రాష్ట్రంలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారడంతో సచివాలయంలో వాస్తుదోషం కారణంగానే అన్న సెంటిమెంట్ వెంటాడుతోంది. రాష్ట్రంలో వైకాపా భారీ ఆధిక్యంతో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టినా...పాలనా పరంగా సంతృప్తి పొందలేకపోతున్నామనే ఆందోళన ఉంది. సంవత్సర కాలంగా ఎదురవుతున్న కోర్టు కేసులు, ఆర్ధిక సమస్యలు, రాజకీయ పక్షాల ఆందోళనలు, ఉద్యమాలు ప్రభుత్వ పెద్దలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనంతటికీ సచివాలయంలో వాస్తు దోషమే కారణమని సిద్ధాంతులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్ధాంతుల సూచనల మేరకు పవిత్ర శ్రావణ మాసంలో వాస్తు దోష నివారణకు సోమవారం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ప్రధానంగా సచివాలయంలోని సీఎం బ్లాక్ వద్ద గల ఉత్తరం గేటుకు అడ్డంగా గోడ కడుతున్నారు. అలాగే 4, 5 బ్లాకుల మధ్యలో గల దక్షిణం గేటును కూడా మూసివే యనున్నారు. వీటితోపాటు సచివాలయం - శాసనసభను కలిపే ఉత్తర వాయువ్యం గేటు ను తీసేసి గోడ కట్టనున్నారు.

అలాగే సచివాలయం మెయిన్ గేటు వద్ద గల రిసెప్షన్ వద్ద మరో గోడను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు మరికొన్ని నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా జగన్ సచివాలయానికి వచ్చే ముందు ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాస్తు సిద్ధాంతులను తీసుకొచ్చి సీఎంవోలో మార్పులు చేర్పులు చేశారు. అయితే, ఇటీవలికాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు, నిమ్మగడ్డ వ్యవహారం, మండలి రద్దు, రాజధాని ఉద్యమం తదితర విషయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. శాసనాలుచేసే శాసనసభ అమలుపర్చే సచివాలయంలో వాస్తు దోషమే వీటన్నింటికీ కారణమని సిద్ధాంతులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమస్యలను గట్టెక్కించేందుకు వాస్తు నిపుణుల సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సచివాలయం, అసెంబ్లీ రక్షణ చర్యల్లో భాగంగానే గేట్లకు అడ్డంగా గోడలు కడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా కేసుల కట్టడికి జగనన్న క-రో-నా కంట్రోల్ లేదా జగనన్న క-రో-నా వార్ పేరుతో పథకం ప్రారంభించాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల గురించి చర్చించానని తెలిపారు. కోవిడ్-19 కేసుల్లో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 5వ సానానికి చేరుకుందని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానం చేరుకునేలా ఉందని వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై త్వరలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి చర్చిస్తానని అన్నారు. రాష్ట్రంలో యాంటీబాడీ టెస్టుల తో ఆలస్యంజరుగుతోందని, కోవిడ్ టెస్టుల ఫలితాలు 7 రోజుల తర్వాత వస్తున్నాయని, ఈలోగా సామాజికవ్యాప్తి జరుగుతోందని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఈ అంశంపై అధి కారులు, ఎంపీలతో జగన్ వెబ్ సెమినార్ నిర్వహిస్తే బావుంటుందని సూచించారు.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంపీలతో సహా చాలామంది కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో చేరారని గుర్తుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతోందని, దాన్ని అరి కట్టాలని సూచించారు. ఏలూరు హాస్పిటల్లో సెంట్రలైజ్డ్ ఆక్సి జన్ సరఫరా చేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే బావుంటుంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యం చదివిన 8 వేల వైద్యులున్నారు ని, వారి సేవలను కూడా కోవిడ్-19 కోసం ఉపయోగించు కోవాలని సూచించారు. కోవిడ్-19 టెస్ట్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా ఉంటే సామాజిక వ్యాప్తిని అరికట్టవచ్చునని అన్నారు. క-రో-నాతో సహజీవనం చేయాలి అనకుండా దాన్ని అరికట్టాలని హితవు పలికారు. కావాలంటే క-రో-నా అరికట్టే పథకానికి జగనన్న కరోనా కంట్రోల్ లేదా జగన్న కరోనా వార్ లాంటి పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదని అన్నారు.

ఇందు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, అయితే కులం ప్రస్తావన లేకుండా ప్రతిభ కలిగిన నిపుణులను అందులో సభ్యు లుగా చేర్చాలని అన్నారు. ఏపీలో కూడా ఢిల్లీ మోడల్ అమలు చేసి కేసులను కట్టడి చేయాలి అని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనొక జోక్ వేశారని, తానుజోక్ గానే భావిస్తున్నానని తెలిపారు. తన గెలుపులో గెలుపులో జగన్ చరిష్మా 90శాతం. తన చరిష్మా 10శాతం ఉన్నాయని పునరుదాటించారు. అవంతి శ్రీనివాస్ తనను రాజీనామా చేయమంటున్నారని, అయితే తాను మాత్రం రాజీనామా చేయనని అన్నారు. నలంద కిశోర్, అవంతి శ్రీనివాస్ కు ఎంత మంచి స్నేహితుడో అందరికి తెలు సునని తెలిపారు. నలంద కిషోర్ విషయంలో పోలుసుల తీరు సరైంది కాదని మరోసారి వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థ పరిధి తెలుసుకోవాలని, ప్రజలు భయపడుతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ప్రసుత్తం ఉన్న కన్నా లక్ష్మీనారాయాణను అధిష్టానం తొలగించి, ఆయన స్థానంలో సోము వీర్రాజుని నియమించింది. కన్నా లక్ష్మీనారాయాణ పదవీ కాలం రెండేళ్ళు పూర్తీ అవ్వటంతో, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికి కొత్త నియామకం జరిగింది. సహజంగా బీజేపీలో రెండు ఏళ్ళు బీజేపీ అధ్యక్షులుగా ఉంటారు. మిగతా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వచ్చినా, ఏపి రాష్ట్రానికి పెండింగ్ లో పడింది. నాలుగు నెలలు లేటుగా నియామకం జరిగింది. అయితే కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో, సోము వీర్రాజుని నియమించారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. గతంలో తెలుగుదేశం హయంలో ఉండగా, అప్పట్లో బీజేపీ మిత్ర పక్షంగా ఉండటంతో, చంద్రబాబుని అడిగి, ఎమ్మెల్సీగా సోముని నియమించుకుంది బీజేపీ. మరో పక్క ఆర్ఎస్ఎస్ కూడా, సోము వైపు మొగ్గు చూపటంతో, నియామకానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది.

సంఘ్ నేపధ్యం ఉండటం, సంఘ్ సిఫార్సుతోనే, ఆయనకు అధ్యక్ష పదవి వరించింది అనే ప్రచారం జరుగుతుంది. ఎవరు అవును అన్నా కాదన్నా, బీజేపీ రెండు వర్గాలుగా ఉంది. ఒక వర్గం వైసీపీకి బాగా అనుకూలంగా ఉంటే, ఒక వర్గం బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సోము వీర్రాజు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా పని చేస్తూ ఉండేవారు. గత ఏడాది కాలంలో కూడా, వైసీపీ ప్రభుత్వానికి కంటే, తెలుగుదేశం మీదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. మొత్తానికి తమకు పక్కలో బల్లెంలా ఉంటూ, 108 స్కాం, కరోనా కిట్ల స్కాం బయట పెట్టిన కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్ష పదవి నుంచి వెళ్ళిపోవటంతో, ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా సంబర పడి పోతుంది. మరి కొత్తగా వచ్చిన సోము వీర్రాజు గారి అజెండా ఏమిటో, రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.

సహజంగా ఎవరి పార్టీ వారికి ఉంటుంది. ఎవరి పార్టీ వ్యవహారాలు వారికి ఉంటాయి. ఆయా పార్టీల్లో, ఎవరు అధ్యక్షుడు, ఎవరు జనరల్ సెక్రటరీ, ఎవరు కార్యవర్గం అనేది, ఆ పార్టీ అంతర్గత విషయం. తమ పార్టీ బలోపేతం అవ్వటానికి, ఆయా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. పక్క పార్టీల వారికి, అవి అనవసరం కూడా. కానీ మన రాష్ట్రంలో ఒక వింత పరిస్థతి ఏర్పడింది. ఢిల్లీలో ఉన్న బీజేపీని మెడలు వంచుతాం అన్న వాళ్ళు, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, ఈ దేశంలోనే ఎవరూ నిలదీయని విధంగా, బీజేపీని నిలదీసి, రాజకీయంగా దెబ్బ తిని, తన పని తాను చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏపి బీజేపీ అధ్యక్షుడు మార్పు జరిగింది. కన్నా లక్ష్మీ నారాయణ పదవీ కాలం ముగియటంతో, కన్నా స్థానంలో సోము వీర్రాజు వచ్చారు. సహజంగా కొత్త అధ్యక్షుడు వస్తే, బీజేపీ క్యాడర్ సంతోషంతో ఊగిపోవాలి కానీ, ఎందుకో మరి, వైసీపీ ఊగిపోతుంది. అదేదో తమ గొప్ప విజయం అన్నట్టు, సోషల్ మీడియాలో ఉన్న బ్యాచ్ గుడ్డలు చించుకుంటుంది.

వేరే పార్టీలో ఉన్న అధ్యక్షుడు మారిపోతే, వీళ్ళు సంబర పడుతున్నారు అంటే, గతంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అంటే వీళ్ళకు భయమా ? లేక సోము వీర్రాజు మన వాడే, మన పార్టీకి అనుకూలం, కన్నా లక్ష్మీనారాయణ 108 స్కాం, కరోనా కిట్ల స్కాం బయట పెట్టినట్టు, సోము వీర్రాజు మన స్కాంలు ఏమి బయట పెట్టరులే అనే ధీమానో కానీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా, ఎదో పెద్ద ఘనత సాధించినట్టు, నిన్న రాత్రి నుంచి ఊగిపోతున్నారు. రేపు ఒక వేళ, సోము వీర్రాజు కూడా, వీళ్ళ స్కాంలు బయట పెడితే, కన్నా మీద ఆరోపణలు చేసినట్టు, సోము వీర్రాజు కూడా చంద్రబాబుకి అమ్ముడు పోయాడు అని, ఆరోపణలు చేసినా ఆశ్చర్యం లేదు. ఎవరైనా తమ బలం పై, ఆధారపడి రాజకీయం చేస్తారు కానీ, ఎదుటి పార్టీలో ఎవరో ఎదో పదవిలోకి వస్తే, వీళ్ళు సంబరపడటం చూస్తుంటే, ఏదో మొరటు సామెత గుర్తుకు వస్తుంది. అయినా ఢిల్లీ బీజేపీ, కనీసం సియం హోదాలో ఉన్న జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వటానికి కూడా ఇష్ట పడటం లేదు, అలాంటిది ఇక్కడ సోము వీర్రాజు ఉంటే ఏమిటి, జీవీఎల్ ఉంటే ఏమిటి, కన్నా ఉంటే ఏమిటి ?

Advertisements

Latest Articles

Most Read