ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు చంద్రబాబు సర్కారు తీపి కబురు అందించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రెండు కేటగిరీ ఉద్యోగుల వేతనాలను ఏకంగా 50 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నాళ్లగానో వేచిచూస్తున్న ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 60 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, వారిలో అంగనవాడీ, హోంగార్డులు కూడా ఉన్నారు.

outsourcing 030222018 2

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రెండు కేటగిరీ ఉద్యోగుల వేతనాలను ఏకంగా 50 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. 2016లో ప్రభుత్వం వేతనాలను పెంచుతూ జీవో జారీ చేసింది. అయితే పెంపు వల్ల కొందరికే ప్రయోజనమంటూ జరిగిందని.. అందుకే రెండు కేటగిరీల ఉద్యోగులకు జీతాలను పెంచాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ ఆమోదంతో అవుట్ సోర్సింగ్ వేతనాలను పెంచారు.

outsourcing 030222018 3

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కమిటీ అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఇక పై అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు ఇప్పుడు రూపొందించే మార్గదర్శకాల ప్రాతిపదికనే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనివల్ల అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కనీస వేతనం పెరగడంతో పాటు థర్డ్‌ పార్టీ ఏజెన్సీల కమీషన శాతం తగ్గుతుంది.

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, సియాటిల్‌లో శాంసంగ్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ కాల్‌రామన్‌ ని కలిసారు... ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో, రాష్ట్రంలో శాంసంగ్‌ గ్లోబల్‌ ఈ-కామర్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యటానికి ముందుకొచ్చింది... పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ దిశగా సాధించిన పురోగతిని లోకేశ్‌ వివరించారు. శాంసంగ్‌ గ్లోబల్‌ ఈ-కామర్స్‌ సెంటర్‌ను మీ రాష్ట్రంలో ఏర్పాటుచేస్తాం. స్వచ్ఛందంగా నేను పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నాను. ఏపీలో ఒక స్కూల్‌ నిర్మిస్తాను. వెయ్యిమంది పేద విద్యార్థుల్ని దత్తత తీసుకుంటాను’ అని ప్రకటించారు.

samsung 03022018 2

ఇదే సందర్భంలో, కాల్‌రామన్‌ స్పందిస్తూ... ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పెద్ద అభిమానిని. చంద్రబాబు ఆలోచనల్ని, ఆయన విజన్‌ని బలంగా నమ్ముతాను. నేను అమెజాన్‌లో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఆ కంపెనీ ఏర్పాటుకు మూడురోజుల్లోనే అనుమతులిచ్చారు. ఇప్పుడక్కడ 30వేల ఉద్యోగాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు అన్నిరకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరు మాటిస్తే దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం ఉంది. శాంసంగ్‌ వివిధ రంగాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం." అని అన్నారు...

samsung 03022018 3

మరోవైపు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ అగ్రికల్చర్‌ డెవల్‌పమెంట్‌ డైరక్టర్‌ నిక్‌ ఆస్టిన్‌, ఇతర ప్రతినిధులతోనూ లోకేశ్‌ సమావేశమై డిజిటల్‌ వ్యవసాయంపై చర్చించారు. గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, విద్య, వైద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్‌ కోరారు. చిన్నారులలో పోషకాహార లేమితో వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేలా రైస్‌ పోర్టిఫికేషన్‌లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గేట్స్‌ ప్రతినిధులు అందుకు సానుకూలత వ్యక్తం చేశారు. అమెజాన్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలీ ఉపాధ్యక్షుడు మైకేల్‌ పంక్‌తో కూడా లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏపీలో క్లౌడ్‌ సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెజాన్‌ను ఇండియాలో విస్తరించే ఆలోచన ఉంటే తమ రాష్ట్రంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మైకేల్‌ స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న తమ బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామన్నారు. వాషింగ్టన్‌ స్టేట్‌ ఇండియా ట్రేడ్‌ రిలేషన్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ పాల్గొన్న లోకేశ్‌... ఆ ప్రతినిధులను రాష్ర్టానికి ఆహ్వానించారు.

బౌద్ధ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు, విశ్వశాంతి కోసం నవ్యాంధ్రలో బౌద్ద సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మూడు రోజులపాటు నిర్వహించే అమరావతి బౌద్ద సాంస్కృతిక ఉత్సవాలు శనివారం నుంచి విజయవాడలో ప్రారంభంకానున్నాయి. స్వరాజ్య మైదానంలో ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. 15 దేశాల నుంచి 1500 మంది బౌద్ధ భిక్షువులు ఈ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరవుతారు. ప్రపంచ రికార్డు కోసం లక్ష మంది భిక్షువులతో బుద్ధ అఖండ నామస్మరణ చేయనున్నారు.

dalailama 03022018 2

ఉదయం ఏడు గంటలకు శాంతియాత్రతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ధర్మానికి పుట్టినిల్లు అయిన అమరావతి కేంద్రంగా అఖండ నామస్మరణతో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఈ ఉత్సవం వేదిక కానుంది. స్వరాజ్యమైదానంలో ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. 15 దేశాల నుంచి 1500 బౌద్ద భిక్షులు ఈ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరవుతారు. ప్రపంచ రికార్డు కోసం లక్ష మంది భిక్షువులతో బుద్ద అఖండ నామస్మరణ చేయనున్నారు. 1,500 మంది ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటుండగా, మిగిలిన వారంతా ఆన్లైన్లలో పాల్గొంటారు... శ్రీలంక, చైనా, టిబెట్, మలేషియా, సింగపూర్, అమెరికా, థాయ్లాండ్, జపాన్, నేపాల్ లండన్, కొరియా వంటి దేశాలను బౌద్ద గురువులు, భిక్షువులు ఇక్కడికి వస్తున్నారు.

dalailama 03022018 3

రెండో రోజున బౌద్ద మతగురువు దలైలామా హాజరవుతారు. ప్రధానంగా శ్రీలంకకు చెందిన బౌద్ద సన్యాసిని బిక్కుని కుసుమతో పాటు కనక సభ ఆర్ట్ సెంటర్ సంచాలకురాలు సిరీరామ, అమెరికా నుంచి బౌద్దాచార్యుల , ప్రజ్వలరత్న వజ్రా చార్యా, ప్రొఫెసర్ దమ్మా జ్యోతి వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిక్షువులు, గురువులకు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ బౌద్ద క్షేత్రాలను సందర్శించే విధంగా ఏర్పాటు చేశామని పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ శుక్లా చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌ లో, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం విషయంలో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలు కేంద్రం పై గుర్రుగా ఉన్నారు... సోషల్ మీడియాలో అయితే, కేంద్రం పై దుమ్మెత్తి పోస్తున్నారు... మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు... అటు వైపు నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు, ఏమి ఇవ్వకపోయినా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు... ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది...

guntur 03022018 2

కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై, అదే విధంగా తెలుగుదేశం మిత్రపక్షంగా ఉండటం పై, కొంత మంది ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు... 'బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు ..మన గింజలు కూడా మనకు దక్కవు' అన్న నినాదంతో రాసిన ఫ్లెక్సీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద దర్శనమిస్తోంది. టీడీపీ అభిమానుల పేరుతో వెలసిన ఈ ఫ్లెక్సీని గుంటూరు వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

guntur 03022018 3

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించారన్న చర్చకు ఈ ఫ్లెక్సీ అద్దం పడుతోంది. ఇప్పటికే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ రాజకీయ నాయకులు, వామపక్షాలు రోడ్ల పై నిరసనలు చేపట్టారు. తాజాగా టీడీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ-బీజేపీ సంబంధాలు బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపించడంతో మరింత దిగజారాయి. ఇప్పుడు ఆ చిచ్చును ఈ ఫ్లెక్సీ మరింత దూరం తీసుకెళ్లేలా కనిపిస్తోంది.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, సాయంత్రం, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసారు... ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులతో చర్చించారు... సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, మాట్లాడుతూ, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని అమిత్ షా అన్నారు... అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా... ఎన్నో చేసాం... ఎన్నో ఇచ్చాం... ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు... బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి" అంటూ అమిత్ షా గీతోపదేశం చేసి పంపించారు...

narayana 03022018 2

ఇదే సందర్భంలో నిధుల గురించి మాట్లాడుతూ... రైల్వే జోన్ అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు చెప్పారు... అమరావతికి సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రోగ్రసివ్ రిపోర్ట్)ను ఇప్పటివరకూ ఇవ్వేలేదు అని అందుకే, అమరావతికి నిధులు ఇవ్వటం లేదు అని చెప్పారు... అప్పటి నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా, అదే పల్లవి అందుకుని, డీపీఆర్ ఇవ్వలేదు అంటూ ఎదురు దాడి మొదలు పెట్టారు... వీరందరి విమర్శల పై, అమరావతి వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ స్పందించారు...

narayana 03022018 3

కేంద్రానికి డీపీఆర్ పంపలేదనడం అవాస్తవమని మంత్రి నారాయణ తేల్చిచెప్పారు. డీపీఆర్ పంపలేదు కాబట్టే నిధులు కేటాయించలేదనడం అర్థరహితమన్నారు. సీఆర్‌డీఏ అభివృద్ధికి రూ. 5 లక్షల కోట్లు అవుతుందని చలా రోజుల క్రితమే డీపీఆర్‌ ఇచ్చామన్నారు. రాజధానిలో పరిపాలన భవన నిర్మాణాలకూ డీపీఆర్ పంపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిపాలన భవన నిర్మాణాలకు 5 వేల కోట్ల అంచనాలతో, డీపీఆర్‌ ఇచ్చామన్నారు... మరి, మంత్రి హోదాలో ఆన్ రికార్డు చెప్పిన వ్యాఖ్యలకు, అమిత్ షా ఏమి సమాధానం చెప్తారో చూద్దాం...

More Articles ...

Advertisements

Latest Articles

Most Read