ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకో వడం లేదని... పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థి తులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం రాత్రి రాష్ట్ర నేత లతో ఆరా తీసినట్లు తెలుస్తోంది. కర్నూలు, కడప, నంద్యాల, శ్రీకాళహస్తి, గుంటూరు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచి పెడుతోం దని రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. "కర్నూలు పాతబస్తీలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కర్నూలులో ఒక అధికార పార్టీ నేత, మర్కజ్ వెళ్లిన వారికి పరీక్షలు నిర్వహించకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. నంద్యాలలో కూడా కేసులను బయటకు రానివ్వడం లేదు. అక్కడ కరోనా వివరాలను బయటకు పొక్కనివ్వడం లేదు. కడపలో కూడా కరోనా పీడితులను క్వారంటైన్లో పెట్టకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు" అని నడా దృష్టికి తీసుకొచ్చారు.
లాక్ డౌన్ ఉన్నప్పటికీ శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఊరేగింపు జరిపారని తెలిపారు. ఆయా అంశా లకు సంబంధించిన పూర్తి వివరాలను తనకు అందించాలని... తన వద్ద కూడా కొంత సమాచారం ఉందని నడ్డా చెప్పారు. ఇదే విధంగా... మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం టాస్క్ ఫోర్స్ ను నియమించిందని గుర్తు చేశారు. కేంద్ర బృందం ఆ రాష్ట్రాలకు వెళ్లి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నదని నడ్డా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక టీమ్ ను పంపాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో కేసులు పెరిగిపోతున్నాయని, అలాగే, టెస్టింగుల విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పీసీఆర్ టెస్టులు చేసి, కరోనా నిర్ధారణ చేయాలనీ, రాపిడ్ టెస్టులు కేవలం లక్ష్యణాలు తెలుసుకోవటానికే అని కేంద్రం చెప్తున్నా, రాష్ట్రం మాత్రం రాపిడ్ టెస్టులు చేసి, గొప్పగా చెప్పుకుంటూ, ప్రజలను ఇబ్బందుల్లోకి నేడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే, 16 వేల టెస్టులకు సంబంధించి ఇప్పటికీ రిజల్ట్ రాకపోవటం పై, ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రభుత్వానికి ఉత్తరం కూడా రాసారు. ఇక విశాఖపట్నంలో కూడా ఏదో జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటి అన్నిటి నేపధ్యంలో, కేంద్రం నుంచి రాష్ట్రానికి టాస్క్ ఫోర్సు వచ్చి, నిజాలు నిగ్గు తెల్చనుందని సమాచారం.