చాలా మందికి పదవులు అలంకారం... కొంత మంది వల్ల ఆ పదవలుకే అలంకారం... అలాంటి వారే మన అశోక్ గజపతిరాజు... టీడీపీతో పొత్తు నేపథ్యంలో 2014లో కేంద్రంలో మంత్రి పదవి వచ్చినప్పుడు, పౌర విమానయాన శాఖ లాంటి చెత్త శాఖ ఇచ్చి, రాజు గారిని ఇబ్బంది పెట్టారు అనుకున్నారు... నిజానికి అప్పటికి కేంద్ర పౌర విమానయాన శాఖ పని తీరు అధ్వాన్నంగా ఉండేది... అశోక్ గజపతిరాజు విమానయాన బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని రూపు రేఖలను మార్చివేశారు. సామాన్యుడికి విమానప్రయాణానికి పెద్ద పీట వేస్తూ దేశవ్యాప్తంగా 80విమానశ్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ashok 16112017 2

2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పరంగా చూసుకుంటే, విమానయాన రంగం పదో స్థానంలో ఉండేది. దీనిని ఛాలెంజ్ గా తీసుకున్న రాజుగారు మూడేళ్లలోనే ఆ పరిస్థితిమార్చేసారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ లో 2017కి గాను విమానయాన రంగానికి మూడో స్థానం దక్కడం అశోక్ గజపతిరాజు కృషిని చాటుతోంది. విమానయాన రంగంలో ఇంత ఎక్కువ కాలం కొనసాగిన మంత్రి కూడా అశోక్ గజపతి రాజు ఒక్కరే. 42నెలలుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు.

ashok 16112017 3

2014 నాటికి దేశంలో 70ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో దేశంలో నిరుపయోగంగా ఉన్న 80 విమానశ్రయాలను ఆయన అందుబాటులోకి తీసుకురాగలిగారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా చిన్న తరహా పట్టణాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసారు...ఈ విమానశ్రయాల్లో మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. 70ఏళ్లలో జరిగిన ప్రగతి ఒక ఎత్తు అయితే, రాజు గారు ఈ మూడేళ్ల వ్యవధిలో విమానయాన రంగానికి చేసిన కృషి మరో ఎత్తు... ఆంధ్రా వాడి దమ్ము చూపించారు... శభాష్ రాజు గారు...

చంద్రబాబు కృషి చేస్తున్నట్టుగానే నవ్యాంధ్ర పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది... ఆటోమొబైల్‌ రంగం మొదలుకొని సెల్ ఫోన్‌ తయారీ పరిశ్రమల వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తిని ఆరంభించగా మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణం... ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం కారణంగా చిన్న సంస్థలే కాదు కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ఇటు దృష్టి సారించాయి... ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు చూస్తే దేశంలోనే నెంబర్ వన్ గా నవ్యాంధ్ర ఉంది.... ఇప్పటికే ఇసుజు, కియా, హీరో కంపెనీలు, వచ్చాయి... 

honda 16112017 2

మరో పక్క దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ ‘హ్యూసంగ్‌’, స్పెయిన్‌కి చెందిన గ్రూపో ఆంటోలిన్‌ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నాయి... మరో పక్క టయోటా ద్యుత్తు కార్ల తయారీ పరిశ్రమను మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు... ఇప్పుడు తాజగా జపాన్‌కు చెందిన ‘హోండా’కూడా మన రాష్ట్రంలో ప్లాంట్ పెట్టటానికి సిద్ధంగా ఉంది... చర్చలు ప్రాధమిక దశలోనే ఉన్నా, జరుగుతున్న విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు... దీనికి బీజం, చందబాబు 2014 జపాన్ పర్యటనలో పడింది... అప్పటి నుంచి రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు ఫాలో అవుతూ ఉన్నారు...

honda 16112017 3

‘హోండా’కు ఇప్పటికే కర్నాటకలోని యూనిట్‌ ఉంది... అక్కడ రోజుకు 6,600 మోటార్‌ సైకిళ్లను తయారు చేస్తోంది. ఆంధ్రాలో అంతకంటే పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ యోచనగా ఉంది. ఇక్కడ పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు అనుకూలమైనవిగా భావిస్తున్నారు. కావాల్సిన భూమి ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి... ఇప్పటికి తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీ లాగా కనిపిస్తుంది... కాంగ్రెస్ పార్టీ అసలు ఉందో లేదో కూడా తెలీదు, కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి అంతే... పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే కాని అసలు ఆ పార్టీ విధానం తెలీదు... ఇంకా మిగిలింది జగన్ పార్టీ... ఆ పార్టీకి, ప్రజలకు మధ్య కనెక్షన్ ఎప్పుడో తెగిపోయింది... కొంత మంది కులం, మతం ఆధారంగా తప్పితే, ఆ పార్టీ గురించి ఆశలు పెట్టుకున్న ప్రజలు ఎవరూ లేరు... నాకు సియం కుర్చీ తప్ప అసలు యావ లేదు అనే విధంగా, జగన్ ప్రవర్తిస్తూ ఉంటాడు... దీంతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ వాక్యుం చాలా ఉంది...

new party 15112017 2

అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు, ముద్రగడతో కలిసి కొత్త రాజకీయ పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు... ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఫార్ములా తరహాలో కాపులు, దళితుల కాంబినేషన్లో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కదులుతున్నారు. ముద్రగడతో పాటుగా కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్ కలిసి పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారు.. దీనికి సన్నాహకంగా అన్నట్టు, తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మాజీ మంత్రి శైలజానాధ్‌, మాజీ ఎంఎల్‌ఎలు పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, కొప్పుల రాజు తదితరులు కూడా హాజరు కావడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి...

new party 15112017 3

మరో పక్క, ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కుట్రగా కూడా రాజకీయ పరిశీలకలు చూస్తున్నారు... ముద్రగడకు కనీసం సొంత ఊరిలో కూడా వోట్లు వెయ్యరు అని, కాంగ్రెస్ నాయకులు అంటేనే రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటారని, ఇలాంటి వారందరూ పార్టీ పెట్టటం వెనుక, చంద్రబాబుని దెబ్బ తీసే కుట్ర ఉంది అని అంటున్నారు... తద్వారా జగన్ కు లాభం చేకూరే ఆలోచనగా చెప్తున్నారు.... గోదావరి జిల్లాల్లో చంద్రబాబు స్వీప్ చెయ్యటం ఖాయంగా కనిపిస్తుంది.. ఇక్కడ కనుక మెజారిటీ సీట్లు వస్తే, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు... అందుకే ఇక్కడ దెబ్బ కొట్టాలి అంటే, కొత్త పార్టీతో ఓట్లు చీల్చాలి అనే ప్లాన్ వేసారు అని అంటున్నారు... తద్వారా తెలుగుదేశం, జనసేన కాంబినేషన్ ఎదుర్కుని, ఓట్లు చీల్చి, జగన్ కు లాభం చేకూర్చే ప్లాన్ గా రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు...

పట్టిసీమ మరో రికార్డును అధిగమించింది. నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్ట్ను పూర్తిచేసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుచేసుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా ప్రాజెక్ట్ నిర్వాహణలోనూ మైల్స్టోన్ను అధిగమించింది. ఈ సీజన్లో బుధవారం (నవంబర్ 15) నాటికి నిరంతరాయంగా 148 రోజులు నీటిని పంపింగ్ చేసి అనతికాలంలోనే 100 టిఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణాకు ఎత్తిపోతల ద్వారా మళ్లించి నదుల అనుసంధానంలో మరో రికార్డును సాధించింది. మొత్తం మీద మూడు సీజన్లలోనూ 159 టిఎంసీల నీటిని అందించగా గత ఏడాది (2016లో) 55.6 టిఎంసీలు, అంతకుముందు ఏడాది అంటే పట్టిసీమను ప్రారంభించిన సంవత్సరం 2015లో 4 టిఎంసీల నీటిని ఈ పథకం పంపింగ్ చేసింది. ఎత్తిపోతల పథకాలు సంక్లిష్టమైనవి అయినందున సాంకేతిక సమస్యలతో తరచూ మరమ్మత్తులకు గురవుతాయనే అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం ఎటువంటి అంతరాయం లేకుండా ఇప్పటికీ ఒక లక్షా 20వేల గంటలు పనిచేసింది.

pattiseema 15112017 2

ఈ పథకంలోని 24 మోటార్లు నిరంతరాయంగా 148 రోజుల్లో 25,36,06,000 కిలోవాట్ల విద్యుత్ వినియోగం ద్వారా నిరంతరాయంగా 72వేల గంటల పాటు పనిచేసి ఎలెక్ట్రోమేకానికల్ రంగంలో ఈ సంస్థ తనకున్న నైపుణ్యాన్ని నిరూపించుకుంది. కృష్ణా నదికి పై నుంచి నీటి లభ్యత ప్రతి ఏడాది క్రమంగా తగ్గిపోతుండడంతో కృష్ణా డెల్టాను ఆదుకునేందుకు గోదావరి నీటి మళ్లింపే లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల క్రితం పూర్తి చేయగా ఈ ఏడాది కృష్ణా డెల్టాకు అవసరమైన నీటిని మొత్తం గోదావరి నుంచే మళ్లించేందుకు ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడింది. డెల్టాలోని మొత్తం ఆయకట్టుకు 13 లక్షల ఎకరాలకు నీరందించింది. దేశం మొత్తంమీదనే నిర్దేశించిన గడువులోగా బడ్జెట్ అంచనాల పెంపుదల లేకుండా పూర్తిచేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ దీనిని ఒక సవాలుగా తీసుకొని 2000 వేల మంది సిబ్బందితో రాత్రింబవళ్లు పనిచేసి, నిర్దేశించిన గడువుకంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టిన 173 రోజులలో (సెప్టెంబర్ 18, 2015న) తొలి పంప్నుంచి నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ప్రాజెక్ట్ను 30 మార్చి 2015న నిర్మాణం చేపట్టిన ఎంఈఐఎల్ ఏడాదికంటే ముందుగానే అంటే 2016 మార్చి 20 న పూర్తి చేసింది. తద్వారా ఎంఈఐఎల్ లిమ్కా బుక్లో రికార్డుగా నమోదు సాధించుకుంది. సముద్ర మట్టం కంటే దిగువన డయాఫ్రం వాల్ వంటి అత్యంత క్లిష్టమైన కాంక్రీట్ నిర్మాణాలను పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానంతో నిర్మించింది.

pattiseema 15112017 3

7476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 24 పంప్లతో కూడిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఏసియాలోనే అతిపెద్దది. ఇరిగేషన్ రంగానికి సంబంధించి మనదేశంలోనే తొలి ప్రాజెక్ట్గా రికార్డులకెక్కిన పట్టిసీమను పూర్తిచేసిన ఘనత ఎంఈఐఎల్దే. పట్టిసీమ ప్రాజెక్ట్ 24 పంపుల ద్వారా సెకనుకు 240 క్యూమిక్కుల నీటిని విడుదలు చేస్తుంది. ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు 1.20 లక్షల గంటలు మోటార్లు పనిచేశాయి. అంటే సగటున ఒక్కొక్క మోటర్ 5 వేల గంటలకు పైగా ఎలాంటి అవాంతరాలు లేకుండా పనిచేశాయి. తొలి ఏడాది అంటే 2015లో 93 రోజులు మోటార్లు 4 టీఎంసీల నీటిని, 2016లో 137 రోజులు పనిచేసిన మోటార్లు 55.6 టీఎంసీలు, 2017లో ఇప్పటి వరకు (148) పనిచేసిన మోటార్లు 100 టీఎంసీల నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణాడెల్టాకు నీటిని అందించాయి. దేశ వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వాహణ వ్యయంతో కూడుకున్నదని ఆచరణలో సాధ్యం కాదని రకారకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సహంతో ఎంఈఐఎల్ తన సాంకేతిక సమర్థతను నిరూపించుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ మూడు సంవత్సరాల్లో వ్యవసాయరంగ నిపుణుల అంచనాల ప్రకారం 24 వేల కోట్ల విలువైన పంటలను కృష్ణాడేల్టా రైతులు పండించారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టిసీమ వల్లే కృష్ణాడేల్టా రైతులు జూన్ నెల ఆరంభంలో తమ పంటలకు నీటిని పొందగలిగారు.

Advertisements

Latest Articles

Most Read