బడ్జెట్లో అన్యాయం పై పార్లమెంట్లో నినదించిన ఏపీ ఎంపీలకు మద్దతు పెరుగుతోంది.... ఎంపీల ఆందోనళలో నిజముందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు... లోక్సభలో మాట్లాడిన కవిత... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఎంపీలు నిరసన చేస్తున్నారని... ఏపీలో తమ సోదరులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి మద్దతిస్తున్నానని చెప్పారు. .. వారికి తమ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఇలా కేంద్రంలో మితపక్షం ఆందోళన చేస్తే... బయటకు తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు. ఏపీ ఎంపీల సమస్యల్ని అర్థం చేసుకోవాలని కోరారు.
విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో హామీలు ఇచ్చినప్పుడు అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. చివరగా ‘జై ఆంధ్రా’ అంటూ కవిత తన ప్రసంగాన్ని కవిత ముగించారు...
కాగా బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడుతూ..ఏపీ ఎంపీలకు మద్దతిచ్చారు... బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట, లోపల నినాదాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న ఆందోళనకు, శివసేన, అకాళీదాల్, మమతా బనేర్జీ మద్దతు ఇచ్చాయి... ఇప్పుడు తాజాగా టిఆర్ఎస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చింది...