పోలవరం పురో గతి, పెట్టిన ఖర్చు తదితర పూర్తి వివరాలన్నీ http://polavaram.apegov.com/ispp/home# వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.... పోలవరం వివరాలు ఏ వెబ్ సైట్ లోనూ దొరకలేదని బీజేపీ నాయకులతో పాటు, కొంత మంది హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రా రాజకీయాలు చేస్తున్న వారు, ఈ వెబ్సైటు లో అన్ని వివరాలు చూసుకోవచ్చు... ఆ రిపోర్ట్ లు అన్నీ చూసి, తీర్పు ఇవ్వండి, ఎవరిది తప్పో ఒప్పో... ఇంత పారదర్శకంగా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టి, పనులు చేస్తుంటే, చేత కాని వారు, పనిలేని వారు, విమర్శలు చేస్తూ ఉంటే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీరికి సమాధానం చెప్తున్నా, విషయం అర్ధం కాని వారు, అలాగే విషయాన్ని తప్పుదోవ పట్టించే వారు, డయాఫ్రం వాల్ అంటే ఎక్కడ చూపించండి నాకు కనపడటం లేదు అనే వారు, చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు...

polavaram 13022018 2

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వం రూ. 7779 కోట్లు వెచ్చింది... కేంద్రం రూ. 4932 కోట్లు ఇచ్చింది... మరో రూ. 2847 కోట్లు రావాల్సి ఉంది... భూ సేకరణ, పునరావాసం బిల్లులను కేంద్రానికి పంపగా, నాబార్డు ద్వారా ఆ నిధులను విడుదల చేయాల్సి ఉంది.... పోలవరం వెబ్ సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయి.. ప్రతి అధికారి ఫోన్ నంబర్లు కూడా వెబ్ సైట్ లో క్లియర్ గా ఉన్నాయి.. దేశంలో ఇంత ట్రాన్స్ పరెంట్ గా జరిగే ప్రాజెక్టు ఎక్కడా లేదు... ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు తెలియాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష..

polavaram 13022018 3

సీఎం చంద్రబాబు ప్రతివారం పోలవరం పనులు పర్యవేక్షిస్తున్నారు... పదేళ్లు, ముగ్గురు ముఖ్యమంత్రులు పోలవరం ముంపు గ్రామాలను ఖాళీ చేయించలేకపోయారు... చంద్రబాబు వచ్చిన తరువాతే నిర్వాసితులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు పడ్డాయి... ఇప్పటి వరకు 53% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి... పోలవరం ప్రాజెక్టు గత వారం నుంచి ఫిబ్రవరి 11 వ తేదీ వరకు పూర్తయిన పనుల వివరాలు... తవ్వకం పనులు 0.10 లక్షల క్యూబిక్ మీటర్లు... మొత్తం పూర్తియిన పనులు 775 లక్షల క్యూబిక్ మీటర్లు... పూర్తి చేయాల్సినది:296 లక్షల క్యూబిక్ మీటర్లు... కాంక్రీట్, స్పిల్‌వే స్టిల్లింగ్ బేసిన్: 3876 క్యూబిక్ మీటర్లు.... మొత్తం పూర్తియిన తవ్వకం 5.01 లక్షల క్యూబిక్ మీటర్లు... మిగిలిన తవ్వకం పనులు 30.13 లక్షల క్యూబిక్ మీటర్లు... థ్రస్ట్ బ్లాక్స్ సంఖ్య : 10.... ఈవారం దాకా మొత్తం పూర్తయినవి: 80... పూర్తి చేయాల్సినవి: 16... డయాఫ్రం వాల్ నిర్మాణం: 19.6 మీటర్లు... మొత్తం పూర్తయ్యింది 967.6 మీటర్లు... ఇంకా పూర్తి చేయాల్సింది: 459.4 మీటర్లు...

నెల్లూరు జిల్లాలో పాదయత్ర చేస్తున్న జగన్, ఈ రోజు సాయంత్రం ఉన్నట్టు ఉండి, పాదయత్ర అర్ధాంతరంగా ఆపేశారు.. షడ్యుల్ కన్నా ముందే, పాదయాత్ర ఆపి, ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు... నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరుగుతోంది... పార్టీకి చెందిన నేతలు అనేకంటే, పార్టీలో ఉన్న జగన్ సన్నిహితులతో మీటింగ్ అనటం దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది... దగ్గరగా ఉండే నేతలు, జగన్ కు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ మీటింగ్ లో పాల్గున్నారు...

jagan padayatra 12022018 2

ఈ సమావేశంలో జగన్ కి అన్నిట్లో తోడు ఉండే విజయసాయిరెడ్డి, బంధువు అయిన మిథున్ రెడ్డి, వ్యాపార భాగస్వామి అయియన్ మేకపాటి, జగన్ కు కేసులలో తోడుగా ఉండే బొత్స, మోపిదేవి, ధర్మాన, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు... ముఖ్యంగా, ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల పై జగన్, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం... ప్రశాంత్ కిషోర్ వీక్లీ సర్వేలో, షాకింగ్ రిజల్ట్స్ బయటకి రావటంతో, ఏమి చెయ్యాలో అర్ధం కాక, జగన్ ఈ మీటింగ్ పెట్టారు...

jagan padayatra 12022018 3

కేంద్ర బడ్జెట్ లో అన్యాయం పై, జగన్ - బీజేపీ కుమ్మక్కు అయిపోయారు అనే ప్రచారం, ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది అని ప్రశాంత్ కిషోర్ సర్వే సారంశం... దీని డ్యామేజ్ కంట్రోల్ ఏంటో ప్లాన్ చెయ్యటానికి జగన్ ఈ సమావేశం పెట్టారు... మోడీ మాత్రం, ఇప్పటికీ, ఎప్పటికీ మనం ఒక్క మాట కూడా అనకూడదు, అనలేము కూడా.. చంద్రబాబునే టార్గెట్ చెయ్యాలి... కాని ప్రజల్లో, మనం మోడీని కూడా ఎదురిస్తున్నట్టు కనపడాలి... దాని కోసం ఏమి చెయ్యాలో చెప్పండి అంటూ, జగన్ ఈ సమావేశం పెట్టారు... మరి చివరకు, ఏమి తెలుస్తారో చూడాలి...

గత సంవత్సరం నవంబర్ నెలలో, హైదరాబాద్ మీడియా చేసిన హంగామా గుర్తుందా ? ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ప్రకటించకుండానే, తెలంగాణా ఫస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉంది అని ఎలా ఊదరగొట్టారో... చివరకు ఈనాడు కూడా అలాగే రాసింది... తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన బ్రీఫింగ్ తీసుకుని, విషయం తెలుసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంది అంటూ హేళన చేసారు... ఈ రోజు ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉంది...

eodb 12022018 1

తెలంగాణా రాష్ట్రం 9వ స్థానంలో ఉంది... మరి ఇప్పుడు హైదరాబాద్ మీడియాకి, ఇవి చూపించే దమ్ము ఉందా ? బ్రేకింగులు వేసే దమ్ము ఉందా... మొన్న ఆంధ్రప్రదేశ్ ను హేళన చేసినట్టు, ఈ రోజు తెలంగాణా రాష్ట్రాన్ని హేళన చేసే దమ్ము ఉందా ? ఇవి తుది ర్యాంకులు కావు, ఇప్పటికే ఇవాల్యువేషన్ జరుగుతూనే ఉంది... ర్యాంకులు ప్రకటించే సమయానికి, ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా మొదటి స్థానంలో ఉండి తీరుతుంది... అది ఆంధ్రప్రదేశ్ దమ్ము... అది మా పారిశ్రామిక విధానం... అది మా నాయుడుకి ఉన్న విజన్...

eodb 12022018 3

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్... గత రెండు సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, మన రాష్ట్రం ఫస్ట్ ఉంటూ వస్తుంది... కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 340 అంశాలను పరామీటర్స్ గా తీసుకుని, ర్యాంకింగ్స్ ఇస్తారు... ఈ సంవత్సరం కూడా, ఈ ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు... ఈ పరామీటర్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వెబ్సైటులో (http://eodb.dipp.gov.in/) అప్డేట్ చెయ్యాలి... కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్రం అప్డేట్ చేసిన వాటిని ఇవాల్యువేట్ చేసి, ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది... ఇవాల్యువేట్ చెయ్యకుండా, తెలంగాణ ఫస్ట్ ఉంది... ఇవాల్యువేట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, తెలంగాణా 9వ స్థానంలో ఉంది... చివరకు ర్యాంకులు ప్రటించే సమయానికి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉండి తీరుతుంది... మిగతా రాష్ట్రాలు ఎక్కడ ఉంటాయో చూసుకోండి, హైదరాబాద్ మీడియా...

సొంత ఆస్తులు త్యాగం చేసి, రాజకీయాలు చేస్తున్న ఘనమైన చరిత్ర కలిగిన నాయకుడు ఒక పక్క... పేదలను పీల్చి, పిప్పి చేసి, హత్యా రాజకీయాలు చేసి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించి, 11 కేసుల్లో A1గా ఉంటూ, 16 నెలలు జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడు ఒక పక్క... ఇంత ఘనమైన అవినీతి చరిత్ర కలిగిన వాడు, అశోక్ గజపతి లాంటి నిజాయితీ పరుడుని, భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ల విషయంలో అవినీతి జరిపారు అంటూ, ఆయన పైనే ఆరోపనులు చేస్తూ, బురద జల్లి, కడుక్కోమంటున్నాడు... దీని పై అశోక్ గజపతి రాజు స్పందించారు...

ashok 12022018 2

భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తానే సూచించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు ఆదాయం, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని... ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అంత శక్తి లేదని వివరించారు... ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అశోక్‌గజపతిరాజు అన్నారు... ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు అప్పిగిస్తే, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది..

ashok 12022018 3

దీని పై వైసిపీ నాయకులు, జగన్ గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు... టెండర్ రద్దు అయినా హడావిడి ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు... టెండర్లు రద్దు అవటం అనేది పాలన పరంగా, జరిగే అతి సాధారణ ప్రక్రియ... అయినా, ఎక్కడైనా టెండర్ ఇస్తే రాద్దాంతం చేస్తారు కాని, ఇక్కడ టెండర్ రద్దు చేస్తే కూడా రాద్దాంతం చేస్తున్నారు... అయినా టెండర్లో ఎవరైనా పాల్గునవచ్చు... అన్నీ నిబంధనలు ప్రకారం జరుగుతాయి.. ఎవరైనా ఎక్కడైనా తేడా అనిపిస్తే కోర్ట్ కి వెళ్ళవచ్చు... ఇన్ని ఆరోపణలు చేసే బదులు, కోర్ట్ కి వెళ్లి, కోర్ట్ చేతే ఇది తప్పు అని జగన్ ఒక్క విషయంలో అయినా ప్రూవ్ చేసాడా ?

Advertisements

Latest Articles

Most Read