ఢిల్లీ పెద్దలు, పూర్తిగా వదిలేసారు... రాష్ట్రానికి రూపాయి కూడా అదనంగా ఇవ్వకూడదు అనే నిబంధన పెట్టుకున్నారు... చంద్రబాబుని సాధించాలి, తద్వారా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టి, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలి, ఇది బీజేపీ పెద్దల తీరు... ఈ కోవలోకే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి హ్యాండిచ్చింది... కందుల కొనుగోలు పరిమితిని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం స్పందించలేదు. రాష్ట్రంలో ఈ ఏడాది కందుల దిగుబడి గతం కంటే బాగా వచ్చింది. రాయలసీమకు నీరివ్వడం, వాతావరణం అనుకూలించడంతో దాదాపు 2లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి రావొచ్చని అంచనా.

cbn kendram 19032018 2

అయితే వీటికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. కేవలం 45,200 మెట్రిక్‌ టన్నుల వరకే గిట్టుబాటు ధర ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రైతుల కోసం ఆ భారం భరించాలని, మిగిలిన 1.5లక్షల మెట్రిక్‌ టన్నులను కూడా మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరైన ఆయన దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.

cbn kendram 19032018 3

ప్రస్తుతం కందుల మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450గా ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌లో ధర రూ.4వేల వరకే ఉంది. మార్కెట్‌ ధర, మద్దతు ధర ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. కానీ కేంద్రం పెట్టిన మెలిక కారణంగా ఇప్పుడు రాష్ట్రమే మొత్తం వ్యత్యాసాన్ని భరించాల్సి ఉంటుంది. ఒక్కో రైతునుంచి 25క్వింటాళ్లకు మించకుండా కందులను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.200కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని కరువు మండలాల్లో 50రోజుల అదనపు పనిదినాలను కల్పించే ఫైలుపైనా చంద్రబాబు సంతకం చేశారు.

ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఏంటో కాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మైండ్ పోతుంది... ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదని, దానికి సమానమైన డబ్బులు ఇస్తే చాలని, ఈ రోజు ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఒక పక్క రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, వెంటనే బీజేపీ, ఆ వ్యాఖ్యలను స్వాగాతించటం, మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.. వీరి ఇద్ది మధ్య ఎంత, బంధం ఉంది అనటానికి ఇదే ఒక ఉదాహరణ... న్యూస్ 18 ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, పవన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కాదని.. పేరు ఏదైనా ఆర్థిక సాయం అందడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

bjp pawan 19032018 3

అయితే, ఇదే విషయం, చంద్రబాబు చెప్పినప్పుడు, మాకు ఎంత సమానమైన ప్యాకేజి ఇచ్చినా, మాకు అవసరం లేదని, అవి పాచిపోయిన లడ్డులు అని పవన్ చెప్పిన వ్యాఖ్యలు గుర్తుకువస్తున్నాయి... మరి పవన్, ఇలా ఎందుకు ట్యూన్ మార్చారు ? బీజేపీకి ఇంతలా ఎందుకు లొంగిపోయారో, ఆయనేకే తెలియాలి... అయితే, పవన్ ఇలా ఈ వ్యాఖ్యలు చేసారో లేదో, స్క్రిప్ లో భాగంగా, వెంటనే బీజేపీ రంగంలోకి దిగింది... పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హరిబాబు స్వాగతించారు. హోదా బదులుగా ఇచ్చిన ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని, పవన్‌ ప్యాకేజీ గురించి వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషమని హరిబాబు కొనియాడారు.

bjp pawan 19032018 2

అయితే, పవన్ వ్యాఖ్యల పై, వెంటనే బీజేపీ స్పందించటం పై, తెలుగుదేశం స్పందించింది... మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, మాట్లాడుతూ, ఏపీకి హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అనాడు కేంద్రం స్పష్టం చేసిందని, అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని అన్నారు. అయితే హోదా ఉన్నరాష్ట్రాల కాలపరిమితి అయిపోయినా... పొడిగించడంతో ఏపీకి కూడా హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే విషయమై జనసేన అధినేత పవన్ చాలా సార్లు మాట్లాడారని, ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని విమర్శించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆయనతో ఎవరైనా అలా మాట్లాడిస్తున్నారా? లేక పవన్ అభిప్రాయమా? అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని అమర్‌నాథ్ రెడ్డి అన్నారు.

అనుకున్నదే అయ్యింది... కెసిఆర్ తో కలిసి డ్రామాలు ఆడుతున్న, 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు రెండో రోజు కూడా పారిపోయింది... అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం, దేశంలో అన్ని విపక్షాలని ఏకం చేసింది... స్పీకర్ అవిశ్వాసం చదివే అప్పుడు, అందరూ తమ స్థానాల్లో నుంచునున్నారు... కాని డ్రామా ప్రకారం, కెసిఆర్ ఎంపీలు, అన్నాడీఏంకే ఎంపీలు వెల్ లో , గోల గోల చేసారు... దీంతో సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలంటూ కోరారు.

modi 19032018 2

కానీ, కావేరీ అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు వెల్‌లోకి వెళ్లి తమ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో సభ్యుల నిరసనల మధ్య లెక్కింపు సాధ్యం కాదంటూ లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. అవిశ్వాసాని భయం లేదంటూనే, బీజేపీ ఇలా డ్రామాలు ఆడిస్తుంది అని, విపక్షలాన్నీ అంటున్నాయి... కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని, సాటి తెలుగు వాడికి సాయం చెయ్యలేని వాడు, దేశాన్ని ఉద్దరిస్తాడా అంటూ, ఎద్దేవా చేస్తున్నాయి...

modi 19032018 3

అటు రాజ్యసభలోనూ ఇవే ఆందోళనలు కొనసాగాయి. వివిధ అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేయడంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు పారిపోయింది అంటూ, ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్షాలు... అలాగే నేను మద్దతు తెస్తాను అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడని, చెల్లలు కవితకు చెప్పి, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు...

చంద్రబాబు ఢిల్లీతో ఎదురు తిరిగిన దగ్గర నుంచి, ఢిల్లీ పెద్దలు ఏదైతే చేస్తారని ప్రచారంలో ఉందో, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో, ఆ ప్రచారం నిజమే అని తేలింది... 4 ఏళ్ళ నుంచి దేశంలో ఎదురు చెప్పేవాడు లేకపోవటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి పై ఎదురు తిరగటంతో, అమిత్ షా - మోడీ, తట్టుకోలేక పోతున్నారు... అందుకే ఆపరేషన్ గరుడ అంటూ, చంద్రబాబుని దెబ్బతీసి, తద్వారా వారిని డీ కొడుతున్న ఆంధ్రప్రదేశ్ లో అనిశ్చితి తేవాలని చూస్తున్నారు... ఇందులో భాగంగా, జగన్, పవన్, కెసిఆర్ ను పర్ఫెక్ట్ గా వాడుతున్నారు... అలాగే, నా డిమాండ్ లు నెరవేరే వరకు, నేను బీజేపీతో వెళ్ళను అని పవన్ అన్నారు... అంటే,అందరూ అనుకుంటున్నట్టు, పవన్ ఎదో ఒక ఆందోళన చేసి,రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు తీసుకువచ్చి, బీజేపీ ఒక్కొక్క హామీ ఇచ్చిన తరువాత, పవన్ బీజేపీతో కలుస్తాడు అనే ప్రచారం నిజం అని పవన్ మాటలను బట్టి తేలింది... ఈ రోజు, పవన్ కళ్యాణ్ ఒక నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తో, ఆపరేషన్ గరుడ అనేది నిజమే అనే విషయం అర్ధమైంది...

pavan 19032018 1

CNN-News18 అనే నేషనల్ మీడియాతో పవన్ మాట్లాడుతూ, చివరకు స్పెషల్ స్టేటస్ పై కూడా మాట మార్చి, తాను మోడీ - అమిత్ షా కు ఎంత లొంగిపోయింది చెప్పకనే చెప్పారు... "స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఏమి ఇస్తారు అనేది అనవసరం, మాకు డబ్బులు" కావలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు... ఇదే విషయం చంద్రబాబు అంటే, పాచి పోయిన లడ్డులు అని చెప్పిన పవన్, ఇప్పుడు ఇలా అంటున్నారు.. ఒక పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ, రాష్ట్రానికి సరిపడా డబ్బులు ఇస్తే చాలు అంటున్నారు... ఇంతటితో ఆగలేదు, మళ్ళీ చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు...

pavan 19032018 1

నా దగ్గరకు 40 మంది తెలుగుదేశం ఎమ్మల్యేలు వచ్చారని, వారంత చంద్రబాబు, లోకేష్ చేస్తున్న అవినీతి గురించి నాకు చెప్పారని, అలాగే, పోలవరంలో కూడా అవినీతి జరుగుతుందని, వీటి అన్నిటి మీద, సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు... అందరూ అనుకుంటున్నట్టు, ఇదే ఆపరేషన్ గరుడ, అసలు ఉద్దేశం.... ఇక పొతే, కెసిఆర్ గురించి కూడా చెప్పారు... ఆయన్ను ఆకాశానికి ఎత్తేసారు... కెసిఆర్ కు, థర్డ్ ఫ్రంట్ పెట్టమని చెప్పింది తానే అని చెప్పారు... 10 మార్కులకు గాను, చంద్రబాబుకి 2.5 మార్కులు, కెసిఆర్ కు 6 మార్కులు వేస్తున్నట్టు చెప్పారు పవన్... ఇది వరుస.. ఒక పక్క ఢిల్లీతో చంద్రబాబు పోరాడుతుంటే, దానికి, కెసిఆర్ తప్ప, దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంటే, జాతీయ మీడియాకు ఎక్కి, చంద్రబాబుని బలహీన పరుస్తూ, కెసిఆర్ ని పొగుడుతూ, వారి అజెండా ఏంటో బయట పెట్టుకున్నారు... దీని పై స్పందించిన తెలుగుదేశం నాయకులు, "ఇప్పటికే చంద్రబాబు క్లియర్ గా చెప్పారని.. మోడీ - అమిత్ షా ఎలాంటి వారో తెలుసు అని, అన్నిటికీ సిద్ధపడే వారితో యుద్ధం మొదలు పెట్టామని, నేను ఏ అవినీతి చెయ్యలేదు అని, నన్ను అవినీతిలో ఇరికించ లేక, ఇలాంటి పనులు చేస్తున్నారని", చంద్రబాబు చెప్పిన విషయం గుర్తు చేశారు...

Advertisements

Latest Articles

Most Read