రేపు ఢిల్లీలో ఏమి జరగబోతుంది ? దేశం మొత్తం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.. ఢిల్లీ వేదికగా మోదీపై టీడీపీ సమరం తీవ్రం చేసి, అవిశ్వాసం పెట్టి, దేశంలోని అన్ని విపక్షాల మద్దతు కూడగట్టిన నేపధ్యంలో, ఏమి జరుగుతుందో అని అందరూ చూస్తున్నారు... అయితే, ఇప్పటికిప్పుడు మోడీకి ఇబ్బంది ఏమి లేకపోయినా, పార్లమెంట్ లో చర్చ జరిగితే, మోడీ విశ్వాసం లేదు అని, అనేక రాజకీయ పార్టీలు పార్లమెంట్ వేదికగా చెప్పి, వివిధ రాష్ట్రాలకు మోడీ చేసిన అన్యాయం వివరిస్తే, దేశం మొత్తం ఇది చూస్తుంది... అందుకే, ఎలాగైనా అవిశ్వాసం తప్పించాలాని, మోడీ - అమిత్ షా ప్లాన్ వేస్తున్నారు...

parliament 18032018 2

దీని కోసం, రెండు పార్టీలను ఉపయోగించనున్నారు... శుక్రవారం కూడా, ఇలాగే చేసారు, రేపు కూడా ఇలాగే చేసే అవకాసం ఉందని చెప్తున్నారు... శుక్రవారం కూడా, తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభలో చదివి వినిపించారు. వాటికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని స్పీకర్‌ చెప్పడంతో కాంగ్రెస్‌, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. దీంతో వాటిపై చర్చ చేపట్టేందుకు స్పీకర్‌ సిద్ధమైన సమయంలో తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభ ఆర్డర్ లో లేదని, సభ వాయిదా వేసారు స్పీకర్...

parliament 18032018 3

శుక్రవారం ఎలా అయితే చేసారో, రేపు కూడా అలాగే చేస్తారని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి... ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాసం ఇచ్చి, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, గల్లా జయదేవ్ వాయించిన వాయింపుకి, ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారు... మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయన్నే కాదు, జగన్ లాంటి వాడితో మోడీ స్నేహం గురించి కూడా ఏకి పడేసారు... ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకూడదు అని బీజేపీ ప్లాన్... తెరాస, అన్నాడీఎంకే సభ్యులతో, మరో రెండు మూడు రోజులు ఆందోళన చేపించి, సభ నిరవధిక వాయిదా వేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.. మరి, చెల్లలు కవితకి, బాబాయి కెసిఆర్ గారికి, పవన్ కళ్యాణ్ గారు కొంచెం చెప్పి, వారిని అవిశ్వాసానికి సపోర్ట్ చేసే విధంగా చెయ్యాల్సిందిగా మనవి...

జరుగుతున్న అభివృద్ధి, చంద్రబాబు పడుతున్న కష్టం ఏ మాత్రం చూడకుండా, కేవలం ఆయన మీద బురద జల్లి, రాజకీయ ప్రయోజనం పొందాలి అనుకునే వారికి ఇలాంటివి కనిపించవు... కనిపించినా, బయటకు చెప్పటానికి మనసు ఒప్పదు... అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటున్న వారికి, ఇలాంటివి అసలు కనిపించవు... కేవలం అమరావతి మీద బురద జల్లటమే అజెండా... లోకేష్ చేసిన ఇలాంటి పనులు కనిపించవు... ఎవరో అనుకుంటున్న మాటలు చెప్పటానికి మాత్రం నోరు వస్తుంది... రాజధాని అమరావతితోపాటు... రాయలసీమలోని తిరుపతిలో, ఉత్తరాంధ్రలోని విశాఖలోనూ ఐటి కంపెనీలు వస్తున్నా, కేవలం అమరావతిలోనే వచ్చేస్తున్నాయని ప్రచారం చేసి, రాష్ట్రంలో ప్రజలని రెచ్చగొడతారు... ఇవన్నీ పక్కన పెట్టి, అసలు విషయానికి వద్దాం...

vizag 18032018 2

గత సంవత్సరం ఐటి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ఫలితాలు ఇవి... విశాఖలో రెండు పెద్ద ఐటీ ప్రాజెక్టులు కొలువుదీరనున్నాయి... ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, కాండ్యుయెంట్‌ సంస్థలు ఈనెల 29న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా తమ కార్యక్రమాలను ప్రారంభిస్తాయి... మధురవాడ సర్వే సంఖ్య 309లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సంస్థకు 40 ఎకరాలు కేటాయించారు.. అయితే, ఆ స్థలంలో నిర్మాణాలు పూర్తిచేసి కార్యక్రమాలను మొదలుపెట్టేసరికి సమయం పడుతుందని, సత్యం కూడలిలో ఉన్న టెక్‌మహేంద్ర సంస్థ ఆవరణలో తాత్కాలిక పద్ధతిన ఒక ఫ్లోర్‌ను ఈ సంస్థకు కేటాయించి, తక్షణం ఈ కంపెనీ ప్రారంభించనున్నారు...

vizag 18032018 3

అలాగే, కాండ్యుయెంట్‌ సంస్థకు మధురవాడ ఐటీ సెజ్‌లో నిర్మించనున్న మిలీనియం టవర్స్‌లో ఒకటి ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈనెల 29న ఈ రెండు సంస్థల ప్రారంభోత్సవంతో పాటు విశాఖలో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఐఐఎం తొలి స్నాతకోత్సవానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. విశాఖ బీచ్‌లో జరగనున్న యాచింగ్‌ పోటీలను సీఎం ఆరోజు ప్రారంభిస్తారు...

రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌, కంతేటి సత్యనారాయణరాజు, పార్టీ నేతలు సురేష్‌రెడ్డి, రవీంద్రరాజులకు అమిత్ షా, ఒక క్లిష్టమైన టాస్క్ ఇచ్చారు... వారం రోజుల టైం ఇచ్చి, చంద్రబాబు ఎమన్నా అవినీతి చేసేరేమో, ఎక్కడైనా దొరుకుతారేమో, అన్నీ వెతకండి, చిన్న ఆధారాం ఉన్నా చాలు, మిగతాది మేము చుకుంటాం అంటూ, ఎదో ఒకటి, ఒక వారం రోజుల లోపు తీసుకుని, ఢిల్లీ రావాలని ఆదేశించారు... అయితే, ఇప్పటికే అవి అన్నీ చూసాం అని, అన్నీ ఆన్లైన్ లో , రియల్ టైంలో ఉన్నాయని, ప్రతిది పక్కగా ఉంది అని, అందుకే రాయలసీమ డిక్లరేషన్ అని, లెక్కలు ఇవ్వలేదు అని ఎదురు దాడి తప్ప, చంద్రబాబు పై ఏ ఆరోపణ చెయ్యలేకపోతున్నామని మాజీ మంత్రి ఒకాయిన చెప్పారు.... అయినా, అమిత్ షా ఎదో ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా చూడండి అని సమాధానం చెప్పినట్టు సమాచారం...

amitshah 18032018 3

తెలుగుదేశంపై దండయాత్ర మొదలుపెట్టాలని అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌ భాజపా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై రాష్ట్రంలో భాజపా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అవసరమైతే, జగన్, పవన్ లతో కూడా కలిసి, చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి, వైఫల్యాలను ప్రజల ముందుంచాలని చెప్పారు. ఏపీకి కేంద్రం ఎన్ని వేల, లక్షల కోట్లు సాయం చేసిందో చెప్పి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆంధ్రప్రదేశ్‌పై భాజపాకున్న శ్రద్ధపై తీర్మానించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయడానికి అమిత్‌షా రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీని శనివారం దిల్లీకి పిలిపించి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, జగన్ కు సలహాదారుడుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఇందులో పాల్గున్నారు.

amitshah 18032018 2

ప్రత్యేక హోదాపై వాళ్లు ఎలా భావోద్వేగాలు రెచ్చగెడుతున్నారో అలాగే మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వాలి, దాని కోసం చంద్రబాబుని దోషిగా చూపించాలి అని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు.. అమిత్‌షాతో సమావేశం అనంతరం ఏపీ భాజపా నేతలంతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చంద్రబాబు చేసిన తప్పులను వెతకాలని రామ్‌మాధవ్‌ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది... దిల్లీ నుంచి కూడా తగిన ఆధారాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం...

ఇన్నాళ్ళు స్క్రిప్ట్ రైటర్ లు కావల్సింది, సినిమా వాళ్ళకే అనుకున్నాం, పాపం ప్రధాని పదవికి పోటీ పడే అభ్యర్ధులు కూడా, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని ఇప్పుడే తెలిసింది... ఈ విషయం తెలంగాణ నేత కిషన్‌రెడ్డి గారు చెప్పారు... ప్రత్యేక హోదా విషయమై శనివారం మాట్లాడుతూ, ‘’ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటీ చూసి అన్నారు. ప్రత్యేక హోదాపై అప్పుడు మోదీకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుంది. అందుకే స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది’’ అని చెప్పారు.

modi 18032018

ప్రత్యేక హోదా విషయంలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారికి చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు.. అలాగే, ప్రధాని మోదీ జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇస్తే తప్పేంటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు... జగన్ లాంటి ఆర్ధిక నేరస్థుడికి అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తున్నారు అని చంద్రబాబు అనటం దారుణం అంట... అన్ని రాష్ట్రాల కంటే, ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ సహాయం చేసారంట.. అంతే కాదు, ప్రత్యెక ప్యాకేజీ ఇచ్చి, కొన్ని లక్షల కోట్లు ఇప్పటికే ఇచ్చారంట...

modi 18032018

అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు, మోడీని వెనకేసుకుని వచ్చే ప్రయత్నంలో, పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నారు... ప్రత్యేక హోదా మీద మోడీ గారికి అవగాహన లేకుండా ఎవరో ఇచ్చిన కాగితం పట్టుకొని తిరుపతి సభలో చదివారు అని చెప్తున్నారు, మరి పార్లమెంటులో బీజేపీ పాస్ చేసిన బిల్లు సంగతి ఏంటి? ప్రత్యేక హోదా ప్రతిపాదించిన వెంకయ్య గారు, అరుణ్ జైట్లీ సంగతేంటి..! పార్లమెంటు లో సపోర్ట్ చేసిన ఇతర బీజీపీ నాయకుల సంగతేంటి!? ఎవ్వరికీ అవగాహన లేదా!?? అందరూ ఎవరో రాసిస్తే ఆ కాగితాన్ని చదివేశారా? చివరగా కిషన్ రెడ్డి గారు, హోదా వద్దు అని స్వంతగా చెప్పారా...? లేదా ఎవరో ఒకరు రాసిచ్చిన, లేదా ఏదో పార్టీ వాళ్ళు చెవిలో చెప్పిన విషయాన్ని చెప్పేస్తున్నారా!?

Advertisements

Latest Articles

Most Read