కమలంతో కన్నా లక్ష్మీనారాయణ ప్రయాణం ముగిసింది. అయితే ఆయన టిడిపిలో చేరతారా? జనసేనకి వెళతారా? అనే దానిపై స్పష్టత రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2014లో మోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నానని తన రాజీనామా సందర్భంగా కన్నా చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని, బీజేపీ ముందుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తుండడంతో బీజేపీకి రాజీనామా చేశానని తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణని త్వరలో వెల్లడిస్తానని చెప్పిన కన్నా ఏ పార్టీలో చేరతారనేది మాత్రం వెల్లడించలేదు. కన్నా లక్ష్మినారాయణ రాజీనామా ప్రకటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావు స్పందించారు. కన్నా లక్ష్మినారాయణకు బీజేపిలో సముచిత గౌరవం ఇచ్చామని, సోము వీర్రాజుపై వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితంగా చేస్తున్నారని చెప్పారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలు స్పందించేందుకు జీవీఎల్ నిరాకరించారు.
news
తనను అడ్డుకున్న పోలీసుల పై, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చూసి, షాక్ తిన్న పోలీసులు...
ఈ రోజు అనపర్తిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే నిన్న అనపర్తిలో సభకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు, ఈ రోజు సభకు పర్మిషన్ లేదని చెప్పారు. దీంతో టిడిపి శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇప్పటికే అనేక మంది అనపర్తి చేరుకోవటంతో, పోలీసులు బ్యారికేడ్ లు పెట్టారు. ప్రజలు, అవి పడగొట్టి ముందుకు వెళ్ళారు. అయితే మరో పక్క చంద్రబాబు అనపర్తి వస్తూ ఉండటంతో, మధ్యలోనే చంద్రబాబుని పోలీసులు ఆపేసారు. దీంతో చంద్రబాబు మొదట, పోలీసులకు 5 నిముషాలు టైం ఇచ్చారు. పోలీసులు అనమతి ఇవ్వకపోవటంతో, చంద్రబాబు కాలినడకన బయలుదేరారు. చంద్రబాబు కేవలం ధర్నా చేసి వెళ్లిపోతరాని పోలీసులు అనుకున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయం తో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడ జనాలను చూసి, పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. చంద్రబాబు నడుచుకుంటూ అనపర్తి బయలుదేరారు.
"నువ్వే మా నమ్మకం" అంటున్న జగన్ క్యాంపెయిన్ కు, చంద్రబాబు కౌంటర్ క్యాంపెయిన్ అదిరింది...
అన్నివర్గాలు వ్యతిరేకం అవుతున్న క్లిష్ట పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐ ప్యాక్‌నే నమ్ముకున్నారు. వారిచ్చిన ప్లానునే అమలు పరుస్తున్నారు. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ తిరుగుతూనే 'మా నమ్మకం నువ్వే జగన్' అనే స్టిక్కర్లను అంటించారు. ఇళ్లకే కాదు లబ్ధిదారుల సెల్ ఫోన్లకు మా నమ్మకం నువ్వే స్టిక్కర్లు అంటించాలని డిసైడ్ అయ్యారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తన శైలికి భిన్నంగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వ్యవస్థలూ నాశనం అయ్యాయని, అన్నివర్గాలూ నష్టపోయారని గోదావరి జిల్లాల పర్యటనలో ఎద్దేవ చేసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక రేంజులో జగన్ ని ర్యాగింగ్ చేశారు. స్టిక్కర్ సీఎం స్టిక్కర్లు అంటిస్తాడట అంటూనే..జగన్ నువ్వే మా దరిద్రం అంటూ సైటైర్ వేశారు చంద్రబాబు. ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రసంగాలు పదునుగా, వ్యంగ్యంగా చేస్తున్నారు. జగన్ పని అయిపోయిందంటూనే...నువ్వే మా నమ్మకం అనే జగన్ ట్యాగ్ లైన్‌ని జనానికి కనెక్టయ్యేలా జగనే మా దరిద్రం అంటూ జనం అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
కేసీఆర్‌ని మింగేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత అరెస్టు తప్పదా?
తెలంగాణ ముఖ్యమంత్రి ఉడత ఊపులకు కేంద్రం బెదరలేదు. ఎమ్మెల్యేల బేరం పేరుతో పెట్టిన కేసులూ తేలిపోయాయి. కేంద్రంలో బీజేపీ విసిరిన లిక్కర్ స్కామ్ ఉచ్చు కవిత మెడకి మరింతగా గట్టిగి బిగిసింది. ఇతరులతో కలిసి కవిత లిక్కర్ స్కామ్‌లో ఉన్నట్లు ఆధారాలున్నాయన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. కవితని అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులపై ఈడీ చేసిన ఆరోపణలకూ ఆధారాలున్నాయన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పి నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది సీబీఐ కోర్టు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవ రెడ్డి కలిసి లిక్కర్ స్కామ్‌ని నడిపినట్లు ఆధారాలను కోర్టుకి సమర్పించారు. ఆధారాలు ఉన్నాయని చెప్పిన మాగుంట రాఘవరెడ్డి విజయ్‌నాయర్, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసిన వారు కవితనీ అరెస్టు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉందని, డబ్బు తరలిన వ్యవహారాలు తేలాల్సి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మనీల్యాండరింగ్ వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిలు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో నిందితులైన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ లు బెయిలు కోసం చేసిన అభ్యర్థనలపై విచారణ జరిపిన కోర్టు నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.