ఆంధ్రప్రదేశ్ లో, ఒకప్పటి రహస్య మిత్రులు, ఇప్పుడు బహిరంగ శత్రువులు అయ్యారు. చంద్రబాబుని ఎలా అయిన దించాలని అనే ఉద్దేశంతో, అప్పటి బీజేపీ లోపాయికారీగా, వైసీపీకి పని చేసింది అనేది, విశ్లేషకుల అంచనా. అనుకున్నట్టుగానే, చేసారు. చంద్రబాబుని డించారు. జగన్ మోహన్ రెడ్డిని ఎక్కించే ప్రయత్నంలో, తమ వంతు సహాయం చేసారు. అయితే, తమ గుప్పిట్లో ఉంటాడు అనుకుంటే, ఎదురు బీజేపీ పైనే ఎదురు దాడి చెయ్యటం మొదలు పెట్టరు. అనుభవం లేని జగన్ మోహన్ రెడ్డి, పరిపాలనలో వేస్తున్న తప్పటడుగులు, ఏడాది అయినా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో బీజేపీ కూడా, ఆ తప్పులని ఎత్తి చూపటం మొదలు పెట్టింది. జగన్, విజయసాయి రెడ్డి చేసే తప్పులకు, కేంద్రానికి చెప్పి చేస్తున్నాం అని చెప్పటం, బీజేపీ హైకమాండ్ ని ఇరికించటమే అని బీజేపీ తెలుసుకుని, జగన్ వైఫల్యాల పై దృష్టి పెట్టింది. జగన్ చేసే అనైతిక పనులు, అసమర్ధ పనుల పై, ఏపి బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంది.

ఈ క్రమంలో, కోరనా టెస్టింగ్ కిట్ల విషయంలో, చత్తీస్ఘడ్ రాష్ట్రం కంటే, డబుల్ రేటుకు, అదే కంపెనీ నుంచి, అదే ప్రోడక్ట్ కొనటం పై, పెద్ద దుమారం రేగింది. ఇందులో ప్రభుత్వం నిజా నిజాలు చెప్పి, పారదర్శకత నిరూపించుకోవాలని, కన్నా లక్ష్మీ నారాయణ ట్వీట్ చెయ్యటంతో, కన్నా పై వైసీపీ విరుచుకు పడింది. కన్నా అడిగిన ప్రశ్న గురించి చెప్పకుండా, కన్నా పై వ్యక్తిగత దాడికి దిగింది వైసీపీ. ఇందుకు విజయసాయి రెడ్డి , నాయకత్వం వహించి కన్నా పై ఎదురు దాడి చెయ్యటం హైలైట్. కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు దగ్గర 20 కోట్లకు అమ్ముడు పోయారని, దీనికి సుజనా బ్రోకర్ అని అన్నారు. ఇక తరువాత రోజు, కన్నా, పురందేశ్వరి, ఎన్నికల సమయంలో బీజేపీ హైకమాండ్ ఇచ్చిన డబ్బులు, ఎన్ని తీసుకున్నారో తనకు తెలుసు అని అన్నారు.

దీనికి స్పందించిన కన్నా, విజయసాయి రెడ్డి పై, పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అయితే ఇదే సమయంలో, ఢిల్లీ నుంచి బీజేపీ హైకమాండ్, రాష్ట్ర బీజేపీ నేతలతో, టెలి కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో వైసీపీని అందరూ కలిసి ధీటుగా ఎదుర్కోవాలని, బీజేపీ పై చేసిన ఆరోపణలు తిప్పి కొట్టాలని చెప్పింది. ఇదే సమయంలో కన్నా, విజయసాయి రెడ్డి పై పరువు నష్టం దావా వెయ్యాలని అనుకుంటున్నా ని చెప్పటంతో, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, దానికి ఒప్పుకుని, కన్నాని ఈ విషయంలో ప్రొసీడ్ అవ్వమని అన్నారు. దీంతో చెప్పినట్టుగానే, కన్నా విజయసాయి రెడ్డికి నోటీస్ పంపించారు. తన పై చేసిన వ్యాఖ్యలకు నోటీస్ పంపించారు. అలాగే గవర్నర్ ని కలిసి, టెస్టింగ్ కిట్ల స్కాం పై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైసీపీ, బీజేపీ నేతల మధ్య, రోజుకి ఒక వివాదం రేగుతూ, ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. నిన్నటి దాకా, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసుకుంటూ, విజయసాయి రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కన్నా లక్ష్మీ నారయణ, సుజనా చౌదరి, పురందేశ్వరి పై తీవ్ర ఆరోపణలు చేసారు. దాదపుగా నాలుగు రోజుల పాటు, ఇరు పార్టీల నేతలకు మాటా మాటా నడించింది. ఇది ఎక్కడ వరకు వెళ్ళింది అంటే, బీజేపీ హైకమాండ్ కూడా, ఎంటర్ అయ్యి, జరుగుతున్న విషయం పై ఆరా తీసింది. రాష్ట్ర బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గున్న హైకమాండ్ నేతలు, వైసీపీ చేస్తున్న అన్ని ప్రజా వ్యతిరేక పనుల పై, నిలదియ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా చెప్పి ఒక్క రోజు అయ్యిందో లేదో, ఇప్పుడు మరో బీజేపీ నేతను టార్గెట్ చేసింది, జగన్ ప్రభుత్వం. నిబంధనలు సాకుగా చూపి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి షాక్ ఇచ్చారు పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆక్టివ్ గా ఉండే నేత, విష్ణువర్థన్‌‌రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. విష్ణువర్థన్‌‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు, ఆయన్ను 28 రోజుల పాటు, బయటకు రాకూడదు అని, హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను విష్ణువర్థన్‌‌రెడ్డి ఇంటికి వచ్చి, పోలీసులు ఇచ్చి వెళ్లారు. విష్ణువర్థన్‌‌రెడ్డి కర్నూల్ జిల్లాకు వెళ్లి రావటమే కారణంగా పోలీసులు చెప్తున్నారు. కర్నూల్ లో కేసులు అధికంగా ఉండటంతో, అక్కడకి వెళ్లి రావటంతో, ఈ నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. నిబంధనలు పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే, తీవ్ర చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే విషయాన్ని విష్ణువర్థన్‌‌రెడ్డికి తెలిపారు పోలీసులు.

అయితే ఈ నోటీసుల పై, బీజేపీ భగ్గు మంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులు లేవనెత్తుతున్నందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఈ విషయం పై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాకు హోంక్వారంటైన్ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేసారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, "నాకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుంది, దేశంలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు నాకుంది. కొందరు అవగాహన లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. స్థానిక సీఐ, ఎస్ఐలు వారికి తెలియక నోటీసులు ఇచ్చారు. 24 గంటల పాటు నాకు సెక్యూరిటీ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు భద్రత కల్పిస్తాయి. అధికార పార్టీ నేతలు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రుల్ని క్వారంటైన్ లో పెడతారా?: అంటూ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు.

రాజధాని అమరావతి మార్పు పై, వైసీపీ నేతలు ఎంతో అహంకారంతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్కన ఈ విషయం కోర్టులో ఉన్నా సరే, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రాజధానిని విశాఖకు మార్చి తీరుతాం అని, ఎవరూ దాన్ని ఆపలేరు అంటూ ఏకంగా ఈ అంశం కోర్టులో ఉండగానే చెప్పటం, సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలోనే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల ప, అమరావతి పరిరక్షణ సమితి తరుపున, ఆ సంస్థ కార్యదర్శి హోదాలో, గద్దె తిరుపతిరావు, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ విషయం పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. రాజధానిని అమరావతి నుంచి, విశాఖకు తరలించి వేస్తూ, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అలాగే మార్చ్ 18 వ తేదీన, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, కమిటీ తీర్మానం, వాళ్ళు తరువాత మాట్లడుతూ, సియం ఓరల్ ఆదేశాలు ఇచ్చారు, మే 31 లోపు వైజాగ్ వెళ్లిపోవాలి అంటూ చెప్పారు అంటూ, ఈ విషయాలు పిటీషనర్ తమ వాదనల్లో పేర్కున్నారు.

ఈ సందర్భంగా, పిటీషనర్ వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలి అంటూ, హైకోర్ట్, అడ్వొకేట్ జెనరల్ ను ఆదేశించింది. అయితే దీని పై వివరణ ఇస్తూ, ఏజీ కోర్టకు ఒక విషయం స్పష్టం చేసారు. రాజధాని తరలింపుకు సంబంధించి చట్ట సభల్లో, బిల్లులు పాస్‌ అవ్వకుండా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోదు అని చెప్పి, అడ్వొకేట్ జెనరల్ కోర్ట్ కు తెలిపారు. అయితే దీని పై స్పందించిన హైకోర్ట్, ఇదే విషయం అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని, ఏజేజి కోరింది. దీని పై స్పందించిన అడ్వొకేట్ జెనరల్ , తమకు 10 రోజులు గడువు కావాలి అని కోరగా, హైకోర్ట్ దానికి అంగీకరించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చెయ్యాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఈ లోపు కనుక రాష్ట్ర ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో ముందకు వెళ్తే, తమ దృష్టికి తీసుకు రావాలి అని, కోర్ట్, పిటీషనర్ తో తెలిపింది. దీంతో కేసును పది రోజులకు వాయిదా వేసింది హైకోర్ట్. అయితే, ఇదే సందర్భంలో, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రాజధాని విశాఖగా అయ్యి తీరుతుందని, ఇది ఆపటం ఎవరి తరం కాదు అంటూ, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై, పిటీషనర్ తరుపు న్యాయవాది, కోర్ట్ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే, ఈ సందర్భంగా, కోర్ట్ స్పందిస్తూ, ఈ విషయం పై వివరణ ఇవ్వాలని, అడ్వకేట్ జనరల్ ను కోరింది. దీని పై కూడా త్వరలోనే వివరణ ఇవ్వనుంది ప్రభుత్వం. మొత్తానికి, ప్రభుత్వాన్ని ఫిక్స్ చేసే విధంగా, కోర్ట్ ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది.

కరోనా మహమ్మారి నుంచి మనలను కాపాడుతుంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఇతర పారామిలటరీ స్టాఫ్. అయితే ఇటీవల కాలంలో వీరి పై దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే, ప్రధాని మోడీ, వీరి పది దాడులు చేస్తే ఊరుకోం అంటూ ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. అయితే, ఇప్పుడు స్వాయంగా జగన్ పార్టీకే చెందిన ఒక ఎంపీ చేసిన పనిని, బయట పెట్టింది ఒక జాతీయ ఛానల్. వైకాపా మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ టెనెంట్ మెడికార్ఫ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసారని, ఆ వివరాలు బయట పెట్టింది టైమ్స్ నౌ. “బాలశౌరికి చెందిన కినేటా టవర్స్ లోని తమ ల్యాబ్ లో కరోనా పరీక్షలు చేస్తున్నందున, ఆయన అభ్యంతరం తెలుపుతూ ఖాళీ చేయాలంటున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నాం" అని మెడికార్ప్ సంస్థ వ్యాజ్యంలో పేర్కొంది. టెనెంట్ మెడికార్ప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హోంశాఖ తరఫు న్యాయవాది తెలిపారు.

బాలశౌరి లేదా ఇతరులు మెడికార్ప్ పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ లోని కినేటా టవలో పదేళ్లకు అద్దె ఒప్పందం ఉన్నా ల్యాబను ఖాళీ చేయాలని చెప్పడంతో పాటు వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి దౌర్జన్యంగా చారి మూసేయడాన్ని సవాలు చేస్తూ టెనెట్ మెడ్ కార్పొ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున డాక్టర్ టి. విజేందర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ల్యాబ్ కోసం 2017 నవంబరులో భవన యజమాని కినేటా టవర్స్ లిమిటెడ్ పదేళ్లకు అద్దె ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. కరోనా పరీక్షలకు ఐసీఎంఆర్ గుర్తించిన ల్యాబ్లో తమదీ ఒకటన్నారు.

భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంతో పాటు ల్యాబ్లోకి వెళ్లకుండా ఎంపీ బాలశౌరి తన అనుచరులతో దారులు మూసివేశారన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే యజమానిపై పోలీసులు ఎస్ఎఆర్ నమోదుచేశారని, అడ్డంకులు తొలగించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ల్యాబ్ నిర్వహణకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసారు. వైసీపీ చర్యలను ఖండించారు. కరోనా టెస్టింగ్ ల్యాబ్ పనులు చేసుకోనివ్వకుండా, వారిని బయటకు గెంటే విధంగా చెయ్యటాన్ని తప్పుబట్టారు. వారికి అండగా ఉండాల్సింది పోయి, ఇలాంటి పనులు చేస్తారా అని ఖండించారు.

Advertisements

Latest Articles

Most Read