మద్రాసు నుంచి తరిమేస్తే, కర్నూల్ కి, అక్కడ నుంచి హైదరాబాద్ కి, అక్కడ నుంచి మళ్ళీ మనల్ని తరిమేస్తే, మనకు రాజధాని లేదు, రాజధానిని కట్టుకోడానికి భూములు లేవు అని సమయంలో, మన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను నేటి ప్రభుత్వం, 3 రాజధానుల ప్రకటనతో, రోడ్డున పడేసింది. ఆ రోజు నుంచి, ఇప్పటి వరకు అంటే, 150 రోజులుగా, ఈ విషయం పై ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ భవిష్యత్తుతో పాటు, రాష్ట్ర భవిషత్తు కోసం 34 ఎకరాలు ఇచ్చాం అని, తమను అన్యాయం చేయ్యావద్దు అంటూ, 150 రోజులుగా ఆందోళన చేస్తున్నా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని, ఒక్క అధికారి కాని, కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా, వచ్చి, ఆరు నెలలుగా మీరు ఆందోళన చేస్తున్నారు, మీ కష్టం ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు. పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టినా, కరోనా వచ్చినా, అమరావతి మహిళలు, రైతులు మాత్రం, తమ పోరాటం ఆపటం లేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, తమ ఆందోళన చేస్తాం అంటున్నారు.
అమరావతి రైతుల దీక్ష, ఈ రోజుతో 150 రోజులు కావటంతో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. "అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు 150 రోజులు. కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు... ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర. రాష్ట్రం కోసం 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలది. ప్రభుత్వానికే 5వేల ఎకరాల ఆస్తి కట్టబెట్టి 'బిల్డ్ ఏపి' చేశారు. వారి త్యాగాలతో రాష్ట్ర ప్రజలకు రూ. లక్ష కోట్ల ఆస్తి సమకూరితే, మూర్ఖత్వంతో ఆ ఆస్తిని వైసీపీ పాలకులు మట్టిలో కలిపేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి 'బిల్డ్ ఏపి'ని 'సోల్డ్ ఏపి'గా మార్చి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు."
"నిర్మాణం విలువ తెలియని విధ్వంసకుల చేతుల్లోకి రాష్ట్రం చేరడమే ఈ దుస్థితికి కారణం. రాజధాని తరలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆవేదనతో 64మంది రైతులు గుండెపోటుతో మరణించారు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా రాజధాని ప్రజలను కలిసి పలకరించిన పాపానికి పోలేదంటే... ఎంతటి కర్కోటక పాలనలో ఉన్నామో అర్ధమవుతోంది. లాక్ డౌన్ కాలంలోనూ శాంతియుతంగా, ఆత్మ విశ్వాసంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలూ... మీ పోరాటం స్పూర్తిదాయకం. మీకు న్యాయం జరిగేవరకూ మీ అండగా నేనుంటాను. తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అధైర్యపడకండి." అని చంద్రబాబు అన్నారు.