విజయవాడ బెంజిసర్కిల్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కు రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల అడ్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లై ఓవర్ పనులు మొదలుపెట్టినప్పుడు వీటిని నరికేస్తుండటం పై ప్రజల్లో వ్యతిరేకత ఎదురైంది. అప్పుడు విషయం తెలుసుకుని, దీని పై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇష్టం వచ్చినట్టు చెట్లు నరకకుండా, ట్రీ ట్రాన్స్ లొకేషన్ విధానంలో చెట్లను తరలించాలని అధికారులను ఆదేశించారు.. దీంతో రంగంలోకి దిగిన అధికారాలు ఆ పరిజ్ఞానాన్ని అనుసరించి చెట్లను జాగ్రత్తగా వేళ్లతో సహా పెకలించి మరో చోట నాటుతున్నారు.

translocation 18112017 2

ఈ పరిజ్ఞానంలో ఏళ్లుగా పెరుగుతూ ఉన్న పెద్ద వృక్షాన్ని వేర్లు, మట్టితో సహా వెలికితీసి ప్రత్యేక యంత్రం సాయంతో ఖాళీ ప్రదేశంలో నాటుతారు. ముందుగా చెట్టు సైజును బట్టి చుటూ మొదలుకు కొంత దూరంలో మూడు నుంచి నాలుగు మీటర్ల లోతులో గుంతను తవ్వతారు. ఇలా తవ్వాక మట్టి, వేర్ల చుటూ పాలిథిన్ కవర్ చుట్టి ఉంచుతారు. ఈ సమయంలో వేర్లకు కావాల్చిన తేమను అందిస్తారు. ప్రత్యేక యంత్రం సాయంతో ఆ చెట్టును వేర్లతో సహా ఎత్తి ఏదైనా వాహనంలో నాటాలనుకున్న ప్రదేశానికి తరలిస్తారు. అక్కడ ముందే చేసిన గుంతలో ఈ చెట్టును అమర్చి పాలిథిన్ కవర్ను తీసేస్తారు. ఇక ఆ చెట్టు మళ్లీ ఎదగటం ప్రారంభిస్తుంది.

translocation 18112017 3

చిన్న చిన్న చెట్ల సహా పది నుంచి పదిహేనేళ్లుగా ఉన్న మొత్తం 308 చెట్లు ఈ ప్రదేశం నుంచి తరలిస్తున్నారు. ముందుగా ఈ పరిజ్ఞానాన్ని గుజరాత్ లో వినియోగించగా అక్కడ విజయవంతమైంది. తర్వాత మన రాష్ట్రంలోనూ పలు చోట్ల చేపట్టారు. ఫలితాలు బాగుండటంతో ప్రస్తుతం నగరంలోనూ ట్రీ ప్లాంటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్ప టికే చాలా వరకూ చెట్ల మొదళ్ల వద్ద వేర్ల వరకూ తవ్వి పాలిథిన్ కవర్లు కట్టి ఉంచారు. వీటిని సితార జంక్షన్ తదితర ప్రాంతాల్లో తరలిస్తున్నారు... ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, ప్రజలు ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు...

హాలిడే రోజు కూడా, జగన్ కు చీవాట్లు తప్పటం లేదు... ఏంటి ఇవాళ హాలిడే అని ఆలోచిస్తున్నారా ? ఇవాళ శుక్రవారం జగన్ డైరీలో హాలిడే... ప్రతి శుక్రవారం, అక్రమాస్తుల కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్, నాంపల్లి సిబిఐ కోర్ట్ కి హాజరు కావాల్సిన సంగతి తెలిసిందే... అయితే, ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్ట్ జగన్ లాయర్ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది... ఇలాంటి వాదనలు 30 ఏళ్ళ సర్వీసులో ఎప్పుడూ వినలేదు అంటూ న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు... దీంతో 11 కేసుల్లో A1గా ఉన్న జగన్ తో పాటు, A2గా ఉన్న విజయసాయి రెడ్డి, జగన్ తరుపు లాయర్లు షాక్ తిన్నారు... సిబిఐ కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చెయ్యటంతో, జగన్ ముభావంగా కనిపించారు...

jagan 17112017 2

పదే పదే విచారణ వాయిదా కోరడం సరికాదని, రెండేళ్లుగా విచారణను జాప్యం చేస్తున్నారని, ఇంకెంతకాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. 4 చార్జ్‌షీట్లను కలిపి వాదనలు వినాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. చార్జ్‌షీట్‌ 9లో వాదనలు కొనసాగించాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. జగన్‌ న్యాయవాదుల తీరుకు సంబంధించి కోర్టులో సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

jagan 17112017 3

జగన్ అక్రమాస్తుల కేసులో 10వ చార్జీషీట్‌పై వాదనలు జరిగాయి. రాంకీ సిమెంట్‌లో తమకు ప్రత్యక్షంగా పెట్టుబడులు లేవని జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటీషన్లో పేర్కొన్నారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. మళ్ళీ ఈ నెల 24న కోర్టుకు జగన్ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో జగన్ కోర్ట్ నుంచి, పాదయాత్ర కంటిన్యూ చెయ్యటం కోసం, కర్నూల్ బయలుదేరారు... రేపటి నుంచి, యధావిధిగా సాక్షి క్రియేటివ్ టీం, పీకే స్క్రిప్ట్ బ్యాచ్ రెడీ, లోటస్ పాండ్ సోషల్ మీడియా బ్యాచ్ రెడీ అవ్వనున్నాయి...

విశాఖ‌ప‌ట్నంలో అగ్రిటెక్ స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో క‌లిసి మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు, మంత్రులు నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... ప్రపంచంలో ప్రతి ఐదుగురు టెకీల్లో నలుగురు తెలుగువారని సీఎం చంద్రబాబు కొనియాడారు. సాప్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌తో తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.

cbn gates 17112017 2

20 ఏళ్ల క్రితం అమెరికాలో కాక్‌టైల్ పార్టీలో కలవమన్నారని, రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని చెబితే విడిగా సమావేశమయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్‌గేట్స్‌ 10 నిమిషాల సమయం ఇచ్చి..40 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటైందని, డబ్బు అందరూ సంపాదిస్తారు..బిల్‌గేట్స్‌లా కొద్ది మందే సద్వినియోగం చేస్తారని కొనియాడారు. సంపాదించిన సొమ్ములో ఎక్కువభాగం సమాజం కోసమే ఖర్చుచేస్తున్నారని, వ్యవసాయ సదస్సుకు బిల్‌గేట్స్‌ రావడం అరుదైన విషయమని చంద్రబాబు పేర్కొన్నారు.

cbn gates 17112017 3

అయితే చంద్రబాబు, బిల్ గేట్స్ ని మూడు విషయల్లో ఆంధ్రప్రదేశ్ కు సహాయం చెయ్యమని అడగారు.. నాకు మీ నుంచి డబ్బు సహాయం వద్దు, మూడు విషయాల్లో సహాయం చెయ్యండి అంటూ... వ్యవసాయం, న్యూట్రిషన్, హెల్త్ విషయంలో మీ సేవలు, మీ ఫౌండేషన్ సేవలు మా రాష్ట్రానికి కావాలని అడిగారు... ఇప్పటికే మీరు హెల్త్ సెక్టార్ ల వినుత్నమైన రీసెర్చ్ చేసారని, మీ సలహాలు, సూచనలు, మీ టెక్నాలజీ, అన్నీ మాకు కావాలని, ఆ విషయంలో మాకు సహకరించండి అంటూ, చంద్రబాబు బిల్ గేట్స్ ని కోరారు...

విశాఖలో నిర్వహిస్తున్న అగ్రిటెక్‌ ముగింపు సదస్సుకు సాప్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే... ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాత బిల్ గేట్స్ మాట్లడారు... చంద్రబాబు విజన్ ని, 20 ఏళ్ళ స్నేహాన్ని, ఆ రోజుల్లో జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నారు... "నా మంచి ఫ్రెండ్ చంద్రబాబుని కలిసినందుకు సంతోషంగా ఉంది...20 ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్‌ చూసి ఆశ్చర్యపోయా, ఆయన విజన్ చూసి అప్పుడే చాలా ఎక్షైట్ అయ్యానని " సాప్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ చెప్పారు....

bill gates cbn 17112017 2

నీ కంటే టెక్నాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న రాజకీయ నాయకుడు ఒకడు ఉన్నారు అని అందరూ నాతో చెప్పే వారు... అప్పుడు అవన్నీ నమ్మ లేదు, కాని ఒక్కసారి చంద్రబాబుని కలిసిన తరువాత, ఆయనతో మాట్లాడితే ఆశ్చర్యపోయాను... టెక్నాలజీ, కంప్యూటర్, డిజిటల్, ఇవన్నీ ఆ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు నోట వినటం, ఆశ్చర్యం అనిపించింది... ఆయనకు టెక్నాలజీ వాడకంతో, ఎలా బాగా గవర్నమెంట్ లో పనులు చెయ్యవచ్చు అనే విజన్ ఉంది... అందుకే ఆయనతో కలిసి పని చేశాం... అది ఒక మైల్ స్టోన్... అని బిల్ గేట్స్ అన్నారు...

bill gates cbn 17112017 3

మన రాష్ట్రంలో కొంత మంది సన్నాసులని చూసాం... చంద్రబాబు హైటెక్ సిటీ కట్టింది నేనే అంటే, ఇంకా పురిటి వాసన కూడా పోని కొంత మంది పిల్లకాయలు సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారు... అక్కడి పాలకులు, ఈ రోజు IT అంటే హైదరాబాద్... హైదరాబాద్ అంటే IT అని చెప్పుకుని తిరుగుతున్నారు అంటే, అది ఆ రోజు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన చంద్రబాబు వేసిన పునాది... సాఫ్ట్‌వేర్‌ రంగంలో హైదరాబాద్‌ను మేటిగా చేసి, సైబరాబాద్‌ లాంటి కొత్త నగరాన్ని నిర్మించిన, చరిత్ర మన చంద్రబాబుది ...హైటెక్ సిటీ కట్టే సమయంలోని లాగుల బ్యాచ్ కి, ఇంకా కొంత మంది అమ్మ ఒడిలో పురిటి వాసన కూడా పోని పిల్ల కాకులకి, చంద్రబాబు బిల్ గేట్స్ ని బ్రతిమాలి మైక్రోసాఫ్ట్ పట్టుకొచ్చారని చెప్పినా, హైదరాబాద్ బిర్యానీ వాసనకొచ్చారని వాదిస్తారు.. ఇప్పటి లాగుల బ్యాచ్, రేపు అమరావతికి ఆవకాయ వాసన కోసం, నుజివీడు మామిడి పళ్ళ కోసం, ఉలవచారు కోసం, నెల్లూరు చేపల పులుసు కోసం, వచ్చారు అనే, వాదన తెస్తారేమోనని, ఈ వీడియో పెడుతున్నాం సాక్ష్యం గా...

Advertisements

Latest Articles

Most Read