అమరావతిని, భ్రమరావతి అంటూ హేళన చేస్తూ, సునకానందం పొందే రాష్ట్ర ద్రోహులు ఒక్కసారి అమరావతిలో ఏమి జరుగుతుందో చూడండి... ఇంత పెద్ద కాంపస్ కేవలం 10 నెలల్లో రెడీ అయ్యింది... మరో నెల రోజుల్లో మొత్తం రెడీ అయ్యి, ఈ దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీల తరుపున నిలవనుంది... చంద్రబాబుతో పాటు ప్రతి ఆంధ్రుడు కలలు కంటున్నా మన అమరావతిలో మొట్టమొదటి ఫలం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ..

srm 15112017 2

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయమైన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఇప్పటికే అమరావతిలో క్లాసులు ప్రారభించింది... అయితే, ఇంకా కాంపస్ నిర్మాణం జరుగుతుంది... ఆ పనులు చురుకుగా సాగుతున్నాయి... ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట ప్రకారం, షడ్యుల్ ప్రకారం నిర్మాణాలు పుర్తవుతున్నాయి... రాష్ట్రప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేవలం ఐదు నెలల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానమైన అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులను నిర్మించి, జూలైలో ప్రారంభం చేశారు... ఇప్పుడు నవంబర్ నాటికి, మిగతా నిర్మాణ పనులు కూడా పూర్తవుతున్నాయి...

srm 15112017 3

2017-18 విద్యాసంవత్సరంలో నాలుగు బీటెక్‌ బ్రాంచ్‌లు.. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టారు. ఈ ఏడాది దాదాపు 300 అడ్మిషన్లుజరిగాయి... ఇప్పటి వరకు 27 మంది అధ్యాపకులను నియమించారు. ఈ ఏడాది 70 శాతం అడ్మిషన్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు, 30 శాతం అడ్మిషన్లు రాష్ట్రేతరులకు కల్పిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎంలో మేనేజ్‌మెంట్‌ కోటా లేదు. క్యాపిటేషన్‌ ఫీజు లేదు... బీటెక్‌ విద్యార్థులకు ఏడాదికి ఫీజు రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు.

వైస్ జగన్ పాదయత్ర జరుగుతున్న విషయం తెలిసిందే... అయితే అది పాదయత్ర లేక ముద్దల యాత్ర అని చాలా మంది ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు అడుగుతూ వస్తున్నారు... ప్రత్యర్ధి పార్టీలు అంటే ఎదో ఒక వంకతో తిడతారు అనుకోవచ్చు... మరి ఈ మధ్య డోస్ మరీ ఎక్కువైందో ఏమో కాని, జగన్ అభిమానులు కూడా ఆ ముద్దులని అసహ్యించుకుంటున్నారు... జగన్ వయసు 44 ఏళ్ళు ముసలి వాళ్లకు ముద్దు పెట్టాడు అంటే, అనుకోవచ్చు, ఎవరు కనపడితే వారికి ముద్దులు పెట్టేస్తున్నాడు... అదీ కేవలం ఆడవారికే పెట్టటంతో, జగన్ మహిళా అభిమానికి చిర్రేత్తుకు వచ్చింది...

jagan kiss 15112017 2

జగన్ కి ట్విట్టర్ లో మహిళా అభిమాని డైరెక్ట్ మెసేజ్ పెట్టారు (పేరు ప్రైవసీ వల్ల రాయటం లేదు, అనుమానం ఉన్న వాళ్ళు ట్విట్టర్ లో చూడవచ్చు). సర్ మీకు ఒక ప్రశ్న, పాదయత్రలో ఆ ముద్దులు ఎందుకు ? అదీ ఆడవారికి మాత్రమే ఎందుకు ? మీరు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది... నేను తప్పు మాట్లాడితే సారీ అంటూ ట్విట్టర్ లో ప్రశ్న వేశారు.. మరి జగన్ వారికి, సమాధానం చెప్తాడో లేదో చూడాలి... అలాగే మరో అభిమాని కూడా జగన్ కు సలహా ఇచ్చారు "సామాన్య ప్రజలు మిమ్మల్ని కలవాలని, మీకు shake hand ఇవ్వాలని ఏంతో ఆత్రుతగా... వస్తూ ఉంటారు.. వీలైనంత వరకు వారికి shake hand ఇవ్వండి.. కాని ముద్దులు పెట్టకండి.. ముద్దులు పెట్టటం అనేది బాబాలు, మత ప్రబోధకులు.. చేసే పని.. మీరు చెయ్యటం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాది."

jagan kiss 15112017 3

హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అయినా తరువాత మహిళలు పరాయి పురుషుని పక్కన కూర్చోవడానికి ఆలోసిస్తారు... ఇలాంటి ముద్దుల సంస్కృతి రాజాకీయాల్లో ఎప్పుడూ లేదు... వృద్దులు, మహిళలు, అమ్మాయిలకు 'ముద్దుల"తో కొత్త "విదేశీ సంస్కృతి" కి తెర తీశారు "వైస్ జగన్"... ఏదైనా శృతి మించ కూడదు.... జగన్ పక్కన ఉన్న సలహాదారులు ఈ సలహా ఇస్తే మంచింది... ఇలాంటి పనులు మన ఇంట్లో మనుషులని, ఇలా ఎవరన్నా వచ్చి ఓదారిస్తే, మనకి ఎలా ఉంటుంది అని జగన్ ఒకసారి ఆలోచించి, ఈ ట్రెండ్ మారుస్తారని ఆశిద్దాం....

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, కేసీఆర్ అనంతపురంలో, పరిటాల శ్రీ రాం పెళ్లిలో కలిసిన సందర్భంలో జరిగిన హంగామా తెలిసిందే... అయితే, ఇప్పుడు మళ్ళీ పయ్యావుల కేశవ్, కేసీఆర్ ని కలిసారు... కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆయన, దాదాపు పావుగంట పాటు అక్కడే ఉన్నారు. ..ఈ విషయం స్వయంగా కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా తన ఫేస్బుక్ ఎకౌంటులో పోస్ట్ చేశారు...

kcr keshav 15112017 2

పయ్యావుల కేశవ్ కుటుంబంలో జరిగే పెళ్లికి ఆహ్వానించేందుకు ఆయన వచ్చారని కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ సమయంలో ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. కాగా, అనంతపురం జిల్లాలో జరిగిన పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లినప్పుడు, హెలిపాడ్ వద్ద పయ్యావుల కేశవ్ ను స్వయంగా పిలిపించుకున్న కేసీఆర్, ఆయనతో కాసేపు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

kcr keshav 15112017 3

పయ్యావులకు, కేసీఆర్ కు మధ్య వ్యాపార సంబంధాలున్నాయని, తెలంగాణలో కాంట్రాక్టులను పొందారని, టీడీపీకి రాజీనామా చేసిన తరువాత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పయ్యావుల కేశవ్, పరిటాల కుటుంబాలు బార్లు, లిక్కర్ తయారీ కంపెనీ లైసెన్స్‌లు తెచ్చుకున్నారని ఆరోపించడం దుమారం రేపింది. తాజాగా మరోసారి కేసీఆర్‌ను పయ్యావుల కేశవ్ కలిశారు. తన సోదరుడు కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు కేసీఆర్‌ను కలిశారు.

కృష్ణా నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగినా, మన అధికారుల్లో ఏ మాత్రం చలనం రాలేదు... సాక్షాత్తు ముఖ్యమంత్రి వీళ్ళ మీద అసహనం వ్యక్తం చేశారు అంటే, వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో అర్ధం అవుతుంది.. ఒక పక్క ప్రభుత్వం అన్ని ప్రైవేటు బోటు ఆపరేటర్స్ తో చర్చలు జరిపి, కొత్త నిబంధనలు వచ్చే వరకు లైసెన్స్ రద్దు చేస్తున్నాం అని చెప్పారు... అయితే, నిబంధనలు రెడీ చెయ్యాల్సిన అధికారాలు, కనీసం ఇప్పటి వరకు ఒక రివ్యూ కూడా జరపలేదు... ఇది ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది... పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినా సంబంధిత శాఖల అధికారుల్లో ఆ స్థాయి స్పందన కనిపించడం లేదని, కనీసం అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకొని చర్చించకపోవడం ఏమిటని ఆయన నిలదీసినట్లు చెబుతున్నారు....

cbn tourism 15112017 2

అసెంబ్లీలో ప్రమాదం పై ప్రకటన చేసి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి. సోమవారం రాత్రి దీనిపై కొందరు ఉన్నతాధికారులతో ఆయన మరోసారి మాట్లాడారు. సభలో తాను చేసిన ప్రకటన ఆధారంగా తదుపరి చర్యలు ఏం తీసుకొన్నారని ఆయన అడిగితే... వారు సమాధానం చెప్పలేకపోయారు. దానితో వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సంఘటనలో ఇరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. విహారానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దారుణం. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది... మళ్లీ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్న దానిపై తక్షణం మీలో స్పందన కనిపించాలి. నేను పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సీరియ్‌సగా ఉందని... ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తానని నేను సభాముఖంగా చెప్పాను. నా ప్రకటనను మీరు ఆదేశంగా తీసుకోవాలి. కానీ ఎవరికి వారు అదేదో మిగిలిన వారి పని అన్నట్లు ఉండిపోయారు. మీ అందరి పని కూడా నేనే చేయాలా? మీకెవరికీ బాధ్యత లేదా’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

cbn tourism 15112017 3

నదిలో పర్యాటకుల కోసం పడవ నడపాలంటే పర్యాటక శాఖ, జల వనరుల శాఖ, అగ్నిమాపక శాఖ, పోలీస్‌ శాఖ వంటి ఐదారు శాఖలు అనుమతులు ఇవ్వాల్సి ఉందని, దీనితోపాటు ఎప్పటికప్పుడు ఆ పడవల స్థితి, అందులోని రక్షణ ఏర్పాట్లపై తనిఖీలు ఉండాలని ఆయన చెప్పారు. ‘ఇవి నేను కొత్తగా పెట్టిన నిబంధనలు కావు. చాలా కాలం నుంచి అమల్లో ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నడుస్తున్న పడవలకు ఈ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది కూడా ఎవరూ చూడటం లేదు. ఇప్పటికైనా ఈ శాఖల అధికారులంతా కూర్చోండి. ఉన్న నిబంధనలు ఏమిటో చూడండి. ఈ ఘటన నేపథ్యంలో అందులో మార్పుచేర్పులు ఏమైనా చేయాలా అన్నది ఆలోచించండి. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సిన బాధ్యత ఎవరిదో తేల్చండి. ప్రాణాలు ఎవరివైనా అమూల్యమైనవే. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడండి. ఇది తక్షణం జరగాలి. మరోసారి నాతో చెప్పించుకోవద్దు’ అని ఆయన అన్నారు. వెంటనే ఈ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక నివేదిక ఇస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. దానికి ఆయన అంగీకరించలేదు. ఆ నివేదికతోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా తన వద్దకు రావాలని, ఏం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారో తనకు చెప్పాలని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం వివిధ శాఖల అధికారుల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.

Advertisements

Latest Articles

Most Read