నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఈ రోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు పిటిషన్‍పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు తిరిగి ప్రారంభం అయ్యాయి. నిన్న ఆరుగురు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనం, ఇవాళ మరికొందరు పిటిషనర్ల తరపు వాదనలు వినటానికి రెడీ అయ్యింది. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు ప్రారంభం చేసారు. అయితే, ఈ సమయంలో, హైకోర్ట్ సీజేకు ఒక సంఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అనుమతించినవారు కాకుండా ఇతర న్యాయవాదులు ప్రవేశించడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. కేవలం 10 మందికి పాస్ వర్డ్ ఇస్తే, ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్ లోకి ఎలా వచ్చారన్న సీజే ప్రశ్నించారు. పాస్‍వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే ఆగ్రహం వ్యక్తం చేసారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే క్రాస్‍టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు.

దీంతో, నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని, సీజే చెప్పారు. కోర్టుతో సంబంధమున్న న్యాయవాదులకు పాసులు జారీ చేసేలా డీజీపీకి ఆదేశాలు ఇస్తాం అని అన్నారు. కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండటంతో, సీజే దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాస్తాం అని చెప్పారు. సోమవారం అందరూ సమాజీక దూరం పాటిస్తూ, నిబంధనులు పాటిస్తూ, కోర్ట్ కు హాజరు కావాలని చెప్పారు. అయతే, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పాస్‍వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బయట వ్యక్తులు ఎలా వస్తారు అంటూ, చర్చ మొదలైంది.

నిన్న, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమి షనర్ తొలిగింపు అంశం పై కేసు విచారణను ఈ రోజుకి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం నూతన సంస్కరణల సాకుతో ఆర్డినెన్స్ ద్వారా తొలిగించింది అంటూ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్మగడ్డ వ్యక్తిగతంగాను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాతో పాటు ఆరు గురు ప్రజావ్యాజ్య పిటిషన్లును హైకోర్టులో దాఖలు చేసారు. ఈ పిటీషన్లకు సంబంధించి ఫిర్యాదుదారులు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్ని కల సంఘం కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాద, ప్రతివాదనలు కొనసాగాయి. ధర్మాసనానికి ఆరుగురు వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

నిమ్మగడ్డ రమేష్ తొలగింపు పిటిషన్ల పై హైకోర్టులో రేపు కూడా విచారణ జరగనుంది. నేడు నిమ్మగడ్డ తరపు న్యాయవాదితోపాటు పలువురు పిటిషనర్ల తరపు వాదనలు ధర్మాసనం వింది. మరికొందరి వాదనలు రేపు ధర్మాసనం విననుంది. తుది విచారణ రేపటికి ధర్మాసనం వాయిదా వేసింది. ఇవాళ పిటిషనర్ల వాదలను సుదీర్ఘంగా విన్నారు చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ఈ విచారణ చేసింది. నిమ్మగడ్డ రమేష్ తరపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, అశ్వనికుమార్ వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడే ఇస్తారని, ఎస్ఈసీ నియామకంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిమ్మగడ్డకు వర్తించదని ధర్మాసనానికి తెలియచేసారు, న్యాయవాది డీవీ సీతారామమూర్తి. పిల్ ను ఎందుకు అనుమతించాలో చెప్పాలని మరో లాయర్ వెంకటరమణను సీజే ప్రశ్నించారు. నిమ్మగడ్డను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం కనుక పిల్ ను అనుమతించాలని సమాధానమిచ్చారు న్యాయవాది వెంకట రమణ.

ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆయన కులం ప్రస్తావన తీసుకురావడం, ఆయన కుమార్తెకు చంద్రబాబు ఉద్యోగం ఇచ్చారని.. సీఎం సహా మంత్రులు మాట్లాడటాన్ని తనవాదనలో వినిపించారు లాయర్ DSNV ప్రసాద్. మంత్రి వర్గాన్ని తొమ్మిదోపార్టీగా చేర్చి వారు ప్రెస్‌మీట్‌లలో నిమ్మగడ్డ పై చేసిన వ్యాఖ్యలు, టీవీ న్యూస్ క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్‌లను అదనపు సాక్ష్యాలుగా పరిగణించాలన్న లాయర్ ప్రసాద్ కోరారు. గవర్నర్‌కు తప్పుడు సమాచారం అందించారని వాదించిన డీఎస్ఎన్‌వీ ప్రసాద్ బాబు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌ను ఎవరు రిప్రజెంట్ చేస్తారని లాయర్ ప్రసాద్‌ను ప్రశ్నించిన సీజే మహేశ్వరి. కేసు రేపటికి వాయిదా పడింది.

ష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎనీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఆ కేసుకు సంబంధించి రిప్లై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. మొత్తం 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్లోని విషయాలపై అంశాలవారీగా 17 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన కౌంటర్లో సంబంధం లేని అంశాలను ప్రస్తావించిందని, ఎన్నికల సంస్కరణలు ఫిబ్రవరిలోనే ప్రారంభించామనడం వాస్తవం కాదని వివరించారు. ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా.. ఆ మార్పు పదవిలో ఉన్న అధికారికి వర్తించదని వివరించారు. ప్రభుత్వం చెబుతున్న సంస్కరణలు వాస్తవిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయని, వాస్తవానికి సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మంత్రి మోపిదేవి చేసిన వ్యాఖ్యల పై టిడిపి మండిపడింది. మోపిదేవి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, టిడిపి నేత కె.ఎస్.జవహర్ తిప్పికొట్టారు. ఆయన మాట్లాడుతూ "రాష్ట్రంలో బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మోపిదేవి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు. యథారాజా తధా ప్రజా అన్న రీతిలో మాట్లాడారే తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు లేదు. మండలి రద్దు అయితే మంత్రి పదవి పోతుందనే ఫ్రెస్టేషన్లో ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. శ్రీకాళహస్తి మాఢ వీధుల్లో దేవుని విగ్రహాన్ని ఊరేగించినట్లు 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన బియ్యపు మధుసూధన్ రెడ్డి ఎవరు.? 50 కరోనా కేసులు నమోదు కావడానికి కారణం ఎవరు.? గూడూరులో ట్రాక్టర్ ర్యాలీ చేసిందెవరు? కనిగిరి ఎమ్మెల్యే 30 వాహనాల్లో కర్నాటక నుండి ఏపీకి వచ్చి గందరగోళం సృష్టించినది ఎవరు.? లక్షతో బోరు వేయించి భౌతిక దూరం పాటించకుండా లక్ష విలువైన పూలు జల్లించుకున్నది ఎవరు.? విజయసాయి రెడ్డి శ్రీకాకుళం నుండి విజయనగరం, అమరావతి, హైదరాబాద్ మాట్లాడితే మోపిదేవి వెంకటరమణకు కనిపించలేదా.? ఇప్పుడు చెప్పండి కరోనా వాహకాలు ఎవరు.? కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు ఎంత పంచారు.? ఎంత దోచేశారో ప్రజలకు చెప్పరా.?"

"తెలుగుదేశం పార్టీ నేతలు ఆహారం పంచుదామన్నా, సేవ చేద్దామన్నా నిబంధనల పరుతో అడ్డుకుంటున్నారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమైనది ఎవరు.? మద్యం షాపుల్లో మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెప్పడానికి సిగ్గులేదా.? తాళం వేశాం.. గొళ్లెం మరచితిమి అన్నట్లు ఎక్సైజ్ అధికారులు వ్యవహరించడంతో అక్కడి మద్యం మొత్తం వైసీపీ నేతలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సారాయి ఏరులై పారుతోందని స్పీకరే చెబుతున్నా పట్టించుకోరు. ఇసుక రీచుల్లో జరుగుతున్న దోపిడీ దేశమంతా చూస్తోంది. ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దేశంలోని అందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలంటే.. మన ముఖ్యమంత్రి మాత్రం గ్రీన్ జోన్లు, మండలాల వారీగా సడలింపులు అంటూ 400 కేసుల్ని 1177 కేసులకు పెంచారు. దీని ద్వా ప్రజల ప్రాణాలపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైంది. ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైంది. ఇంటెలిజెన్స్ పని చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఏకంగా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటారు. సహజీవనం చేయాలంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరపాలి, తమ వారికి పదవులు కట్టబెట్టాలి. తద్వారా జె ట్యాక్స్ వసూళ్లు పెంచుకోవాలన్నదే ధ్యేయంగా ఉంది తప్ప. ప్రజల ప్రాణాలు ఏమాత్రం పట్టడం లేదు."

"ఎన్నికల కమిషనర్ కనగరాజ్ చెన్నై నుండి ఎలా వచ్చారు.? అతనికి క్వారంటైన్ పట్టదా.? రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయడానికి అతని అడ్రస్ కూడా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది.? రాజ్ భవన్ సిబ్బందికి కరోనా సోకడానికి కారణం ఈ ఎన్నికల కమిషనర్ కాదా.? రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు కాబట్టే పాలన ఇంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో నమోదైన కేసులకు గల కారణాలను విశ్లేషించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మీ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రజలు నువ్వే కావాలి అనుకునే పరిస్థితుల్ని 10 నెలల్లోనే తీసుకొచ్చారు." అని జవహర్ అన్నారు.

జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా విషయంలో పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్, సాధారణ జ్వరం అంటూ జగన్ అవగాహనలేమి వల్ల కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. 11 జిల్లాల్లో మరణ మృదంగం మోగుతోంది. ప్రపంచం మొత్తం కరోనాను సీరియస్ గా తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి అత్యంత తేలిక భావంతో ఉన్నారు. ప్రపంచంలో కరోనా పట్ల మూర్ఖంగా మాట్లాడిన మొదటి వ్యక్తి ట్రంప్ అయితే.. రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సీఎం తీరు వల్లే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. జగన్, వైసీపీ ధనదాహానికి టెస్టింగ్ కిట్లలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరుగింది. వైద్య సిబ్బందికి మాస్కులు లేవు. కనీస సదుపాయాలు కూడా వారికి కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో 13 జిల్లాల్లో రైతుల కోసం జగన్ తీసుకున్న చర్యలు ఏంటి లాక్ డౌన్ ప్రక్రియ మొదలైన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఎన్ని టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది, ఎంతమేర చెల్లింపులు చేశారు50 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడులు వస్తే.. రెండు, మూడు లక్షలు కూడా కొనుగోలు చేయలేదు. వీటికి కూడా సరిగా నగదు చెల్లింపులు చేయలేదు. 13 జిల్లాల్లో వరి ఎంత పండింది, ఎంత కొనుగోలు చేశారు, నగదు ఎంత చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా. ఉద్యానవన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పూలతోటల రైతులు నాశనం అయ్యారు. ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారు. 40 రోజుల వ్యవధిలో ఒక్క టన్ను రొయ్యలు కానీ, చేపలు కానీ కొన్నారా. మద్దతు ధర చెల్లించారా. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది.

కనీసం 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, కులవృత్తులు చేసుకునే వారు పస్తులతో ఉంటున్నారు. దీనికి కారణం జగన్ అసమర్థత కాదా. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. జగన్ చేయాల్సిన పనిని చంద్రబాబు గారు చేస్తున్నారు. నిరంతరం కరోనాపై అప్రమత్తం చేస్తున్నారు. కరోనాతో జీవితాంతం ఉండాల్సి వస్తుందని నిన్న జగన్ మాట్లాడటం అసమర్థతకు నిదర్శనం. వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించబట్టే కరోనా విస్తృతమవుతోంది. జగన్ పేద కుటుంబాలను ఏవిధంగానూ ఆదుకోలేదు. దీనిపై టీడీపీ పోరాడుతుంది.

Advertisements

Latest Articles

Most Read