తెలుగుదేశం పార్టీ, కేంద్రం పై తీవ్రమైన పోరుకు సిద్ధమైంది... ఈ రోజు ఉండవల్లిలో జరిగిన టీడీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు... ముందుగా అన్ని విషయాలు విశ్లేషించి, నిన్న అమిత్ షా తో జరిగిన మీటింగ్ గురించి కూడా చర్చించి, ఇక బీజేపీ రాష్ట్రానికి ఏమి చెయ్యదు అని కంక్లుజన్ కు వచ్చారు... అందుకే, ఇక బీజేపీ పై జాతీయస్థాయి పోరాటానికి సిద్ధమైంది తెలుగుదేశం. విభజన హామీలపై దేశంలోని వివిధ పార్టీలకు లేఖలు రాయాలని టీడీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఆనాడు ప్రధాని పార్లమెంట్ ఉభయసభలో ఇచ్చిన హామీలతోపాటు ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, వాటన్నిటిపై జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలకు కూడా లేఖలు రాయాలని నిర్ణయించారు.

modi court 02032018 2

అయితే, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరో ఆసక్తికర విషయం బయట పెట్టారు.. గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... అవసరమైతే విభజన హామీలపై కోర్టుకు కూడా వెళతామని అన్నారు. ఫైనాన్స్ బిల్లులో సవరణలు చూశాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు... దీంతో బిల్ లో పెట్టిన అంశాలు నాలుగేళ్ళు అయినా, కేంద్రం పట్టించుకోలేదు అంటూ, కోర్ట్ మెట్లు కూడా ఎక్కటానికి చంద్రబాబు వెనుకాడటం లేదు... ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చట్ట సభల్లో ఇచ్చిన హామీలు, పార్లమెంట్ ఆమోదించిన చట్టం, నాలుగేళ్ళు అయినా ముందుకు కదలలేదు అని, కేంద్రం పై కోర్ట్ కు వెళ్ళే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు..

modi court 02032018 3

మరో పక్క ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ, ఏపీ వ్యవహారం జాతీయ సమస్యగా మారిందని, నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు.. గురువారం జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జరిగిన సమావేశంలో చూస్తామన్నారే తప్ప .. ఏదీ స్పష్టంగా చెప్పలేదన్నారు. ‘‘2018 బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలిపాం. మా నిరసనల ద్వారా కేంద్రం స్పందించి.. ఏపీ హక్కులపై నిర్ణయాలు తీసుకుంటుందని మేము భావించాం. లోక్‌సభ, రాజ్యసభలో చెప్పిన మాటలనే మళ్లీ, మళ్లీ చెప్పారే తప్పా... కొత్తగా ఏపీ హక్కులపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం రాలేదు. ఇక బీజేపీతో తెల్చుకోవటమే’’ అని రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా కూడా ప్రైవేట్‌ సంస్థ చేసిన మోసానికి.. ప్రభుత్వం పరిహారం చెల్లించిన దాఖలాలు లేవు.. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, వారి కుటుంబాలకి ఆసరాగా ఉండటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది... అగ్రిగోల్డ్ వల్ల మోసపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన 130 మందికి రూ.5 లక్షల చెక్కులను సచివాలయంలో ముఖ్యమంత్రి నేడు పంపిణీ చేశారు... రాష్ట్రంలో మొత్తం 19 లక్షల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.. ప్రైవేటు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, ఎక్కువ వడ్డీలిస్తామని, రెండేళ్లల్లో రెట్టింపు చేస్తామనే ప్రచారాలకు మోసపోవద్దని, ప్రభుత్వ బ్యాంకులలో డిపాజిట్ చేసుకోండి అంటూ చంద్రబాబు పిలుపిచ్చారు..

agrigold 02032018 2

అగ్రిగోల్డ్‌ కేసు పురోగతిపై నిరంతరం సమీక్షిస్తున్నామని, ఐదు రాష్ట్రాల సమస్య.. కోర్టు పరిధిలో ఉందని, జీఎస్సెల్‌ గ్రూప్‌కు అన్నివిధాలుగా సహకరిస్తామన్నారు. 19 లక్షల కుటుంబాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత సంవత్సరం మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతిపరులు రెచ్చిపోయారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారని అన్నారు.

agrigold 02032018 3

అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం స్పందించింది... ముఖ్యమంత్రి చంద్రబాబు 130 మంది అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించడం చాలా సంతోషమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా ప్రైవేట్‌ సంస్థ చేసిన మోసానికి.. ప్రభుత్వం పరిహారం చెల్లించిన దాఖలాలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల 130 కుటుంబాలు నిలదొక్కుకున్నాయని ఆయన అన్నారు. తమ న్యాయమైన పోరాటాల కారణంగా సీఎం పరిహారం ఇచ్చారని, అలాగే బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చాలని ఆయన అన్నారు.

నిన్న ఢిల్లీలో, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో కలిసి, రాష్ట్ర సమస్యల పై చర్చలు జరిగాయి. సుమారు ముప్పావుగంటపాటు సమాలోచనలు జరిపారు. అమిత్‌షాతో చర్చలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటున్న 19 అంశాల గురించి రామ్మోహన్‌నాయుడు, కుటుంబరావులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన 19 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

amit 0202302018

వీటి పై వెంకయ్య నాయుడు కూడా, కల్పించుకుని, ప్రతి అంశం పై క్లారిటీ అడుగుతూ ఉండటంతో, అమిత్ షా అసహనానికి గురైనట్టు సమాచారం... అందులోని చాలా అంశాలపై ఇప్పటికే ఫిబ్రవరి 9న రాజ్యసభలో ప్రకటన ద్వారా చెప్పామని అమిత్‌షా చెప్తూ, ఇప్పటికే రాష్ట్రానికి చాలా చేసామని, ఇక ప్రత్యేకంగా చెయ్యల్సింది ఏమి లేదని, మేము సిద్ధంగా లేమని, ఇంతటితో వదిలెయ్యండి అంటూ, వెంకయ్యతో అన్నట్టు వార్తలు వచ్చాయి. .ఆంధ్రాకు చేస్తే..ఇతర రాష్ట్రాలు కూడా సహాయాన్ని అడుగుతాయని..అందుకే తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని...తాము చేద్దామనుకున్నది.. ఇప్పటికే చెప్పామని..ఇంతకంటే..చేసేది లేదని..ఆయన తేల్చి చెప్పారట.

amit 0202302018

దీంతో ఇక బీజేపీకి, మన రాష్ట్రానికి ఏమి చేసే ఆలోచన ఏమి లేదు అనే విషయం అర్ధమైంది అని, టిడిపి ఎంపీలు అంటున్నారు.. ఈ చర్చలో జరిగిన అన్ని విషయాలు, అమిత్ షా స్పందన, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరిస్తామని అన్నారు... వెంకయ్య స్థాయి వ్యక్తి సమావేశం పెడితే, ఎదో ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం, కాని అమిత్ షా ఆయన మాట కూడా లెక్క చెయ్యలేదు.. పైగా ఇక చేసేది ఏమి లేదు అని తేల్చి చెప్పేశారు.. చివరి ప్రయత్నం కూడా విఫలం అయినట్టే, ఇక పార్లమెంట్‌లోనే తేల్చుకోవాలనే దిశగా నిర్ణయం తీసుకుంటాం అంటూ, టిడిపి ఎంపీలు అంటున్నారు...

amit 0202302018 4

అమిత్‌షాతో సమావేశంలో తెదేపా నాయకులు ప్రధానంగా 19 అంశాల గురించే పట్టుబట్టారు. అందులో... 1. ప్రత్యేకహోదా 2. రెవిన్యూలోటు భర్తీ 3. పోలవరం ప్రాజెక్టు 4. రైల్వే జోన్‌ ఏర్పాటు 5. పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు 6. అమరావతికి మరిన్ని నిధులు 7. జాతీయ విద్యాసంస్థల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయడానికి అవసరమైన నిధుల కేటాయింపు 8. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు 9. విభజన చట్టంలో ఉన్న పన్ను లోపాలను సరిదిద్దడం 10. కడపలో స్టీల్‌ప్లాంటుపై వెంటనే నిర్ణయం 11. వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ 12. విశాఖ, విజయవాడ మెట్రో 13. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలనుంచి అమరావతికి వేగవంతమైన రైలు, రోడ్డు నెట్‌వర్క్‌ ఏర్పాటు. 14. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌, కేబీకే తరహా ప్యాకేజీ 15. విద్యుత్తు డిస్కంలకు బకాయిల చెల్లింపు 16. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన అంశాలు ప్రధానమైనవి. ఇందులో కొన్నింటిపై రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

ఇక చంద్రబాబు ఓర్పు నశించింది... కేంద్రం పై మలి విడత పోరాటానికి చంద్రబాబు సిద్ధం అయ్యారు.. కొన్ని నెలలుగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి, ఆందోళనలు చేసి, ఒక పద్దతిగా పోరాటం చేసినా, బీజేపీ దిగిరాక పోవటంతో, ఇక చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు.. ఈ ఉదయం చంద్రబాబుతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, విభజన హామీల అమలుపై చర్చించారు... నిన్నటి సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో, ఇక బీజేపీ చేసేది ఏమి లేదనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు... అదే విధంగా, చంద్రబాబు కూడా ప్రతి విషయంలో కేంద్ర వైఖరి బేరీజు వేసుకుని, ఇక కేంద్రం ఏమి చెయ్యదు అనే విషయాన్ని నిర్దారించుకున్నాట్టు తెలుస్తుంది.

tdp bjp 02032018 2

రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు... దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు... విభజనచట్టం హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు హోదా-ప్యాకేజీ మతలబును లేఖలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు... ప్రజలు, పార్టీ క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా.. నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఎంపీలు పట్టుబట్టినట్లు సమాచారం... 5 నుంచి పార్లమెంట్‌లో మళ్లీ పోరాటం చేయాలని నిర్ణయం టీడీపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

tdp bjp 02032018 3

మరో పక్క ఎంపీలు కూడా ఆగ్రహంగా ఉన్నారు... కేవలం వీరు చంద్రబాబు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు... విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన రాకపోతే ఎక్కడా రాజీ పడేది లేదని, మిత్రపక్షమైనా వదిలి పెట్టేది లేదని చెప్తున్నారు... కేంద్ర మంత్రులు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని, ఒక పద్దతి ప్రకారం, మన వైపు వేలు చూపించకుండా, అంచల వారీగా ఆందోళన చేస్తున్నామని, సమయం రాగానే, మంత్రుల రాజీనామా, ఎన్డీయే నుంచి బయటకు రావటం, అవిశ్వాసం లాంటి కార్యక్రమాలు చేస్తామని, మనకు జరిగిన అన్యాయం దేశం మొత్తం అర్ధమయ్యేలా పార్లమెంట్ లో మరో సారి ఆందోళన చేస్తామని చెప్తున్నారు... మన ఆందోళనకు కేంద్రం తలొగ్గటం, రాష్ట్రానికి మంచి జరగటం...లేదా బీజేపీ వైఖరిని దేశం మొత్తానికి చెప్పటమే మా ఎజెండా అని అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read