చంద్రబాబు అనపర్తి పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు రివర్స్ కేసులు బనాయించారు.చంద్రబాబు ఏ1, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జవహర్ ఏ3 గా కేసులు నమోదు చేసిన బిక్కవోలు పోలీసులు మరో వెయ్యి మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఏకంగా వెయ్యి మంది పై కేసులు పెట్టటంతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు. అనపర్తి, బిక్కవోలు పీఎస్ ల పరిధిలో 143, 353, 149 సెక్షన్ల కింద మొత్తం 3ఎఫ్ఫై ఆర్ లు పెట్టారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జవహర్ సహా పలువురు తెలుగుదేశం నేతలపై 143, 353, 332, 149 సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేశారు.అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొందరు తెలుగుదేశం శ్రేణులపై 188, 506, 34 సెక్షన్ల కింద మరో కేసు నమోదు అయింది.
news
సుప్రీంకోర్టులో బెంచ్ హంటింగ్ బెడిసికొట్టిందా? విచారణకి రాని భారతీ సిమెంట్స్ కేసు
న్యాయవ్యవస్థలో వెసులుబాట్లను వాడుకుని ఏళ్లుగా తనపై నమోదైన సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్ కేసులు విచారణకి రాకుండా చూస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ బెంచ్ హంటింగ్‌కి జగన్ గ్యాంగ్ పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంటే తమకు అనుకూలమైన జడ్జి వద్దకే కేసు విచారణ వచ్చేలా చేసుకున్నారని ఓ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు జగన్ బండారాన్ని ఆధారాలతో బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో భారతీ సిమెంట్స్ కేసు విచారణకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారతీ సిమెంట్స్ కేసును 16వ నెంబర్ కేసుగా జాబితాలో రిజిస్ట్రీ పేర్కొన్నారు. 15వ నెంబర్ కేసును విచారించిన తర్వాత నేరుగా 17వ నెంబర్ కేసును ధర్మాసనం విచారించిందిద. అంటే బెంట్ హంటింగ్ ఆరోపణలు వచ్చిన భారతీ సిమెంట్స్ కేసు విచారణకి రాలేదని తేలిపోయింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను అప్పట్లో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ కేసుని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ ధర్మాసనం ముందుకు విచారణకి వచ్చేలా జగన్ రెడ్డి మనుషులు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ధర్మాసనం విచారణ జాబితా నుంచి చివరి నిమిషంలో డిలీట్ అయినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు ఏపీ సీఎం. ఆ నిరంజన్ రెడ్డి బంధువు పనిచేసే జడ్జి బెంచ్‌కి కేసు వెళ్లేలా చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ బయట పెట్టారు. సుప్రీంకోర్టు బెంచ్ హంటింగ్ విషయంలో జగన్ రెడ్డి ప్రకటన చేయాలని టిడిపి డిమాండ్ చేసింది. భారతి సిమెంట్స్ ఆస్తుల జప్తునకు సంబంధించి సుప్రీంకోర్టులో జరగబోయే కేసు విచారణలో బెంచ్ హంటింగ్ జరిగిందని, అవినీతి మార్గంలో తనపై కేసులు మాఫీ చేయించుకోవడానికి తెలంగాణకు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు బెంచ్ హంటింగ్‌లో ఎంపీ నిరంజన్ రెడ్డి బంధువు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుందని, దీనిపై సీఎం జగన్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
కన్నాలాగే, పురందేశ్వరికి బీజేపీలో పొగపెట్టారా?
ఏ పార్టీలో వున్నా చిన్నమ్మగా పిలవబడే మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే బీజేపీలో మాత్రం ఏ వర్గం ముద్ద పడకుండా ఇన్నాళ్లు నెగ్గుకొచ్చారు. కానీ ఏపీ బీజేపీ దేశంలోనే విచిత్రమైన స్ట్రాటజీ. బీజేపీకి రాష్ట్రంలో ఒక వార్డు మెంబర్ కూడా లేరు. కేంద్రంలో అధికారమే బలంగా ఇక్కడ రాజకీయాలు చేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచిన ఒక్క పదవీ లేకపోయినా, వర్గాలు మాత్రం బోలెడు. బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచినా, అవి అప్పుడు అధికారంలో వున్న టిడిపి భిక్ష. ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఏపీ కీలక నేతలు..ఇతర పార్టీల నుంచి వచ్చిన, ఇతర పార్టీల వైపు చూస్తున్నా, ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న నేతలని పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారు. బీజేపీ తేనె పూసిన కత్తి రాజకీయాలు తట్టుకోలేక మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీలో ఆ ఇద్దరి నేతల టార్గెట్ పురందేశ్వరిని బయటకి పంపడం అని ప్రచారం సాగుతోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్ని పథకాలకు వైఎస్ఆర్, ఎన్టీఆర్ పేర్లే పెడుతున్నారని, పథకాలకు పెట్టేందుకు ఆ ఇద్దరి పేర్లే ఉన్నాయా? ఇంకా ఎవరూ లేరా? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్, వైఎస్ పేర్ల గురించి జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి స్పందించారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు అంటూ జీవీఎల్ కి కౌంటర్ ఇచ్చారు. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరోకరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇదంతా బీజేపీ గేమ్ లో భాగమని కన్నా లక్ష్మీనారాయణ లాగే పురందేశ్వరిని కూడా పొమ్మనకుండా పొగబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి ఏమైనా డ్యామేజ్ చేసేలా మాట్లాడే బీజేపీ నేతలను సోము వీర్రాజు, జీవీఎల్ టార్గెట్ చేస్తారని బీజేపీలో ఓ వర్గం గుర్రుగా ఉంది.
చంద్రబాబు పై బిక్కవోలులో కేసు నమోదు చేసిన ప్రభుత్వం...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అనపర్తిలో చేసిన పర్యటన, ఎంత ఉద్రిక్తతల మధ్య జరిగిందో చూసాం. చంద్రబాబు అనపర్తి సభకు, ముందు అనుమతి ఇచ్చి, తరువాత నిరాకరించటంతో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నాం అని, మీ మాట వినేది లేదు అంటూ, నడుచుకుంటూ అనపర్తి వచ్చి, సభలో ప్రసంగించారు. ఈ నేపధ్యంలోనే, పోలీసులు ఈ రోజు చంద్రబాబుతో పాటుగా, మరో ఏడుగురు పైన కేసు నమోదు చేసారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని, బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు పైన కేసు నమోదు చేసారు. సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ వర్గాలు చెప్పాయి. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపైన కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా సభ నిర్విహించారని, అలాగే పోలీసుల పై చంద్రబాబు దూషణలకు దిగారని డీఎస్పీ ఫిర్యాదు చేసారు. దీని పై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం పై కోర్టులోనే తేల్చుకుంటాం అని చెప్తున్నారు.