తాను పరుగుతీస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించానని, నాలుగేళ్ళలో దేశం ఏపీ వైపు చూసేలా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రగతిపథంలో పయనించేలా శ్రమించానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో అందరి సహకారం అనివార్యమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని దోనేపూడి గ్రామంలో సోమవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నవ్యాంధ్ర సాధనలో త్యాగాలకు సిద్ధమని, 2004లో జరిగిన తప్పిదాన్ని పునరావృతం చేయొద్దంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

cbnhelp 17072018 2

ఒకసారి ప్రజలు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి పోయిందని తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కుల, మత వర్గ భేదాలకు, అవినీతికి, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనేదే సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ది, ఆనందం, ఆరోగ్యం ఈ మూడు ప్రతి పేదవాని కళ్ళల్లో కనపడాలని, అదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి కట్టించి ఇస్తామన్నారు.

cbnhelp 17072018 3

మహిళల ఆత్మ గౌరవాన్ని నిలిపేందుకు చేపట్టి నిర్మించిన మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ వినియోగించాలని అన్నారు. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి చెప్పుకోలేనిదని, వారికి ఆ స్థితి కలుగకూడదనే ఆలోచనతో చంద్రన్న బీమా కింద సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. దోనేపూడి గ్రామంలో పెన్షన్లకు సంబంధించి అందిన 32 దరఖాస్తులను ఆమోదిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై గ్రామ స్థాయి అధికారులు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించారు. తొలుత చౌక దుకాణాల ద్వారా వినియోగ దారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులపై లబ్దిదారులతోనూ , దుకాణాల డీలర్ల సమక్షంలో సమీక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై స్వయంగా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించారు. వారి ఇళ్ళల్లోకి వెళ్లి కుటుంబాలను పలకరించారు.

పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి కేంద్రం దగ్గర నిలిచిపోయిన ఆకృతుల కు త్వరితగతిన ఆమోదం లభించేలా ప్రయత్నించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు ఆదేశించారు. అలాగే పెండింగ్‌ డిజైన్లు అన్నింటి నీ సిద్ధం చేసి, తుది అనుమతుల కోసం కేంద్రానికి ఆగస్టులోగా పంపాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగ తిపై సోమవారం సచివాలయంలో 67వ సారి ముఖ్యమంత్రి వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. నిరాటంకంగా కురుస్తున్న వానలతో కాంక్రీట్‌ – తవ్వకం పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు 56.53 శాతం పూర్తయిందని తెలిపారు. మొత్తం పనుల్లో తవ్వకం పనులు 76.20శాతం , కాంక్రీట్‌ పనులు 30.10శాతం చేపట్టినట్టు వివరించారు.

andhra 17072018 2

కుడి ప్రధాన కాలువ 90 శాతం ఎడమ ప్రధాన కాలువ 62.15 శాతం నిర్మాణం పూర్త య్యిందని, అలాగే రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 61.44శాతం, కాఫర్‌ డ్యాం జెట్‌ గ్రౌం టింగ్‌ పనులు 93శాతం చేపట్టినట్టు వెల్లడించారు. గత వారం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌, లెప్ట్‌n ప్లnాంక్‌ తవ్వకం పనులు 1.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర చేపట్టగా, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీట్‌ పనులు 30 వేల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్‌ మీటర్లకు గాను ఇప్పటివరకు 850 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి.

andhra 17072018 3

స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 11.08 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 18 వేల మెట్రిక్‌ టన్నులకు 11,060 మెట్రిక్‌ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. నాగావళి – వంశధార అనుసంధానానికి ఇంకా అవసరమైన 320 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అడవిపల్లి లిప్ట్‌ – కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ఈ నెలాఖరుకు, నెల్లూరు బ్యారేజ్‌ – సంగం బ్యారేజ్‌ ఆగస్టు చివరి నాటికి, మల్లెమడుగు రిజర్వాయర్‌ ఈ ఏడాది అంతానికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ఈ నాలుగేళ్లలో ‘నీరు – ప్రగతి’ కార్యక్రమం కింద 8,10,003 పంటకుంటలు, 88,403 చెక్‌ డ్యాంలు నిర్మించినట్టు చెప్పారు.

టిడిపి అధిష్టానం వైఖరితో మనస్థాపం చెంది ఆనం కుటుంబం టీడీపీని వీడుతుందని, జగన్‌ పార్టీలోకి వెళ్తున్నామని, ఆయనతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆనం వివేకా కుమారుడు, నెల్లూరు 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. వస్తున్న పుకార్లు వాస్తవం కాదని 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి అన్నారు. సోమవారం తన డివిజన్‌ పరిధిలోని సౌత్‌రాజుపాళెంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌తో మేము ఎవరూ టచ్‌లో లేమని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి మేయర్‌ పదవులు ఇస్తారంటూ వస్తున్న కథనాల్లోనూ వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

aanam 17072018 2

మాకు పార్టీ మారే ఆలోచన లేకపోయినా ఆత్మీయులతో సంప్రదించాక ముందుస్తు నిర్ణయాన్ని వెల్లడించి ఆపై తుది అడుగు వేస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం ఆనం జగన్‌తో భేటీ అయ్యారన్నది వాస్తవం కాదన్నారు. అనంతరం ఆయన పనులు పరిశీలించి తనిఖీ చేశారు. మరో పక్క, నెల్లూరు తెలుగుదేశం అధ్యక్షుడుగా ఆనం జయకుమార్‌రెడ్డిని నియమితులు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలిసింది. టీడీపీ పట్ల అభిమానం, నగర రాజకీయాలపై అనుభవాలు ప్రధాన అర్హతలుగా జయకుమార్‌రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేశారు. బీసీ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త నగర కమిటీ ఏర్పాటు కు కసరత్తు జరుగుతోంది.

aanam 17072018 3

ఆనం జయకుమార్‌రెడ్డిని నగర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయన పార్టీ పట్ల చూపుతున్న విశ్వసనీయత. రెండు నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అను భవం. జయకుమా ర్‌రెడ్డి ఆనం వివేకా, రామనారాయణ రెడ్డిల కన్నా ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వెంట ఆయన తెలుగు దేశంలోకి అడుగుపెట్టారు. తాజా గా ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ వీడిపోతురనే ప్రచారం జరిగినా, జయకుమార్‌రెడ్డి తెలుగుదేశంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆదాల ప్రభకర్‌రెడ్డి వెంట రాగా రెండు సార్లు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న అభిమానం చంద్రబాబును ఆకర్షించింది. అలాగే నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అనుభవం కూడా అధ్యక్షపదవికి అర్హత సంపాదించి పెట్టింది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో, నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం గురించి మరిన్ని విషయాలను తాజాగా ఆయన ప్రస్తావించారు. ఉండవల్లి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి భేటీలో ఎలాంటి రాజకీయాంశాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. చంద్రబాబుతో భేటీ అయ్యానని జగన్ అభిమానులు ఏమనుకున్నా తనకు ఎలాంటి నష్టం లేదని, పార్టీలను కలిపే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలిచినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా వెళ్లానని అన్నారు. రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి గొడవా జరగకపోతే విభజన చట్టంలోని అంశాలు ప్రస్తావనకు వస్తాయని అన్నారు.

undavalli 17072018 2

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి తెలియజెబుతూ, దేశంలోని పలు పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కలవడం ద్వారా ఏదైనా ప్రయోజనం లభించవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ‘‘రాజ్యాంగానికి వ్యతిరేకంగా విభజన జరిగిందంటూ నేను గతంలో లేఖలు రాసిన నేపథ్యంలో.. పార్లమెంటు లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు రా వాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, రాష్ట్ర విభజన చట్టం అమలు తీరు పై మా మధ్య చర్చ జరిగింది. ఈ అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించాం’’ అని మీడియాకు ఉండవల్లి వివరించారు

undavalli 17072018 3

తాను ఏ పార్టీలోనూ లేనని, కొత్తగా చేరే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. దీనిపై నేను మొదటి నుంచీ పోరాటం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా పార్లమెంటులో కోర్టు జోక్యం చేసుకోలేదని.. అయితే పార్లమెంటులో ఆ పనిని ఎంపీలు చేయొచ్చునన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు కదా అన్న ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నేను రాజీనామాలకు వ్యతిరేకం. అయితే నేనూ గతంలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని ఉండవల్లి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read