దాదాపుగా 45 రోజుల నుంచి లాక్ డౌన్ ఉంది. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అయితే ఉన్నట్టు ఉండి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మద్యం షాపులు ఓపెన్ చేసింది. కేంద్రం మార్గదర్శకాలు అని చెప్తున్నా, ఇది పూర్తిగా రాష్ట్రాలు ఇష్టం. అందుకే కేరళ, తమిళనాడు, తెలంగాణా మద్యం షాపులు ఓపెన్ చెయ్యలేదు. కాని మనకు మాత్రం, మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను చెబుతునే ఉహించని ట్విస్టు ఇచ్చింది. లిక్కరు షావులను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉదయం 11గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరుస్తారు. దీంతో సంబర పడుతున్న మద్యం ప్రియులకు షాకిచ్చింది. మద్యం ధరలను 25 శాతం పెంచింది. దీంతో మద్యం ప్రియులు నీరుగారి పోయే వరిస్థితి వస్తుందని అందరూ అనుకున్నారు.

మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా ఆరు అడుగుల భౌతిక రూపాన్ని పాటించాల్సివుంటుంది. లిక్కరు షాపులను ఉదయం 11-7 గంటల నడుమ నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్ స్పష్టం చేసారు. ఇందుకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను జిల్లా కలెక్టరులకు పంపినట్లు తెలిపారు. దుకాణాల్లో కి అయిదుగురి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అదే విధంగా షావుల ముందు సర్కిల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మాస్క్ లేనిదే మద్యం దుకాణాల్లోకి అనుమతించమన్నారు. క్యూలైనుల్లో ఉండనివ్వమన్నారు. ఒక వేళ షాపుల వద్ద రద్దీ ఉంటే పరిస్థితి సద్దుమణిగే దాకా కొంత సమయం అమ్మకాలు నిలిపివేస్తామన్నారు. బారులకు అనుమతి లేదన్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందకు మద్మం ధరలు పెంచినట్లు వివరించారు.

అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వీడియోలు చూస్తుంటే, ఎక్కడా, ఈ నిబంధనలు పాతిన్చినట్టు లేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ఒక మంచి అవకాసం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జగన్ హామీ ఇచ్చినట్టు, మధ్య నిషేధానికి, ఇంతకంటే మంచి అవకాసం ఉండదని అంటున్నారు. 45 రోజులు ఎక్కడా మందు లేదు కాబట్టి, ప్రజలు అలవాటు పడిపోయారని, ఇప్పుడే మధ్య నిషేధం అమలు చెయ్యాలని అన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా, పక్క రాష్ట్రాలు షాపులు తెరవకపోయినా, ఈ రోజు జగన్ మందు షాపులకు అవకాసం ఇచ్చి, అక్కడ సీన్లు చూసి, ప్రజలు, ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. మేము అన్నీ మానుకుని, ఇంట్లో కూర్చుంటే, ఒక్క దెబ్బతో, లాక్ డౌన్ ఉపయోగం లేకుండా చేసారని వావుపోతున్నారు. మొత్తానికి, జగన్ తాను హామీ ఇచ్చిన మధ్య నిషేధం అమలు చేసే, మంచి అవకాసం వదులుకోవటమే కాకుండా, ఇప్పుడు ఎదురు ప్రజలు తిట్టే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు వాపోతున్నారు. ఒక వేళ, రేపు కేసులు పెరిగిపోతే, ఆ నింద, జగనే మొయ్యాల్సి వస్తుంది.

కరోనా వైరస్ కట్టడికి ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాలకు రానున్నాయి. కరోనా ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను ఈ ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేస్తాయని, వీళ్ళు కేంద్రానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయిదుగురు సభ్యులుగల కేంద్ర బృందం హైదరాబాద్లో ఎనిమిది రోజులపాటు పర్యటించి ఆదివారం తిరిగి ఢిల్లీ వెళ్లింది. తాజాగా మరో ప్రత్యేక బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే కేంద్రం, దేశంలోనే 20 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. తెలంగాణాలో కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం, మూడు జిల్లాలు ఉన్నాయి.

ఏపీలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రత్యేక కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, ఢిల్లీ సౌత్ ఈసి, ఢిల్లీ సెంట్రల్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్, రాజస్థాన్‌లోని జైపూర్, జోద్పూర్, తమిళనాడులోని చెన్నై, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా, లక్నో, పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయని కేంద్రం తెలిపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షిస్తుంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో వ్యాధి ఉధృతి తగ్గుముఖంపట్టేలా అధికారులు తీసుకుంటున్న చర్యలతోపాటు వారికి కావాల్సిన సలహాలను ఈ బృందాలు ఇస్తాయని కేంద్రం వివరించింది.

అయితే, ఈ 20 ప్రాంతాల్లో, మూడు మూడు స్థానాలతో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉన్నాయి అంటే, పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి, కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇది కేవలం పర్యటించి వెళ్ళిపోతారా ? లేక అక్కడే ఉండి, పరిస్థితి అదుపులోకి వచ్చే దాకా, పర్యవేక్షణ చేస్తారా అనేదాని పై మాత్రం, ఆ ఉత్తర్వుల్లో క్లారిటీ లేదు. ఆ ప్రకటనలో, సెంట్రల్ టీమ్స్ ని డిప్లాయ్ చేస్తున్నాం అని ఉంది. దీన్ని బట్టి చూస్తే, కేంద్ర బృందాలు అక్కడే ఉంటాయని తెలుస్తుంది. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, కేసులు కట్టడిలోకి రావటం లేదు. ఈ రోజు కూడా 68 కొత్త కేసులు వచ్చాయి. అనూహ్యంగా వైజాగ్ నుంచి ఈ ఒక్క రోజే ఆరు కేసులు వచ్చాయి.

విద్యుత్ రంగంలో సంస్కరణలపై వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికో రీతిలో విద్యుత్ చార్జీలు కాకుండా ఇక దేశమంతటా ఒకే రీతిలో విద్యుత్ చార్జీలు రాబోతున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయి ఏకీకృత చార్జీల విధానం అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఇప్పుడున్న చట్టాలకు భారీగా సవరణలు చేపడుతూ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఎన్టీయే సర్కా రు ఈ బిల్లును రానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలన్న అభిప్రాయంతో ఉంది. 2003లో విద్యుత్ చట్టానికి సవరణలు ప్రతిపాదించి. గత నెల 17న ముసాయిదా విద్యుత్ సరవణ చట్టం ప్రతిపాదనలపై సలహాలు సూచనలకోసం రాష్ట్రాల కు పంపింది. మేనెల 8వరకూ ఇందుకోసం గడువు ఇచ్చింది. అయితే దేశమంతటా క-రో-నా వైరస్ ప్రభావం,లాక్ డౌన్ అమలు తదితర కారణాల వల్ల ఈ గడువును మరింత పెంచింది. జూన్ 8లోపురాష్ట్రాలు విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాపై తమ అభ్యంతాలు, అభిప్రాయాలు, సలహాలను కేంద్రానికి తెలిపేందుకు గడువు పెంచింది.

విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాలో విద్యుత్ చార్జీల ఏకీకృత విధానం, విద్యుత్ కొనుగోలు ఒప్పం దాలు వాటి అమలు, ప్రత్యేక అధారిటీ ఏర్పాటు, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. విద్యుత్ రగంలో ఏవైనా సమస్యలు వివాదాలు ఉత్పన్నమైతే వాటిని అధారిటీ విచారణ చేసి తీర్పునిస్తుంది. అధారిటీ తీసుకున్న నిర్ణయాలు ,తీర్పులు నచ్చని వారు అప్పీలేట్ ట్రిబ్యునల్ లో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, పీపీఏలు సమీక్షిస్తాను అనే విధానం ఇక కుదరదు. ఇలా చేస్తే, అధారిటీ ఎంటర్ అవుతుంది. విద్యుత్ రంగంలో ఎటువంటి చట్టాలున్నా వినియోగదారులందరికీ ఆసక్తి కరమైనది. ఇకపై విద్యుత్ పంపీణీ సంస్థలు విద్యుత్ చార్జీలకు సంబంధించిన బిల్లుల్లో ఎటువంటి రాయితీలు సబ్సిడీలు కల్పించవు. విద్యుత్ సరఫరా దారులనుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ పంపిణీ తదిరత అన్ని రకాలు ఖర్చులను మదింపు చేసుకుని వాస్తవిక ఖర్చుకు అనుగుణంగా ఒకే టారీఫ్ ను నిర్ణయిస్తారు. ఇప్పడున్న విధంగా గృహ వినియోగ,వ్యవసాయ , వాణిజ్య, పారిశ్రామిక, ధార్మిక తదితర కేటగిరీలన్నీ రద్దయి ఓకే కేటగిరి అమల్లోకి వస్తుంది.

అయితే ఇప్పుడున్న వివిధ రకాల స్లాబులను మాత్రం యధాతధంగా కొనసాగించే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రప్రభుత్వాలు కొన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వినియోగ దారులకు ఏవైనా సబ్సిడీలు, ఉచిత విద్యుత్ పదకాలను అమలు చేయాలనుకుంటే విద్యుత్ గ్యాస్ తరహాలో చార్జీల సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలకే జమ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇప్పడిస్తున్న క్రాస్ సబ్సీడీలు ఇక ఉండవు. చట్ట సరవరణల ముసాయిదా ప్రకారం ఇక జలవిద్యుత్ కూడా పునరుత్పాదక విద్యత్ ఖాతాలోకి చేరిపోనుంది. విద్యుత్ నియంత్రణ కోసం ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండళి నియామకాల అధికారాన్ని ఇక కేంద్ర ప్రభుత్వమే తనచేతుల్లోకి తీసుకోనుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా విద్యుత్ రంగ నిపుణులతో కూడిన కమిటీని నియమించనుంది. ఈ కమిటీ రాష్ట్రాల్లో ఈ ఆర్పీలకు చైర్మన్లు, సభ్యుల నియమాకాలకు పేర్లను సిఫార్సు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈఆర్సీల నిర్వహణ వ్యయాలను రాష్ట్రాలే భరించాల్సివుంటుంది.

కరోనా నిరోధక చర్యలు, లాక్ డౌన్ మార్గదర్శకాల్లో మార్పులతో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఏపీలో జిల్లాలవారీగా 3 జోన్లను ప్రకటించిన కేంద్రం. గ్రీన్ జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లా. రెడ్ జోన్ జిల్లాలు : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు. మిగిలిన ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్ గా ప్రకటన చేసింది కేంద్రం. కంటైన్మెంట్ ప్రాంతాలను మ్యాపింగ్ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి, కాంటాక్టులు, ఇతర అంశాల ఆధారంగా కంటైన్మెంట్లు చేయాలని సూచన చేసింది. కంటైన్మెంట్ క్లస్టర్ కు అదనంగా 500 మీటర్ల నుంచి కిలోమీటర్ ప్రాంతం బఫర్ జోన్ గా ఉంచాలని సూచన.

రిస్కు ఉన్న ప్రాంతాన్ని అవసరమైతే 3 కిలోమీటర్ల దాకా బఫర్ గా ప్రకటించాలని ఆదేశం. పట్టణాల్లో వార్డు, కాలనీని, గ్రామాల్లో పంచాయతీని కంటైన్మెంట్ గా గుర్తించాలని సూచన. కంటైన్మెంట్ ను మిగతా ప్రాంతాలతో వేరు చేసేలా బారికేడ్లు వేయాలని ఆదేశాలు. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని సూచన. ఔషధాలు, నిత్యావసరాలు మాత్రమే సరఫరాకు అనుమతి. థియేటర్లు, మాల్స్, దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలకు అనుమతి నిరాకరణ. క్రీడా, రాజీకయ, సామాజిక సమావేశాలు, విద్యాసంస్థలకు అనుమతి నిరాకరిస్తు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇకపోతే, రేపటి నుంచి మద్యం షాపులు కూడా తెరుసుకోనున్నాయి. 25 శాతం అధిక ధరలతో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, అమ్మకాలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరో పక్క, జగన్ కు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేఖ రాసారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కలెక్టర్ స్వీయ నిర్బంధంలో ఉన్నారంటే.. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. కరోనాతో మనం సహజీవనం చేయడం కాదు. మనతో కరోనా సహజీవనం చేసే పరిస్థితి తెచ్చారు. ఏపీకి వెళ్లొద్దని పక్క రాష్ట్రాలు అప్రమత్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది అంటూ, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జగన్ కు లేఖ రాసారు.

Advertisements

Latest Articles

Most Read