విజయసాయి రెడ్డి అనే పేరు ఒకప్పుడు వైసీపీ పార్టీల మారుమొగి పోయేది. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా, విజయసాయి రెడ్డి పేరు వినిపించేది. విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్తే చాలు పని అయిపోతుంది అనే భావన వైసీపీ ఉండేది. విజయసాయి రెడ్డి అపాయింట్మెంట్ ల కోసం, పెద్ద పెద్ద నేతలు ఎదురు చూస్తూ ఉండే వారు. అప్పట్లో పేరుకు జగన్ నంబెర్ వన్ అయినా, మొత్తం నడిపించేది విజయసాయి రెడ్డి. అయితే రోజులు మారే కొద్దీ సీన్ కూడా మారిపోతూ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, విజయసాయి రెడ్డి హోదా పోయింది. ఆయన ప్లేస్ లో సజ్జల వచ్చారు. విజయసాయి రెడ్డిని మూడు జిల్లాలకు పరిమితం చేసారు. ఇప్పుడు ఆ మూడు జిల్లాల నుంచి కూడా పీకే పనిలో ఉన్నారు. ఇక విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు కూడా త్వరలో ముగిసిపోతుంది. విజయసాయి రెడ్డికి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి చాన్స్ ఇవ్వరు అనే ప్రచారం జరుగుతుంది. చివరకు విజయసాయి రెడ్డిని పార్టీలోని అన్ని విభాగాలకు ఇంచార్జ్ గా పరిమితం చేసారు. మొత్తంగా విజయసాయి రెడ్డి తోక కట్ చేసి, జగన్ వదిలేసారు. దీంతో విజయసాయి రెడ్డి తన ఇమేజ్ కాపాడుకోవటానికి చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని జగన్ ని తిడుతుంటే, విజయసాయి రెడ్డి జాబ్ మేళా అంటూ బయలుదేరారు.

vsreddy 8042022 2

అది కూడా కేవలం వైసీపీ కార్యకర్తలకే. కార్యకర్తలకు తానూ ఏదో చేసేస్తున్నా అనే ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పేరు తక్కువగా, విజయసాయి రెడ్డి పేరు ఎక్కువగా వచ్చేలా హడావిడి చేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియా టీంని ఉపయోగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా విజయసాయి తిరుపతిలో హడావిడి చేసారు. అయితే తిరుపతిలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు విజయసాయి వైపు కూడా వెళ్ళలేదు. భూమన, చెవిరెడ్డి వెళ్లి కలిసారు తప్పితే, ఇక ఏ నేత అటు వైపు కూడా చూడలేదు. డిప్యూటీ సియం నారాయణ స్వామి అక్కడే ఉన్నా, విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్ళలేదు. కొంత మంది మీడియా లేకుండా కలిసి వెళ్ళారు, మీడియా ఉంటే ఎందుకు అనుకున్నారో ఏమో మరి. విజయసాయి రెడ్డి వెంట, సోషల్ మీడియాలో హడావిడి చేసే గుర్రం లాంటి వాళ్ళు తప్ప, చెప్పుకోతగ్గ నేతలు ఎవరూ లేదు. మరి తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారమే నేతలు ఎవరూ కలవలేదా, లేదా మరేదైనా కారణమా అనేది తెలియాలి.

దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కోర్టులో దొంగతనం, మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం, నెల్లూరు జిల్లా కోర్టులో, కోర్టు రికార్డు రూమ్ తాళం బద్దలు కొట్టి, ఒకే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు దొంగలు ఎత్తుకు పోయారు. అయితే ఎత్తుకు వెళ్ళే క్రమంలో, కొన్ని కాగితాలు పడేసి వెళ్ళిపోవటంతో, విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కేసు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు ఆధారాలు కావటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి పై కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసారు. దీని పై విచారణ చేసిన పోలీసులు, ఫోర్జరీ చేసినట్టు నిర్ధారించి, కేసు పెట్టారు. ఈ కేసు వైసీపీ అధికారంలోకి రాగానే, ప్రభుత్వం కేసు క్లోజ్ చేసింది. అయితే హైకోర్టు మాత్రం ఊరుకోలేదు. అలా ఎలా క్లోజ్ చేస్తారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు పై విచారణ జూన్ నెలలో జరగనుంది. ఈ క్రమంలోనే, ఇప్పుడు కేవలం కాకానికి సంబంధించిన కేసు ఫైల్స్ మాయం అవ్వటంతో, అందరూ అవక్కయ్యారు. ఫోర్జరీ కేసు కావటంతో, ఇందులో ముఖ్యంగా ల్యాప్ టాప్, ట్యాబ్ చాలా కీలకం. అవే మాయం అయ్యాయి. దీంతో ఈ కేసు రాజకీయ కోణం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ విరుచుకు పడింది.

nellore 17042022 2

కాకాని కావాలనే మాయం చేపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసు పై పోలీసులు విచారణ చేసారు. ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీ దొంగతనం చేసిన వారికి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నెల్లూరు ఎస్పీ ఏమి చెప్తారా అని అందరూ ఎదురు చూడగా, ఆయన జరిగిన విషయం చెప్పుకొచ్చారు. ఈ దొంగలు ఐరన్ దొంగలు అని, పాత సామాన్లు ఎత్తుకు పోయే వారని, ఈ క్రమంలోనే వీరికి కోర్టు దగ్గర ఐరన్ ఉందని తెలుసుకుని, ఆ ఐరన్ దొంగ తనం కోసం ముందుగా కోర్టు వద్దకు వచ్చినట్టు చెప్పారు. అయితే అక్కడ కుక్కలు మొరగటంతో, భయపడి, కోర్టు లోపలకు వెళ్లి, అక్కడ రికార్డు రూమ్ తలుపు బద్దలు కొట్టి, బీరువాలో , కాకాని ఫైల్స్ కు సంబంధించి బ్యాగ్ ఉండటంతో, బ్యాగ్ లో ఏముందో కూడా చూడకుండా, ముందు అక్కడ నుంచి పారిపోయి, తరువాత ఆ బ్యాగ్ లో ఉన్న ల్యాప్ టాప్, ఫోన్ తీసుకుని, మిగతా కాగితాలు పడేసినట్టు చెప్పారు. అయితే నెల్లూరు ఎస్పీ గారు చెప్పిన విషయం పై, అనేక ప్రశ్నలు వస్తున్నాయి. నెల్లూరు పోలీసులు చెప్పిన విషయం నమ్మసక్యంగా లేదని ఇంటర్నెట్ లో అనేక ట్రోల్స్ వస్తున్నాయి.

చిరంజీవి, రాం చరణ్ నటించిన ఆచార్య సినిమా, ఈ నెల 27న రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఈ నేపధ్యంలోనే, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో చేయటానికి, చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడ సిద్ధర్దా గ్రౌండ్స్ లో, ఈ నెల 23 నిర్వహించటానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ ఈవెంట్ కు అనూహ్యంగా ముఖ్య అతిధిగా జగన్ మోహన్ రెడ్డిని పిలవాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా ఒప్పుకోవటంతో, దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ లోనే, జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేయాలని, చిరంజీవి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమా టికెట్ల అంశం పై, చిరంజీవి పలు మార్లు జగన్ తో భేటీ అయ్యారు. ఇతర హీరోలని కూడా జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆ తరువాత సినిమా టికెట్ ధరలు పెంచారు. ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేయాలని, చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆచార్య సినిమా నిర్మాత కూడా, జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన మోహన్ రెడ్డి సిబిఐ కేసులు చూసే లాయర్ గా, ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ఉన్నాడు. అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా, మొదటి నుంచి ఈ సినిమా పై ఇంట్రెస్ట్ తో ఉన్నారు.

pk 16042022 2

ముఖ్యంగా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి, జగన భేటీకి, నిరంజన్ రెడ్డి చొరవ చూపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో జగన్ తమకు సానుకూలంగా స్పందించారని చెప్పిన ఆచార్య చిత్ర యూనిట్, చిరంజీవితో, జగన్ మోహన్ రెడ్డికి ఘన సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా, పొలిటికల్ టచ్ తో, ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్ళుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండటంతో, ఈ ఈవెంట్ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. అయితే ఈ పరిణామం మాత్రం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది అనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు జగన్ ఆడనివ్వకుండా చేస్తున్నారు. ఇక పవన్ కూడా, జగన్ ని గెలవకుండా చూడటానికి వైసీపీ వ్యతిరేకత ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు సొంత అన్న, జగన మోహన్ రెడ్డిని పొగుడుతూ సన్మానం చేస్తే, ఆ పరిణామం , పవన్ కళ్యాణ్ కు ఇబ్బందిగా మారుతుంది. మరి ఈ అంశం పై, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న కాకాని వద్ద ఉన్న ఐజేఎం విల్లాలో నిన్న షేక్ మహ్మద్ అనే 25 ఏళ్ళ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతను ఏసి మెకానిక్ గా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఐజేఎం విల్లాలో, ఏసి మెకానిక్ పని చేసేందుకు వెళ్ళిన అతను, కళ్ళు తిరిగి పడిపోయాడు అంటూ, కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్ళింది. తరువాత కొద్ది సేపటికి, అతను చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటి అంటే, చనిపోయింది మంత్రి కాకానికి చెందిన విల్లాలో అని ప్రచారం జరుగుతుంది. కరెంటు షాక్ కొట్టి  షేక్ మహ్మద్ చనిపోయాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మంగళగిరి పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారని చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఈ వివరాలు గోప్యంగా ఉంచి, బయటకు వివరాలు వెళ్ళకుండా, మీడియాకు తెలియకుండా ఉంచటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం బయటకు పొక్కటంతో, విషయం వెలుగులోకి వచ్చింది. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంత్రి కాకాని, ఇప్పటికే కోర్టులో పత్రాల చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా బయటకు రావటంతో, ఆయన చుట్టూ వివాదాలు వస్తున్నాయి. పోలీసులు విచారణలో ఏమి చెప్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read