వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మొదటి నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, పార్టీకి సంబంధం లేకుండా, ఏ తప్పు జరిగినా, సొంత పార్టీ అయినా సరే ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. మొదట్లో, వైసిపీ ప్రభుత్వం, తెలుగు మీడియం ఎత్తేసి, ఇంగ్లీష్ మీడియం తెచ్చిన సమయంలో, ఏకంగా పార్లమెంట్ లోనే, తెలుగు భాష పై మాట్లాడారు, అంతే కాదు మాతృభాషలో విద్యాబోధన అనేది చట్టం అని పార్లమెంట్ లోనే చెప్పి, తన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పు అనే విధంగా మాట్లాడారు. ఇక ఆ తరువాత, అనేక విషయాల పై, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పై, ప్రజల గొంతు వినిపించారు. ఇసుకలో జరుగుతున్న అక్రమాలు కాని, ఇళ్ళ స్థలాల పేరిట డబ్బులు వసూలు చెయ్యటం కాని, వరుసగా కోర్టుల్లో ఎదురు దెబ్బలు గురించి కాని, ఒకే సామజివర్గానికి పదవులు ఇవ్వటం కాని, ఇలా ప్రతి విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో అవి మీడియాలో చెప్తూ వచ్చారు. తనకు జగన్ మోహన్ రెడ్డి అప్పాయింట్మెంట్ ఇవ్వటం లేదని, అందుకే నాలుగు గోడల మధ్య చెప్పాల్సింది, ఇలా మీడియా ద్వారా చెప్పాల్సి వస్తుందని అన్నారు. అయితే, అందరి పై ఎదురు తిరిగి నట్టే, రఘురామ కృష్ణం రాజు పై కూడా, ఎదురు తిరిగటం మొదలు పెట్టింది వైసిపీ పార్టీ. రఘురామ కృష్ణం రాజు సొంత సామజిక్వర్గ నేత చేత మొదట్లో తిట్టించారు.

తరువాత ఆ విషయం పై కూడా, మా చిన్న కులంలో చిచ్చు పెట్టకండి అని రఘురామ కృష్ణం రాజు బహిరంగంగా విమర్శించటంతో, మిగతా వారి చేత కూడా తిట్టించటం, దిష్టి బొమ్మలు తగల బెట్టించటం, ఇలా అనేక నిరసనలు చేసారు. ఇంతటితో ఆగకుండా, ఈ దిష్టి బొమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అని అన్నారని, రఘురామకృష్ణంరాజుకు వీడియోలు చేరటంతో, ఆయన సీరియస్ అయ్యారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసారు. అక్కడ ఎవరూ పట్టించుకోలేదు, దీంతో జిల్లా ఎస్పీకి ఉత్తరం రాసారు. అయితే, మరో పక్క, తనకు రాష్ట్ర పోలీసులు పై నమ్మకం లేదు అంటూ, ఏకంగా ఢిల్లీలోనే చక్రం తిప్పటం మొదలు పెట్టారు. పార్లమెంట్ స్పీకర్ కు లేఖ రాసి, జరిగిన విషయం మొత్తం చెప్పి, వీడియో ఆధారాలు ఇచ్చి, తనకు కేంద్ర బలగాల చేత భద్రత కావాలని కోరారు. అయితే ఈ ఉత్తరం స్పీకర్, హోం మంత్రి అమిత్ షా కార్యాలయానికి పంపించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తనకు తొందరలోనే కేంద్ర భద్రత వస్తుందని, అన్నారు. ప్రజాసమస్యలతో జగన్ బిజీగా ఉన్నారేమో, తనకు ఇప్పటికైనా కొంత సమయం ఇస్తే, ఆయనతో మాట్లాడతానని అన్నారు.

విజయసాయి రెడ్డి అతి పెద్ద కుంభకోణం చేసారంటూ, రూ.307 కోట్ల స్కాం వివరాలు తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం బయట పెట్టారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన "జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఈ సంవత్సరకాలంలో అన్ని రంగాల్లో కుంభకోణాలు చూశాం. ఇసుక, మద్యం, ఇళ్ల పట్టాలు ఇలా ఒకటేమిటి చివరికి కరోనా కిట్లు, పారిశుధ్యం కోసం చల్లే బ్లీచింగ్ పౌడర్ లో కూడా కుంభకోణాలకు పాల్పడ్డారు. దీనికితోడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జే ట్యాక్స్ పేరుతో వేల కోట్లు బొక్కేస్తున్నారు. తాజాగా 108 అంబులెన్సుల కొనుగోళ్లు, నిర్వహణలో భారీ స్కాం జరిగింది. ట్విట్లర్లో రోజూ కూతలు కూసే జగన్ ఆత్మ విజయసాయి రెడ్డి ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి. నిర్వహణ పేరుతో 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. 2016కి ముందు వరకు జీవీకే ఈఎంఆర్ సంస్థ అంబులెన్సుల్ని నిర్వహించేది. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011 అక్టోబర్ 1 నుండి 2016, 30 సెప్టెంబర్ వరకు ఒప్పందం జరిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా.. జీవీకే నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించారు. 2016లో ఓపెన్ టెండర్లు పిలవడం ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పాటు, లండన్కు చెందిన యుకే ఎస్ఏఎస్ భాగస్వామ్యం కలిగిన బీవీజీ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. నియమనిబంధనలకు అనుగుణంగా2017, డిసెంబర్ 13న ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది.

ఈ కాంట్రాక్టు 2020, డిసెంబర్ 12 వరకు ఉంటుంది. అయితే.. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే.. 2019, సెప్టెంబర్ 5న ఉన్న అంబులెన్సులకు అధనంగా మొత్తంగా 439 అంబులెన్సులు కొనుగోలు చేసేందుకు 105 జీవో ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రబుత్వంపై భారం లేకుండా ఉండేందుకు ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019, సెప్టెంబర్ 20న పాత, కొత్త అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీని గుర్తించాలని 111 జీవో విడుదల చేశారు. బీవీజీ సంస్థ కాంట్రాక్టు పరిమితి ముగియక ముందే కొత్త సంస్థను గుర్తించాల్సిన అవసరం ఏమిటో ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రి సమాధానం చెప్పాలి. 2019, అక్టోబర్ 18న అంబులెన్సులను పైనాన్స్ విధానంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేలా జీవో నెం.117 విడుదల చేశారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండకూడదని ఫైనాన్స్ అన్న ప్రభుత్వ పెద్దలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి కారణమేంటి.? ఎవరితో ఎంత కమిషన్ కోసం ఈ జీవో మార్పు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మొదటి నుండి ఆరోగ్యశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్ సర్వీసులను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద నిర్వహించే 2019, అక్టోబర్ 30న జీవో నెం.566 ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవో అనే వ్యక్తిని ఆఘమేఘాలపై డైరెక్టర్ గా నియమించారు. ఈ మార్పు ఎందుకు చేశారో ముఖ్యమంత్ర సమాధానం చెప్పాలి.

ఈ అంబులెన్సులను కొనుగోలు చేయడం కోసం రూ.71.48 కోట్లను అంబులెన్సుల కొనుగోలు కోసం విడుదల చేస్తున్నట్లు 2019, డిసెంబర్ 30న 679 జీవో ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవోగా నియమించిన రాజశేఖర రెడ్డికి నెల రోజులకే పదోన్నతి కల్పిస్తూ అడిషనల్ సీఈవోగా పదోన్నతి కల్పిస్తూనే.. ఆరోగ్యశ్రీ నిర్వహణ మొత్తం అతని చేతుల్లో పెడుతూ జీవో నెం.72 ఇచ్చారు. ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉండగానే.. దాన్ని రద్దు చేసి కొత్త అంబులెన్సులకు నెలకు రూ.1.78లక్షలు, పాత అంబులెన్సులకు రూ.2.21లక్షలు చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లించేలా 2020, ఫిబ్రవరి 13న జీవో నెం116 విడుదల చేశారు. కానీ.. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్సుకు రూ.1.31 లక్షలకే నిర్వహిస్తుంటే.. ఆ సంస్థను కాదని అరబిందో ఫౌండేషన్ సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.? జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ కు చెందిన అరబిందో ఫౌండేషన్ కు ఉన్నఫలంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా 108 అంబులెన్సుల నిర్వహణలోనే రూ.307 కోట్ల కుంభకోణం జరిగింది. ఇది కేవలం 108లో మాత్రమే. 104లో మరింత కుట్ర జరిగిందో.? ఒక సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేసి సొంత కంపెనీకి కట్టబెట్టడంలో విజయసాయి రెడ్డి పాత్ర లేదంటారా.? ఈఎస్ఐలో ఏమీ లేని చోట ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తూ.. ట్విట్టర్ లో కూతలు కూస్తున్న విజయసాయి రెడ్డి ఈ విషయంలో సమాధానం చెప్పాలి. ఏమీ లేని చోట ఏదో అవినీతి జరిగిందని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. విజయసాయి రెడ్డి కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నాం. అతనిపై ఏ చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి" అని పట్టాభిరాం అన్నారు.

క-రో-నా కేసులు రోజురోజుకు పెరుగుతున్ననేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ ఆదివారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు ఇందుకు ప్రజలు స్వచ్చందంగా సహకరిం చాల్సిందిగా అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఎస్పీ సంయుక్తంగా ప్రకటించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించి వెనులుబాటు కల్పించిన తర్వాత క-రో-నా కేసులు ఎక్కువ కావడం జరుగుతోందన్నారు. రాజధాని, ఉద్యాన్, కృష్ణ ఎక్స్ ప్రెన్స్ ద్వారా జిల్లాలోని గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, పుట్టపర్తి స్టేషన్లలో రైళ్లు నిలుస్తున్నాయన్నారు. వీటి ద్వారా ఢిల్లీ, బాంబే, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు జిల్లాకు చేరుకుంటున్నా రన్నారు. అందువల్ల జిల్లాలోని కొన్ని కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఈ నెల 21వ తేది ఆదివారం నుంచి అనంతపురం నగరం మొత్తం, ధర్మవరం పట్టణం, పెనుకొండ గ్రామీణ ప్రాంతమైన కియా రెసిడె నియల్ ఏరియా, వెంకటంవల్లి తాండాలలోని కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు విధిస్తున్నామన్నారు. ఈ ఆంక్షల సమయంలో అనంతపురం నగరంలో ప్రజలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపు గతంలో విధించిన మినహాయింపుల మాదిరిగానే కూరగాయల, నిత్యవసర వస్తువులు మినహా మిగతా అన్నిషావులు, సంస్థలు మూసి వేయాలన్నారు.

ఉదయం 12 గంటల నుంచి కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఆదివారం రోజు నుంచి ప్రతి ఆదివారం మాంసాహార దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదన్నారు. ఆసుపత్రులు, ఫార్మసీలు, మెడికల్ షావులు 24/7 వనిచేస్తాయన్నారు. ఆటోలు, క్యాబ్స్ వంటి ప్రైవేట్ రవాణాను తిప్పేందుకు వీలు లేదన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పోరేట్ బ్యాంకులు ఏటీఎంలలో నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తూ పనిచేస్తాయన్నారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలెవరూ తమ ఇంటి నుంచి పట్టణంలో సంచరించరాదన్నారు. ఇక మరో పక్క, ఒంగోలులో కేసులు అధికమవుతున్న నేపధ్యంలో ఒంగోలు నగరమంతా 14 రోజులపాటు రెడ్ జోన్‌గా పరిగణిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 14 ప్రాంతాల్లో అనూహ్యంగా 34 కేసులు నమోదు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఒంగోలు నగరంలో క-రో-నా వైరస్ కేసులు నమోదైన చోట 14 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి కంటైన్మెంట్, బఫర్ జోన్ల పరిదిలోకి ఒంగోలు నగరమంతా వస్తున్నందన రెజోన్‌గా ప్రకటించారు.

శనివారం నుంచే నగరమంతా జననంచారం నిషేధించాలని ఆయన వెల్లడించారు. జిఓ నెం: 50 ననునరించి నిషేధాజ్నలు అమలు చేయాలని ఆయన సూచించారు. ఉదయం 7 నుంచి ఉదయం 10 గంటల వరకు నిత్యవసర సరుకులు తెచ్చుకోవడానికి ఇంటిలో ఒకరికే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. నిత్యవసరాలకోసం నిర్ణయించిన సమయం మినహా నగరంలో జన సంచారం ఉండరాదని, వాహనాలు నిషేదించామని, రహదారులంతా నిర్మానుషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఒంగోలు నగరమంతా కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి వస్తున్నందున ఆర్టీసి బస్సులు నగరంలోకి నిషేదించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే లిక్కర్ దుకాణాలు 14 రోజులపాటు మూసివేయాలని ఆయన చెప్పారు. షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య దుకాణాలు, హోటల్స్, ప్రైవేట్ సంస్థలు పూర్తిగా మూసివేయాలని ఆయన సూచించారు.

జగన్ మోహన్ రెడ్డి పరువుకి భంగం కలిగించే విధంగా మాట్లాడారని చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించింది. చంద్రబాబు నాయుడుడి పాటుగా, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ సిహెచ్‌ రామోజీ రావు, ఉషోదయ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావుకు కూడా లీగల్ నోటీసులు వెళ్ళాయి. అలాగే ఆంధ్రజ్యోతికి కూడా లీగల్ నోటీసులు వెళ్లినట్టు తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసారని, అవి ఆయన పరువుకు భంగం అని, అలాగే చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించాయని, అందుకే వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కమిషనర్ మరియు ఎక్స్-అఫిషియో సెక్రటరీ (వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాలు) తరుపున కే.శశిధర్ ఈ నోటీసులు ఇచ్చారు. హైకోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఇసుకకు సంబధించి చంద్రబాబు జగన్ పై ఆరోపణలు చేసారని అన్నారు.

అలాగే పిడిఎస్ కింద ఇచ్చే సరుకులను పంపిణీ చేయడానికి ఉపయోగించే సంచులను సరఫరా చేసే ఒప్పందాన్ని జగన్ కు చెందిన సంస్థకు ఇచ్చినట్టు ప్రచారం చేసారని, అందుకే నోటీసులు ఇస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక అలాగే, మరొక నోటీసు కూడా జారీ చేసారు. గుంటూరు జిల్లాలోని దాచెపల్లి మండలంలో ఉన్న సరస్వతి పవర్ మైనింగ్ లీజులను 50 సంవత్సరాలకు, రూల్స్ అన్నీ బ్రేక్ చేసి ఇచ్చినట్టు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయని, ప్రభుత్వం ప్రత్యేక లీగల్ నోటీసు అందుకున్న, చంద్రబాబు నాయుడు, రామోజీ రావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇదే విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది కూడా ఈ రోజు ధృవీకరిస్తూ, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్‌కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని, వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read