నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం ఎన్​95 మాస్క్​లు ఇచ్చే పరిస్థితి లేదని ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు సుధాకర్ రావు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులే ఉంటే నర్సీపట్నం మొత్తం కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పని చేసే మత్తు వైద్యుడు సుధాకర్ రావు... ఆస్పత్రిలోని పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేరుకే 150 పడకల ఆస్పత్రి ఉందని.. కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లకు ఒక్క మాస్క్ ఇచ్చి 15 రోజుల వాడమంటున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో ఆర్డినేటర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారని.. ప్రసూతి నిపుణురాలిని ఇంతవరకు నియమించలేదని అన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు ఆస్పత్రిని కనీసం పట్టించుకునే స్థితిలో లేరని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ ఘటనపై కలెక్టర్ సూచనల మేరకు జిల్లా అధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రిలోని పరికరాలు పరిశీలించారు. మాస్కులు, రక్షణ పరికరాల వివరాలు తెలుసుకున్నారు. అయితే వైద్యుడు చేసిన ఆరోపణల్లో నిజం ఉందో లేదో విచారణ కమిటీ రిపోర్ట్ ఏమిటో బయటకు రాక ముందే ప్రభుత్వం ఆక్షన్ తీసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీనియర్ వైద్యుడు సుధాకర్ ను ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే కేవలం సస్పెన్షన్ తోనే, ప్రభుత్వం ఆగలేదు. ఆ దళిత డాక్టర్ పై కేసు కూడా పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఉన్నతాధికారులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి పలు సెక్షన్ల కింద సుధాకర్‌పై కేసులు నమోదు చేసారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ పై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్-95 మాస్కుల కోసం డిమాండ్ చేయడమే డా.సుధాకర్ చేసిన నేరమా? సమస్యను పరిష్కరించకుండా వైద్యుడిని సస్పెండ్ చేస్తారా? కరోనా నివారణకు ముందుండి పోరాడే వైద్యులను అగౌరపరచడం మంచిది కాదు అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై మండి పడ్డారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్​కుమార్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నేతలు ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన వెయ్యి రూపాయల నగదు, నిత్యావసరాలను వాలంటీర్లతో పంపిణీ చేయించకుండా... వైకాపా అభ్యర్థులతో ఇప్పిస్తున్నారని ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన ఆధారాలంటూ దాదాపు 250కి పైగా సంఘటనల వీడియోలు, ఫొటోలను లేఖకు జతచేశారు. స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎన్నికల సంఘం బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇది ఆయన రాసిన లేఖ "కోవిడ్ 19వైరస్ ఉధృతి నేపథ్యంలో మనదేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం మీకు విదితమే. అటు రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో, ఇటు లాక్ డౌన్ కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లాగానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అల్లాడుతోంది. పేద కుటుంబాలకు రేషన్ తోపాటు రూ 1,000ఆర్ధిక సాయం అందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమంచిన పెయిడ్ వాలంటీర్ల ద్వారా రూ 1,000 నగదును, రేషన్ తోపాటు ఇంటింటికి పంపిణీ చేస్తారని ప్రకటించింది. అయితే సదరు గ్రామ వాలంటీర్ల విధుల నిర్వహణకు బదులుగా, ఇటీవల వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధులే, స్థానిక వైసిపి నాయకులతో కలిసి ఇంటింటికి నగదు పంపిణీ చేస్తూ నిస్సిగ్గుగా తమకు ఓట్లు వేయాలని కోరుతున్నారు."

"కరోనా మహమ్మారిపై యావత్ ప్రపంచం తమ శక్తినంతటినీ వినియోగించి, ఎంతో శ్రద్దతో ఒకవైపు పోరాటం చేస్తుంటే, మనరాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపైనే పూర్తిగా నిమగ్నం అయ్యారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలపై కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి నాయకులు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. శరవేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్నిరకాల సామాజిక మరియు రాజకీయ సమావేశాలను కేంద్రప్రభుత్వం నిషేధించింది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇంటింటికి రేషన్, నగదు పంపిణీ ముసుగులో పార్టీ కండువాలు ధరించి, జెండాలు ప్రదర్శిస్తూ, వైసిపి ప్రచారం చేస్తూ గుంపులుగా తిరుగుతున్నారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో జనాన్ని పోగేసుకుని గుంపులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఈ రకమైన ప్రచార ప్రదర్శనల వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదమే కాకుండా ప్రాణాలకే పెనుముప్పుగా పరిణమిస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంపైనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా నిమగ్నం అయ్యారని దీనిని బట్టే తెలుస్తోంది. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేటప్పుడే, మళ్లీ తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఏవిధమైన ఎన్నికల ప్రచారాలు చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. "

"ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్ధుల ప్రచారం చేస్తున్న సందర్భాలు రాష్ట్రంలోని 175అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొల్లలుగా ఉన్నాయి. వీటిపై సాక్ష్యాధారాలతో సహా, దాదాపు 253 ప్రాంతాల్లోని స్థానిక ప్రజలే ఎక్కడికక్కడ రికార్డింగ్ చేసిన వీడియోలు తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్నాయి. వాటన్నింటినీ తదుపరి చర్యల నిమిత్తం మీకు అందజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఆర్డినెన్స్ నెంబర్ 2ను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్ధి అయినా డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తే, సదరు అభ్యర్ధిని పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా, శిక్ష కూడా విధించాలని ఆ ఆర్డినెన్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఎన్నికల ప్రచారం చేయరాదన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంఘించడమే కాకుండా, ఈ ప్రక్రియ ద్వారా ఓట్ల కొనుగోళ్లకు ప్రభుత్వధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు గుంపులుగా ప్రచారం చేస్తూ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 51- 60 సెక్షన్లను ఉల్లంఘించారు. అంతే కాకుండా వైసిపి నాయకుల ఈ విధమైన ప్రచారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 171(ఇ), 171(ఎఫ్),188 సెక్షన్ల కింద కూడా శిక్షార్హమైనవి. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలను ఇంత ఘోరంగా, నిస్సిగ్గుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంఘించడం ప్రజాస్వామ్య విలువలకు, నిబంధనలకు మాయనిమచ్చ. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ మూకుమ్మడి ఉల్లంఘనలపై విచారణ జరిపి దోషులపై సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను, నిబంధనలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." అంటూ చంద్రబాబు లేఖ రాసారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ రాసారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరితే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ఫిర్యాదు చేసారు. ఫోన్‌లో కలెక్టర్ స్పందించక నేరుగా కలవాలని నిర్ణయించారని, నేరుగా వినతిపత్రం ఇవ్వాలని రామానాయుడు ఒక్కరే సైకిల్ పై వెళ్తుంటే, భీమవరం వద్ద పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకు వెళ్ళారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వందలమందితో సమావేశం నిర్వహించారని, సమావేశం నిర్వహించినవారిపై చర్యలు తీసుకోలేదని, మంత్రి, కలెక్టర్ 200 మందితో సమావేశం నిర్వహిస్తే చర్యల్లేవని అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు కోరుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసారు. ఇది చంద్రబాబు పూర్తీ లేఖ... "కోవిద్ 19 వైరస్ కారణంగా లాక్ డౌన్ తో ధాన్యం రైతులు, ఆక్వా రైతాంగం, హార్టీకల్చర్, ఫౌల్ట్రీ, సెరికల్చర్ మరియు రబీ పంటల రైతులంతా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ వైఎస్పార్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు. ఈ నేపథ్యంలో పాలకొల్లు శాసన సభ్యుడు, టిడిఎల్ పి ఉపనేత అయిన డాక్టర్ నిమ్మల రామానాయుడుగారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ను స్వయంగా కలిసి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. "

"దీనిపై డా. రామానాయుడు అనేక ఫోన్ కాల్స్ చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ స్పందించలేదు. కొవిడ్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, అందుకే తానొక్కడే సైకిల్ పై ఏలూరు వెళ్లి కలెక్టర్ ను కలిసేందుకు బయల్దేరారు. భీమవరం సమీపంలో విస్సాకోడూరు వద్ద పోలీసు అధికారులు ఆయనను కొద్దిసేపు నిర్బంధించి, తర్వాత పాలకొల్లు వెనక్కి పంపారు. అనంతరం, అదేరోజున పశు సంవర్ధక మరియు మత్స్యశాఖల మంత్రి జిల్లా కలెక్టర్ తో సహా 200మంది మత్స్యశాఖ అధికారులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. భీమవరం ఆనంద్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఆ సమావేశానికి నర్సాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు పాలకొల్లు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆ సమావేశం కేంద్రప్రభుత్వం జారీచేసిన కోవిడ్ ప్రొటోకాల్ మార్గదర్శకాలకు వ్యతిరేకమే కాకుండా విపత్తు నిర్వహణ చట్టం, 2005ను ఉల్లంఘించడమే. "

"కోవిడ్ ప్రొటోకాల్ కు అనుగుణంగా భౌతిక దూరం ఆ సమావేశంలో పాటించలేదు. దానికి ముందే సైకిల్ పై ఒంటరిగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న డా రామానాయుడుగారిని అక్రమంగా నిర్బంధించారు. ఈ సమావేశం గురిచి టిడిపికి చెందిన ఉండి, పాలకొల్లు శాసన సభ్యులకు కావాలనే తెలియపర్చక పోవడం శోచనీయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఒంటెత్తు పోకడలకు పాల్పడుతుందో ఇదే ఉదాహరణ. లాక్ డౌన్ పీరియడ్ లో సమావేశం నిర్వహణ, ఇద్దరు శాసన సభ్యులకు ఆ సమావేశం గురించిన సమాచారం ఇవ్వకపోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తామరతంపరగా చేస్తున్న తప్పుడు పనులకు అద్దం పడుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే జోక్యం చేసుకుని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఒంటెత్తు ధోరణికి, వివక్షతకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాం. ప్రస్తుత ఆపత్కాల పరిస్థితుల్లో మీ తక్షణ జోక్యం ప్రజాస్వామ్య విలువలను, రూల్ ఆఫ్ లా కాపాడటానికే కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు దోహదకారి కాగలదు. " అంటూ లేఖ రాసారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పై అనుకున్నంత స్థాయిలో ఆక్టివ్ గా లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా, ఇదేమి పెద్ద రోగం కాదు, ఇది ఒక జ్వరం లాంటిది, కేవలం పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటూ, చాలా లైట్ గా చెప్పిన విషయం తెలిసిందే. దేశం అంతా లాక్ డౌన్ ఉంది కాబట్టి, ఈ మాత్రం చర్యలు అయినా ఉన్నాయి కాని, లేకపోతే, కరోనా పై ఏపి ప్రభుత్వం నుంచి, ఏమి ఆశించలేము అనే విమర్శలు వస్తున్నాయి. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం, సూచనలు, సలహాలు ఇస్తున్నా, వారి పైనే మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, విసుగు చెందిన విజయవాడ తూర్పు ఎమ్మల్యే గద్దె రామ్మోహన్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. సొంత ఖర్చులతో, విజయవాడ తూర్పు నియోజకవర్గం మొత్తం, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. తన సొంత ట్రాక్టర్లు ద్వారా ఈ పని చేసారు. అయితే ఇదే విధంగా, ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టారు. తనకు ప్రభుత్వం తరుపున సహాయం అందిస్తే, విజయవాడ అంతటా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని 24 గంటల్లో, పిచికారీ చేయిస్తానని అన్నారు.

ఆయన మాట్లాడుతూ, "ప్రభుత్వం సహకరిస్తే 24 గంటల్లో విజయవాడ మొత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తాను. అగ్నిమాపక యంత్రాలు సమకూర్చిస్తే కేవలం ఒక్క రోజులో నగరమంతా ద్రావణం చల్లించగలను. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడగడం తోపాటు సోడియం హైపో క్లోరైడ్ వీధుల్లో చల్లితేనె కరోనా మహమ్మారి నుంచి బయటపడగలం. ఈ ద్రావణం ప్రాముఖ్యత తెలియడం వల్ల సొంత నిధులు, సొంత వాహనాలతో 21వ డివిజన్ లో చల్లిస్తున్నాను. కరోనా విపత్కర పరిస్థితులలో పరిపాలనా ధక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేక పోయింది. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే చంద్రబాబు సలహాలు తీసుకున్నా ఎంతో బాగుండేది."

"ఎలాంటి అంటు రోగాలు ప్రభల కుండా పుష్కరాలు నిర్వహించిన సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వం కరోనా పై యుద్ధం చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం పనిగా పెట్టుకుంది. చంద్రబాబుని విమర్శించే స్థాయి ప్రభుత్వంలో ఎవరికీ లేదు. కరోనా తో దేశం తల్లడిల్లు పోతుంటే జగన్ సర్కార్ తమ అనుయావులకు రూ. 6,500 కోట్లు కాంట్రాక్టు ఇచ్చి పెద్దకుంభకోణంకి తెర తీసింది." అని అన్నారు. అయితే ప్రభుత్వం ఎక్కువగా, ఇసుక కలిపిన బ్లీచింగ్ పౌడర్ మాత్రమే చల్లుతుంది. ఎక్కడైతే కేసులు వస్తున్నాయో, ఆ ఏరియాలోనే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా, అన్ని ప్రదేశాల్లో, బ్లీచింగ్ కాకుండా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలని విపక్షం కోరుతుంది.

Advertisements

Latest Articles

Most Read