వైసీపీ నేతలు ఎవరినీ వదలటం లేదు. అందిన కాడికి దోచుకునే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. అవినీతి సెంట్రలైజ్ అవ్వటం, తమకు మద్యం, ఇసుక, మట్టి, ఇలా దేంట్లో కూడా వాటా లేక పోవటంతో, వైసీపీ నేతలు సామాన్య ప్రజల పై పడి పీక్కుతింటున్నారు. అయితే మొన్నటి వరకు సామాన్య ప్రజలనే టార్గెట్ చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఈ సమాజాన్ని రక్షించే పోలీస్ లని కూడా వదిలిపెట్టటం లేదు. ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి స్థాలనికే ఎర్త్ పెట్టాడు, వైసీపీ ఎంపీ. ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఫిర్యాదు చేయటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ కె. మధు, ఎంపీ పైన ఫిర్యాదు చేసారు. ఎంపీ తన స్థలాన్ని కబ్జా చేసారని కంప్లైంట్ ఇచ్చారు. తన స్థలం కబ్జా చేసుకోవటమే కాక, అందులో రోడ్డు కూడా వేసేసారని, విశాఖ నార్త్ ఏసీపీ సీహెచ్ శ్రీనివాసరావుకు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. 531 గజాల స్థలాన్ని 2016లో ఎస్పీ కొనుగోలు చేసారు. అయితే ఆ స్థలంలో నిర్మాణం చేయాలని భావించి, 2018లో దరఖాస్తు చేసుకోగా, ఈ భూమిలో ప్రభుత్వ స్థలం కలిసి ఉందని జీవీయంసీ గతంలోనే ఆ అప్లికేషన్ తిరస్కరించింది. అయితే ఈ స్థలం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఈ స్థలాన్ని ఆనుకుని, వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్థలం కూడా ఉంది. అక్కడ ఎంపీ లేఅవుట్ వేయించారు. అయితే పక్కనే ఉన్న ఎస్పీ స్థలాన్ని అక్రమంగా తీసుకుని, తన లేఅవుట్ కోసం రోడ్డు వేయించాడు ఎంపీ. అయితే విషయం తెలిసిన ఎస్పీ, తన స్థలం వద్దకు వెళ్లి, తన స్థలంలో ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేసాడు. కూలీలను తీసుకుని వెళ్లి పనులు ప్రారంభించాడు. వెంటనే విషయం తెలుసుకున్న ఎంపీ అనుచరలు, అక్కడకు వచ్చి, ఈ స్థలం మదని, ఎస్పీని బెదిరించారు. ఇదే సమయంలో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి, స్థలం కాగితాలు తీసుకుని స్టేషన్ కు రావాలని చెప్పారు. దీంతో చేసేది ఏమి లేక, ఎస్పీ అక్కడ నుంచి వచ్చేసారు. తరువాత జరిగిన విషయం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ విషయం పెద్దది అవ్వటం,మీడియాలో రావటంతో స్పందించిన వైసీపీ ఎంపీ, ఆ స్థలం తనదే అని, కావాలనే ఆయన ఇదంతా చేస్తున్నారు అంటూ, వివరణ ఇచ్చారు.