అమరావతికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ లో వేసిన నాలుగు పిటిషన్లను కొట్టేసిన సంగతి తెలిసిందే... అయితే, ఈ విషయంలో ప్రభుత్వం సమర్ధవంతమైన వాదనలు వినిపించింది... డేటా మొత్తం ట్రైబ్యునల్‌ ముందు ఉంచింది... దీంతో వాటితో ఏకీభివించిన ట్రైబ్యునల్‌, అవతలి వారు కుట్రలను తిప్పి కొడుతూ, అమరావతికి లైన్ క్లియర్ చేసేంది... భూకంపాలు వస్తాయి అని, వరదలు వచ్చి అమరావతి మునిగిపోతుంది అని, లూజ్ సాయిల్ అని, అహార భద్రతకు ముప్పు అని, ఇలా టీవీల్లో, పేపర్ లో ఎలా భయపెట్టారో, అలాగే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ ముందు పిటీషన్ వేశారు... కాని, అవన్నీ తప్పు అని, ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది...

green 19112017 2

ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతానికి వరదల భయం ఉందని అంటే, దీనికి సమాధానంగా గత వందేళ్లకు పైగా ఆ ప్రాంతంలో వచ్చిన వరదల వివరాలు తీసుకుని, అత్యధికంగా వరదలు వచ్చిన 1853లో పరిస్థితిపై అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం పేర్కొన్న అంశాలను ప్రభుత్వం ఎన్జీటీ ముందుంచింది. వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి ఇవతల కేవలం ఇబ్రహీంపట్నం వైపు మాత్రమే మునిగిందని, ప్రస్తుతం రాజధాని నిర్మించే ప్రాంతంలో ఎటువంటి వరద రాలేదని స్పష్టం చేసింది. అలాగే, భూకంప తీవ్రత జోన్‌-3లో ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ప్రాణనష్టం ఏర్పడొచ్చనే అంశాన్ని లేవనెత్తారు. అయితే ఇదే జోన్‌లో ఆగ్రా, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, కోయంబత్తూర్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, పుణే, లక్నో, వారణాసి వంటి రాజధానులు, నగరాలు ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది.

green 19112017 3

ఆమరావతి ప్రాంతంలో ఆహార ధాన్యాలు పండించే పంట భూములు తీసుకోవడంతో ఆహార సంక్షోభం ఏర్పడుతుందనే అంశానికి సమాధానంగా 2014-15లో అక్కడ సాగు చేసిన పంటల వివరాలు అందించారు. ఖరీఫ్‌లో 11242 హెక్టార్ల రాజధాని ప్రాంతంలో 1266 హెక్టార్లలో వరి సాగు చేశారని అది రాష్ట్రంలో జరిగే సాగులో కేవలం 0.027 శాతమేనని, దానివల్ల వరి ధాన్యానికి నష్టం వాటిల్లదని తేల్చింది. ఇలా ప్రతి అంశంపై పర్యావరణ హితంగా, ప్రజలకు అనుగుణంగా ఎలా ఉండాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వడంతో అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

మా అంత గొప్ప పార్టీ లేదు అంటూ ఊరు ఊరు తిరుగుతూ, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ ఒక పక్క చెప్తుంటే, వారి పార్టీ నాయకులు దారుణాలు చేస్తున్నారు... సాక్షాత్తు మునిసిపల్ చైర్మన్ గా పని చేసిన వ్యక్తులే అరాచకాలు చేస్తున్నారు... వివరాల్లోకి వెళ్తే, జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును శనివారం విజయవాడ, పటమట పోలీసులు లైంగికదాడి, బెదిరింపు, చీటింగ్ తదితర సెక్షన్ల క్రింద నమోదైన కేనులో జగ్గయ్యపేటలో అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం విజయవాడ రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ కోరుకు హాజరువర్చగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు రిమాండును విధించారు.

ysr 19112017 2

పోలీసులు వివరాల ప్రకారం వటమట డొంకరోడ్డులో నివసిస్తున్న ఒక మహిళ జగన్ పార్టీ పై అభిమానంతో పార్టీలో పనిచేయాలనుకుని, తనకేదైనా పదవిని ఇప్పించమని అడగడానికి కొంత కాలం క్రింద జగ్గయ్యపేటకు చెందిన వైసిపి నాయకులు సామినేని ఉదయభాను ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు తన్నీరు నాగేశ్వరరావు పరిచయమయ్యారు. తనకు వైఎస్ఆర్సిపి పార్టీలో మంచి పలుకుబడి ఉందని, తాను పదవిని ఇప్పిస్తానని ఆమెతో నమ్మబలికాడు. దానికి గాను ఆమె నుండి పలు దఫాలుగా మొత్తం రూ. 40 లక్షలను వసూలు చేశాడు. అంతే కాక తనను శారీరకంగా కూడ వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. ఎంతకీ ఏ పదవిని తనకు కట్టబెట్టక పోవడంతో సదరు మహిళ తన్నీరు నాగేశ్వరరావును గట్టిగా నిలదీసింది. ఈ మధ్య కాలంలో కొంత కాలం పాటు మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన సదరు మహిళ నిలదీయగా దిక్కున్నచోట చెప్పుకోమని, తన జోలికి వస్తే తనతో శారీరక సంబంధం ఉందని ఊరంతా అల్లరి చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

ysr 19112017 3

దాంతో తాను మోసపోయానని గ్రహించి కృష్ణాజిల్లాకు చెందిన నాయకులతో పాటు అధినాయకులను కూడ ఆమె కలిసింది. అయినా ఫలితం దక్కక పోవడంతో చేసేది లేక గత నెలలో నగర పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ను కలిసి పై విషయాలన్నీ వివరిసూ తన గోడుని వెళ్ళబోసుకుంది. హుటాహుటిన స్పందించిన సిపి ఆదేశాల మేరకు పటమట పోలీసులు మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పై లైంగిక దాడి, మోసం, బెదిరింపు తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట లోని ఆయన ఇంటి వద్దే అరెస్ట్ చేసి, విజయవాడ రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ కోర్టులో హాజరుపర్చినట్లు పటమట సిఐ తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

అవి నిన్నమొన్నటి వరకూ పంటభూములు.. మరి నేడో!? విజ్ఞానకాంతులు వెదజల్లే ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి నెలవులు! ప్రజా రాజధానిగా రూపొందుతున్న అమరావతిలోని ఐనవోలు వద్ద నిర్మాణంలో ఉన్న విట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌, ఈ నెల 28న ప్రారంభోత్సవాన్ని జరుపుకోవటానికి రెడీ అయ్యింది... తమిళనాడులోని వెల్లూరు ప్రధాన కేంద్రంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన క్యాంపస్‌లను కలిగి ఉన్న ఈ విఖ్యాత యూనివర్సిటీ తరగతుల ప్రారంభంతో అమరావతిలో విద్యాపరిమళాలు గుబాళించడం మొదలైంది.. ఈ నెల 28న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరగనుంది... క్రిందటి ఏడాది నవంబర్ లో శంకుస్థాపన చేసుకున్న విట్, సంవత్సరం లోపే, మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకుంది...

vit ap 18112017 2

ఇప్పటికే, తాత్కాలిక తరగతులు అక్కడ ప్రారంభం అయ్యాయి... రాజధానిలోని వెలగపూడి తాత్కాలిక సచివాలయ సముదాయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఐనవోలు శివార్లలో నిర్మాణం జరుపుకుంటున్న విట్‌ ఏపీ విశ్వవిద్యాలయంలో తరగతుల ప్రారంభంతో ఆ ప్రాంతం విద్యార్థినీ విద్యార్థులతో కళకళలాడుతోంది... ప్రారంభంలోనే ఎనిమిది బ్రాంచీలను విట్‌ ప్రవేశపెట్టింది. ఆల్‌ఇండియా లెవల్లో ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించి విద్యార్థులకు అడ్మిషన్‌లు ఇచ్చారు. ఆరు ఇంజనీరింగ్‌ బీటెక్‌ బ్రాంచిలు, ఒక సాఫ్ట్‌వేర్‌ ఎంసెట్‌ బ్రాంచి పీహెచడీ బ్రాంచి మొత్తం.. ఎనిమిది బ్రాంచీలను ప్రవేశపెట్టారు...

vit ap 18112017 3

అమరావతిని ప్రపంచంలోనే పేరొందిన విద్యాకేంద్రంగా మలచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే క్రమంలో భాగంగా అందులో దేశ, విదేశాలకు చెందిన పలు సుప్రసిద్ధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే మిగిలిన అన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల కంటే ముందుగా విట్‌, ఎస్‌.ఆర్‌.ఎం. యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను చకచకా నిర్మింపజేస్తూ, బీఆర్‌ శెట్టి మెడీ సిటి పనులు కూడా ప్రారంభం అయ్యాయి... అమృత యూనివర్సిటీతో పాటు, మరిన్ని ప్రముఖ విద్యా సంస్థలు అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చెయ్యటానికి ముందుకు వచ్చాయి... ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి...

రాజధాని అమరావతిలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలోని, తుళ్లూరు మండలంలోని మందడం గ్రామం వద్ద సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఒకేసారి 26 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో ఐదు వేల మొక్కలను నాటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏడీసీ, సీఆర్డీయే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా అమరావతిలో 5.50 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విస్తీర్ణంలో సుమారు 23 శాతంలోనే మొక్కలు ఉన్నాయి. 2029 నాటికి దాన్ని 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ ఇచ్చారు...

cm 19112017 2

అయితే ఈ సందర్భంలో నర్సారావు పేట సాయి తిరుమల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన, ఆకుల వనజారాణి అనే విద్యార్ధిని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది... ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ విద్యార్ధిని సన్మానం చేశారు.. అంతలా ఆ విద్యార్ధిని ప్రసంగం ఉంది... భవిష్యత్తు తరాల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబు లాంటి విజన్ ఉన్న సీఎంకి అండగా నిలవాలని, అధికారులు చేస్తున్న కృషికి మన వంతు సహకారంగా జన్మదినం తదితర శుభదినాల్లో మొక్కలు నాటాలని సహచర విద్యార్థులకు సూచించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి చక్కగా వివరించిన ఈ అమ్మాయి సీఎం చేత సన్మానం అందుకుంది...

cm 19112017 3

ప్రసంగం చివర్లో తండ్రితోసహా అందరికీ కృతజ్ఞతలు తెలిపి, తల్లిని మర్చిపోవడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ ఆ విషయాన్ని గుర్తు చేశారు. ‘ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాతే ఎవరైనా’ అన్న ఆయన మాటలు సభికులను ఆకట్టుకున్నాయి... ఈ అమ్మాయే కాదు, రాజధాని గ్రీనరీ ప్రాజెక్టుకు శ్రీకారం సందర్భంగా పలువురు విద్యార్థులు వేదిక పై నుంచి ప్రసంగించారు. వారు చేసిన ప్రసంగాలు సీఎం చంద్రబాబును అమితంగా ఆకట్టుకున్నాయి.

Advertisements

Latest Articles

Most Read