చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్‌ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్‌ చిట్స్‌ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. తొలి విడతగా జూలై ఒకటో తేదీన కృష్ణా జిల్లా పరిధిలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల విక్రయానికి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

agrigold 24062018 2

కొన్నిరోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్‌ ఆస్తుల విక్రయంపై ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. రెండు వారాల్లోగా స్పష్టమైన పురోగతి, ఫలితం ఉండాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియకు కృష్ణాజిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ జిల్లాలోని ఐదు ఆస్తుల వేలానికి వచ్చేనెల ఒకటో తేదీన టెండర్లు పిలుస్తారు. జూలై 8న టెండరుదారులకు ఆ ఆస్తులను చూపిస్తారు. టెండర్ల గడువును 15వ తేదీగా ఖరారు చేయాలనే ఉద్దేశంతో అధికారులు గడువు ముగియగానే 16వ తేదీన టెండర్లను తెరుస్తారు. అత్యధిక ధరకు కోట్‌ చేసినవారికి ఆ ఆస్తులను విక్రయిస్తారు. ఈ వేలం ప్రక్రియ మొత్తాన్ని ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిస్తారు. ప్రభుత్వం, హైకోర్టు ఆశించిన స్థాయిలో ధర వస్తేనే విక్రయించాలన్న ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.

agrigold 24062018 3

ప్రతి ఆస్తి రిజిస్ర్టేషన్‌ విలువ ఎంత, వాల్యూయర్‌ నిర్ణయించిన ధర ఎంత, అక్కడ రియల్టీ ప్రకారం ధర ఎంత అనే వివరాలను ప్రభుత్వం రూపొందించింది. మార్కెట్‌ ధర ప్రకారం టెండర్లు కోట్‌ అయితేనే ఆస్తుల విక్రయం చేస్తారు. తక్కువకు కోట్‌ చేయడం, రింగవడం వంటివి జరగకుండా ముందుగానే వాటి విలువలను సుమారుగా నిర్ణయించారు. వాటికంటే ఎక్కువగా కోట్‌ చేసిన టెండరుదారుకు ఆస్తులను అప్పగిస్తారు. అంతా కోర్ట్ పర్యవేక్షణలో జరుగుతుంది. దీంతో, ప్రతిపక్షాలకు గొడవ చేసే ఆస్కారం కూడా ఉండదు. విజయవాడలో మూడు స్థలాలు, మచిలీపట్నంలో వాణిజ్యస్థలం, వీర్లపాడు మండలంలో భూమి, తొలి విడతగా వేలం వేసి, ఆగ్రిగోల్డ్ బాధితులకు ఆ డబ్బు ఇవ్వనున్నారు.

దేశంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన శాఖలు, సంస్థలు, వ్యక్తులకు ప్రతిష్ఠాత్మక సంస్థ స్కోచ్‌ అందించే అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డుల్లో 22 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ పాలన, పాదర్శకత అమలు సహా పలు పథకాలతో రాష్ట్ర పురపాలక సంఘాలు అవార్డులు దక్కించుకున్నాయి. పాఠశాల విద్య, ఘనవ్యర్థాల నిర్వహణ, ఈ-కార్యాలయం, గృహనిర్మానం, మౌలిక సదుపాయాల కల్పన తదితర పలు విభాగాల్లో తాడిపత్రి పురపాలక సంఘానికి 10 పురస్కారాలు దక్కాయి. వీటిని మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ అందుకున్నారు. ఉద్యోగులు సహా అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో కర్నూలులో ప్రతి ఆదివారం నిర్వహించే ‘హ్యాపీ సండే’ కార్యక్రమానికి , మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీల ఆధునికీకరణకు దక్కిన అవార్డులు కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి అందుకున్నారు. రెండంకెల వృద్ధిరేటుకు సంబంధించి ఏపీ ప్రణాళిక విభాగానికి అవార్డు లభించింది. విజయవాడ పరిధిలో చెత్త సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణకు సంబంధించి నగరపాలికకకు అవార్డులు దక్కాయి.

ap 24062018 2

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) వరుసగా రెండో ఏడాది ‘స్కోచ్‌’ పురస్కారానికి ఎంపికైంది. ‘పారిశ్రామిక కేటాయింపులపై మూడో పక్షంతో పర్యవేక్షణ’ అంశంలో అవార్డు దక్కింది. ఏడుగురు యువ గ్రామీణ పారిశ్రామిక వేత్తలు పురస్కారాలు అందుకున్నారు. మంత్రి నారా లోకేశ్‌కు లభించిన ‘స్కోచ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గవర్నెన్స్‌’ అవార్డును రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరక్టర్‌ రంజిత్‌ బాషా అందుకున్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పీఆర్‌, ఆర్డీ శాఖకు దక్కిన మరో మూడు అవార్డులనూ ఆయన స్వీకరించారు. గ్రామీణ తాగునీటి సరఫరాలో అధునాతన ట్రాకింగ్‌, జలవాణి కాల్‌సెంటర్‌, డ్యాష్‌బోర్డుకు అవార్డులు దక్కాయి. ఇక స్కోచ్‌ ప్లాటినం అవార్డును ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ దక్కించుకుంది. మీసేవకు స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు, స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ గోల్డ్‌ దక్కింది.

ap 24062018 3

రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని విస్తరింపజేసి, ఉద్యాన పంటల సాగులో ప్రగతి సాధించిన ఏపీ మైక్రో ఇరిగేషన్‌ పీఓ సూర్యప్రకాశ్‌, గ్రామస్థాయిలో పశువుల ఇన్‌పుట్‌ దాణా పంపిణీ చేసిన పశు సంవర్థకశాఖ డైరెక్టర్‌ సోమశేఖరం స్కోచ్‌ అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖకు మొత్తం 19 స్కోచ్‌ అవార్డులు వచ్చాయి. భూగర్భ జలాలను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షిస్తూ వాటి పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నందుకు గాను జాతీయ స్థాయిలో ప్లాటినం పీకాక్‌ అవార్డు లభించింది. అదేవిధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పాటు నీరు-చెట్టుకు ‘ప్లాటినమ్‌ పీకాక్‌’ దక్కింది. రాష్ట్ర జల వనరుల సమాచారం, పురుషోత్తపట్నం, గండికోట ఎత్తిపోతల, ముచ్చుమర్రి, ఏపీఎ్‌సఐఈసీ ఎత్తిపోతలను పునరుద్ధరించినందుకు బంగా రు నెమలి అవార్డులొచ్చాయి. వెబ్‌ ఆధారిత జలవనరుల సమాచార వ్యవస్థకు ‘కాంస్య నెమలి’ పురస్కారం దక్కింది. అలాగే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీకి రెండు పురస్కారాలు దక్కగా, ‘మన అమరావతి’ యాప్‌నకు ఇంకో అవార్డు దక్కింది.

జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్ట్ నోటీసులు పంపించింది. సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలో, ప్రభుత్వానికి కోర్ట్ నోటీసులు ఇచ్చింది. సమాచార కమిషనర్ల ఎంపిక, త్రిసభ్య కమిటీ చేస్తుంది. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. అయితే, ప్రతిపక్ష నేత జగన్ ను, సమాచార కమిషనర్ల ఎంపిక చెయ్యాలని, అమరావతి రావలిసిందిగా, ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు కోరింది. అయితే, జగన్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేనని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ప్రతిపక్ష నేత లేకుండా, ఈ ఎంపిక చేసే అవకాసం లేదు. దీని వల్ల ఎప్పటి నుంచో ఈ నియామకం పెండింగ్ లో పడింది.

jagan 23062018 2

అయితే, ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండటంతో, కోర్ట్ నోటీసు పంపించింది. సమాచార కమిషనర్లను ఎందుకు నియమించలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

jagan 23062018 3

ఆపై కోర్టు ఆదేశానుసారం ఏపీలో స.హ కమిషనర్లను ఇప్పటివరకు నియమించలేదంటూ కోర్టుధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పై మేరకు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం, ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేసే పనిలో ఉంది. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత ఉండాలని, ఆయన ఎన్ని సార్లు పిలిచినా అందుబాటులోకి రాలేదని, అందుకే ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యింది అని చెప్పే అవకాసం ఉంది. అప్పుడు కోర్ట్ ఆదేశాలను బట్టి, ప్రభుత్వం ముందుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు. ఇప్పుడు ఏకంగా, ప్రభుత్వనికే నోటీసు వచ్చింది.

అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతఙ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికకు పెద్దసంఖ్యలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును అంగన్వాడీ టీచర్లు కలిసారు. మంత్రి పరిటాల సునీత, మహిళా శిశిసంక్షేమ శాఖ అధికార్లు, మహిళా నేత రాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఒక పార్టీ వరుస ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

anganwai 23062018 2

నాలుగేళ్ళలో కేంద్రం సహకరించకపోయినా అంగనవాడీ టీచర్ల, ఆయాల బాధలను తొలగించేందుకు జీతాలు రూ. 10500, రూ.6000కు పెంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేదవాళ్ళకు అండగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ, ఆయాల వేతనాలు పెంచామన్నారు. అంగన్వాడీలు ఆనందంగా ఉంటే వారు పెంచే పేద పిల్లలు ఆరోగ్యంతో ఎదుగుతారన్నారు.తద్వారా వారి తల్లిదండ్రులు చివరకు సమాజం సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, బంధుత్వంతో సంబంధం లేకుండా పేదరికాన్ని తొలగించడానికే అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు జీతాలు పెంచామన్నారు. 2018-19 ఏడాదిని పేదపిల్లల్లో పౌష్టికాహారం లోపం లేకుండా పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. జీతాలు పెరగడంతో అంగన్వాడీ టీచర్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆనందం కనపడుతోందన్నారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నింటినీ తొలగించి నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశానికి అంగన్వాడీ టీచర్లు అండగా ఉంటారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

anganwai 23062018 3

"నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4200 నుంచి 7000, ఇప్పుడు రూ.10500కు పెంచాం. ఆయాలకు కూడా గతంలో ఉన్న రూ. 2500, రూ.4500 ఇప్పుడు రూ. 6000 కు పెంచాం. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.305 కోట్ల భారం పడుతుంది. అంగన్వాడీ టీచర్ల ఆనందంగా ఉండటమే లక్ష్యంగా సాహసోపేతమైన జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నాం. జీతాల పెంపుతో అంగన్వాడీ టీచర్లలో ఆనందం, ఉత్సాహం కనపడటం సంతోషకరం. ప్రతి ఒక్కరికీ ఆర్థిక వెసులుబాటు ఉంటే ఆయా వృత్తులు, పనుల్లో మెరుగైన ఫలితాలు సాధ్యం. ఒకపక్క ఇల్లు, మరోపక్క పేదపిల్లలను చూసుకునే అంగన్వాడీ టీచర్ల కు ఆర్థిక మద్దతు ఇవ్వాలని భావించి జీతాలు పెంచడం జరిగింది. భవిష్యత్తు భావీభారత పౌరులైన పిల్లలను తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు అండగా నిలవాలని భావించా" అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read