ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో, ఇళ్ళ పట్టాల పై స్కాం జరిగింది అంటూ, హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. 600 ఎకరాల భూమి కొనుగులులో అవినీతి జరిగింది అంటూ, హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు, బూరుగుపూడికి చెందిన రైతు. ఆ పిటీషన్ ఈ రోజు హైకోర్ట్ లో విచారణకు వచ్చింది. తూర్పుగోదవరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలో, ఎకరం రూ.7 లక్షల 20 వేలు చేసే భూమి, ప్రభుత్వం రూ.45 లక్షలు చెల్లించింది అంటూ, ఫిర్యాదు చేసారు. ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాలకు ఇస్తున్నారని, ఆ కొనుగోలులో, ఆరు రెట్లు అధిక ధర ఇచ్చారంటూ, కోర్ట్ దృష్టికి తెచ్చారు, పిటీషన్ తరుపు న్యాయవాది, బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు. అధికారులు, నాయకులు కుమ్మక్కు అయ్యి, ప్రజాధనం వృధా చేసారని చెప్పారు. అక్కడున్న 20 అడుగులు లోతు గుంతలు పుడ్చాలంటే వందల కోట్లు, ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని, కోర్ట్ కు తెలిపారు.

అయితే దీని పై హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, భూములు అమ్మిన రైతులకు, డబ్బు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ప్రభుత్వం తరుపు వాదనలను అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. ఇలాంటి కేసు పై దక్షిణ ఆఫ్రికాలో జడ్జిమెంట్ ప్రస్తావించారు, అడిషనల్ ఏజీ. అయితే సుప్రీం తీర్పులే దీని పై ఉన్నప్పుడు, ఇతర దేశాల ఉదాహరణలు ఎందుకుని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. తమకు కౌంటర్ దాఖలు చెయ్యటానికి సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరటంతో, కేసును హైకోర్ట్ వాయిదా వేసింది. రాజమండ్రి అర్బన్, రూరల్ మండల ప్రాంతంలోని 42,742 మంది పేదలైన లబ్దిదారులకు నవరత్నాలు పేరిట ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది.

ఈ మేర కు సమీపంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లభ్యం లేకపోవడంతో రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, కోరుకొండ మండలంలో, 177 ఎకరాల్లో ఉన్న ఈ ఆవ భూములు కొనుగోలు చేసేలా, చేసారు. అక్కడ ఎకరా, 5 నుంచి 7 లక్షలు కూడా లేని చోట, ఏకంగా 43 లక్షల నుంచి 63 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించేలా ప్రయత్నాలు చేసారు. అయితే, ప్రయివేట్ వ్యక్తుల నుండి కొనుగోలు ద్వారా సేకరించిన భూముల్లో 177 ఎకరాలు భూమి గోదావరి ప్లడ్ ఎఫెక్ట్డ్ ల్యాండ్ ప్రాంతంగా ఉందని మార్చి 9 వ తేదీన జలవనరులశాఖ సెంట్రల్ డివిజన్ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ తన పై అధికారి అయిన ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ కి ఒక లేఖ కూడా రాసారు. జలవనరులశాఖ నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అంటే, ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. దీని పై, ఇప్పుడు హైకోర్ట్ ఏమి చెప్తుందో చూడాలి.

లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ, అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహా, మిగతా అన్ని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరుస్తూ, వ్యపారాలు చేసుకునే వీలు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం, ఎట్టి పరిస్థితిలోనూ దుకాణాలు తెరవ కూడదు అని, ఉల్లంఘిస్తే మాత్రం, కఠిన చర్యలు తీసుకుంటామని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పండ్లు, కూరగాయలు, పాల విక్రయాలు ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే నిర్వహించుకోవచ్చని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. వస్త్ర, బంగారు ఆభరణాలు, చెప్పుల దుకాణాలకూ అనుమతి లేదని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.

షాపింగ్ మాల్స్ కాని, మార్కెట్లు కాని, మార్కెట్ కాంప్లెక్స్ లు కాని, తెరిచే వీలు ఉండదు. పట్టణ ప్రాంతంలో కాని, గ్రామీణ ప్రాంతంలో కాని, ఎక్కడా ఈ షాపింగ్ మాల్స్ కాని, మార్కెట్లు కాని, మార్కెట్ కాంప్లెక్స్ లు తెరిచే వీలు ఉండదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, కాలనీల్లో ఉండే షాపులు, రెసిడెన్షియాల్ కాంప్లెక్స్ లో ఉండే షాపులు, తెరుచుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక బట్టల దుకాణాలు కాని, బంగారం షాపులు కాని, చెప్పులు షాపులు కానీ, గ్రామీణ ప్రాంతంలో కాని, పట్టణ ప్రాంతంలో కాని, తెరవటానికి వీలు లేదు. అలాగే పట్టణ ప్రాంతంలో కూడా, కాలనీల్లో ఉండే షాపులు, రెసిడెన్షియాల్ కాంప్లెక్స్ లో ఉండే షాపులు, తెరుచుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అలాగే పక్క పక్కన ఉండే షాపుల విషయంలో కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిత్యావసర వస్తువులు, మందులు, పాలు, కూరగాయలు షాపులు మినహా, మిగతా షాపుల విషయంలో, ఒక షాపు ఒక రోజు తెరిస్తే, మరో షాపు ఇంకో రోజు తెరవాలని, ఈ రకంగా, ఒక షాపుకు, ఇంకో షాపుకు దూరం ఉంటుందని, దీనికి సంబంధించి మునిసిపల్ అధికారులు ఆదేశాలు ఇస్తారని చెప్పింది. ఇక ఎక్కువ కేసులు ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో, కేవలం నిత్యావసర వస్తువులు, కన్స్ట్రక్షన్ కు సంబందించిన షాపులు, వ్యవసాయానికి సబందించిన షాపులు, స్పేర్ పార్ట్శ్ అమ్మె షాపులు మాత్రమే తెరుస్తారని చెప్పింది. అలాగే ప్రతి ఒక్కరికీ ఆరు అడుగుల దూరం ఉండాలని, షాపు ముందు మార్క్ పెట్టాలని, సానిటైజర్లు షాపులు ఉండాలని, మాస్కులు, గ్లవుజులు వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

ఏ ప్రభుత్వం అయినా, కేంద్రం అయినా, రాష్ట్రం అయినా, ఇప్పుడు ఉన్న సహజ సంపద కాపాడి, భవిష్యత్తు తరానికి, బ్రతికే అవకాశం ఇవ్వాలి. అయితే, మైనింగ్ లాంటి విషయాల్లో, ఎలాగూ ప్రభుత్వాలు మన మాట వినవు. ఇక అడవులు కొట్టేయటం కూడా, అలాంటిదే. కాని ఇప్పుడు చివరకు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, ప్రభుత్వమే అమ్మకానికి పెడితే ? మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాదాపుగా 80 వేల కోట్లు అప్పు చేసింది. చేసిన ఆ అప్పుతో, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందా ? ఏదైనా ప్రాజెక్ట్ కట్టిందా ? ఎక్కడైనా రోడ్డు వేసిందా ? ఎక్కడైనా పంచాయతీ బిల్డింగ్ కాని, స్కూల్ కాని కట్టిందా అంటే లేదనే చెప్పాలి. రంగులు వెయ్యటం తప్ప, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన కొత్త పని ఏమి లేదు. మరి ఈ 80 వేల కోట్లు ఏమయ్యాయి ? మొత్తం సంక్షేమానికి ఖర్చు అయిపోయాయా ? అప్పు చేసి, ఎన్నాళ్ళు, ఇలా సంక్షేమం చేస్తాం ? ఆదాయం పెంచుకునే మార్గాలు చూడాలి కదా ?

ఇలాంటి మాటలు వినిపిస్తున్న టైంలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భూములు అమ్మి, నెట్టుకురావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇంకా అప్పు ఎవరూ ఇవ్వరు అనుకున్నారో ఏమో, ఇలా భూములు అమ్మి, కాలక్షేపం చెయ్యటానికి రెడీ అయ్యింది ప్రభుత్వం. చంద్రబాబు 5 ఏళ్ళలో, ఒక లక్షా 6 వేల కోట్లు అప్పు చేస్తేనే, రాద్ధాంతం చేసిన వైసీపీ, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత, ఏడాది కాలంలోనే 80 వేల కోట్లు అప్పు చెయ్యటమే కాక, ఇప్పుడు భూములు అమ్మి కూడా, డబ్బు సమకుర్చునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ప్రభుత్వం ఆధీనంలో ఉండే భూమి ఎంతో విలువైనది. డబ్బు పరంగా విలువైనది కాదు, భూమి పరంగా. ఎందుకుంటే, ఏదైనా ప్రాజెక్ట్ కు ఒక్క సెంటు భూమి కావాలి అంటే, రణరంగం జరిగే పరిస్థితి.

ఎవరూ భూములు తేలికగా ఇవ్వరు. ఒక కంపెనీ పెట్టాలి అంటే భూమి కావాలి. అలాంటిది ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి అమ్మటం ఏమిటి ? భూములు రక్షించాల్సిన ప్రభుత్వమే దాన్ని అమ్మటమా అనే విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ఆదాయం పరిగే మార్గాలు ఆలోచిస్తారు. అవేమీ చెయ్యకుండా, అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి ఎన్నాళ్ళు, ఒక రాష్ట్రాన్ని నెట్టుకుని వస్తారు ? దీనికి మళ్ళీ బిల్డ్ ఏపి అనే పేరు. ఇది బిల్డ్ ఏపి ఎలా అవ్తుంది ? సెల్ ఏపి కదా అయ్యేది. ఇదే విషయం పై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. లోకేష్ ట్వీట్ చేస్తూ, ఇది బిల్డ్ ఏపి కాదు, జగన్ కిల్లెడ్ ఏపి అని ట్వీట్ చేసారు. ఆదాయం ఎలా సంపాదించాలో తెలియని వాళ్ళు, మనం ఊరిలో చూస్తూ ఉంటాం, వాళ్ళే ఇలా ఆస్తులు అమ్మి, ఆ రోజుకి గడిపేస్తారు, అలా ఉంది మన ప్రభుత్వ పరిస్థితి.

కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టు, తయారు అయ్యింది పరస్థితి. గుంటరు జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో అక్రమంగా బ్లీచింగ్ తయారీ చేసి అమ్ముతున్నారు అంటూ, నిన్న స్కాం బయట పడింది. అయితే, మంగళవారం హఠాత్తుగా ఈ యూనిట్లు మూసివేశారు. విజిలెన్స్ దాడుల భయంతో అక్రమార్కులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కరోనా విపత్తును ఆసరాగా తీసుకొని కొంతమంది నేతల సహకారంతో దారుణమైన అవినీతికి ఒడిగట్టారు. పల్నాడు ప్రాంతంలో మాత్రమే లభించే సున్నపురాయి, ముగ్గురాయి నిక్షేపాలు అక్రమార్కులు బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారాయి. పల్నాడు నుంచి ప్రతిరోజూ దాదాపు రెండు వేల టన్నుల సరకు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. అదంతా సున్నం, ముగ్గురాయి కలిపిన మిశ్రమమే. ఈ మిశ్రమం ప్యాకింగ్ చేసిన బ్యాగ్ ల పై పేరున్న కంపెనీలకు సంబంధించిన లోగోలు వేసి అమ్మేస్తున్నారు. ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క టన్ను 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. అంటే ప్రతిరోజూ దాదాపు 60 లక్షల నుంచి కోటి రూపాయల వ్యాపారం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో అధికారులు బ్లీచింగ్ తయారీకి కొన్ని కంపెనీలకు అనుమతి ఇచ్చారు.

దానిని ఆసరాగా చేసుకొని ఆయా కంపనీల పేర్లతో భారీఎత్తున బ్లీచింగ్ తయారీకి శ్రీకారం చుట్టారు. పల్నాడు పరిసర ప్రాంతాలలో నల్లరాయి, తెల్ల రాయి నిక్షేపాలు విస్తారంగా వున్నాయి. వాటిని పిండి గా చేసేందుకు పల్నాడు ప్రాంతంలో దాదాపు రెండు వందలకు పైగా బాల్ మిల్స్ వున్నాయి. లాక్ డౌన్ కారణంగా అవన్నీ గత కొద్ది రోజులుగా మూతపడ్డాయి. ఈ పరిస్థితిని అక్రమార్కులు తమకు అనువుగా మార్చుకున్నారు. కరోనా కరవులో కాసులు పిండుకునే కుతంత్రానికి తెరతీశారు. సాధారణంగా మేలిరకం సున్నం టన్ను 3 వేల రూపాయలు, ముగ్గుటన్ను 15వందలకు లభిస్తాయి. అవి రెండూ కలిపి 25 కిలోల బ్యాగ్ లలో ప్యాకింగ్ చేస్తారు. అంటే దాదాపు 5 వేల రూపాయలు వ్యయం చేస్తే రెండు టన్నుల మిశ్రమం అందుబాటులోకి వస్తుంది. ఆ మిశ్రమాన్ని బయటి మార్కెట్ లో 60వేలనుంచి లక్ష రూపాయల వరకు విక్రయిస్తారు. అంటే ప్రతి టన్ను పై 12 నుంచి 20 రెట్లు అధికంగా లాభం వస్తుంది. ఈ మొత్తం పై వివిధ స్థాయిల్లో వాటాలు చెల్లిస్తారు. ఈ విధంగా కరోనా కరవు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. బ్లీచింగ్ పేరుతో వివిధ ప్రాంతాలకు సరఫరా అయ్యే మిశ్రమాన్ని ప్యాక్ చేసేందుకు అవసరమైన సరంజామా అంతా పల్నాడులోనే తయారవుతుంది.

గోతాల తయారు చేసి దాని పై వివిధ కంపెనీల లోగోలను ముద్రించేందుకు అక్రమార్కులు స్వయంగా ఏర్పాట్లు చేసుకున్నారు. గోతాల పై ఇతర రాష్ట్రాలలో తయారయినట్టు పేర్లు ముద్రించి వుండటం విశేషం. కొన్నిటి పై ప్రముఖ కంపెనీ లోగో తో గుజరాత్ లో తయారయినట్టు ముద్రించారు. మరికొన్ని చోట్ల, రాజస్థాన్ లోని కోట లోనూ, ఇంకొన్ని చోట్ల ఏకంగా తైవాన్ చిరునామాలు ముద్రించి వుండటం విశేషం. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకే ప్రముఖ కంపెనీ లు, లేదా అనుమతి వున్న కంపెనీల చిరునామాలు ముద్రించి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పు కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షల బస్తాల బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకోగా, టెండర్లు పిలవకుండా, డైరెక్ట్ గా కొనటంతో, ఎవరి పనితనం వారు చూపించారు. ఇదే రకంగా, వారం రోజులు క్రితం గుడివాడలో కూడా జరిగింది. ఈ స్కాం 70 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. మరి, కింద స్థాయి నుంచి, పై స్థాయి వరకు ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి అనే, విచారణ చేస్తే కాని, అసలు విషయం బయట పడదు. అయితే మరీ బ్లీచింగ్ లో కూడా నొక్కేయటం పై, ప్రజలు ఆవాక్కవుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read