వైసీపీ మూడు రాజధానులు నినాదం నాటకమని తేలిపోయింది. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఇప్పటివరకూ చెప్పుకుంటూ వచ్చినవన్నీ డ్రామాలేనని వైసీపీ పెద్దల ప్రకటనలే చెబుతున్నాయి. కోర్టులో కేసులున్నాయని, రాజధాని అంశంపై మాట్లాడితే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందనే భయం లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో ఓ సదస్సులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖే మా రాజధాని, నేను అక్కడికే షిఫ్ట్ అవుతున్నానంటూ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను కోర్టుల దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. మళ్లీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా విశాఖే మా రాజధాని అని చెప్పకనే చెప్పారు. బెంగళూరు పారిశ్రామిక సదస్సులో మంత్రి బుగ్గన విశాఖ కేపిటల్ గురించి ఇన్ డైరెక్టుగా మాట్లాడారు. మూడు రాజధానులు అనేది తప్పుగా కమ్యూనికేట్ అయిందని వివరించారు. విశాఖ నుంచే మొత్తం పరిపాలన సాగుతుందని చెప్పుకొచ్చారు. పాలనా రాజధానిగా విశాఖనే సరిగ్గా సరిపోతుందన్నారు. మౌలిక వసతులు, మరింత అభివృద్ధి చెందే ప్రాంతం విశాఖ అని చెప్పుకొచ్చారు. పోర్టుసిటీ, కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం విశాఖ అని మంత్రి వివరించారు. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే కర్నూలులో ఉంచాలనుకుంటున్నామని చెప్పడం ద్వారా మూడు రాజధానులు ఉండనే ఉండవని, కర్నూలు న్యాయరాజధాని అనేది కూడా ఉత్తుదేనని బుగ్గన తేల్చేశారు. ఇప్పటివరకూ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల పేరిట వైసీపీ గర్జించిందంతా నాటకమేనని సీఎం, ఆర్థిక మంత్రి చెప్పకనే చెప్పేశారు.
news
ఉద్యోగుల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమకు జీతాలు ఇవ్వటం లేదు అంటూ, కొన్ని ఉద్యోగ సంఘాలు, గవర్నర్ దగ్గరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. తమకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం లేదని, పెన్షన్లు సమయనికి ఇవ్వటం లేదని, ఇవి సమయానికి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి అంటూ, గవర్నర్ వద్దకు వెళ్లి, తరువాత మీడియాతో మాట్లాడారు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నో మార్గాలు ఉండగా, గవర్నర్ దగ్గరకు ఎలా వెళ్తారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అంటూ, కొన్ని నిబంధనలు సాకుగా చూపి, షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మీ ఉద్యోగ సంఘాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ, ప్రశ్నించింది. దీని పైన ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విషయం అంటూ, ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. దీని పైన విచారణ జరిపిన హైకోర్టు, ఉద్యోగ సంఘాల రద్దు పై స్టే విధించింది. దీని పై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కడప ఉక్కు చెల్లికి మళ్లీ పెళ్లి చేయనున్న జగన్
తోటరాముడు అనే ఆకు రౌడీ కవి కూడా. ఆయన రాసిన కవితే. చెల్లికి జరగాలి మళ్లీ పెళ్లి కవిత. ఇది కామెడీ కోసమే అయినా ఏపీ సీఎం నిజం చేసి చూపించారు. ఇప్పటివరకూ ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ఒకే ఒక్క కర్మాగారంగా కడప ఉక్కు నిలిచింది. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 2007 జూన్ 10న నాటి కడప ఉక్కు పరిశ్రమ కోసం భూమిపూజ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఉక్కు ఫ్యాక్టరీ ఘనమైన ప్రకటనలు కడప జిల్లావాసులని ఊరించాయి. సేకరించిన భూముల్లో ఒక్క ఇటుకా పెట్టలేదు. 2018 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గండికోట రిజర్వాయర్ ఎగువన ఉన్న కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని శిలాఫలకం వేశారు. ఐదు నెలల్లో అధికారం కోల్పోయారు. దీంతో కడప ఉక్కు ఫ్యాక్టరీ మరోసారి శిలాఫలకానికే పరిమితమైంది. ముచ్చటగా మూడోసారి 2019 డిసెంబర్ 23న జగన్ కూడా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఇది ఏమైందో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లె వద్ద మళ్లీ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం అయిన ఏడాదిలో చేసిన శంకుస్థాపన తరువాత టాటా వారు వస్తున్నారని ఒకసారి, విదేశీ కంపెనీ పెట్టుబడులు పెడుతోందని మరోసారి ఘనంగా ప్రకటించారు. ఆ ప్రతిపాదనలు ఏమయ్యాయో కానీ చెల్లికి మళ్లీ పెళ్లి టైపులో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ సారి జేఎస్ డబ్ల్యూ వారు పేరు వినిపిస్తున్నారు. ఇది మరో శంకుస్థాపనకి వెళుతుందా? కార్యకలాపాలు ఆరంభిస్తుందా అనేది చూడాలి.
సునీల్ పేరుతో జగన్ రెడ్డికి గండం పొంచి వుందా?
సునీల్ అనే పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆ పేరులో వైబ్రేషన్ జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి. సునీల్ పేరున్న వాళ్లు జగన్ రెడ్డికి అత్యంత ఆప్తులు అవుతున్నారు. ఆ తరువాత ఆయన క్రైమ్ పార్టనర్స్ అవుతున్నారని గతం నుంచి ఇప్పటివరకూ జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక, ఆయన కోసం చట్టాలను చేతుల్లోకి తీసుకుని మరీ అరెస్టు చేసిన ప్రతీ ఒక్కరినీ కస్టోడియల్ టార్చర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి సీఐడీ డిజి సునీల్ కుమార్ సంగతి అందరికీ తెలిసిందే. లేటెస్ట్గా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎస్ కి లేఖ రాసింది. మరో సునీల్ కథ పాతది. ఎమ్మార్ కేసులో అరెస్టయి సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. విజయసాయి రెడ్డి వైయస్ జగన్కు కుడి భుజమైతే, సునీల్ రెడ్డి ఎడమ భుజమని చెబుతారు. జగన్ సంస్థలో ఉద్యోగిగా చేరి, ఆయనతో కలిసి వ్యాపారాలు చేసే స్థాయికి ఎదిగాడు సునీల్ రెడ్డి. మరో సునీల్ కథ చూద్దాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ పేరులోనూ సునీల్ ఉందని గమనించారా?వైసీపీ సర్కారు అరాచకత్వానికి పరాకాష్టగా నిలిచిన గంజాయి కేసు కారులో షికార్లు కొట్టిన డిఎస్పీ పేరు కూడా యాధృచ్చికంగా సునీల్ కావడం గమనార్హం. సునీల్ అనే పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏవో వైబ్రేషన్స్ కొనసాగుతున్నాయి.