వైసీపీలో మంత్రి రోజా ఒంటరైందా అంటే అవుననే పరిస్థితులు నిరూపిస్తున్నాయి. నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సభలో మంత్రి రోజాపై ఒక తుఫానులా విరుచుకుపడిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు. విమర్శల బాణాలు సంధించారు. అయితే వైసీపీ నుంచి రోజాని వెనకేసుకొస్తూ ఎవ్వరూ ఆమెకి మద్దతుగా నిలవలేదు. ఆమెపై లోకేష్ ఆరోపణలు చేస్తే ఆమే మీడియా ముందుకొచ్చి ఖండించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. డైమండ్ పాప అంటే ఫీలవుతోందని, జబర్దస్త్ ఆంటీ అంటున్నానని చెప్పారు లోకేష్. రోజా భర్త, అన్నలు నగరి నియోజకవర్గాన్ని వాటాలు వేసుకుని మరీ దోచుకుంటున్నారని ఆరోపించారు. రోజా అవినీతి, ఆరోపణలు, విదేశీ టూర్లు, మంత్రిగా అహంకారం మొత్తం కడిగి పారేశారు. తనపై ఈ స్థాయిలో నారా లోకేష్ విరుచుపడతాడని ఊహించని రోజా షాక్‌లోకి వెళ్లింది. వైసీపీ నుంచి ఎవరైనా తనకు మద్దతు వస్తారేమోనని ఎదురుచూసింది. ఎవ్వరూ రాకపోయేసరికి తానే ఆస్థాన మీడియా విద్వాంసులు సాక్షి వాళ్లని పిలిచి తనదైన మొరటు భాషలో కౌంటర్ ఇచ్చింది. మంత్రి రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక రేంజులో ఫైరయ్యారు. మరోవైపు రోజాకి ఇస్తామంటూ చీరలు, గాజులు పట్టుకుని వచ్చిన తెలుగు మహిళలు మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు మహిళలను అరెస్టుచేసి స్టేషన్‌కి తరలించారు. తమ నాయకుడు నారా లోకేష్ గురించి అనవసరంగా మాట్లాడితే రోజాను ఎక్కడికక్కడ నిలదీస్తామని తెలుగు మహిళలు హెచ్చరించారు. మంత్రిగా ఉన్న రోజాని లక్ష్యంగా చేసుకుని మరీ నారా లోకేష్ నగరిలో ప్రసంగించారు. అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీ నుంచి రోజాకి సంఘీభావం తెలపలేదు. తనపై ఆరోపణలకు చివరికి తానే వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి రోజాకి దాపురించింది. మరోవైపు లోకేష్ పై రోజా విమర్శల దాడికి దిగిన వెంటనే టిడిపి నేతలు, కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో రోజా అవాక్కయ్యారు.
news
గవర్నర్ మార్పుతో జగన్ పరిస్థితి ఏంటి ? మోడీ ఇచ్చిన సంకేతం ఏంటి ?
ఏ ఆర్డినెన్స్ పంపినా పెద్ద మనసుతో నిమిషం ఆలస్యం చేయకుండా సంతకం చేసేవారు. ప్రభుత్వాన్ని కోర్టులు అభిశంసించినా పట్టించుకోని విశాల హృదయం గవర్నర్ ది. చివరికి ఉద్యోగసంఘాలకు అపాయింట్మెంట్ ఇప్పించారనే కారణంతో తన సెక్రటరీ సిసోదియాని సీఎం ఆకస్మికంగా బదిలీ చేసినా, ఎందుకు చేశారు బదిలీ అని అడగనంత సాత్వికుడైన గవర్నర్‌ని ఎందుకింత హఠాత్తుగా బదిలీ చేశారని ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం కోసం బీజేపీ పంపిన దేవుడిలాంటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని ప్రభుత్వం ఉన్నంతవరకూ ఉంటారని అనుకున్నారు. సడెన్ గా ఇతర రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలలో గవర్నర్ హరిచందన్‌ని చత్తీస్ గఢ్‌కి పంపడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రంలోనూ గవర్నర్ ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేదు. అటువంటిది ఏపీలో వైసీపీ సర్కారుకి గవర్నర్ అందించిన సహకారం చూస్తుంటే, వైసీపీ కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని ప్రజలు నమ్మేవారు. అయితే సడెన్‌గా ఏపీకి కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్‌ను నియమించారు. దీంతో వైసీపీతో బీజేపీ హనీమూన్ పిరియడ్ ముగిసిందని, సర్వేలలో వైసీపీ పని అయిపోయిందని తెలిసి బీజేపీ పెద్దలు దూరం అవుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ సర్కారుతో అత్యంత స్నేహంగా ఉండే బిశ్వభూషణ్‌ని చత్తీస్ గఢ్ పంపారని టాక్ వినిపిస్తోంది.
మంత్రి గుడివాడ అమర్ నాథ్ కామెడీతో ఏపీ పరువు పాయె
ఏపీ ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అనతికాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆయనేదో ఘనత సాధించి ఇంత పేరు సంపాదించలేదు. అవగాహనలేనితనంతోపాటు అసందర్భపు ప్రేలాపనలతో వైసీపీ సర్కారు పరువే కాదు, ఏపీ పరువు కూడా తీసేస్తున్నాడు. ఎన్నిసార్లు బకరా అయినా, అదే మంత్రిని మీడియా ముందుకు పంపడం ఏదో ప్లాన్డ్‌గా చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఏపీలో ఏదో ఒక సీరియస్ టాపిక్ పై చర్చలు జరుగుతుంటాయి. అప్పుడే ఆ అంశంతో సంబంధంలేకుండా పిచ్చివాగుడు వాగి పోతాడు మంత్రి అమర్ నాథ్. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. అప్పుడు అమర్ నాథ్ అనే ఈ కామెడీ పీస్ ని మీడియా ముందుకు వదిలారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తనకి తెలియదని, అంటూనే పవన్ కళ్యాన్ వచ్చి తనని బతిమాలుకుని ఫోటో దిగాడంటూ ట్రోలర్లకి అతి పెద్ద ఆయుధం అందించి పోయాడు. దావోస్ ఎందుకు వెళ్లలేదు అని మీడియా అడిగితే అక్కడ మైనస్ 5 డిగ్రీల చలి వుంటుందని స్నానం చేయడానికి అవ్వదని చెప్పుకొచ్చి నవ్వులపాలై ఏపీని నవ్వుల పాలు చేశారు. మద్యనిషేధం అనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదని తేల్చేసిన గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నేతలే నోరెళ్లబెట్టారు. తెలంగాణలో ఈ రేసింగ్‌ల వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు కోడి గుడ్డు పెట్టాలని, ఆ గుడ్డు పొదిగించితే పెట్ట అవుతుందంటూ మరోసారి తన స్టాండప్ కామెడీ స్కిల్స్ ప్రదర్శించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి లేమిపై ప్రజలు మాట్లాడుకోకుండా అమర్ నాథ్ కామెడీ గురించి ప్రజలు మాట్లాడుకునేలా వైసీపీ డైవర్షన్ ప్లాన్ ఇది అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
లోకేష్ 200 కిమీ నడిచాడు..వైసీపీ 200 ప్రెస్‌మీట్లు పెట్టింది
నారా లోకేష్ యువగళం వైసీపీ సర్కారు అడ్డంకులను అధిగమించి మరీ 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పోలీసుల కుయుక్తులు, అనుమతులు పేరుతో అడ్డగింతలు, రోడ్డుపై మాట్లాడకూడదు, మైకు వాడకూడదు, జనం గుమికూడదు ఇన్ని ఆటంకాలను శాంతియుతంగానే ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నారు లోకేష్. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం కత్తెరపల్లి గ్రామంలో 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. రెండు వారాల పాదయాత్రలో లక్షలాది జనాన్ని పలకరిస్తూ సాగుతున్నారు. వేలాది మంది కష్టాలు వింటున్నారు. అయితే అసలు పాదయాత్ర జరగడంలేదని వైసీపీ దుష్ప్రచారం చేసేందుకు తనకి అందుబాటులో ఉన్న సొంత మీడియా, కూలి మీడియాలను విరివిగా వాడుతోంది. 200 కిలోమీటర్లు దాటేసరికి లోకేష్‌పై నమోదైన కేసులు 20 దాటిపోయాయి. తాను అన్నింటికీ సిద్ధమేనంటూ ప్రకటించిన లోకేష్, 400 రోజుల పాదయాత్రలో రోజుకొకటి లెక్క తనపై 400 కేసులు పెట్టుకోమంటూ సవాల్ విసిరాడు. లోకేష్ పాదయాత్ర 200 రోజులు పూర్తయ్యేసరికి, లోకేష్‌ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ తమ నేతలతో పెట్టించిన ప్రెస్‌మీట్లు 200 దాటిపోయాయి. 17 రోజుల లోకేష్ పాదయాత్రని విమర్శిస్తూ 19 మంది మంత్రులు, , 58 మంది ఎమ్మెల్యేలు, 138 మంది వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఇంతమంది మాట్లాడారు కానీ.. పాదయాత్రలో నారా లోకేష్ వేస్తున్న ప్రశ్నలకు ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు. యువగళంలో యువనేత లోకేష్ చేసే ఆరోపణలపైనా స్పందించలేదు.