ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో ఇవాళ కూడా కొనసాగిన విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. గురువారం ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ధర్మాసనం ఒకటిన్నర రోజు సమయమిచ్చింది. శుక్రవారం విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ రోజు కోర్టుముందు తన వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. అధికరణ 243k ప్రకారం సర్వీస్ నిబంధనలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు వర్తిస్తాయని వాదించారు. ఆర్డినెన్సు తీసుకురావడానికి గల కారణాలేవీ స్పష్టంగా చెప్పనప్పుడు ఆర్డినెన్స్ చెల్లదని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని అన్నారు.

"ఎన్నికల సంస్కరణల పేరుతో 77 ఏళ్ల వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే ఆయన ఎంతవరకు సమర్థవంతంగా పనిచేయగలరు? రమేష్ కుమార్ నియామకాన్ని రాజ్యాంగంలోని అధికరణ 243k మేరకు నియమించారు. అధికరణ 200 ప్రకారం నియమించామని ప్రభుత్వం చెబుతోంది. అధికరణ 200 ప్రకారం చేయడానికి వీల్లేదని, ఎలక్షన్ కమిషనర్ నియామకాన్ని అధికరణ 243k ప్రకారమే చేపట్టాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ప్రభుత్వ ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశం ఉందని: సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తన వాదనలు వినిపించారు.

తనను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వదవి కాలం కన్నా ముందుగానే తొలిగించడంపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి కామినేని శ్రీనివా' సహా ఆరుగురు పిటీషన్ పిటీషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 'దీర్ఘ కాలం పాటు వాదనలు జరిగాయి, ఈ కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది, అయితే కేసులో ఫిర్యాదుదారుల తరపున న్యాయవాదులు వాదనలు చేస్తుండగా, పెద్ద సంఖ్యలో ఇతరుల మధ్యలోకి రావడంతో హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ, వాదనలు హైకోర్టులోనే మౌళికంగా చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు పరిమితులకు లోబడి కొందరికి అనుమతినిచ్చి, విచారణను వాయిదా వేసింది. తిరిగి విచారణ సోమవారం కోర్టులోనే విచారణ ప్రారంభంకాగా, నిన్న వాదనలు విన్న కోర్ట్, ఈ రోజుకి వాయిదా వేసింది, ఈ రోజు కూడా వాదనలను విన్న కోర్ట్, విచారణ గురువారానికి వాయిదా వేసింది.

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది పారా కిషోర్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధులు వ్యాప్తి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు, తీసుకున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీలను ఆదేశాలు జారీచేసింది. పిల్​లో ప్రతివాదులైన వైకాపా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధనరెడ్డి, రోజా, కిల్వేటి సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజనిలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అయితే, ఇప్పటి వరకు, పోలీసులు కాని, ప్రభుత్వం కాని, వీరి పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరి డీజీపీ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

మరో పక్క, నెల్లూరులో, ప్రసన్న కుమార్ రెడ్డి, ఇలాగే లాక్ డౌన్ ఉల్లంఘించారని, కేసు పెడితే, అక్కడ మాత్రం, ఆ ఎమ్మెల్యే ఎదురు, కలెక్టర్, ఎస్పీకే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకుంటే, మీ అంతు చూస్తా అంటూ బెదిరించిన సంగతి తెలిసిందే. ఏకంగా కలెక్టర్, ఎస్పీలేక్ వార్నింగ్ ఇవ్వటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఇక్కడ ఈ ఒక్కరి పై తప్పితే, మిగతా పెద్ద నేతల పై, ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో, కోర్ట్ లో వీరి పై కేసు వెయ్యటంతో, ఈ కేసు విచారణ చేసిన కోర్ట్, అయుదుగురు వైకాపా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధనరెడ్డి, రోజా, కిల్వేటి సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజనిలకు నోటీసులు ఇవ్వాటంతో, ఇప్పుడు వీరు ఏమి సమాధానం చెప్తారో చూడాలి.

తెలుగుదేశం పార్టీ, మొదటి నుంచి కరోనా వ్యాప్తి చేస్తుంది, వైసీపీ నేతలే అని ఆరోపిస్తుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, నేషనల్ పర్మిట్ లారీ లాగా, అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వందల మందితో, ట్రాక్టర్ ర్యాలీ పెట్టిన, శ్రీకాళ‌హ‌స్తి వైకాపా ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి వల్లే, ఈ రోజు శ్రీకాళ‌హ‌స్తిలో ఈ పరిస్థితి వచ్చిందని, ఆరోపిస్తున్నారు. ఇక నగిరి ఎమ్మల్యే రోజా రెడ్డి, ప్రచార పిచ్చతో, ప్రజల చేత, పూలు చల్లింకుంటూ వచ్చిన వీడియో పై కూడా దుమారం రేగింది. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, గుంటూరు ఎమ్మెల్యే ముస్త‌ఫా, క‌ర్నూలు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మాదాసి వెంకయ్య, క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌ , పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, చిలకలూరి పేట ఎమ్మల్యే విడుదల రజినీ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపుపై ఏపీ హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉదయం 11గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల పాటు విచారణ కొనసాగింది. పిటిషనర్ తరపు వాదనలను, సీనియర్ న్యాయవాదులు బండారుపల్లి ఆదినారాయణ, వేదుల నారాయణ వినిపించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తొలగించడం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలో, ప్రభుత్వాన్ని అదిరిపోయే ప్రశ్న అడిగింది హైకోర్ట్. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఎస్ఈసీని తొలగించినప్పుడు మున్సిపల్ యాక్ట్‌ను అమలుచేయలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నట్టా అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్ట్ అనూహ్యంగా, ఈ పాయింట్ తీసుకు రావటంతో, ప్రభుత్వం ఇరుకున పడినట్టే అని చెప్పాలి.

అయితే, వాదనలకు సమయం ముగియటంతో, కేసు విచారణ రేపిటికి వాయిదా పడింది. మరో పక్క, ఈ రోజు తమ లాయర్లు రాలేదని, విచారణ వాయిదా వెయ్యాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరారు. అయితే, దీనికి కోర్ట్ ఒప్పుకోలేదు. రాలేకపోతే, రిటన్ గా, తమకు వాదనలు చెప్పవచ్చు అని కోరటంతో, వాయిదా వెయ్యాలని అనుకున్న ప్రభుత్వం తరుపు ప్లాన్ వర్క్ అవ్వలేదు. కేసుకు సంబంధించిన గతంలో వాదించిన లాయర్లు మాత్రమే ఉండాలి ఇతరులు ఎవరూ రావడానికి వీల్లేదు అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేసారు. ఇది ఇలా ఉంటే, ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖకు సంబంధించిన ఆంశాల్లో సీఐడీ విచారణ హైదరాబాద్కు మారింది. అక్కడి సీఐడీ విభాగం అధికారులు లేఖ విషయమై ఆదివారంనాడు కూడా విచారించారని తెలిసింది.

లేఖ విషయమై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమగ్ర విచారణ జరపాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిం దే. నిమ్మగడ్డ రమేష్ కు సహాయ కార్యదర్శిగా పనిచేసిన పీఎస్ సాంబమూర్తి, మరికొందరు సిబ్బంది హైదరాబాద్లో ఉంటున్నందున వారిని సీఐడీ అధికారులు అక్కడే విచారించాలని భావించారు. సీఐడీ మలి దశ విచారణలో భాగంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న సహాయ కార్యదర్శి సాంబమూర్తి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేయాలని జీవో నెం.623ని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ రంగులతో పాటు మరో రంగును వేయాలని ప్రభుత్వం జీవో తెచ్చింది. అయితే ఈ రంగులు కూడా మూడు వైసీపీ రంగులు, ఒకటి కింద మట్టి రంగు ఉన్నాయి. దీంతో, మళ్ళీ, పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని సవాల్ చేసారు. ఈ పిటీషన్ పై, హైకోర్ట్ ఈ రోజు విచారణ జరిపింది. దాఖలపైన పిటిషన్‍ను విచారించిణకు స్వీకరించిన హైకోర్టు, జీవో నెం.623ను సస్పెండ్ చేసింది. దీని పై కౌంటర్ వెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం, ఇలా పదే పదే కోర్ట్ ఆదేశాలు ధిక్కరించటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇది వరుకే, ఈ రంగుల విషయం పై, హైకోర్ట్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తరువాత ప్రభుత్వం, హైకోర్ట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. అక్కడ సుప్రీం కోర్ట్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు, కాషాయం రంగు వేసి, మోడీ ఫోటో పెడితే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా తాత్సారం చెయ్యటంతో, హైకోర్ట్ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ కొట్టేసిన తరువాత కూడా, ఇంకా ఎందుకు పని మొదలు పెట్టలేదు, లాక్ డౌన్ ముగిసిన మూడు వారాల్లో, రంగులు మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపటానికి వీలు లేదని చెప్పింది. కొత్తగా ఏ రంగులు వెయ్యాలో, నిర్ణయం తీసుకోవాలని, చీఫ్ సెక్రటరీని కోరింది. అయితే, ఇంత జరిగిన తరువాత కూడా, ప్రభుత్వం, మళ్ళీ అవే రంగులతో కొత్తగా ఆదేశాలు ఇచ్చింది. పోయిన నెలలో, కొత్త రంగులతో, మార్గదర్శకాలు జారీ చేస్తూ, జీవో, 623 విడుదల చేసింది.

దాని ప్రకారం, వైసీపీ రంగులు, తెలుపు, నీలం, ఆకుపచ్చతో పాటుగా, కొత్తగా మట్టి రంగు వేసారు. దానికి అర్ధాలు కూడా చెప్పారు. పాడి పంటలకు ఆకుపచ్చ రంగు అని, నీలి విప్లవానికి, నీలు రంగు అని, అలాగే పాల విప్లవానికి, తెలుపు రంగు అని, మట్టిని పోల్చుతూ, మట్టి రంగు అని చెప్పింది. అన్ని భవనాలకు ఈ రంగులు వెయ్యాలని, కింద మాత్రం, మట్టి రంగు వెయ్యాలని చెప్పింది. అయితే, పైన మూడు రంగులు మాత్రం, వైసీపీ రంగులే. సాంకేతికంగా, కింద ఎక్కడో ఒక మూల ఇంకో రంగు వేసి, కోర్ట్ దగ్గర తప్పించుకోవాలని చూసింది. అయితే, ఈ రోజు ఈ కొత్త జీవో కూడా విచారణకు రావటంతో, మళ్ళీ పార్టీ రంగులే వేస్తున్నందుకు, హైకోర్ట్ వెంటనే ,ఆ జీవో సస్పెండ్ చేస్తూ, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని కోరింది.

Advertisements

Latest Articles

Most Read