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, ఈ ఫ్లై ఓవర్ మొత్తం తమ వల్లే అయ్యింది అంటూ, వైసీపీ క్రెడిట్ కొట్టేయటం ప్రారంభించింది. గతంలో ఇక్కడ ఫ్లై ఓవర్ వద్దు అని ఉద్యమించిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేష్ లాంటి నేతలు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో మాట్లాడటంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇదే రాజకీయం అనుకుంటున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే, ఆ ఫ్లై ఓవర్ మా వల్లే వచ్చింది అంటూ, మా జగన్ విజనరీ అంటూ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన, వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది.
వైసీపీ హడావిడి గమించింది విజయవాడ ఎంపీ కేశినేని నాని, సైలెంట్ గా తన పని తాను చేసేసారు. వెంటనే ఢిల్లీ వెళ్లి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, ఫ్లై ఓవర్ పూర్తికి సహకరించినందుకు అభినందించారు. అంతే కాదు, ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కు రావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించారు. ఎలాగైనా ఫ్లై ఓవర్ ఓపెనింగ్ మీరే చెయ్యాలి అని కేశినేని నాని పట్టుబట్టటంతో గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. వీలు ఉంటే తానే స్వయంగా విజయవాడ వస్తానని, లేకపోతే ఆన్లైన్ లో ప్రారంభం చేస్తానని చెప్పారు. ఈ ప్రకటన వచ్చే దాకా కేశినేని నాని ఢిల్లీలోనే ఉండి, అనుకున్నది సాధించారు. ఫ్లై ఓవర్ క్రెడిట్ అంతా తామే తీసుకుందాం అనుకున్న వైసీపీకి ఇది ఇబ్బంది కర పరిణామం అనే చెప్పాలి. గడ్కరే పాల్గుంటే, అటు గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం భుసేకరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని, స్థానిక ఎంపీ కేశినేని నాని కృషిని, బుద్దా వెంకన్న ఉద్యమాన్ని, కేంద్ర సహకారాన్ని ఇలా ఇవన్నీ ప్రస్తావించే అవకాసం ఉంది. ఈ ప్రాజెక్ట్ లో వైసీపీ పాత్ర పరిమితం అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇన్నాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో, మీడియా లో చేసిన హడావిడి పై అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. మొత్తానికి గడ్కరీ ప్రకటన, వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.