మంత్రి వర్గం మొత్తం మార్చేస్తున్నాం, ఇక మంచి రోజులు వస్తున్నాయి అంటూ, వైసీపీ హడావిడి చేసింది. ఇక కొడాలి నాని లాంటి మంత్రులు అయితే, మంత్రి వర్గంలో సమర్ధులు కావాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, సమర్ధులకు చోటు ఇస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక మంత్రి వర్గం సమర్ధులతో నిండి పోతుంది, పండగే పండగ అని ప్రజలు అనుకున్నారు. కానీ కొత్త మంత్రి వర్గం ఏర్పాటు అయిన రెండో రోజే ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో మార్చాల్సింది మంత్రుల్ని కాదు, ప్రభుత్వాన్ని అని ప్రజలు అనుకుంటున్నారు. కొత్త మంత్రి వర్గం వచ్చినా అప్పుల ప్రవహం ఆగలేదు. మంత్రి వర్గం ప్రమాణస్వీకారం అయిన రోజే, రూ.2000 కోట్ల కొత్త అప్పు తీసుకున్నారు. ఇక పన్నులు బాదుడు కొనసాగుతూనే ఉంది. పరిశ్రమలు వాడే కరెంటు పై సుంకం పెంచారు. గృహాలకు వాడే విద్యుత్ సామర్ధ్యానికి మించి వాడితే, దానికి చార్జ్ వేస్తున్నారు. మీసేవా చార్జీలు పెంచారు. ఇలా పక్క అప్పులు, మరో పక్క పన్నుల బాధతో వాయిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందుల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉందో తెలిపే సంఘటన నిన్న తిరుపతిలో జరిగింది. హృదయ విదారకరమైన వార్తలు నిన్న తిరుపతి నుంచి వచ్చాయి.

jagan 13042022 2

పరిపాలన సరిగ్గా లేక పోతే, పరిపాలన తెలియక పోతే, పాలకుల్లో ముందు చూపు లేకపోతే ఏమి జరుగుతుందో, నిన్న తిరుపతిలో చూసాం. వెంకన్న దర్శనం కోసం, సహజంగానే వేసవిలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు క-రో-నా కూడా తగ్గిపోవటం, వరుస సెలవులు ఉండటంతో, భక్తులు పోటెత్తారు. సర్వ దర్శనం కోసం అనేక మంది వచ్చారు. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించటంలో, ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. అంత మంది భక్తులు వస్తారని తెలిసినా, ముందే సరైన ఏర్పాట్లు చేయలేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. కనీసం పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఎక్కడా షల్టర్లు లేవు, కనీసం మంచి నీళ్ళు ఇచ్చే నాధుడు కూడా లేడు. తిరుమల లాంటి చోట కూడా, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. చేతకానితనంతో, భక్తులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మీడియా ముందు, గొప్పలు చెప్పే ప్రభుత్వ పెద్దలు, ఇలాంటి వాటి గురించి ఏమి చెప్తారో మరి. మంత్రులు మారిపోయారు, అద్భుతాలు జరుగుతాయని ప్రజలను నమ్మించి, చివరకు మళ్ళీ అదే చేతాకని పాలన కొనసాగిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో, కొంత మందిని కొన్ని పనులకు మాత్రమే వాడేవారు. వాళ్ళ శాఖల్లో పనులు కంటే, వేరే పనులకే మంత్రులను ఉపయోగించుకునే వారు. మరి వీరి శాఖ సంగతి ఏంటి అనుకుంటున్నారా ? అన్ని శాఖలు చూసేది ఒకరే కాదా, ఆయన చూసుకునే వారు. మంత్రులను మాత్రం, రాజకీయాలకు మాత్రమే వాడుకునే వారు. కొడాలి నానిని కమ్మోళ్ళ మీదకు, పేర్ని నానిని కాపుల మీదకు వదిలేవారు. ఎప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినా, లోకేష్ మాట్లాడినా, గంటలోపే కొడాలి నాని రంగంలోకి దిగి, ఉచ్చ నీచాలు మరిచి, అమ్మలక్కలు తిట్టి, విషయం ఏమి లేకుండా, కేవలం బూతులు తిట్టి, చెమటలు కక్కుకుంటూ ప్రెస్ మీట్ ముగించే వారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడతే చాలు, మా కాపోడు అంటూ, డైరెక్ట్ గా కులం పేరు పెట్టి, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి, పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడేవారు. కొడాలి నాని లాగా బూతులు లేకపోయినా, వెటకారంగా తీసి పడేసే వారు. మూడేళ్ళ పాటు, ఈ ఇద్దరు మంత్రుల ఉద్యోగాలు ఇవే. అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో, పేర్ని నాని, కొడాలి నానిని, జగన్ మోహన్ రెడ్డి పీకి పడేసారు. ఏదో ఒక రోజు జగన్ మోహన్ రెడ్డి, ఇలా బూతులు తిట్టించి, వాడుకుని వదిలేస్తాడు అని అందరూ అనుకున్నట్టే జరిగింది.

perninani 13042022 2

వీరి బూతు స్థానాలకు ఎవరూ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది, కొంత మంది మంత్రులు చార్జ్ కూడా తీసుకున్నారు. అయితే, నిన్న పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి పాలనలో చనిపోయిన రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి, వారికి పార్టీ తరపున కొంత సాయం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, జగన్ పై విరుచుకు పడ్డారు. తనని చంద్రబాబు దత్త పుత్రుడు అంటే, జగన్ ని సిబిఐ దత్తపుత్రుడు అంటానని, తనని టిడిపి బి-టీం అంటే, మిమ్మల్ని చర్లపల్లి షటిల్ టీం అనాల్సి వస్తుంది అంటూ, ఘాటుగా స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ కు వైసీపీ వైపు నుంచి కౌంటర్ ఇచ్చే వాళ్ళే లేకుండా పోయారు. పేర్ని నాని ఉండి ఉంటే, గంటలోనే ప్రెస్ మీట్ పెట్టి విరుచుకు పడేవారు. ఇప్పుడు మంత్రి పదవి నుంచి పీకి పడేయటంతో, నాకు ఎందుకులే అని ఆయన మాట్లాడ లేదు. ఇక కొత్త మంత్రులలో కాపుల్లో అంబటి ఫేమస్. ఆయన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాటల పై కౌంటర్ ఇవ్వలేదు. మొత్తానికి పేర్ని నాని లోటు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా భర్తీ చేస్తారో మరి.

తమ్మినేని సీతారాం తన వ్యవహార శైలితో రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిని దిగజార్చుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ద్వజమెత్తారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ....తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి దక్కలేదని జగన్ పై ఉన్న అక్కసు టీడీపీపై వెల్లగక్కడం ‍హాస్యాస్పదం. తనకు పదవులు అవసరం లేదని అంటున్న తమ్మినేని దమ్ముంటే స్పీకర్ ‎ పదవికి రాజీనామా చేయాలి. ఏ ఎండకు ఆగొడుకు పట్టే ఊసరవెళ్లి తమ్మినేని సీతారాం. స్పీకర్ పదవి పోతుందన్న భయంతోనే ‎టీడీపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. గతంలో టీడీపీపై అవాకులు చెవాకులు పేలిన కొడాలి నాని, పేర్నినానిల పరిస్థితి ఏంటో స్పీకర్ గమనించాలి. మంత్రి వర్గ విస్తరణలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని తమ్మినేని అంటున్నారు. దళిత మహిళను మంత్రి పదవి నుంచి తొలగించటం ఏ సామాజిక న్యాయమో చెప్పాలి? సామాజిక న్యాయం పాటిస్తే జగన్ ని వైసీపీ కార్యర్తలే ఎందుకు తిడుతున్నారు? టీడీపీ హయాంలో కళింగ సామాజికవర్గానికి 9 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. కానీ జగన్ రెడ్డి పాలనలో ఆ సామాజికవర్గానికి ఏం న్యాయం జరిగింది? మంత్రివర్గ విస్తరణ దామాషా ప్రకారం కాదు తమాషాగా జరిగింది. ఓసీల్లో వైశ్యులు, బ్రాహ్మణులు వంటి అగ్ర కులాలు ఈ రాష్ట్రంలో లేరా? వారికి పాలనలో ప్రాతినిధ్యం అక్కర్లేదా? జగన్ రెడ్డి డమ్మీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పెత్తనమంతా సకలశాఖమంత్రి సజ్జలకు కట్టబెట్టారు. డమ్మీ మంత్రి పదవులు, కుర్చీలు లేని కార్పోరేషన్ల వల్ల బీసీలకు ప్రయోజనం ఏంటి? కార్పోరేషన్లకు కనీసం ఒక్క రూపాయి ఖర్చు చేశారా?

tammineni 12042022 2

బీసీగా పుట్టిన తమ్మినేని జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటం సిగ్గుమాలిన చర్య. జగన్ రెడ్డి మాయమాటలు, తమ్మినేని తమ్మా బుసు మాటలు వినేందుకు రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. చేతకాని అవినీతి, అసమర్ద‎ వైసీపి నేతలకు టీడీపీని విమర్శించే నైతిక అర్హత లేదు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చి రాజ్యాధికారం వైపు నడిపించిన పార్టీ టీడీపీ. టీడీపీ హయాంలో సంక్షేమ పధకాలు అమలు చేయలేదా? ప్రతినెలా ‎ 54 లక్షల మందికి ఫించన్లు ఇవ్వలేదా? ఇప్పుడు ఫించన్లు జగన్ తన తాత ఆస్తిలో నుంచి ఏమైనా ఇస్తున్నారా? టీడీపీకి డిపాజిట్లు రావని తమ్మినేని అంటున్నారు, తనకు దమ్ముంటే రాజీనామా చేయ్ , నిన్ను ఆముదాల వలస ప్రజలు పంచ ఊడదీసి పరిగెత్తించేందుకు సిద్దంగా ఉన్నారు. ‎ ఆముదాల వలసలో తండ్రి కొడుకుల అవినీతి, అరాచకాలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మీ ఇసుక దోపిడి, ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులు తీసుకున్న డబ్బులు ఇవన్నీ ప్రజలకు తెలియవనుకుంటున్నారా? రాష్ట్రంలో ఏ1 ఇసుక డాన్ తమ్మినేని ఇసుక అక్రమ రవాణాతో రోజుకు రూ. కోటి దోపిడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలసలో తమ్మినేనిని ప్రజలు పంచఊడదీసి తరమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని, ‎ టీడీపీ 160 సీట్లు గెలవటం ఖాయమని కూన రవికుమార్ అన్నారు.

ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆత్మ-హ-త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి నేతల పై ,జగన్ పై  తీవ్ర విమర్శలు చేసారు.  తానూ ఎప్పుడూ రాజకీయ పరంగానే విమర్శ చేస్తాను తప్పితే  వ్యక్తిగత విషయాల పై విమర్శించను అని చెప్పుకొచ్చారు.  తానూ ఎప్పుడూ పాలసీల గురించి మాట్లాడుతాను  తప్పితే వైసిపి లాగా దిగజారి మాట్లాడను అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయాల గురించి వైసిపి పార్టీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గురించి జగన్ నిన్న పవన్ కళ్యాన్ సిబియన్  దత్త పుత్రుడని విమర్శించిన సంగతి తెలిసిందే. దీని పై  ఈ రోజు పవన్ కళ్యాణ్ జగన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తనని ఇంకోక్కసారి సిబియన్ దత్త పుత్రుడని పిలిస్తే తానూ కూడా జగన్ సిబిఐ దత్తపుత్రుదని పిలవాల్సి ఉంటుందని ఘాటుగానే విమర్సించారు. అలాగే మా జనసేన పార్టీని టీడీపీ బీ-టీమ్ అంటే నేను వైసిపిని చర్లపల్లి షటిల్ టీం అనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్థిక నేరాలు చేసి కోర్టులు చుట్టూ తిరిగే మీకు మా జనసేన పార్టీ గురించి కాని, నా వ్యక్తగతం గురించి కాని విమర్సించే అర్హతే లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Latest Articles

Most Read