గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన లిస్టులో ముద్రగడ మొదటి వరుసలో ఉన్నారనే చెప్పాలి. 2014-19 మధ్య కాదు, అంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ముద్రగడ హడావిడి చేసి, వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా జగన్ సియం అవ్వగానే, ఒకటి రెండు లేఖలు తప్ప, ముద్రగడ సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టినా, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెట్టినా, శాంతించని ముద్రగడ ప్రతి రోజు ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉండేవారు. అయితే జగన్ వచ్చిన తరువాత రిజర్వేషన్ ఎత్తేసినా, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం అవుతున్నా ముద్రగడ పట్టించుకోలేదు. అయితే ఈ రోజు సడన్ గా కాపులను ఉద్దేశించి ముద్రగడ లేఖ రాసారు. తనను సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారని, మానసికంగా కృంగిపోయాను అని, ఇక కాపు ఉద్యమం చెయ్యలేను అంటూ చేతులు ఎత్తేస్తూ, వీడ్కోల లేఖ రాసారు ముద్రగడ. ఇంత పెద్ద ఉద్యమ నేతను అని చెప్పుకునే ముద్రగడ, కేవలం సోషల్ మీడియా విమర్శలకే ఉద్యమం ఆపేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఇవాళ్టి రోజున సోషల్ మీడియా బారిన పడని వారులేరు. మరి ముద్రగడ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారు ? రకరకాల మాటలు వినిపిస్తున్నా, అవేమి నిర్ధారణ లేని వార్తలు కాబట్టి, దాన్ని గురించి మాట్లాడుకోలేం కానీ, ముద్రగడ రాసిన లేఖలో విషయాలను బట్టి ఒక అంచనాకు రావచ్చు. ముద్రగడ లేఖలో, తనకు ఎవరో ఫోన్ చేసి, వాళ్ళు ఎవరో కాపు ఉద్యమం పై చేసిన స్టేట్మెంట్ కు మద్దతు ఇచ్చి, వారితో కలిసి నడవమన్నారని రాసారు. కాపు ఉద్యమం పై ఎవరు మాట్లాడింది అంటే, ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ, మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్ కావాలని కోరింది. అయితే దీని పై ముద్రగడ మాత్రం స్పందించలేదు. ఈ రోజు ముద్రగడ లేఖలో రాసింది ఈ అంశం ఏనా అనే అనుమానం వస్తుంది. నేను ఉద్యమం చేసినప్పుడు వారు నాతొ వచ్చారా, ఇప్పుడు వారి ఉద్యమానికి నేను ఎందుకు రావాలి అని ముద్రగడ రాసారు. ఇలా చేస్తున్నందుకు, తన పై బురద చల్లుతున్నారని, ముద్రగడ లేఖలో చెప్పారు. అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ? తాము చేస్తున్న కాపు ఉద్యమానికి మద్దతు తెలపమని ఎవరు కోరారు ? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం కళ్ళకు కనపడుతుంది, చరిత్ర చెప్తున్న వాస్తవం కూడా ఇదే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే, ముద్రగడ బయటకు వస్తారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో చలామణి అవుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, గుర్తింపుని రద్దు చెయ్యాలి అంటూ, అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న మహబూబ్ భాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల కమిషన్, పార్టీలకు పేర్లు కేటాయించే సందర్భంలో కూడా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే వాడుకోవాలని, వైఎస్‍ఆర్ కాంగ్రెస్ అని వాడకూడదు అంటూ షరతులు పెట్టింది. ఆ షరతు పైనే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ అయ్యింది. అయితే గత కొంత కాలం తరువాత, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి, మా పార్టీ పెద్ద పార్టీ అని, అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధం లేడని, తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునే అవకాసం ఇవ్వాలని లేఖ రాసింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం, ఆ విజ్ఞప్తిని ఒప్పుకోలేదు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా సరే, జగన్ పార్టీ, తమ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ, వాడుకోలోకి తీసుకోవచ్చింది.

అయితే అధికారిక లెటర్ హెడ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుతూ ఉండటంతో , ఇబ్బంది మొదలైంది. తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, రఘురామ రాజు అభ్యంతరం తెలిపారు. దీంతో జగన్ పార్టీ పేరు విషయం, బయటకు వచ్చింది. దీంతో, అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాషా, అభ్యంతరం తెలుపుతూ, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేసారు. అయితే, అక్కడ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, ఆయన ఢిల్లీ హైకోర్ట్ ని ఆశ్రయించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉండటంతో, కేసు అక్కడ ఫైల్ చేసారు. అయితే ఈ పిటీషన్ అసలు కోర్టు పరిగణలోకి తీసుకోదు అని జగన్ పార్టీ అనుకున్న సమయంలో, ఢిల్లీ హైకోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించి, జగన్ పార్టీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. దీని పై సమాధానం చెప్పాలి అంటూ, కేసును సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉండటంతో, ఇప్పుడు కోర్టు ఏమి చెప్తుందో చూడాలి.

అమరావతి రాజధాని ఇక్కడే కొనసాగుతుందని వైకాపా మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్మోహనరెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట తప్పిన విషయం తెలిసిందే. అమరావతి రాజధాని ఉద్యమం 206 రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు, నిరసన తెలిపారు. వైకాపా మేనిఫెస్టోలో రాజధాని ఇక్కడే అన్నారని, ఎమ్మెల్యే ఆర్కే ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలో ప్రకటించిన విషయం మర్చిపోయారని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం, జగన్ మాట తప్పారని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట మార్చారని ఆరోపించారు. రాజధాని ఉద్యమం నేపధ్యంలో రైతులు, మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలో హైకోర్టు, యూనివర్సిటీలు ఏర్పాడ్డాయి. సచివాలయం, అసెంబ్లీ నిర్మించుకొని పాలన కొనసాగుతుందని, జిల్లాల మద్య విభేదాలు సృష్టించడం మంచి పరిణామం కాదని అన్నారు.

వైకాపా ప్రభుత్వం ఎన్ని కుటీల ప్రయత్నాలు చేసిన ఉద్యమం కొనసాగుతోందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులను అవమానపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అందరికి ఆమోదయోగ్యమైన అమరావతి రాజధాని వైకాపా ప్రభుత్వం ఎందుకు విస్మరించింది. నాడు నేడు అమరావతి నుండే పరిపాలన కొనసాగుతున్న విషయం గుర్తుచేశారు. రాజధాని సమస్య రాష్ట్ర సమస్య అన్నారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ మంత్రుల చేస్తున్న ప్రకటనల పై రాజధాని రైతులు చాలెంజ్ చేసారు. మంత్రులు అందరూ, వైజాగ్ రాజధాని వద్దు అంటూ, అక్కడ ప్రతిపక్ష నేతలను రాజీనామా చేసి గెలవమని అంటున్నారని, మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసి, మళ్ళీ గెలవలాని ఛాలెంజ్ చేస్తున్నాం అని, దీని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెడీనా అని ఛాలెంజ్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిస్వభూషణ్ హరిచందన్ కు అమరావతి పరిరక్షణ సమితి లేఖ రాసింది. రాజధాని బిల్లులు సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో, అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం లేదని ఆ లేఖలో తెలిపింది. రాజధాని రైతుల హక్కులకు భంగం కలిగించేలా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారని ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, ఆ లేఖలో తెలిపింది. నిజానికి గత రెండు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు రాజధానుల బిల్లుని గవర్నర్ వద్దకు పంపిస్తుందని, మీడియాలో వార్తలు వస్తున్నాయి. శాసనమండలిలో మొదటి సారి బిల్లులు ప్రవేశపెట్టగా, అవి సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి. అయితే కమిటీ వెయ్యకుండా, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. రెండో సారి శాసనమండలిలో ఆ బిల్లులు పెట్టింది, అయితే సభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో, 14 రోజులు దాటి పోవటంతో, ఆ బిల్లులకు ఆమోదం కోసం, గవర్నర్ వద్దకు పంపించి, గవర్నర్ ఆమోదంతో, మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని, ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ వారం, లేదా వచ్చే వారం, ఈ ప్రక్రియ అయిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే, ప్రభుత్వం తరుపు కుట్రని పసిగట్టిన అమరావతి పరిరక్షణ సమితి, గవర్నర్ కు లేఖ రాసింది. కన్వీనర్ ఏ.శివా రెడ్డి ఈ లేఖ రాసారు. రెండు బిల్లులను ఆర్టికల్ 237, 238 కింద, సెలెక్ట్ కమిటీకి పంపించారని అన్నారు. రెండో సారి ఈ బిల్లుని మండలిలో ప్రవేశ పెట్టటం, చట్ట విరుద్ధం అని అన్నారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అయితే ఇవేమీ పట్టించుకోకుండా, మంత్రిమండలిలో చర్చ లేకుండా, హడావిడిగా ఆమోదించి, అసెంబ్లీలో పాస్ చేసారని, ఇలాంటి హడావిడి బిల్లులను శాసనమండలిలో మరింతగా చర్చించే అధికారం ఉందని, దాని ప్రకారమే చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపారని తెలిపారు. అయితే, సెలెక్ట్ కమిటీ వెయ్యకుండా, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, రెండో సారి మండలిలో ప్రవేశపెట్టారని అన్నారు. మండలి చైర్మెన్ సెలెక్ట్ కమిటీ వెయ్యలేదని, ఇప్పటికే ఫిర్యాదు చేసారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఒకసారి సెలెక్ట్ కమిటీ దగ్గర ఉండగా, మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టె అధికారం లేడని అన్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన విషయం ప్రభుత్వం హైకోర్టు కి కూడా చెప్పిన విషయం తెలిపారు. కౌన్సిల్ వద్దే ఉన్న బిల్లుల పై, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ, రాజ్యంగ పరిరక్షకుడిగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read