తెలుగుదేశం ఎంపీలు నిరసనల ఉద్ధృతి పెంచటంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లియ్యాయి... దీంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి... లోక్ సభ నడిపే పరిస్థితి లేదని చెబుతూ, లోక్‌సభను సభాపతి సుమిత్రా మహాజన్ మార్చి 5 వరకు వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ శుక్రవారం సాయంత్రం 2-30 గంటల వరకు వాయిదా పడింది... వాయిదా అనంతరం 12 గంటలకు సభ ప్రారంభం అయ్యింది... ఆ సమయంలో పలువురు సభ్యులు హడావిడిగా బిల్లులను ప్రవేశపెట్టారు...

loksabha vayida 09022018 2

బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కూడా తెలుగుదేశం ఎంపీలు నిరసనల తీవ్రతరం చేసారు.. నినాదాల మధ్యే, బిల్లులు ప్రవేశపెట్టగా, ఆ తరువాత సభను వాయిదా వేస్తున్నట్టు సుమిత్ర తెలిపారు. అదే విధంగా రాజ్యసభలో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో రాజ్యసభ ఛైన్మన్ వెంకయ్యనాయుడు సభను ఈ సాయంత్రం 2-30 గంటలకు వాయిదా వేశారు.

loksabha vayida 09022018 3

ఉభయసభలు ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణతో నిరసన తెలిపారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఢిల్లీకి మించిన అమరావతిని నిర్మిస్తామంటూ మోదీ హామీ ఇచ్చారని... దీంతో మోదీని వెతుక్కుంటూ వెంకటేశ్వరస్వామి తనను ఆవహించి పార్లమెంట్‌కు వచ్చారంటూ వినూత్న ప్రదర్శన చేశారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు దాదాపు 30 నిమిషాల పాటు నిరసన తెలిపారు..

వినూత్నశైలిలో నిరసన తెలపడంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ కు మించినవారు మరెవరూ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు... ఈరోజు కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ఏపీ డిమాండ్ లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు... కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద తప్పు చేసింది... మీకు కూడా వాళ్లకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

sivaprasaad 09022018 2

తలకు పోడవాటి వెంట్రుకల విగ్గు ధరించి, అఘోరా వేషం వేశారు. మెడలో రుద్రాక్షమాల, ఒక చేతిలో పాము, మరో చేతిలో నిమ్మకాయ గుచ్చిన కత్తిని పట్టుకుని నిరసన తెలిపారు.... ఏడుకొండల సామి, దుర్గమ్మ తల్లి పూనారు అంటూ, మాకు ఎప్పుడు సహాయం చేస్తావ్ మోడీ గారు అంటూ, పాటలు పడుతూ నిరసన తెలిపారు... ఏడుకొండలు సాక్షిగా చెప్పావ్, అమరావతి వచ్చి, దుర్గమ్మ సాక్షిగా చెప్పావ్, ఇంకా ఎప్పుడు హామీలు తీర్చుతావ్ అంటూ వినూత్న ఆందోళన చేసారు...

sivaprasaad 09022018 3

అయితే ఇదే వేషధారణతో సభ మొదలైన 5నిమిషాల తర్వాత ఎంపీ శివప్రసాద్ లోనికి ప్రవేశించారు. అతని వేషధారణను చూసిన స్పీకర్ సుమిత్రామహాజన్ ఏదో జరగబోతోందని భావించి లోక్ సభను వాయిదా వేశారు... శివప్రసాద్ గత మూడు రోజులుగా నారదుడి వేషంలో, తప్పెటగూళ్ల వేషధారణలో ఢమరుకం మోగిస్తూ ఆందోళన చేసారు... గోవిందా గోవిందా అంటూ నిరసన చేపట్టారు... ఇన్ని వినూత్న నిరసనలు చేసి, మిగతా ఎంపీలకు, మన రాష్ట్ర సమస్యల గురించి, వారు మద్దతు పలికేలా చేస్తున్నారు...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనపై ఏపీ టీడీపీ ఎంపీల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేశారని ఎంపీలు దుయ్యబట్టారు. పాత కథనే మళ్లీ వినిపిస్తున్నారని, ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఎంపీ సీఎం రమేష్‌ ఆరోపించారు... కాగా, రాజ్యసభ వాయిదా అనంతరం, లాబీల్లో కొంచెం సేపు కలకలం రేగింది... ఒకేసారి వాతావరణం వేడెక్కింది.... పార్లమెంట్ లో జైట్లీ ప్రకటన తరువాత, రగిలిపోతున్న నేతలకు, జైట్లీ ప్రశ్నతో మరింత కాక రేగింది... జరిగిన విషయం ఏంటి అంటే...

jaitley 08022018 2

కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీకి, సుజనా చౌదరికీ మధ్య వాగ్వివాదం జరిగింది.... లోక్-సభ, రాజ్యసభలో రెండు సార్లు ప్రకటన చేసినా మీరు సంతృప్తి చెందరా ? ఇలా అయితే ఎలా అంటూ, సుజనా పై, జైట్లీ మండిపడ్డారు.. దీంతో, సుజనా కూడా అంతే ధీటుగా స్పందించారు... డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయ్యలరు అని జైట్లీతో సుజనా వాదనకు దిగారు... పార్టీలు ఉంటాయి, పోతాయి, కానీ, ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటూ తీవ్ర స్వరంతో సుజనా స్పందించారు...

jaitley 08022018 3

ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుకున్నది ప్రజల మద్దతుతో సాధిస్తామని, మీరు నిర్దిష్ట హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తూనే ఉంటామని తెగేసి చెప్పినట్లు సమాచారం... సుజనా ఈ విధంగా నిరసన తెలపటంతో, కొంచెం సేపు అక్కడ వాతావరణం వేడెక్కింది... వెంటనే పక్కనే ఉన్న మిగతా రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదిరిని వారించి, అక్కడ నుంచి పంపించి వేసారు... తాము మిత్రపక్షంలో ఉన్నప్పటికీ, నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ జైట్లీ సరైన ప్రకటన చేయలేదని పార్లమెంట్ లో ఎంపీలు కూడా, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు...

గత నాలుగు రోజులుగా లోక్ సభ, రాజ్య సభ లో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై టీడీపీ ఎంపీలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.... ఈ సంఘటనలు మొత్తం టీవీ చానెల్స్ లైవ్ టెలీకాస్ట్ ద్వారా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.. మిత్రపక్షం అయిన టిడిపినే ఇలా నిరసన చేస్తే, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది అని అనుకుంటున్న కేంద్రం, తాజాగా షాకింగ్ ఆదేశాలు ఇచ్చింది... ఉభయసభల్లో తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీల ఎంపీలు చేస్తున్న నిరసనలు ప్రసారం చేయొద్దని లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ వర్గాలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

parliament 09022018 2

వెల్‌లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్‌లను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సభ్యులు వెల్‌ లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్‌ లను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి... ఒక పక్క మిత్రపక్షం ఆందోళన చేస్తున్న సంగతి తొక్కి పెట్టటం, మరో పక్క ఎంపీల ఆందోళన చూసి రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థుతులు తలెత్తకుండా, ఈ చర్యలు తీసుకునట్టు తెలుస్తుంది...

parliament 09022018 3

నిన్న లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. సభ మొదలవగానే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గోవిందా గోవిందా అంటూ టీడీపీ ఎంపీలు వినూత్నంగా నినాదాలు చేశారు. ఎంపీ శివప్రసాద్ ఏకంగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు.
టేబుల్‌పై ఉన్న పుస్తకాలను తీసుకుని బయటకు వెళ్లేందుకు యత్నించారు.. అలాగే కొంత మంది ఎంపీలు సభలో పడుకుని నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు... ఇవాళ మరింత తీవ్రంగా స్పందన ఉంటుంది అని తెలుసుకున్న కేంద్రం, అవి టీవీల్లో చూపించకుండా నిర్ణయం తీసుకుంది...

Advertisements

Latest Articles

Most Read