రాష్ట్రంలో మంత్రుల పరిపాలన పై చంద్రబాబు నిన్న రివ్యూ చేశారు... ఏ మంత్రి, ఎంత ఫాస్ట్ గా పని చేస్తుంది లెక్కలతో సహా చెప్పారు... తన కార్యాలయం కంటే, హోం మంత్రి చినరాజప్ప ఫాస్ట్ గా ఉన్నారంటూ కితాబు ఇచ్చారు... ముఖ్యమంత్రి సొంత టీం పై అసంతృప్తి వ్యక్తం చేశారు... గత క్వార్టర్ లో, తన కార్యాలయంలో ఫైల్స్‌ క్లియరెన్స్‌ చెయ్యటానికి సగటున ఒక్కో ఫైలు 42 రోజుల 11 గంటలు పట్టింది అన్నారు... ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఇలా ఉంటే ఎలా? అంటూ వ్యాఖ్యానించారు.

chinarapappa 15112017 2

ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కేవలం నాలుగు గంటల్లో దస్త్రాన్ని పరిష్కరిస్తున్నారని, రెండో స్థానంలో లోకేష్‌ ఉన్నారని తెలిపారు. లోకేష్‌ ఆరు గంటల సమయం తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ఈయన వచ్చిన ఫైలు వచ్చినట్టూ పంపేస్తున్నట్టున్నాడు’’ అని చినరాజప్పనుద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సగటున ఒక్కో దస్త్రానికి 66 రోజులు తీసుకుంటున్నారంటూ... ‘‘ఈయన సమావేశాలకు రారు. ఇక్కడ కూడా కనిపించరు. ఆయనదో ప్రత్యేక ధోరణి’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి మాణిక్యాలరావు గురించి చెబుతూ... ‘‘ఆయన 9 గంటల 5 రోజుల సమయం తీసుకుంటున్నారు. గతం కంటే బాగా మెరుగుపడ్డారు. అంతకుముందు 77 రోజులు తీసుకునేవారు’’ అని పేర్కొన్నారు. మంత్రి అఖిలప్రియ 35.10 రోజుల సమయం తీసుకుంటున్నారని చెబుతూ... ఇలా అయితే ఎలా అమ్మా? అని ప్రశ్నించారు.

ఇక నుంచి గెట్టిగా పని చెయ్యాలి అని, 15 రోజులకి ఒకసారి రివ్యూ చేస్తాను అని చెప్పారు.. అందరూ ఫాస్ట్ గా ఫైల్స్‌ క్లియరెన్స్‌ చెయ్యాలని చెప్పారు... నా కార్యాలయంతో సహా, ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది, అందరూ అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు.. మరో రెండు నెలల్లో ఫైల్స్ అన్నీ డిజిటల్ అయిపోయాని, సచివాలయం నుంచి కింది స్థాయి వరకు దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌లో పెట్టినా కొన్ని అవసరమైన దస్త్రాల హార్డ్‌కాపీలు కూడా భద్రపరచాలని సూచించారు.

కింద నుంచి పై స్థాయి నాయకుడి దాకా ఎప్పుడూ కేసులు, కోర్ట్ లు చుట్టూ తిరిగే వైసిపి పార్టీకి మరో గోల్డ్ మెడల్ వచ్చింది... గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, పై లైంగిక వేధింపులతో పాటు చీటింగ్ కేసు బుక్ అవ్వటంతో, పోలీసులు అరెస్ట్ చేశారు.... మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని, సాయంత్రం గుంటూరు 5వ అదనపు మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు కి తీసుకువెళ్లగానే, ఆరోగ్యం బాగోలేదు అని చెప్పటంతో, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ysrcp leader 15112017 2

వివరాలు ఇలా ఉన్నాయి... ఓ దళిత యువతికి అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50వేలు తీసుకుని.. లైంగికంగా వేధించిన కేసులో మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నాయకుడు టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కృష్ణారెడ్డి అరెస్ట్‌ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్‌ రెడ్డి, ఎల్‌.అప్పిరెడ్డి తదితరులు కోర్టు వద్దకు చేరుకున్నారు.

ysrcp leader 15112017 3

మాజీ ఎమ్మెల్సీగా ఉన్న కృష్ణారెడ్డిని మాచవరానికి చెందిన మాతా శోభ అనే మహిళ అంగన్‌వాడీ ఉద్యోగం కోసం ఆశ్రయించారు. ఇందుకుగాను కృష్ణారెడ్డి రూ.50 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఆమె ఎమ్మెల్సీ కార్యాలయం, ఇల్లు, అతిథి గృహానికి పలుమార్లు తిరిగింది. ఉద్యోగం ఇప్పించకపోగా ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ నెల 10న నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి సెక్షన్‌తోపాటు లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షన్‌ 354 ప్రకారం కేసు నమోదు చేశారు.

జగన్ ని ఎప్పుడూ ర్యాగింగ్ చేసే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, చాలా రోజులు తరువాత మళ్ళీ జగన్ పై సటైర్ లు పేల్చారు... ఈసారి సటైర్ లు మాత్రమే కాకుండా, జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు... పాదయత్రలో జగన్ ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో చెప్పారు... దానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందో వివరించారు... పనిలో పనిగా, రాష్ట్ర మంత్రుల పై కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న మంత్రులు వెన్నుముక లేని వారని అన్నారు...

ambati 14112017 2

జగన్ కు పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబును విమర్శించడమే పని అని మండిపడ్డారు. ఒక పార్టీకి నాయకుడిగా ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో తప్పు లేదని... ఇదే సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, తినటానికి తిండి, తాగడానికి నీరు కూడా లేని అనంతపురం జిల్లాకు నీరు ఇస్తూ సస్యశ్యామలం చేశారని... దీనికి అనంతపురం జిల్లా ప్రజలంతా చంద్రబాబుకు రుణపడి ఉంటారని చెప్పారు.

ambati 14112017 3

కరవుసీమ రాయలసీమకు చంద్రబాబు నీరు ఇస్తుంటే... రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని, పల్నాడుకు ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పోయే కాలం దగ్గరపడిందని అన్నారు. పల్నాడుకు నీరు కావాలనే స్లోగన్ ను అంబటి రాంబాబు ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఇది అత్యంత దారుణమని... సీమకు నీళ్లివ్వకుండా, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఇంకా దోచి పెట్టాలా? అని నిలదీశారు. ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేసేందుకు జగన్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. జగన్ దృష్టి అంతా సీఎం పదవి మీదే ఉందని చెప్పారు.

సామాన్యులకు సైతం కనీసావసరంగా మారిపోయిన మొబైల్ ఫోన్లు ఇప్పటికే మేడిన్ ఆంధ్రా బ్రాండ్‌తో తయారవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు ఇతర దేశాల్లోనే ఉన్నాయి. కానీ.. భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..

xiaomi 14112017 2

ఫాక్స్‌కాన్‌, మైక్రోమాక్స్‌, లావా, సెల్‌కాన్‌, కార్బన్‌ మొబైల్‌ కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో శ్రీసిటీ సెజ్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ లో తయారైన Xiaomiకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే విస్తృతంగా మార్కెట్ లో ఉన్నాయి...

xiaomi 14112017 3

అయితే, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC), 2017 క్వార్టర్ 3 ఫలితాలు ప్రకారం, Xiaomi టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీగా అవతరించింది... ఎక్కువ మంది, మన దేశంలో Xiaomiకి చెందిన రెడ్‌మీ మోడల్ స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారు... ఈ ఫోన్ లు, మన రాష్ట్రంలో తయారవుతున్న సంగతి తెలిసిందే... సామ్సంగ్ తో కలిసి, Xiaomi టాప్ బ్రాండ్ గా నిలిచింది... ఇద్దరూ కలిసి, 23.5 శాతం ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ కలిగి ఉన్నారు... మన రాష్ట్రంలో మేడ్ ఇన్ ఆంధ్రా అంటూ తయారవుతున్న ఫోన్ లు, ఇప్పుడు దేశంలోనే టాప్ బ్రాండ్ గా నిలవటం, మనకు కూడా గర్వ కారణం...

Advertisements

Latest Articles

Most Read