అన్యాయం జరిగింది అంటూ, కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీకి, అతి తక్కువ టైం కేటాయించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుంది మేమే కాబట్టి, మా రాష్ట్ర సమస్యల పైనే అవిశ్వాసం పెడుతున్నాం కాబట్టి, గంట సమయం కేటాయించమని తెలుగుదేశం కోరింది. కానీ, మేడమ్ స్పీకర్ గారు, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తెదేపా కి కేవలం 13 నిమిషాలు, దాన్ని బలపరిచిన కాంగ్రెస్ కి 38 నిమిషాలు మాత్రమే కేటాయించి, అధికార పక్షానికి మాత్రం 3 గంటల 33 నిమిషాలు కేటాయించారు. పార్లమెంట్ ని బుల్దోజ్ చేయటం చెయ్యటంలో మోడీ తరువాతే ఎవరైనా. కనీసం మన వాదన వినిపించుకొనే అవకాశం కూడా లేకుండా, వీరి దుర్మార్గాలు ఎక్కడ బయట పడిపోతాయో అని, ఇలా కేవలం 13 నిమషాలు మాత్రమే ఇచ్చారు.

time 19072018 2

అప్పట్లో, కాంగ్రెస్ బీజేపీలు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రుల గొంతు కోశారు. ఇప్పుడు బీజేపీ తలుపులు తెరిచి 13 నిమిషాలు మాత్రమే కేటాయించి ఆంధ్రుల గొంతు నొక్కుతుంది. ఇలాంటి దుర్మార్గాల మీదే అవిశ్వాసం పెడితే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. లోక్‌సభ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. లోక్‌సభలో ఆయా పార్టీల బలాబలాలను బట్టి పార్టీలకు సమయం కేటాయించారు. అత్యధికంగా బీజేపీకి 3:33 గంటలకు కేటాయించగా, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, అన్నాడీఎంకేకు 29 నిమిషాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 27 నిమిషాలు, బీజేడీకు 15 నిమిషాలు, శివసేనకు 14 నిమిషాలు, టీడీపీకి 13 నిమిషాలు, టీఆర్ఎస్‌కు 9 నిమిషాలు, సీపీఎంకు ఏడు నిమిషాలు, సమాజ్‌వాదీ పార్టీకి ఆరు నిమిషాలు, ఎన్‌సీపీకి ఆరు నిమిషాలు, ఎల్‌జేఎస్‌పీకి ఐదు నిమిషాల చొప్పున కేటాయించారు.

time 19072018 3

ఆయా పార్టీలకు ఇచ్చిన సమయంలోపు సభ్యులు సభలో మాట్లాడాల్సి ఉంటుంది. అధికార భాజపా మద్దతు కూడగట్టుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. భాజపా మిత్రపక్షమైన శివసేన ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తామని వెల్లడించింది. చర్చ జరగనున్న సందర్భంగా కాంగ్రెస్‌, భాజపా, ఆప్‌, తెదేపాతో పాలు పలు పార్టీలు ఆయా ఎంపీలందరూ తప్పకుండా సభకు హాజరు కావాల్సిందిగా విప్‌ జారీ చేశాయి. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించనున్నారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అవిశ్వాసంపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఒక పక్క లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం పై చర్చ రేపు జరుగుతున్న నేపధ్యంలో, ఇటు రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తెచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు దూకుడుగా వ్యవహరించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు పట్టుబట్టారు. చివరికి సోమవారం చర్చ చేపట్టడానికి సభాధ్యక్షుడు వెంకయ్య అంగీకరించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత 267 నిబంధన కింద తాను ఇచ్చిన నోటీసుపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ప్రస్తావించారు. ప్రతిపక్షనేత గలాం నబీ ఆజాద్‌, ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ, సీపీఎం నేత టీకే రంగరాజన్‌తో పాటు తదితరులు ఆయా అంశాలపై ఇదే నిబంధన కింద నోటీసులు ఇచ్చారని వెంకయ్య చెప్పారు.

rajyasabha 19072018 2

రమేశ్‌ ఇచ్చిన నోటీసు మినహా... మిగిలిన నోటీసులను తిరస్కరించి, వాటిని జీరో అవర్‌ నోటీసు కింద మారుస్తున్నానని స్పష్టం చేశారు. రమేశ్‌ నోటీసును స్వల్పకాలిక చర్చకు మార్చి చర్చకు అనుమతిస్తున్నానని, రెండ్రోజుల్లో చర్చ ఉంటుందని ప్రకటించారు. తక్షణమే చర్చ చేపట్టాలని రమేశ్‌ డిమాండ్‌ చేశారు. చర్చకు అనుమతించడానికి తనకు అభ్యంతరం లేదని కానీ సంబంధిత మంత్రి సిద్ధంగా ఉండాలి కాదా అని వెంకయ్య అన్నారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ చర్చ గురించి ప్రస్తావించారు.

rajyasabha 19072018 3

ఈ అంశంపై చర్చించడానికి కనీసం నాలుగు గంటలు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే సభ సజావుగా నడవడానికి సహకరిస్తామని సుజనా చౌదరి తెలిపారు. దానికి వెంకయ్య అంగీకరించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పై సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ మేరకు బీఏసీలో నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ సమస్యల పై తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు ఇంత ఆందోళన చేసినా, వైసీపీ ఎంపీలు విజయసాయి, వేమిరెడ్డి ప్రేక్షకపాత్ర పోషించారు. మోడీ, అమిత్ షా ఏమన్నా అంటారేమో అని, అలాగే చూస్తూ కూర్చున్నారు.

భక్తులు అభిప్రాయాల మేరకు మహాసంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శన విధివిధానాలను రూపొందించాలని టీటీడీ సంకల్పించింది. ఇందుకు యాత్రికుల అభిప్రాయం మేరకు నడుచుకోవాలని తలచింది. ఇప్పటికే సలహాలు, సూచనలు స్వీకరించడం ప్రారంభించింది. మహాసంప్రోక్షణకు ఆగస్టు 11న అంకురార్పణ జరగనుంది. 12 నుంచి 16 వరకు మహాసంప్రోక్షణ జరుగుతుంది. ఆ రోజుల్లో స్వామి దర్శనానికి అతి తక్కువ సమయం ఉండడం, ఈ తరుణంలో వేలాదిగా తరలివచ్చే పక్షంలో ఆరు రోజుల పాటు యాత్రికులకు తలెత్తే సమస్యలను అంచనా వేసి టీటీడీ నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు, దేవస్థానం నిర్ణయాలు సరిగ్గా లేవంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ttd 19072018 2

దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి.. టీటీడీకు ఆదేశాలు ఇవ్వడంతో ధర్మకర్తల మండలితో పాటు ఉన్నతాధికారులు దిగివచ్చారు. మహాసంప్రోక్షణ వేళ పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పనపై అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆగమ పండితులు, అర్చకులు నిర్ణయించిన షెడ్యూలు మేరకు పరిశీలిస్తే అంకురార్పణ జరిగే 11వ తేదీన 9 గంటలు, మహాసంప్రోక్షణ ప్రారంభమయ్యే 12న 4 గంటలు, 13న 4, 14న 6, 15న 5, పూర్ణాహుతి జరిగే చివరి రోజు 16న 4 గంటల చొప్పున స్వామివారి మహాలఘు దర్శనానికి సమయం ఉంటుంది. గంటకు 4 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించడానికి వీలవుతుంది.

ttd 19072018 3

ఈ సమయంలో ఏ విధానాన్ని అనుసరించి శ్రీవారి దర్శనానికి అనుమతించాలనే విషయమై టీటీడీ అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. మెజార్టీ యాత్రికుల అభిప్రాయం మేరకు ఈనెల 24న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ నెల 23న మధ్యాహ్నం లోపు సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేసింది. సలహాలు, సూచనల తెలియజేసేందుకు.. * టీటీడీ కాల్‌ సెంటర్‌ నంబర్లు- 0877 2233333, 2277777 * వాట్సాప్‌ నంబరు- 93993 99399 * టోల్‌ఫ్రీ నంబర్లు- 1800 425 4141, 1800 425 3333 * ఈ-మెయిల్‌ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

"జగన్ వేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్".. ప్రతి సారి చెప్పే విషయమే... ఎందుకంటే, మనోడు నెలకి ఒక సెల్ఫ్ గోల వేసుకుంటూ ఉంటాడు... అయితే, ఈ సారి మాత్రం, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు... పార్లమెంటులో ఏపీ సమస్యలే అజెండాగా పోరు సాగుతున్న కీలక సమయంలో... ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోంది. ఎంపీల రాజీనామాల నేపథ్యంలో... సభా సాక్షిగా కేంద్రాన్ని నిలదీసే అవకాశం కోల్పోయింది. అటు ఉప ఎన్నికలూ రాక... ఇటు కీలకమైన సమయంలో లోక్‌సభలో తమ ఉనికి లేక వైసీపీ త్రిశంకు స్వర్గంలో నిల్చుంది... రాజీనామాలు చేసి, తమ గొంతను తామే కట్టేసుకున్నట్లయింది. ‘ఉప ఎన్నికలైనా జరిగి ఉంటే... హోదాపై మేం చేసిన రాజీనామాలపై ప్రజా తీర్పు ఇదీ అని చెప్పగలిగేవాళ్లం. ఇప్పుడు అదీ లేదు, ఇదీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది’’ అని వైసీపీ వర్గాలే వాపోతున్నాయి.

jagan 19072018 2

మొత్తం మీద తమ రాజకీయ కంఠస్వరం బలహీనపడకుండా ఎప్పటికప్పుడు గొంతుని సవరించుకుంటున్న వైకాపా తాజా పరిణామాలతో వచ్చే ఎన్నికల దాకా తమ విమర్శల దాడిని సజీవంగా ఉంచుకునేందుకు మంచి అవకాశాన్ని కొట్టేసినట్టయింది. ప్రభుత్వాన్ని పడగొట్టలేని అవిశ్వాసంతో తెలుగు దేశం మున్ముందు వాడిగా వేడిగా గొంతు పెగల్చలేక పోవచ్చన్నది వైకాపా ఆలోచనగా ఉండొచ్చు. మరో పక్క ఆ పార్టీ తరఫున గెలిచిన బుట్టారేణుక, ఎస్‌పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీకి; పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెరాసకు అనుకూలంగా ఉన్నారు. కొత్తపల్లి గీత ఏపార్టీలోకి వెళ్లనప్పటికీ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని వైకాపా స్పీకర్‌ ముందు అనర్హత పిటిషన్లు కూడా దాఖలు చేసింది. వీరిపై అనర్హత వేటు వేయించడానికి విప్‌ను ఆయుధంగా వాడుకొనే అవకాశం ఎంపీల రాజీనామా కారణంగా వైకాపా కోల్పోయింది.

jagan 19072018 3

పార్టీ తరఫున సభాపక్షనాయకుడుకానీ, చీఫ్‌విప్‌ కానీ విప్‌ జారీ చేయాలి. ఇప్పుడు ఆ రెండు స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. మిగిలిన నలుగురిలో ఎవరో ఒకరికి విప్‌ జారీచేసేలా ఉత్తర్వులు జారీ చేద్దామనుకున్నా ఇప్పటికే ఆ నలుగురికి వ్యతిరేకంగా అనర్హత పిటిషన్లు దాఖలు అయ్యాయి కాబట్టి పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేయలేరని న్యాయనిపుణులు పేర్కొన్నారు. దీంతో జగన్ కు అన్ని దారుపు మూసుకుపోయాయి. ఒక పక్క రాష్ట్రం తరుపున, కనీసం బీజేపీకి ఎదురుగా మాట్లాడలేని పరిస్థితి. మరో పక్క మోడీని కాని, అమిత్ షా ని కాని, కనీసం ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి. ప్రస్తుతం, 5 కోట్ల ఆంధ్రులు, మోడీ పై కోపంగా ఉన్న సమయంలో, జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే, ఇది అతి పెద్ద సెల్ఫ్ గోల్ అని, కాంగ్రెస్ పార్టీలాగా ఇక భూస్థాపితమే అంటున్నారు విశ్లేషకులు.

Advertisements

Latest Articles

Most Read