చంద్రబాబు పరిపాలాన అంటే టెక్నాలజీ... దాపరికం లేని పాలనే చంద్రబాబు పరిపాలన విధానం... అన్ని విషయాలు ప్రజలు ముందు ఉంచారు చంద్రబాబు... తాను ఏ డేటా చూసి, పరిపాలన సాగిస్తున్నారో, అదే డేటా సియం డ్యాష్ బోర్డు ద్వారా ప్రజల ముందు ఉంచారు... ఈ కోర్‌ డ్యాష్‌ బోర్డుకు 33 కీలకమైన శాఖలను అనుసంధానం చేశారు. వీటిల్లో జరుగుతున్న పనులు, ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు.... దేశంలో ఏ రాష్ట్రం ఇంత ట్రాన్స్పరెంట్ గా పరిపాలన అందించటం లేదు.. పోలవరం పనుల కోసం, ఒక వెబ్సైటు పెట్టారు.. అందులో వీక్లీ రిపోర్ట్ తో పాటు, రోజు జరిగే ఖర్చుల వివరాలు పెట్టారు...

live feed amaravati 15022018 2

ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసారు... ప్రజా రాజధాని అమరావతిలో ఏమి జరుగుతుందో, ప్రత్యేకంగా ప్రజలు, ఎక్కడ నుంచి అయినా తెలుసుకొనేందుకు, లైవ్ ఫీడ్ ఇస్తున్నారు... ఈ లైవ్ ఫీడ్ ప్రజలకే కాదు, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, తాపీగా స్టూడియోల్లో కూర్చుని, అమరావతిలో ఏమి జరుగుతుందో మాకు తెలియాలి అనే పోటుగాళ్ళకి కూడా, ఇది ఉపయోగపడుతుంది... మీరు ఎలాగూ అమరావతి రాలేరు కదా... వచ్చి, మా రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి చూడలేరు కదా, కనీసం మీ ఫోన్ లో, కంప్యూటర్ లో అయినా, ఓపెన్ చేసి, మా అమరావతి ప్రగతి చూసుకోండి...

live feed amaravati 15022018 3

అమరావతిలో జరుగుతున్నా హౌసింగ్ ప్రాజెక్ట్స్ లైవ్ కెమెరాల ఫీడ్ ఇస్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... 61 టవర్లు... 85 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా..రాయపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఇక్కడ లైవ్ ఫీడ్ లో చూడవచ్చు... https://crda.ap.gov.in/APCRDA/UserInterface/LiveVideo/Home.aspx ... లైవ్ ఫీడ్ కాబట్టి, లోడ్ అవటానికి టైం పడుతుంది... SPC_OFFICERS HOUSING SITE మీద క్లిక్ చెయ్యండి, అవి ఫాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి... అమరావతి నిర్మాణ పనులు ప్రత్యక్షంగా చూడవచ్చు... ఇవి రాత్రి, పగలు తేడా లేకుండా 24/7 ఆన్ లోనే ఉంటాయి... ఎప్పుడైనా, అక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు కూడా చూడవచ్చు.... ఇంతకంటే పారదర్శకంగా ఈ దేశంలో పరిపాలన చేస్తున్న వారు ఉంటే చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్దాం, నేర్చుకుంటారు....

కేంద్ర సహయం కోసం, ఎదురు చూస్తూ, ఆందోళన బాట పట్టిన రాష్ట్రానికి మరో సమస్య వచ్చి పడింది... ఇది దేశ వ్యాప్త సమస్య అయినా, మన రాష్ట్రంలో ఉన్న తీవ్రతని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్‌, ప్రాంతీయ గవర్నర్లకు లేఖలు రాసారు... తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల కరెన్సీ పంపాలని లేఖలో రాసారు... నోట్ల రద్దు నాటి పరిణామాలు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయన్నారు... ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు... అదే విధంగా ధాన్యం విక్రయించినా డబ్బులు తీసుకోలేక రైతులు తంటాలు పడుతున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు...

cbn jaitley 144022018 3

నిజానికి నోట్ల రద్దు లాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి.. ఉన్నట్టు ఉండి కరెన్సీ కొరత ఏర్పడింది... బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్న ఖాతాదారుల్లో ‘పెద్ద నోట్ల రద్దు’ నాటి కలవరం కనిపిస్తోంది. శనివారం సాయంత్రానికి ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఆదివారం నాడు ఏటీఎంలు పనిచేయలేదు. సోమవారం కూడా ఏటీఎంలలో నగదు పెట్టలేదు. మంగళవారం శివరాత్రి. దీంతో నగదు కావాలన్న ప్రజలకు జాగారమే దిక్కు! బ్యాంకుల నుంచి నగదు ఇవ్వకపోవడం, ఏటీఎంలో డబ్బుల్లేకపోవడంతో ప్రజల ఇక్కట్లు వర్ణణాతీతం...

cbn jaitley 144022018 2

దాదాపు అన్ని జిల్లాల్లోను బ్యాంకు చెస్ట్‌ల నుంచి నగదు పంపిణీ ఆగిపోయింది. రిజర్వుబ్యాంకు నుంచి డబ్బు రావాల్సి ఉందా? చెస్ట్‌లలో ఉన్నా ఇవ్వడం లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.10-12వేల కోట్ల రూపాయలు చెస్ట్‌ల నుంచి బ్యాంకులకు వెళ్తాయి. కానీ శుక్రవారం నుంచి ఇది నిలిచిపోవడంతో నగదు కొరత తీవ్రస్థాయి లో ఉంది... బ్యాంకులు నష్టాల బారిన పడి డిపాజిట్‌దారుల డబ్బును తిరిగివ్వకున్నా.. ఇక చేసేదేమీ లేదన్నట్లుగా ఓ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు వచ్చిన వార్తలతో ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు... డిపాజిట్లను వెంటనే క్లియర్‌ చేసుకొని, నగదును ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. మళ్లీ డిపాజిట్‌ చేయడంలేదు. ఇప్పుడు డిపాజిట్లు తగ్గిపోవడంతో వచ్చేది తగ్గిపోయింది. అదే సమయంలో ఖాతాదారులు తీసుకునేదేమో పెరిగిపోయింది.

రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ, నిన్న మన రాష్ట్రంలో పర్యటించి, వెలగపూడి సచివాలయంలో, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ సందర్శించిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంలో, ముకేష్ అంబానీ ఒక ఆసక్తికర విషయం చెప్పారు.... ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని వెళ్లి రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తే తనకు ఆసక్తి కలిగిందని, ఇప్పుడు సందర్శించే అవకాశం వచ్చిందని, పారదర్శక పరిపాలన, జవాబుదారీతనంతో ప్రభుత్వాలు వ్యవహరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ విధానం అపూర్వమన్నారు. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసిన ఆరోజుల నుంచీ తనకు తెలుసని ముకేశ్ అంబానీ చెప్పారు.

amaravati ambani 14022018 2

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ ‘ఈ వినూత్న ప్రయోగాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. స్ఫూర్తిదాయకంగానూ ఉంది.మీలాంటి సమర్ధుడైన నాయకుడు మరింత పెద్ద హోదాలో ఉంటే అద్భుత ఫలితాలు ఒనగూరతాయి’ అని ముకేశ్ అంబానీ సీఎంను ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ-ఆఫీసు విధానం దేశమంతా అమలులోకి తేవాల్సి ఉందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం దేశంమంతా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మేధోపరమైన హక్కులను మీరు పొంది మీ బృందమే అన్ని రాష్ట్రాలలో ఈ విధానం అవలంబించేందుకు శిక్షణనిచ్చి మార్గదర్శనం చేయవచ్చు’ అని ముకేశ్ అంబానీ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు...

amaravati ambani 14022018 3

పరిపాలనలో ఈ నవ్య ప్రయోగం, నవ్య విధానం తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచంలో సుపరిపాలనకు ఎస్టోనియాను ఒక నమూనాగా భావిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను చూశాక అధ్యయనానికి ఎస్టోనియా సీఈఓ, ఆయన బృందమే ఇక్కడికి రావాలి’ అని ముకేశ్ అంబానీ కితాబునిచ్చారు. ‘ ముప్ఫయ్ విభాగాలను ఏకీకృతం చేసి మీరు సాధించిన అభివృద్ధి చూశాక సాంకేతికత వినియోగంలో ఇక మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’ అని ఆయన చెప్పారు. ఇప్పడు ‘ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ’ ద్వారా ఎన్నో అవకాశాలున్నాయని ముకేశ్ అంబానీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కలిశారు. వెలగపూడి సచివాలయంలో, ముఖ్యమంత్రి ఛాంబర్‌లో చంద్రబాబు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్ధి గురించి మాట్లాడారు... ఈ సందర్భంగా అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం పై ఇరువురి మధ్య చర్చ జరిగింది.... రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ప్రణాలిక రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు లక్ష్మణ్ నికోరారు... దీని కోసం లక్ష్మణ్ కూడా పోజిటివ్ గా స్పందించారు... త్వరలోనే పూర్తి ప్రణాళికతో వస్తాను అని చెప్పినట్టు సమాచారం...

vvs lakshman 14022018 1

ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే విషయం తెలిపారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ది కోసం కార్యాచరణ రూపొందిస్తానని లక్ష్మణ్ చెప్పారు... అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు.... వరల్డ్ క్లాసు క్రికెట్ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చెయ్యమని చంద్రబాబు కోరారని, మన రాష్ట్రం నుంచి, దేశానికి క్రికెట్ ఆడే వారిని తయారు చెయ్యాలని, అవసరమైన అన్ని రకాల సహాయాలు చేస్తామని, స్పోర్ట్స్ సిటీలో దీని కోసం స్థలం కేటాయిస్తామని, పూర్తి ప్రణాళికతో రమ్మని చంద్రబాబు కోరారు...

vvs lakshman 14022018 1

రెండు నెలల క్రితం అనిల్ కుంబ్లే కూడా విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు స్పోర్ట్స్ పట్ల చూపిస్తున్న శ్రద్ధని కొనియాడారు... ఇప్పటికే ద్రావిడ్ తో కూడా, క్రికెట్ అకాడమీ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు... మరో పక్క గోపిచంద్ గురించి చెప్పనవసరం లేదు.. హైదరాబాద్ లో ఆ రోజు గోపీచంద్ అకాడమీ పుణ్యమే, ఇప్పుడు సింధు, శ్రీకాంత్ లాంటి వారు తయారు కావటం, అని స్వయంగా వారే చెప్పిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే గోపీచంద్ కూడా అమరావతి స్పోర్ట్స్ సిటీలో అకాడమీ పెట్టనున్నారు...

Advertisements

Latest Articles

Most Read