22వ తారిఖు జరిగే వినాయక చవతి ఉత్సవాల పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రగడ నెలకొంది. వినాయక చవతి ఉత్సవాల పై ఏపి ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఎక్కడ పందిరిలో పెట్టుకోకూడదు అని, ఇంట్లోనే పండుగ చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలు అయి చాలా రాజులు అయ్యింది, సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ కూడా తెరుస్తాం అంటున్నారు, బౌతిక దూరం పాటిస్తూ, పర్మిషన్ ఇవ్వచ్చు కదా అనే కామెంట్లు వస్తున్నాయి. లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి, బౌతిక దూరం పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుని, వినాయక చవతికి పర్మిషన్ ఇవ్వాలని కొంత మంది కోరుతున్నారు. అయితే హిందువులు తరుపున మాట్లాడే బీజేపీ, తెలంగాణాలో ఒకలా, ఏపిలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంది. ఏపి ప్రభుత్వం చెప్పినట్టు, ఏపి బీజేపీ సోము వీర్రాజు చెప్పారు. అయితే తెలంగాణా బీజేపీ మాత్రం, అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో సోము వీర్రాజు, ఏపి ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల పై రఘురామరాజు స్పందించారు. ఆయన మార్కు వెటకారంతో, సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు.
ఆయన మాట్లడుతూ "అందరికీ వినాయకుడు అంటే అందరికీ ఇష్టమే. మన పక్క రాష్ట్రం తెలంగాణాలో బండి సంజయ్ గారు, హిందూ సంప్రదాయలు ప్రతిబంబించే లాగా, గణేష్ ఉత్సవాలు మనం నిర్వహించుకోవాలి, బౌతిక దూరం పాటిస్తూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, ఆచారాన్ని కూడా కాపాడుకుందాం అని చెప్పారు. నేను ఉదయం బండి సంజయ్ తో మాట్లాడాను. మీ ఆంధ్రాలో కూడా మా బీజేపీ వాళ్ళు ఇలాగే అడుగుతున్నారా అని అడగటం జరిగింది. అయితే దానికి నేను సమాధానం చెప్తూ, ఆంధ్రా బీజేపీ వేరు, తెలంగాణా బీజేపీ వేరు అనే భావన వార్తలు చూస్తే తెలుస్తుంది. మీ ఏపి బీజేపీ అధ్యక్షుడు, ఏపి ప్రభుత్వం చెప్పినట్టే, ఒక్క పూట మాత్రమే చెయ్యాలి అంటూ ఏదో నియమావళి ఇచ్చారు. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావటం లేదు. ఒక జాతీయ పార్టీకి, రెండు విధానాలు ఏమిటో అర్ధం కావటం లేదు. కానీ ఈ రకంగా, హిందూ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఇలా హిందూ పండుగల పై ఇలా చెప్పటం బాధ కలిగిస్తుంది. ఇది మా దురదృష్టం" అంటూ కౌంటర్ ఇచ్చారు.