ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం వివధ రూపాల్లో జరుగుతుంది. సెలబ్రిటీలుగా పేరు ఉన్న వారు కూడా, ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్‍లో 'జబర్దస్త్' నటుడుకి సంబంధం ఉన్నట్టు, టాలీవుడ్ లింక్‌లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మొన్నటి దాకా, టీవీ సీరియళ్లలో చిన్నచిన్న క్యారెక్టర్లు వేసుకునే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లకు పడగలెత్తాడు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా సంపాదించిన కోట్ల రూపాయాలతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. పోలీసులు ఇతని కోసం స్పెషల్ టీంలు పెట్టి వేటాడటంతో, పోలీసులు నుంచి తప్పించుకోలేక లొంగిపోయాడు.

yerrachandanam 18072018 2

ఎర్రచందనం నిందితుడైన బుల్లితెర నటుడు హరి మంగళవారం తిరుపతిలోని టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్సు సీఐ మధుబాబు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరానికి చెందిన హరి చిత్తూరు, తిరుపతి అర్బన్‌, టాస్క్‌ఫోర్స్‌ పరిధిలో 13 కేసుల్లో వాంటెడ్‌ నిందితుడని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కంటే ముందు చోరీ కేసులో 4 నెలలు రిమాండులో ఉన్నాడని వివరించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్లతో సంబంధాలున్నాయని తెలిపారు. స్మగ్లింగ్‌ ద్వారా సంపాదించిన నగదును సినీరంగంలో ఫైనాన్స్‌ చేసేవాడన్నారు.

yerrachandanam 18072018 3

కాగా, టాస్క్‌ఫోర్సు ఐజీ ఎదుట లొంగిపోయే ముందు హరి మీడియాతో మాట్లాడాడు. 2014లో తన తల్లి అనారోగ్య పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రి వైద్యఖర్చుల కోసం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డానని అంగీకరించాడు. ఇతను ఫైనాన్స్ చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణానంతర దశలో ఉన్నాయని తెలుస్తోంది.. అయితే మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. విచారణ జరిపి, వీరిని కూడా అరెస్ట్ చేతామని పోలీసులు అంటున్నారు.

దశాబ్దాలుగా కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసి, రాజకీయంగా పావుగా మారి, చివరకు ఆ వెంకన్ననే రోడ్డుకు లాగిన, శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, సడన్ గా ప్లేట్ మార్చారు. మొన్నటి దాక చంద్రబాబుని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాలని, విఫలయత్నం చేసి, చివరకు కేంద్ర న్యాయ శాఖ నుంచి కూడా మొట్టికాయలు తిని, ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా మాట్లడతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మనిషిలో మార్పు ఎమన్నా వచ్చిందా, లేక ఇంకా ఏమైనా కుట్రా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం ఆయన చెన్నైలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.

deekshitulu 18072018 2

ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏమీ లేదని, కొందరి ప్రోద్బలంతోనే తనపట్ల ఆయనకు వ్యతిరేకత ఏర్పడిందని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు తెలిపారు. తాను గతంలో చేసిన ఆరోపణల పై భక్తుల నుంచి స్పందన కరువైందని, కొండమీదున్న సాటి అర్చకుల మద్దతుకూడా లభించలేదని, ఎందుకు ఇలా జరిగిందో అని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎస్వీ యూనివర్సిటీలో నాకు జూనియర్‌. నాకు బాగా పరిచయమైన వ్యక్తి. కొంతమంది ప్రోద్బలంతో ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మనసులో మాత్రం ఏమీ లేదు. మేమంతా స్వామివారి భక్తులమే. నేను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటా. ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకోవాలి అని రమణ దీక్షితులు అన్నారు.

deekshitulu 18072018 3

మరో పక్క మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలు రద్దు చెయ్యకూడదు అని అన్నారు. అయితే, వీలైనంత వరకు, పరిమిత సంఖ్యలోనైనా దర్శనాలకు అనుమతించాలని సీఎం అప్పటికే ఆదేశించారని విలేకరులు రమణ దీక్షితులు దృష్టికి తీసుకొచ్చారు. ఇది విని, చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు, టిటిడి ఇప్పటికైనా ఆ నిర్ణయం సమీక్షించాలి అని అన్నారు. అయితే, ఇప్పుడు రమణ దీక్షితులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒక పక్క బీజేపీ అగ్ర నేతలను కలవటం, మరో పక్క జగన్ ను కలవటం, క్రీస్టియన్ మత ప్రచారాకులతో ప్రెస్ మీట్లు పెట్టి, రాష్ట్ర పరువుని తీస్తూ, తిరుమల పవిత్రతను దెబ్బ తీసిన దీక్షితులు, ఇప్పుడు ఎందుకు ఇలా చంద్రబాబుని పోగుడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

రేయింబవళ్లు అన్నది చూడక పోలవరం పనులు సాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో తిరిగి సోమవారమే ప్రాజెక్టు పనుల్నిఆరంభించారు. ప్రతికూల పరిస్థితుల్నీ ఎంత మాత్రం లక్ష్య పెట్టడం లేదు. కేవలం కుంభ వర్షం కారణం గానే ఆదివారం తప్పని సరి పరిస్థితుల్లో పనులకు విరామం ఇచ్చారు. ఊహించని విధంగా కొంత మేర వాతావరణం సహకరించడంతో స్పిల్‌ వే పనుల్నీ మొదలెట్టారు. ఒక రోజు పని పోవడాన్ని కంపెనీ, అధికా రులు జీర్ణించుకున్నట్లు లేరు. బహుశా వీరు ఆదివారం రాత్రి నిద్రపోయినట్లు లేరేమో! అన్పిస్తోంది. నిర్దేశించిన సమయానికే ఎలాగైనా సరే పనుల్ని పూర్తి చేసేందుకు నవయుగ కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఉందన్నది విస్పష్టం. పగేలే కాదు, రాత్రి వేళా పనుల్ని లైటింగ్‌లో చేసేందుకు మోపును పెట్టారు.

poalvaram 17072018 2

అసలే పైన కారు మబ్బులుతో ఆకాశం గర్జిస్తోంది. ఏ మాత్రం జంకు లేకుండా ఇంజనీరింగ్‌ అధికారులు కమిట్‌ మెంట్‌తో ఉన్నారు. సాయంత్రం సమయమే చిమ్మ చీకట్లను ఆ ప్రాంతం అల ముకుంది. చక్కటి లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో చూసేందుకు అదో అనుభూతన్నట్లు పనులు సాగుతు న్నాయి. బహుశా ఇందు కోసమే సిఎం చంద్రబాబు కంపెనీ హెడ్‌ శ్రీధర్‌ పై అపార నమ్మకాన్ని ఉంచారన్పి స్తోంది. రాష్ట్ర సర్కార్‌ నమ్మకాన్ని కాంట్రాక్ట్‌ ఏజెన్సీ, ఇంజనీరింగ్‌ ఉన్నాతాధికారులు వమ్ము చేయకుంది. తమ లక్ష్యంలో ఓ రోజు అనుకోకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వెనక బడ్డ ఒక రోజు పనిని రికవరీ చేసేందుకు వీరంతా ఎంతో హైరానా పడుతున్నారు. నిజంగా ఇది అభినందనీయమే. మరో మారు శభాష్‌ అన్పించుకునేందుకు వీరంతా తాపత్రయ పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది.

poalvaram 17072018 3

ఏ కొద్ది పాటి వర్షాన్నీ లెక్క చేయడం లేదు. నిజంగా పని రాక్షసులు అనే పదం వీరికి అచ్చుగుద్దినట్లు సరిపోతుందన్పి స్తోంది. ఒక రోజు విరామాన్ని తామెంత మాత్రం ఊహించలేదని ఈఎన్‌సి ఎం వెంకటేశ్వరావు ఆంధ్రప్రభ బ్యూరోతో అన్నారు. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లుగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ నవయుగ , ఇంజనీరింగ్‌ అధికార యంత్రాంగం చిత్త శుద్దితో కన్పిస్తోంది. చుట్టూ ఆందోళన కరమైన గోదావరి పరవళ్లనూ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. విరామం లేకుండా సాగుతున్న పోలవరం పనులపై ప్రజానీకం హర్షామోదంతో ఉంది. రాజకీయ అవరోధాలే కాదు, ప్రకృతి ఆటంకాలనూ పోలవరం అధిగమిస్తుండటం అనిర్వచనీయమే అంటున్నారు. పోలవరం సాగుతున్న తీరును చూసి ప్రత్యర్థి వర్గాలు సైతం ఔరా ! అనక తప్పదన్నట్లుంది. ఏపీకి జీవనాడైన పోలవరాన్ని అన్ని విధాలా అంతా స్వాగతిస్తున్నారు. (ఆంధ్రప్రభ సేకరణ)

రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, కొత్త కొత్త వ్యూహాలతో రాష్ట్రం పై విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతుకులాడిన బీజేపీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కింగ్‌మేకర్ కావాలని భావిస్తోంది. బీజేపీ, ఎన్డీయేతో టీపీపీ తెగతెంపులు చేసుకున్న తరువాత రాష్టానికి కొత్త అధ్యక్షునిగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర పెద్దల ఆదేశాలను, అమిత్‌షా రాజకీయాన్ని యథాతథంగా ఇక్కడ అమలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ, 2019లో కాషాయ జెండా రెపరెపలను చూడాలని అధిష్ఠానం ఆశిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ, రెండు ఎంపీ సీట్లను, నాలుగు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న సంకేతాలు బీజేపీ శ్రేణులకు అందాయి.

bjp 17072018 2

దీంతో ఏపీలో 25 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వీటిలో 10కి పైగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని పార్టీ అగ్రనేతలు తెలియచేశారు. పార్టీ ఇప్పటికే ఎంపిక చేసుకున్న 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోబోతోంది. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతోపాటు, కేంద్రం నుంచి అదనంగా నిధులు తెప్పించుకుని, అక్కడ బలీయమైన శక్తిగా ఎదగాలన్న ఆలోచనలో ఉంది.

bjp 17072018 3

నెలకు ఒక కేంద్ర మంత్రిని ఏపీకి తీసుకువచ్చి, ఆయా శాఖల ద్వారా ఏపీకి ఇచ్చిన నిధుల గురించి వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, నడ్డా ఏపీలో పర్యటించి వెళ్లారు. త్వరలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాష్ట్రానికి రాబోతున్నారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. అంతేకాదు, వచ్చే నెలలో బీజేపీ చీఫ్ అమిత్‌షా ఏపీకి వస్తున్నట్టు బీజేపీ నాయకులు తెలియచేశారు. అమిత్‌షా ఏపీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని వారు తెలియచేశారు.

Advertisements

Latest Articles

Most Read