ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో పై సరవత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిలో, ఇలాంటి వృధా ఖర్చులు, భజన చెయ్యటానికి ఖర్చులు ఎందుకు అంటూ విమర్శలు వస్తున్నాయి. విషయానికి వస్తే, మే 13న, టూరిజం శాఖ ఒక జీవో విడుదల చేసింది. దాంట్లో రాసి ఉన్న ప్రకారం, "జగన్ జయ కేతనం" అనే పద్య నాటక ప్రదర్శన కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, 5 లక్షలు రూపాయలు విడుదల చేస్తున్నట్టు, ఆ జీవోలో ఉంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ జీవోని విడుదల చేసారు. నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు, 2019వ సంవత్సరంలో జరిగిన "జగన్ జయ కేతనం" పద్య నాటక ప్రదర్శన కోసం, అందులో పాల్గున్న పది మందికి, ఒక్కొక్కరికీ 50 వేలు రూపాయలు చొప్పున, మొత్తంగా 5 లక్షలు విడుదల చేస్తూ, ఆదేశాలు జరీ చేసారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ ఆదేశాలు మేరకు, ఈ జీవో విడుదల అయినట్టు తెలుస్తుంది. ఈ అమౌంట్ విడుదల చేస్తూ జీవో ఇచ్చారు.
అయితే, ఇది ఎప్పుడు జరిగింది ? అక్కడ జరిగిన పద్య నాటకాలు ఎలా ఉన్నాయి ? "జగన్ జయ కేతనం" పద్య నాటక ప్రదర్శన అంటే, జగన్ ను పొగుడుతూ నాటక ప్రదర్శన ఉందా, లాంటి వివరాలు తెలియవు. ఇది జరిగినట్టు కూడా చాలా మందికి తెలియదు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో పై తెలుగుదేశం పార్టీ మండిపడుతుంది. ఒక పక్క రాష్ట్రంలో నిధులు లేవు , ఆదాయం లేదు అంటూ, ఇప్పటి వరకు 77 వేల కోట్లు అప్పు చేసారని, అలాగే డబ్బులు లేవని, రాష్ట్రంలో ఉన్న భూములు అమ్ముతున్నారని, కాని ప్రభుత్వం చేస్తున్న పనులు మాత్రం, ఇలా తనను తాను పోగిడించుకోవటానికి, ఇలా అనవసరపు ఖర్చులు పెడుతూ, తన పేరు మీద పద్యాలు పాడటానికి, 5 లక్షలు ప్రభుత్వ ధనం ఇవ్వటం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేసారా ? లేక జగన్ భజన చేసారా అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అనవసరమైన ఖర్చులు పెడుతున్నారని, గుర్తు చేస్తున్నారు. దాదాపుగా 50 మంది సలహాదారులను, తనకు ఇష్టం వచ్చిన వారిని పెట్టుకుని, వారికి లక్షల లక్షల జీతాలు ఇస్తున్నారని, అలాగే సాక్షి ఉద్యోగులను, సోషల్ మీడియా ప్రచారం పేరుతొ, పెట్టుకున్నారని, ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అలాగే, తన సొంత ఇంటి కోసం, దాదాపుగా 16 కోట్లు ఖర్చు పెట్టటాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రంగుల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారని, ఇప్పుడు ఇలా భజన చేసుకోవటానికి, 5 లక్షలు ఖర్చు పెట్టారని గుర్తు చేస్తున్నారు.