వైజాగ్ లో, డాక్టర్ సుధాకర్ పై ప్రవర్తించిన తీరు, అమానవీయ కోణం, దేశ ప్రజలనే కాదు, హైకోర్ట్ ని కూడా కలిదించాయి. ఒక డాక్టర్ ని, రోడ్డు పై పడేసి, పెడ రెక్కలు విడిచి, వెనక్కు తీసుకొచ్చి, తాడులతో కట్టేస్తూ, చొక్కా లేకుండా రోడ్డు మీద మోసుకు వెళ్తూ, ఆటోలో పడేయటం, ఆయన్ను కొట్టటం ఇవన్నీ, చూసిన వారు, ప్రభుత్వ తీరుని ఖండిస్తున్నారు. ఆయన తప్పు చేసారే అనుకున్న, ప్రవర్తించే తీరు ఇది కాదని, అందరూ చెప్తున్న మాట. అయితే డాక్టర్ సుధాకర్ కేసు, హైకోర్ట్ సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీని పై విచారణ చేసిన హైకోర్ట్, బుధవారం డాక్టర్ సుధాకర్ ని, తమ ముందు హాజరు పరచాల్సిందిగా కోరింది. అయితే, నిన్న బుధవారం కేసు విచారణకు రావటంతో, కోర్ట్ ఆదేశాల ప్రకారం, డాక్టర్ సుధాకర్ ని, హాజరు పరచలేక పోయారు. డాక్టర్ సుధాకర్ ను నేరుగా హాజరు పరచాలేమని, ప్రభుత్వ తరుపు నయ్యవాది, కోర్ట్ కు తెలిపారు. ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతి ఇవ్వాలని కోర్ట్ కు తెలిపారు.
అయితే దీని పై, సుధాకర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం కావాలని చేస్తుంది అని, డాక్టర్ సుధాకర్ కు తగిలిన గాయాలు, కోర్ట్ వారు చూడకుండా, ఆ గాయాలు మానే వరకు, కోర్ట్ ఎదుట హాజరు పరచకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని కోర్ట్ కు తెలిపారు. నేరుగా ఆయన్ను కోర్ట్ ముందుకు ప్రవేశపెట్టలేని పక్షంలో, విశాఖలో ఉన్న ఒక న్యాయవాదిని, ఆయన వద్దకు పంపి, వాంగ్మూలం నమోదు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అక్కడే ఆయన ఆ గాయాలు చూసి, వాంగ్మూలం నమోది చెయ్యవచ్చని, కోర్ట్ కు తెలిపారు. డాక్టర్ సుధాకర్ తరుపు న్యాయవాది, అభ్యర్ధనను కోర్ట్ కూడా అంగీకరించింది. విశాఖ జిల్లా జడ్జిని డాక్టర్ సుధాకర్ వద్దకు వెళ్ళాలని ఆదేశించింది.
గురువారం సాయంత్రంలోగా, అయన వాంగ్మూలం నమోదు చేసి, ఆయనకు తగిలిన గాయాలు కూడా పరిశీలించాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో, నిన్న సాయంత్రమే, జిల్లా జడ్జి, డాక్టర్ సుధాకర్ వద్దకు వెళ్లి, వాంగ్మూలం నమోదు చేసారు. సుమారుగా, రెండు గంటలకు పైగా, ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా, కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ మద్యం తాగారు అందుకే ఇలా చేసాం అంటున్నారు, మద్యం తాగితే, ఇలా చేతులు కట్టేసి, తీసుకొస్తారా ? లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఏమో వదిలేసారు, ప్రభుత్వం దగ్గరుండి మద్యం అమ్ముతూ, మందు బాబుల నుంచి అధిక ధరలు అమ్ముతూ, ఆదాయం ఆర్జిస్తున్నారు, డాక్టర్ సుధాకార్ విషయంలో ఇలా అంటూ, కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.