విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గున్నారు. అలాగే సమీక్షలో కిషన్‌రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్యాస్‌ లీకేజి పై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేసిన పోలీసులు, సిబ్బంది, అక్కడ వారిని తరలించారు. ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులకు అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలించారు. ఇళ్లు వదిలేసి ఐదు గ్రామాల ప్రజలు బయటికొచ్చారు. ఇప్పటి వరకూ ఊపిరాడక ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసులు హెచ్చరించారు. వెంకటాపురంలో పెద్ద ఎత్తున పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు మాడిపోయాయి.

విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న ఉపరాష్ట్రపతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వెంకయ్య నాయుడు. పెట్రోలియం మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, కిషన్ రెడ్డితో మాట్లాడిన వెంకయ్య నాయుడు. బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని సంబంధిత శాఖలకు వెంకయ్య నాయుడు ఆదేశం. ఇక విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పలువురు మృతి చెందడం, ఆస్పత్రిపాలు కావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. "ఆర్.ఆర్ వెంకటాపురం దుర్ఘటన బాధాకరం. మనుషులే కాదు ముగజీవాలు కూడా మృతి చెందాయి. కొనఊపిరిలో ఉన్న ప్రజలను, ముగజీవాలను కాపాడాలి.

చెట్లన్నీ రంగుమారడం విషవాయువు తీవ్రతకు నిదర్శనం. యుద్ధప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలి. సహాయక చర్యలు వేగపరచాలి.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి" అని చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం సెహ్సారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన లోకేశ్ . ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ - సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 75 శాతం స్థానిక రిజర్వేషన్ల పై, గతంలో ఎంతో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు అన్నీ, 75 శాతం స్థానికులకే అని చెప్తూ, ఒక చట్టం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై, జాతీయ స్థాయిలో కూడా దుమారం రేగింది. ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో, ఇంకా ఈ స్థానిక రిజర్వేషన్లు ఏమిటి, ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారా, ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అంటూ, అప్పటి నుంచే, జగన్ ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వం అని పిలవటం మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు ఏడాది తరువాత, అప్పుడు వాళ్ళు చెప్పిందే నిజం అని తేలింది. ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా, ఈ ఏడాది కాలంలో పెట్టుబడి పెట్టటానికి రాలేదు. ఉన్న కంపెనీలు కూడా, వెళ్ళిపోవటం మొదలు పెట్టాయి. వివిధ రకాల కారణాలు ఈ పరిస్థితికి కారణం అయినా, అందులో, ఈ 75 శాతం రిజర్వేషన్ కూడా ఒకటి.

స్థానికంగా ఏపిలో స్కిల్ లేదు, బయట నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే, ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తే కాని వచ్చే పరిస్థితి లేదు. వారిని ప్రోత్సహించాలసింది పోయి, మాకే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, పెట్టుబడులు రాక, వచ్చే ఆ కొన్ని ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. అయితే, ఇదే విషయం పై, ఈ రోజు కోర్ట్ తలుపు తట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, 75 శాతం రిజర్వేషన్ అంటూ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, విజయవాడకు చెందిన లాయర్, సీహెచ్‌. వరలక్ష్మి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వొకేట్, బి.ఆదినారాయణరావు, తమ వాదనలు వినిపించారు.

అయితే, ఈ పిటీషన్ రాగానే, ఈ పిటీషన్ స్వీకరించటానికి అర్హత లేదు, తిరస్కరించమంటూ, ప్రభుత్వ తరుపు న్యాయవాది సుమంత్‌ రెడ్డి హైకోర్ట్ ని కోరారు. పిటీషన్ వేసింది న్యాయవాదులు అని, న్యాయవాదులకు, ఇతరులకు, దీంతో సంబంధం లేదని, అవసరం అనుకుంటే పారిశ్రామికవేత్తలు స్పందిస్తారని వాదించారు. అయితే హైకోర్ట్ మాత్రం, ఈ వాదనతో అంగీకరీంచలేదు. ఈ పిటీషన్ లో, ప్రజాప్రయోజనం దాగి ఉందని, ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తున్నామని తెలిపింది హైకోర్ట్. రాజ్యాంగానికి లోబడే, ఈ 75 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నారా ? ఈ నిర్ణయానికి చట్ట బద్దత ఉందా అంటూ, హైకోర్ట్ ప్రశ్నించింది. దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, తమకు కొంత సమయం కావాలని కోరగా, నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చెయ్యాలని, కోర్ట్ ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానకులకు ఉహించని షాకు ఇచ్చింది. 24గంటల వ్యవధిలో వరుసగా మద్యం ధరలు పెంచేసింది. మంగళవారం మద్యంధరలను ఏకంగా 50శాతానికి పెంచింది. రాష్ట్రంలో క-రో-నా వైరస్ ప్రభావంతో మద్యం విక్రయాలను 44 రోజులుగా నిలిపివేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ కీలక మార్గదర్శకాలను అనుసరించి సోమవారం నుంచి మద్యం అమ్మకాలను ప్రారంభించి, గ్రీన్, ఆరెంజ్ జోనుల్లోను, రెజోన్లులో కొన్ని జిల్లా లో మాత్రమే మద్యం అమ్మకాలను ప్రారంభించారు. అయితే కేంద్రం మీదకు తోసేస్తున్నా, ఇక్కడ సామాజిక దూరం, ఇతరత్రా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అవి పట్టించుకోలేదు అనే విమర్శలు వచ్చాయి. సోమవారం నుంచి, మద్యం అమ్మకాలు ప్రారంభంకావడంతో దాదావు రాష్ట్రమంతటా అన్ని జిల్లాలో లిక్కరు షాపుల వద్ద పానప్రియులు కిలో మీటర్లు మేర క్యూలు కట్టారు. కొన్ని చోట్ల పోలీసుల ప్రమేయంతో మద్యం ప్రియులు సామాజిక దూరాన్ని పాటించినప్పటికి, దాదాపు అన్ని ప్రాం తాల్లో అందుకు భిన్నంగా మద్యం కోసం పోటే త్తారు.

ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాల వద్ద పరిస్థితుల చక్కదిద్దడం పోలీసులకు సాధ్యం కాని పరిస్థితులు నెలకున్నాయి. దీంతో నిన్న 25శాతం మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం మందు బాబుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో 50శాతం మద్యం ధరలు పెంచింది. ఈ ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. దీంతో మద్యం ధరలు ఒక రోజు వ్యవధిలో 75శాతం పెరిగిన ట్లయ్యింది. రూ. 120 నుంచి రూ. 150 మధ్య ఉన్న క్వార్టర్ ధరపై రూ.80, రూ.150 ఉన్న క్వార్ట రుపై రూ.120 పెంవు, బీర్పై రూ.60, మినీ బీర్‌పై రూ.40 పెంచారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం దుకా ణాలను ఉదయం తెరుచుకోలేదు, పెంచిన ధర లకు అనుగుణంగా రికార్డులు అప్ డేట్ చేసుకునే పనిలో సిబ్బంది వడటంతో అమ్మకాలను ఆరంభించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుందని ప్రకటించారు.

అధికారిక యంత్రాంగం కుడా ఏఏ మోతాదు మద్యం ఎంత ధర పెరిగిందనే పనిలో పడ్డారు. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మద్యం దుకాణాలను తెరవద్దని అధికారులు ఆదేశించినట్లు చెబుతున్నారు. అధికారిక ఉత్తర్వుల జారీ అయ్యేంత వరకు అమ్మకాలను సిబ్బంది ప్రారంభించకపోవడంతో మద్యపాన ప్రియులు ఆయా దుకాణాల వద్ద ఎదురు చూవులు చూసారు. మధ్యాహ్నం 12గంటలు తరువాతగాని షాపులు తెరుచుకోలేదు. అయితే రెండు రోజుల అమ్మకాలు చూస్తూ, దిమ్మ తిరగాల్సిందే. మొదటి రోజు కలెక్షన్ 68 కోట్లు వచ్చింది. మొదటి రోజు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మారు. ఇక రెండు రోజు అయిన నిన్న, చాలా వరకు రేట్లు పెంచినా, చాలా వరకు మధ్యానం నుంచి ప్రారంభం అయినా, నిన్నటి కలెక్షన్ కూడా 40 కోట్లు వరకు వచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా, రెండు రోజుల్లోనే, దాదాపుగా, 100 కోట్ల పైన ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకి ఫోన్ చేసారు. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా, కర్ణాటకలో ఉడుపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకు పోయిన శ్రీకాకులం జిల్లా మత్స్యకారులు 300మందికి, ఆహారం లేక అగచాట్లు పడుతున్నారని, వారికి తక్షణ సహాయం నిమిత్తం ఆదుకోవాలని, అలాగే వారిని ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వారిని తరలించడం గురించి, చంద్రబాబు, యడ్యూరప్పతో మాట్లాడారు. కోవిడ్ 19పై కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నానని చంద్రబాబు చెప్తూ, ఈ విపత్కర సమయంలో మేమంతా మీతోపాటు కర్ణాటక ప్రజలకు సంఘీభావంగా ఉంటాం. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఏపి కార్మికులు అనేకమంది ఆయా ప్రాంతాలలో అష్టకష్టాలు పడుతున్నారని, ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300మంది మత్స్యకారులు కర్ణాటకలోని ఉడిపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకుపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నానని అన్నారు. వారి యోగక్షేమాలపై స్థానికంగా ఆయా కుటుంబాల సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు తల్లడిల్లుతున్నారని, వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయా కుటుంబాల తరఫున, ప్రత్యేకించి నా తరఫున మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నానని అన్నారు. అది వీలుగాని పక్షంలో లాక్ డౌన్ పూర్తయ్యేదాకా వారికి అక్కడే ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్య సాయం ఇతర నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరుతున్నానని అన్నారు.

సదరు తెలుగు మత్స్యకారులను ఆదుకునేందుకుగాను అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చి, అతన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు. చంద్రబాబు ఇప్పటికే ఇలాగే విదేశాల్లో చికుకున్న వారి గురించి, వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావటం గురించి, కేంద్రానికి విజ్ఞప్తులు చెయ్యటం, అవి పరిష్కారం అయిన విషయం తెలిసిందే. అలాగే, మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు వారికోసం, గుజరాత్ లో చిక్కుకున్న వారి కోసం, తమిళనాడులో చిక్కుకున్న వారి కోసం,కూడా చంద్రబాబు ఇలాగే లేఖలు రాసి, అక్కడి ముఖ్యమంత్రులతో మాట్లాడి, సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేసారు, చంద్రబాబు.

Advertisements

Latest Articles

Most Read