గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబ్దోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం చేసింది ఏబీఎన్ కావటంతో, రాధాకృష్ణ పై వైసీపీ నేతలు పడిపోయారు. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఏబీఎన్ కధనం ఖండిస్తూ, ఒక పత్రికా ప్రకటన షర్మిల నుంచి వచ్చినా, అందులో ఎక్కడా తాను పార్టీ పెట్టటం లేదు అని మాత్రం చెప్పలేదు. అయితే ఈ రోజు ఉన్నట్టు ఉండి షర్మిల నుంచి కొంత మంది సన్నిహితులకు ఫోన్లు వెళ్ళాయి. దీంతో వైఎస్ షర్మిల రేపు లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశం పై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమావేశానికి కేవలం నల్గొండ జిల్లాకు సంబందించిన వారినే షర్మిల ఫోన్ చేసి, రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుండి, ఈ సమావేశాలు జరుగుతాయని, వైఎస్ఆర్ అభిమానులను, వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారిని రావాలని, ఆహ్వానాలు అందాయి. సమావేశంలో పాల్గునబోయే నాయకులు కొంత మంది, మాకు ఈ సమావేశానికి రావాలని ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బలం చేకురుంది. షర్మిల రేపు నిర్వహించే సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే షర్మిల సొంత పార్టీ పెట్టబోతున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి రేపు తెర పడనుంది.

sharmila 080222021 2

ఆమె రేపు పార్టీ పెట్టకపొతే వెంటనే ఖండిస్తారని, పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే మాత్రం, ప్రతి జిల్లా అభిమానాలను పిలిచి మాట్లాడి అభిప్రాయం తీసుకుంటారని, దానికి రేపు నాంది పలుకుతారని అనుకోవచ్చు అనే ఊహగానాలు వస్తున్నాయి. సమావేశంలో షర్మిల ఏమి చెప్పబోతున్నారు అనే విషయం ఇప్పుడు వైఎస్ అభిమానుల్లో ఉంది. సమావేశం జరిగే లోటస్ పాండ్ దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, లోటస్ పాండ్ లోనే షర్మిల నివాసం కూడా ఉందని, అక్కడే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ జగన్ అధికారంలో ఉండటం, జగన్ కు, షర్మిలకు మధ్య గ్యాప్ వచ్చింది అనే చర్చ జరుగుతుంది. అధికారం వచ్చిన తరువాత, షర్మిలను దూరం పెట్టటం, తనను, తన తండ్రిని తిట్టిన వాళ్ళకు మంత్రి పదివి ఇచ్చిన జగన్ కు, తాను పనికరానా అనే భావన రోజు రోజుకీ ఎక్కువ అయ్యి, ఇక్కడ దాకా వచ్చిందని చెప్తున్నారు. ఇక మరో పక్క, ఇద్దరి మధ్య సయోద్య కోసం ప్రయత్నం చేసినా, జగన్ వైపు నుంచి సహకారం లేదని, అందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని చెప్తున్నారు. ఈ ఊహాగానాలు అన్నిటికీ రేపు తెర పడనుంది.

నోటికి ఏది వస్తే అది, ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది మాట్లాడే విజయసాయి రెడ్డి, అదే ధోరణి ఈ రోజు రాజ్యసభలో కూడా కొనసాగించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, అధికారం ఉంది కాబట్టి చెల్లుబాటు అవుతాయి కానీ, రాజ్యసభలో కుదరవు కదా, అందుకే అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కూడా విజయసాయి రెడ్డి తీరు పై విరుచుకు పడింది. ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. పోయిన వారం జరిగిన చర్చలో, టిడిపి ఎంపీ కనకమేడల, హైకోర్టు తీర్పులోని, 6093 అంటే జగన్ అని జడ్జి చెప్పారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల పై ఈ రోజు విజయసాయి రెడ్డి రాజ్యసభలో అభ్యంతరం తెలిపారు. కనకమేడల చేసిన వ్యాఖ్యలు అభంతరకరం అని, ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరారు. అయితే ఈ సందర్భంగా పాయింట్ అఫ్ ఆర్డర్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది పాయింట్ అఫ్ ఆర్డర్ కింద రాదని, దీని పై రాత పూర్వక ఫిర్యాదు చేస్తే, నేను పరిశీలన చేసి, అభ్యంతరకరం అయితే తొలగిస్తానని వెంకయ్య చెప్పారు. పాయింట్ అఫ్ ఆర్డర్ అంటే అప్పుడే ఇవ్వాలని, నాలుగు రోజులు తరువాత ఇస్తే రూల్స్ ఒప్పుకోవని, ఫిర్యాదు చేయాలని వెంకయ్య, సూచించారు. అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి వినకుండా, తన ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు.

reddy 08022021 2

అయితే చైర్మెన్ వెంకయ్య, మీరు ఫిర్యాదు ఇవ్వండి అంటూ, జీరో హావర్ ని కంటిన్యూ చేసారు. అయితే, విజయసాయి రెడ్డి మాత్రం, వెంకయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. మీరు పక్షపాతంగా ఉంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు. టిడిపికి ఎక్కువ సమయం ఇచ్చి, మాకు తక్కువ సమయం ఇస్తున్నారు, మీ తనువు టిడిపితో ఉంది, మనసు బీజేపీతో ఉంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ సందర్భంలో కలుగు చేసుకున్న కాంగ్రెస్, బీజేపీ సభ్యులు, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని పై స్పందించిన వెంకయ్య, ఆ సభ్యుల ప్రవర్తన పై, మీరు అందరూ నాకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు, నేను పార్టీ పదవికి రాజీనామా చేసిన తరువాతే ఇక్కడ కూర్చున్నా అని గుర్తు చేసారు. నేను పక్షపాతంగా వ్యవహరిస్తున్నాను అని చెప్పిన మాటలు లెక్క చేయను కానీ వ్యక్తిగతంగ ఆ మాటలు బాధించాయని అన్నారు. మీరు ఫిర్యాదు ఇవ్వండి, చర్యలు తీసుకుంటా అని చెప్పిన తరువాత కూడా, ఇలా నా పై ఎందుకు నిందలు వేసారో అని బాధపడ్డారు. తన తనువు ఈ దేశంతో, రాజ్యాంగంతో ఉందని, వెంకయ్య అన్నారు. మొత్తానికి విజయసాయి రెడ్డి పై, రాజ్యసభ సభ్యులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు స్వయంగా ఫిర్యాదు చేసారు. ఆయన ఫిర్యాదు ఇలా ఉంది.. "అధికారులు మూడు దశల్లో ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులను వేధిస్తున్నారు. మొదటి దశలో సంబంధిత పత్రాలు ఇవ్వకపోవడం, రెండో దశలో అక్రమకేసులు మోపడం, మూడో దశలో నామినేషన్లు వేసే వారిపై భౌతిక దా-డు-ల-కు దిగడం వంచి చర్యలకు పాల్పడుతున్నారు. 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో హిం-సా-త్మ-క సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్ల, పుంగనూరులో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉండి పోలీసలు ఇతర పార్టీల వారిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఏకగ్రీవాల కోసం పెద్ద ఎత్తున అరాచకాలకు తెరలేపారు. రెవెన్యూ అధికారులు ఎటువంటి సహకారం అందించడం లేదు. కుల దృవీకరణ, నో డ్యూస్ పత్రాలివ్వడం లేదు. దీనిపై తక్షణమే స్పందించాలి. నామినేషన్లకు ఇంక ఒక్కరోజే మాత్రమే గడువుంది. దీనిపై చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు సహకరించేలా చూడండి. శాంతియుతంగా నామినేషన్లు ప్రక్రియ జరిగేలా చూడాలి. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు మాచర్లలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఇతర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవేళ అభ్యర్థులు పోలీసుల బెదిరింపులకు లోనవుకుంటే వెంటనే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. "

nimmagadda 08022021 2

"అక్రమ మద్యం, గంజాయి కేసులను పోలీసులు బనాయిస్తున్నారు. రెంటచింటల గ్రామ పంచాయతీకి సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా బలహీన వర్గాలకు చెందిన దండె అంకమ్మ భర్తపై తప్పుడు కేసులు పెట్టారు. ఫిబ్రవరి 7న ఉదయం 7 గంటలకు దండే శివయ్యను అరెస్ట్ చేసి వేధించారు. అదేవిధంగా పసర్లపాడు గ్రామ పంచాయతికి నామినేషన్ వేయడానికి సిద్ధమైన యాదవ సామాజిక వర్గానికి సవాలా రామరాజును వైసీపీ నాయకులు అడ్డుకుని దాడి చేశారు. జమ్మలమడక గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమైన తరుణంలో బాలు నాయక్ ను వైసీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. దుర్గి మండలంలో ఓబులేసునిపల్లెకు సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన ఓర్సు వెంకట్రావుపై వైసీపీ నాయకులు దా-డి-కి పాల్పడ్డారు. పుంగనూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సోడమ్, సోమల మండలాల్లో వైసీపీ గూం-డా-లు, పోలీసు, రెవెన్యూ అధికారులు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సోడమ్ మండలంలో ఎంపీడీవో కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థులపై భౌతిక దా-డు-ల-కు తెగబడ్డారు. దీనిపై చర్యలు తీసుకుని తక్షణమే నామినేషన్ల కార్యాలయాలను మార్చాలి." అంటూ చంద్రబాబు ఫిర్యాదు చేసారు.

ఒక పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పై, కారణం లేకుండా చర్యలు తీసుకోవటం పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. గత వారం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తిరుపతి పర్యటన నేపధ్యంలో, ఐఏఎస్ అధికారి బన్సల్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు స్వాగతం పలికి, దగ్గర ఉండి తిరుమల దర్శనం చేపించారు. అయితే ఆ తరువాత రోజే, ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆగ్రహానికి గురి అయ్యారు. ఆయన్ను వెంటనే బదిలీ చేసిన ప్రభుత్వం, చివరకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడిలో రిపోర్ట్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆయన నెల్లూరు జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిగా కూడా ఉన్నారు. కేవలం ఎలక్షన్ కమీషనర్ కు స్వాగతం పలికారని, ప్రభుత్వం ఇలా చేయటం పై, అందరూ షాక్ తిన్నారు. ఐఏఎస్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. అయితే ఇలాంటి చర్యలు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికార వర్గాలను, ప్రభుత్వం బెదిరింపు ధోరణికి నిదర్శనంగా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకోవటం పై,రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఇంకా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలు జరగాల్సి ఉండటం, అలాగే తరువాత మునిసిపల్ ఎన్నికలు కూడా ఉండటంతో, మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంది.

sec 08022021 2

దీనికి సంబంధించి, నిన్న రాత్రి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ప్రభుత్వం, ఇష్టం వచ్చినట్టు బదిలీ చేయటం కుదరదు అంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. సాధారణ బదిలీలు అయితే ఒకే కానీ, ప్రభుత్వం కావాలని చేసే బదిలీలు మాత్రం, సరైన కారణం చెప్పి, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని, ఆ తరువాతే బదిలీ చేయాలని, ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇటీవల ఎన్నికల పరిశీలుకుడిని అకారణంగా బదిలీ చేసినట్టు తమ దృష్టికి వచ్చింది, ఇక ముందు ఇలా జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలని, తమ అనుమతి తీసుకున్న తరువాతే బదిలీలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇటీవల కాలంలో, అధికారుల పై, ఎన్నికలు అయిన తరువాత చర్యలు ఉంటాయి అంటూ వస్తున్న బెదిరింపులు పై కూడా స్పష్టత ఇస్తూ, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దీని పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరూ రాజ్యాంగం ప్రకారం పని చేయాలనీ, ఉద్యోగులకు భరోసా ఇచ్చింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్.

Advertisements

Latest Articles

Most Read