ఇది మూడు గంటల సినిమా కాదు... ఇలా ఒక పాటలో, జీరో నుంచి, హీరో అయ్యి, నాలుగు పంచ్ డైలాగ్ లు చెప్పి, జేజేలు కొట్టించుకోటానికి... ఇది వాస్తవం... దగా పడ్డ ఆంధ్రుడిని ముందుండి, తన కష్టంతో, తన తెలివితేటలతో, మన రాష్ట్రానికి జరుగుతున్న పునర్నిర్మాణం... 67 ఏళ్ళ వయసులో, తన కుటుంబాన్ని వదిలి, 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, ఢిల్లీ చేస్తున్న కుట్రలు, మన రాష్ట్రంలోని తోడేళ్ళను తట్టుకుని, నిలబడి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు గారి సత్తా... అందుకే ఆయన్ను రీల్ హీరో కాదు, నిజమైన హీరో అంటుంది... ఈ నిజమైన హీరోని చూసి, ఆటోమొబైల్ దిగ్గజం హీరో కంపెనీ మన రాష్ట్రానికి వస్తుంది...

hero 20032018 2

ఎన్నో అడ్డంకులు దాటుకుని, మార్చి 23న ప్లాంట్ కు శంకుస్థాపన చెయ్యనున్నారు... హీరో కంపెనీ తమ ప్లాంటును దక్షిణభారతదేశంలో పెట్టడానికి సిద్ధమవగానే ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచాయి. ఈ ప్రాజెక్టును పట్టుబట్టి సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారు. సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

hero 20032018 3

హీరో మోటార్స్‌ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2019 చివర నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు. 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి. 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు. విడిభాగాల తయారీ యూనిట్‌ రూ.1600 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది.

విభజన హామీల్లో మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, ఇచ్చిన కొంచెం కూడా వెనక్కి తీసుకుంటున్నారు... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన రూ.350 కోట్లు విడుదల చేశారు. కానీ... ప్రధాని ఆమోదం లేదంటూ వెంటనే మొత్తం డబ్బు వెనక్కి తీసుకున్నారు... ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... ఇదే విషయం పై, ఈ రోజు అసెంబ్లీలో ఏకి పడేసారు..

modi 20032018 3

ఎన్నడూ లేని విధంగా నిధులు వెనక్కి తీసకోవడంపై టీడీపీ సభ్యులు బీజేపీ సభ్యులను నిలదీశారు. దీనిపై స్పందించిన బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఇందులో కేంద్రం నాయకుల ప్రమేయం లేదని, టెక్నికల్ సమస్యవల్ల ఇదంతా జరిగిందని అన్నారు. దీంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఎదురుదాడికి దిగారు. రాష్ట్ర ఖజానాకు వచ్చిన నిధులను పీఎంవో వెనక్కు తీసుకోవడం ఎప్పుడూ జరగలేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి లేదని చూపించి వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు.

modi 20032018 2

రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయని, చట్టాల ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఇవ్వాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఆ నిధులు రాష్ట్రానికి రావాల్సిన హక్కని, వెనుకబడిన జిల్లాలకు నిధుల్ని చట్టం ప్రకారం కేటాయించాల్సిందేనని, దాన ధర్మాలు చేసేది కాదని, కొన్నేళ్లు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణడు అన్నారు. యూసీలు సమర్పించకపోతే అసలు నిధులే కేటాయించరని ఆయన తెలిపారు.

హైదరాబాద్ నుంచి వచ్చి, గుంటూరులో సభ పెట్టి, మళ్ళీ హైదరాబాద్ చెక్కేసిన పవన్ కళ్యాణ్, మొన్న మీటింగ్ లో చేసిన ఆరోపణల పై మంత్రి నారా లోకే్శ్‌ స్పందించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా అమరావతిలో ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతుంటే, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి హైదరాబాద్‌లో కూర్చున్న వారికి ఏం తెలుస్తుందని అని లోకేష్ అన్నారు... చంద్రబాబుకు రెండున్నర మార్కులు ఇవ్వడానికి పవన్‌ ఎవరు, హైదరాబాద్‌లో ఉండేవారికి చంద్రబాబు పడే కష్టం ఏం తెలుస్తుంది? అంటూ పవన్ పై మండి పడ్డారు.... కేరాఫ్‌ రాజధాని లేని రాష్ట్రానికి ఒక రూపు తీసుకువచ్చింది ఎవరు? 8 శాతం ఉన్న వృద్ధిరేటును 12 శాతానికి తీసుకువచ్చింది ఎవరు? అంటూ చంద్రబాబు పరిపాలన పై పవన్ చేసిన విమర్శలకు లోకేష్ స్పందించారు ...

lokesh 20032018 2

చంద్రబాబు పడే కష్టాన్ని విమర్శిస్తుంటే ఎంతో బాధపడ్డా అని, ఏపీ ప్రజలు తెలివైన వారని, ఎవరేంటో వాళ్లకు తెలుసుని, చంద్రబాబు పరిపాలన పై, పవన్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదని ఆయన అన్నారు... జగన్ పార్టీ చేసినట్టు, దిగజారుడు రాజకీయాలు విచారకరమని, నాతో ఫొటోలో ఉంది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని లోకేష్ అన్నారు. పెద్ది రామారావును శేఖర్‌రెడ్డి అని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు... అలాగే పోలవరం అవినీతి పై పవన్ మాటలకు స్పందిస్తూ "పోలవరంలో ఒక్క టెండరైనా తెదేపా ప్రభుత్వం ఇచ్చిందా.. ఒక్క టెండరు కూడా తెదేపా ప్రభుత్వం ఇచ్చింది కాదు... పోలవరం భూనిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు వెళ్లాయి... నా ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? పోలవరంలో పెట్టే ప్రతి ఖర్చు, పోలవరం అథారటీ పెడుతుంది... అది కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది... ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది ? " అంటూ లోకేష్ స్పందించారు...

lokesh 20032018 3

తను అవినీతి చేశానంటూ పవన్ చేసిన ఆరోపణల పై కూడా లోకేష్ స్పందించారు " ఎవరో దుమ్మేస్తే నేను దులుపుకోవాలా? జగన్‌పై మేము చేసే ఆరోపణలపై రుజువులతో సహా చూపాం.. నిరాధారమైన ఆరోపణలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు... పవన్‌ వద్ద నిజంగా ఆధారాలుంటే ఒక్కరోజులోనే మాట ఎలా మారుస్తారు... ఆధారాలు ఉంటే కేసు వేసుకోండి... సీబీఐ విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారు... సీబీఐ విచారణ దేనిపై వేస్తారు.. వేసుకుంటే వేసుకోనివ్వండి... తప్పు చేయనప్పుడు మాకు భయమెందుకు... మా తాతకు చెడ్డపేరు తెస్తున్నానని ఆరోపించడం బాధ కలిగించింది... నా ఫోన్‌ నంబరు పవన్‌కల్యాణ్ వద్ద ఉంది... నా గురించి ఎవరో.. ఏదో.. అనుకుంటున్నారంటే అది నాకే చెప్పవచ్చు కదా... బహిరంగ సభలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటికి విలువేం ఉంటుంది" అంటూ లోకేష్, పవన్ చేసిన అవినీతి ఆరోపణల పై స్పందించారు...

రోజుకి ఒక నేషనల్ మీడియా ఛానల్ లో, మోడీ మీద తన స్వామి భక్తి చాటుకుంటున్న పవన్ కళ్యాణ్, ఈ రోజు కూడా మోడీని ఆకాశానికి ఎత్తేసారు... ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, పవన్ మాట్లాడుతూ "మోడీ అంటే తనకు చాలా ఇష్టం అని, దాంట్లో డౌటే లేదని " అంటూ తన అభిప్రాయం చెప్పారు... ఒక పక్క, రాష్ట్రం అంతా, మోడీ అన్యాయం చేసాడు అని, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దాకా, మోడీని బూతులు తిడుతుంటే, పవన్ కళ్యాణ్ పదే పదే... జాతీయా మీడియాకు ఎక్కి, మోడీని ఆహా, ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించారు...

pawan modi 20032018

మోడీ అంటే ఇష్టం అని, దాంట్లో డౌటే లేదంటూ, కాని ప్రజలు బీజేపీ పై కోపంగా ఉన్నారు కాబట్టి, నేను కూడా పోరాడాల్సి వస్తుంది అని, అందుకే ఏపీలో బీజేపీ బాగా బలహీనపడిందన్నారు (అక్కడికి బీజేపీకి ఎదో ఒక వంద సీట్లు బలం ఉన్నట్టు)... పవన్ కళ్యాణ్ వరుసగా మోడీని పొగిడేస్తున్నారు... ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ లో, మోడీ అసలు స్పెషల్ స్టేటస్ ప్రామిస్ చెయ్యలేదని అన్నారు.. నిన్న, స్పెషల్ స్టేటస్ పెద్ద సమస్య కాదని, డబ్బులు ఇస్తే చాలు అంటూ, ఏ నోటితో అయితే పాచి పోయిన లడ్డులు అన్నారో, అవే పాచి పోయిన లడ్డులు కావాలని అంటున్నారు... ఈ రోజు ఏకంగా, మోడీ అంటే చాలా ఇష్టం అని, డౌటే లేదు అంటూ నొక్కి మరీ చెప్తున్నారు...

pawan modi 20032018

ఒక పక్క, మోడీ మీద నమ్మకం లేదని, మోడీ పై అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు, దేశం అంతటా వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నారు... మరో పక్క, పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాకు ఎక్కి, చంద్రబాబు అవినీతి చేసారని, ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో విఫలం అయ్యింది అని, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్తూనే, మోడీ అంటే చాలా ఇష్టం అని చెప్తూ, మోడీ మీద యుద్ధం చేస్తున్న చంద్రబాబుని బలహీన పరుస్తున్నారు... అయితే, ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం ఒక్కటే, పవన్ కళ్యాణ్ ఇంతలా ఎందుకు మోడీకి లొంగిపోయాడు ? ఇదే ప్రశ్న ? మరీ ఇంతలా పవన్ ఎందుకు, ఢిల్లీకి బెండ్ అయిపోయాడు ? అసలు విషయం ఏంటి అనేదాని పై, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read