విశాఖ గ్యాస్‍లీక్ ఘటన పై, చనిపోయిన వారికి కోటి ఇస్తే సరిపోతుంది అనుకున్న ఎల్జీ పాలిమర్స్ కి ఎన్జీసీ షాక్ ఇచ్చింది. మొత్తం ఇష్యూ ని 20 కోట్లతో ముగించేద్దాం అనుకున్న ఎల్జీ పాలిమర్స్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ కేసు పై విచారణ ప్రారంభించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎల్జీ పాలిమర్స్ కు నోటీసులు ఇచ్చింది. కేంద్రం, ఎల్జీ పాలిమర్స్, సెంట్రల్ పీసీబీకి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. అంతే కాదు, ముందుగా, ప్రాధమికంగా రూ.50 కోట్లు స్థానిక కోర్టులో డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్ సంస్థకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం. భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్న ఎన్జీటీ, ఎల్జీ పాలిమర్స్ కు భారీ నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇది కేవలం మరణించ వారికి కోటి రూపాయలు ఇస్తే సరిపోదని, నిన్నటి నుంచి అందరూ వాదిస్తూనే ఉన్నారు. ఆ గ్యాస్ పీల్చిన వారు, జీవితాంతం ఇబ్బందులు పడుతూనే ఉంటారని, అక్కడ ఉన్న మొత్తం 25 వేల మందికి, భారీగా నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

అలాగే అక్కడ భూమి, నీరులో కూడా ఈ గ్యాస్ అవశేషాలు ఉండి పోవటం, ఇవన్నీ చూస్తూనే, అక్కడ వాతావరణం మొత్తం, ఈ కంపెనీ చేసిన పని వల్ల నష్టం వాటిల్లిందని, పాడి పశువులు కూడా మరణించటంతో, అక్కడ ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చనిపోయిన 12 మందికి, కంపెనీ ఇన్సురన్సు ద్వారా, కోటి ఇచ్చి చేతులు దులుపుకుందాం అని చూసిన ఎల్జీ పాలిమర్స్ కు, ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ప్రాధమికంగానే, 50 కోట్లు డిపాజిట్ చేయ్యమంది అంటే, నిన్న జరిగిన నష్టం మొత్తం, ఈ కంపెనీ నుంచి రాబట్టే అవకాసం ఉంది. అయితే, ఇవన్నీ తేలే సరికి ఎన్ని ఏళ్ళు పడుతుందో అనే వాదన కూడా వస్తుంది. భోపాల గ్యాస్ విషాదం పరిహారం, దాదపుగా 20 ఏళ్ళు తరువాత వచ్చిందని, ఆ కంపెనీకి వేసిన ఫైన్, ఇప్పటికీ కట్టలేదనే వాదన వినిపిస్తుంది.

విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పై స్పందించింది. వర్ల రామయ్య మాట్లాడుతూ, విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదానికి కారకులైన యాజమాన్యాన్ని తక్షణం అరెస్ట్ చేయాలని అన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రమాదానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ ప్రభావ అంచనా (EIA) సర్టిఫికెట్ లేకుండా కంపెనీని ఎలా ప్రారంభించారు ? పాలిమర్స్ యాజమాన్యం నుంచి విజయసాయిరెడ్డి ట్రస్ట్ బలవంతాన ఎంత డబ్బు వసూలు వేసిందో బయటపెట్టాలని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రేమ వ్యక్తం చేస్తున్నారు? ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా వ్యవహరించడం తగదని కోరారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటన పై పూర్తి వివరాలు తెలుసుకోవటానికి, కేంద్రప్రభుత్వం సొంతగా ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. కేంద్ర మంత్రిత్వహోంశాఖ, రసాయన మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఈ కమిటీని నియమించింది. గురువారం విశాఖ దురటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి, కేబినెట్, హోం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల తో గురువారం సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో గ్యాస్ లీకేజీ మటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చరించారు. అనంతరం ఘటనపై ప్రత్యేక కమిటీని నియమించారు. అయితే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ మంత్రులతో కమిటీ వేసింది. అయితే, ఇది పరిగణలోకి తీసుకోకుండా, కేంద్రమే ఒక కమిటీ వెయ్యటం, తామే పూర్తీ వివరాలు తెలుసుకుంటాం అని, కేంద్రం చెప్పటంతో, కేంద్రం ఈ విషయంలో, ఎంతో సీరియస్ గా ఉందని అర్ధం అవుతుంది.

ఇక మరో పక్క, మోడీ గురువారం ఉదయమే జగన్ కు ఫోన్ చేశారు. ఆయన గ్యాస్ లీకేజీ కారణాలను, విశాఖలో పరిస్థితుల పై జగన్ ను ఆరా తీసారు. గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకునే విషయంలోను, సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రంగలోకి దిగిన విషయాన్నీ చెప్పారు. ఘటనపట్ల ప్రధాని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు.ఎల్జీ పాలిమర్స్ రసాయన ఎరువుల కంపెనీలో ప్రమాదంపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలను ముఖ్యమంత్రి జగనకు ప్రధాని నరేంద్రమోడీకి వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రభావం అయిదు గ్రామాల పైన, 15 వేలమందికి పైగా ప్రజలపైన ఉందని తెలిపారు. ఘటన ప్రాంతం లోను, ప్రభావిత గ్రామాల్లోను రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను చేపట్టినట్లు వివరించారు.

ప్రస్తు తానికి పరిస్థితి అదువులో ఉందని తెలిపారు. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. దీనికి స్పందించిన ప్రధాని మోడీ ఈ విషయంలో కేంద్రం సహాయకారిగా ఉంటుందని, అవసరమయైన వైద్య,సహాయక బృందాలను పంపిస్తుందని తెలియచేసారు. ప్రధాని నరేంద్రమోడీ జరిగిన మటనపై ట్వీటరు వేదికగాను ప్రధాని మోడీ విచారాన్ని వ్యక్తం చేసారు. ప్రమాదంపై కేంద్ర మంత్రిత్వ శాఖ. జాతీయ విపత్తుల నివారణశాఖ అధికారులతో మాట్లాడానని ప్రధాని ట్వీటరులో వివరించారు. బాధితులను ఆదుకునే విధంగా తక్షణ సహాయచర్యలకు ఆదేశించినట్లు వివరించారు. ఘటనపై వరిస్థితులను ఎప్పటికప్పుడు విచారిస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేసారు. విశాఖ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు.

విశాఖలో పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ అయిన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన స్పందించారు. పలువురు మృతి చెందడం, అనేకమంది ఆసుపత్రి పాలు కావడంపై దిగ్భ్రాంతి చెందారు. హుటాహుటిన చంద్రబాబు స్పందించి విశాఖ టిడిపి నాయకులను అప్రమత్తం చేశారు. దుర్ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని, బాధితులను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే గణబాబు తెల్లవారుజామునే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఒకవైపు మృతుల కుటుంబాలను ఊరడించడం, మరోవైపు బాధితులను తరలించడంపై అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదిస్తున్నారు.

జిల్లా పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శికి మెయిల్ పంపారు. ఒకవైపు కేంద్రంలో అధికారులకు సమాచారం పంపిస్తూ, మరోవైపు విశాఖ నాయకులతో, అధికారులతో సంప్రదిస్తూ సహాయ చర్యలను వేగిరపర్చేలా చేశారు.

‘‘గాలిలో విష వాయువుల తీవ్రత ఎంత ఉంది అధ్యయనం చేయాలి. ఎంత పరిధిలో ప్రజలు ప్రభావితం అవుతారు అనేది అంచనావేయాలి. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, విష వాయువుల ప్రస్తుత ప్రభావం, దీర్ఘకాలిక ప్రభావం, సాధారణ పరిస్థితి ఎప్పటికి నెలకొంటుంది అనేవాటిపై నిపుణులతో చర్చించాలి. వారిచ్చిన సూచనల మేరకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. బాధితులకు అత్యున్నత వైద్యం సత్వరమే అందించాలి. ప్రాణనష్టం నివారించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. దీనిపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించింది. విచారణను వారంపాటు వాయిదా వేసింది. అలాగే, విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఘటనను సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం... మానవ తప్పిదం కారణంగానో, నిర్లక్ష్యం వల్లనో ఘటన జరిగినట్లు రుజువు కాకపోయినా... అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

ఒకవైపు కరోనా ప్రభావంతో దేశంలో ప్రజల ప్రాణాలు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని మానవహక్కుల సంఘం అభిప్రాయపడింది. పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించి.. నియమ నిబంధనలు ఉల్లంఘన, సంబంధిత వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసిన ఎన్​హెచ్ఆర్సీ.

విశాఖ గ్యాస్​ ఘటనలో ప్రభావితులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా సూచించారు. గ్యాస్ పీల్చిన వారికి కళ్లు, గొంతునొప్పి, వాంతులు అయ్యాయని అన్నారు. ప్రమాదకర రసాయనం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని వెల్లడించారు. విష వాయువు ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం ఆగిపోయి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. తీవ్రమైన హృద్రోగ సమస్యలు వస్తాయన్నారు. బాధితులు వెంటనే ఆక్సిజన్​ థెరపీ తీసుకోవాలని.. మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ పేర్కొన్నారు. పరిశ్రమలన్నీ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలన్న ఆయన.. కార్మికులు భౌతిక దూరం పాటించాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read