ఒక పక్క అమరావతి విషయం పై, రాష్ట్ర బీజేపీలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర బీజేపీలో అమరావతి పై ఒక్క అభిప్రాయంతో లేరు. ఒకరేమో కేంద్రానికి సంబంధం లేదు అంటారు. మరొకరు ఏమో అమరావతి రాజధాని, కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది అంటారు. మరొకరు ఏమో అమరావతి రాజధానిగా ఉండాలి, కర్నూల్ లో హైకోర్టు రావాలి అంటారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, రాష్ట్ర బీజేపీలో మాట్లాడుతున్నారు. అసలు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు అని చెప్తారు. మరో పక్క కేంద్రం కూడా మొన్న హైకోర్టుకు అఫిడవిట్ లో, గత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మూడు రాజధానులు అంటూ, బిల్లు ఆమోదించింది అంటూ, కోర్టుకు తెలిపారు. మరో పక్క అమరావతికి 2500 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇలా ఇక్కడ రాష్ట్ర బీజేపీ కానీ, కేంద్రం కానీ, అమరావతి విషయంలో కన్ఫ్యూషన్ చేస్తూనే ఉన్నారు.
మొన్నటి దాకా అమరావతి రైతులకు కేంద్రం, జగన్ కు కట్టడి వేస్తుంది అనే నమ్మకం ఉండేది. బిల్లులు గవర్నర్ ఆమోదించటంతో, కేంద్రంలోని బీజేపీ కూడా గేం ఆడుతుంది అని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కన్ఫ్యూషన్ కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు కేంద్రంలో సర్వే అఫ్ ఇండియా శాఖ, తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కు లేఖ రాసింది. 2019 నవంబర్ 21న, గల్లా జయదేవ్ పార్లమెంట్ అమరావతి మ్యాప్ లో ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్న వేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి సర్వే అఫ్ ఇండియా లేఖ గల్లాకు లేఖ రాసింది. దెస పొలిటికల్ మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పెట్టమని, ఇంగ్లీష్ మ్యాప్ 9వ ఎడిషన్ లో, హిందీ యమప్ 6 వ ఎడిషన్ లో అమరావతిని రాజధానిగా గుర్తించినట్టు లేఖలో తెలిపారు. మొత్తంగా అమరావతి విషయం పై, కేంద్రం వైఖరిలో కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉంది.