ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి, ప్రజలను బాగుపెట్టటం కోసం కాకుండా, ప్రజలను బానిసలు చేసే పిచ్చ పిచ్చ పధకాలు పెట్టి, నాశనం అయిన దేశాల్లో మొన్నటి దాకా వెనెజులా గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ లిస్టులో తాజాగా శ్రీలంక వచ్చి చేరింది. మన కళ్ళ ముందే పర్యాటక ప్రదేశంగా కళకళలాడుతూ ఉండే శ్రీలంక, ఒక అసమర్ధుడి చేతిలో పడి, ఆదాయం సంపాదించటం చేతకాక, ఉన్న వనరులు మొత్తం ఖాళీ చేసి, చివరకు అప్పులు పాలు అయ్యి దివాలా తీసింది. ఈ ప్రత్యక్ష ఉదాహరణలు చూసిన తరువాత, మన పరిస్థితి కూడా ఇలా అవ్వటానికి ఎంతో దూరంలో లేదని, మన దేశ ఉన్నాతాధికారులు విశ్లేషించారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆదాయ మార్గాలు, అభివృద్ధి అనేది మర్చిపోయి, కేవలం అప్పులు చేస్తూ, పిచ్చి పిచ్చి ప్రాజాకర్షణ పధకాలు పెట్టి, ప్రజలను మోసం చేయటమే కాకుండా, దేశాన్ని కూడా నాశనం చేస్తున్నాయి అంటూ, ఉన్నతాధికారులు నిన్న ప్రధాని మోడీని నివేదిక ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉన్న, విపరీతంగా అప్పులు చేసి, ప్రజలను మభ్యపెడుతూ మాయ చేస్తున్నాయని ప్రధాని మోడీకి తెలిపారు. ఇలాంటివి ఇప్పుడు బాగానే ఉంటాయని, దీర్ఘకాలంలో ఇలాంటి పనులు చేసినందుకు, రాష్ట్రాలు కోలుకోలేని విధంగా దెబ్బ తింటాయని ప్రధానికి వివరించారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆదాయం లేకపోయినా, విపరీతంగా అప్పులు చేసి, పెడుతున్న పనికిమాలిన పధకాలతో, త్వరలోనే శ్రీలంక లాంటి ఆర్ధిక సంక్షోభం ఆయా రాష్ట్రాలలో రావటానికి ఎంతో దూరంలో లేదని అన్నారు.
శనివారం రాత్రి ప్రధాని కార్యాలయంలో, దాదాపుగా నాలుగు గంటల పాటు, వివిధ శాఖల కార్యదర్శులతో ప్రధాని మోడి భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర లాంటి అధికారులు కూడా పాల్గున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న పలు విషయాలు, వాటి వల్ల దేశానికి జరుగుతున్న నష్టం పై చర్చించారు. అభివృద్ధికి రాష్ట్రాలు ప్రాధాన్యత ఇవ్వాలని, భారీ అభివృద్ధి పధకాలను అలక్ష్యం చేయొద్దని ప్రధానికి చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అప్పులు, పధకాలు అనేవి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే, దేశం ఆర్ధికంగా దెబ్బ తింటుందని అన్నారు. శ్రీలంక లాంటి పరిస్థితి మనకు రాక ముందే మేల్కోవాలని అన్నారు. సీనియర్ అధికారులు చెప్పిన విషయాలు, మోడీ సావధానంగా విన్నారు. అయితే అధికారులు చెప్పిన ఆ రాష్ట్రాల్లో, ఏపి మొదటి వరుసలో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆదాయం, అభివృద్ధి, పెట్టుబడులు గురించి ఆలోచించకుండా, కేవలం అప్పులతో రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం. కనీసం ప్రధాని ఇప్పటికైనా, జగన్ మోహన్ రెడ్డి గారికి సరైన సలహాలు ఇచ్చి, రాష్ట్రాన్ని గాడిలో పెడతారని ఆశిద్దాం.